< תהילים 61 >
למנצח על-נגינת לדוד ב שמעה אלהים רנתי הקשיבה תפלתי | 1 |
౧ప్రధాన సంగీతకారుని కోసం. తీగె వాయిద్యాలతో పాడేది. దావీదు కీర్తన దేవా, నా మొర ఆలకించు, నా ప్రార్థన శ్రద్ధగా విను.
מקצה הארץ אליך אקרא-- בעטף לבי בצור-ירום ממני תנחני | 2 |
౨నా ప్రాణం తల్లడిల్లినప్పుడు భూదిగంతాల నుండి నీకు మొరపెడతాను. నేను ఎక్కలేనంత ఎత్తయిన కొండ పైకి నన్ను ఎక్కించు.
כי-היית מחסה לי מגדל-עז מפני אויב | 3 |
౩నువ్వు నాకు ఆశ్రయదుర్గంగా ఉన్నావు. నా శత్రువుల ఎదుట బలమైన కోటగా ఉన్నావు.
אגורה באהלך עולמים אחסה בסתר כנפיך סלה | 4 |
౪యుగయుగాలు నేను నీ గుడారంలో నివసిస్తాను, నీ రెక్కల కింద దాక్కుంటాను. (సెలా)
כי-אתה אלהים שמעת לנדרי נתת ירשת יראי שמך | 5 |
౫దేవా, నువ్వు నా మొక్కుబడులు అంగీకరించావు. నీ నామాన్ని గౌరవించే వారికిచ్చే వారసత్వాన్ని నాకు అనుగ్రహించావు.
ימים על-ימי-מלך תוסיף שנותיו כמו-דר ודר | 6 |
౬రాజుకు దీర్ఘాయువు కలుగజేస్తావు గాక, అతని సంవత్సరాలు తరతరాలు నడుస్తాయి గాక.
ישב עולם לפני אלהים חסד ואמת מן ינצרהו | 7 |
౭అతడు నిత్యం దేవుని సన్నిధిలో నివసిస్తాడు గాక. అతని కాపుదల కోసం నీ కృపాసత్యాలను నియమించు.
כן אזמרה שמך לעד-- לשלמי נדרי יום יום | 8 |
౮ప్రతి రోజూ నా మొక్కుబడులు నేను చెల్లించేలా నీ నామాన్ని నిత్యం కీర్తిస్తాను.