< תהילים 50 >
מזמור לאסף אל אלהים יהוה-- דבר ויקרא-ארץ ממזרח-שמש עד-מבאו | 1 |
౧ఆసాపు కీర్తన శక్తిశాలి, దేవుడు అయిన యెహోవా ఆదేశిస్తున్నాడు. పొద్దు పొడిచే దిశ నుండి పొద్దు గుంకే దిశ వరకూ ఉన్న ప్రజలందర్నీ రమ్మని పిలుస్తున్నాడు.
מציון מכלל-יפי-- אלהים הופיע | 2 |
౨పరిపూర్ణ సౌందర్యం అయిన సీయోనులో నుండి దేవుడు ప్రకాశిస్తున్నాడు.
יבא אלהינו ואל-יחרש אש-לפניו תאכל וסביביו נשערה מאד | 3 |
౩మన దేవుడు వస్తున్నాడు. ఆయన మౌనంగా ఉండడు. ఆయనకు ముందుగా భీకర అగ్ని కబళించుకుంటూ వెళ్తుంది. ఆయన చుట్టూ ప్రచండ గాలులు వీస్తున్నాయి.
יקרא אל-השמים מעל ואל-הארץ לדין עמו | 4 |
౪తన ప్రజలకు న్యాయం తీర్చడానికి ఆయన ఆకాశాలనూ భూమినీ పిలుస్తున్నాడు.
אספו-לי חסידי-- כרתי בריתי עלי-זבח | 5 |
౫బలి అర్పణ ద్వారా నాతో నిబంధన చేసుకున్న నా విశ్వాస పాత్రులను నా దగ్గరకు సమకూర్చండి అని పిలుస్తున్నాడు.
ויגידו שמים צדקו כי-אלהים שפט הוא סלה | 6 |
౬ఆకాశాలు ఆయన నీతిని ప్రకటిస్తున్నాయి. ఎందుకంటే దేవుడు తానే న్యాయాధిపతిగా ఉన్నాడు.
שמעה עמי ואדברה-- ישראל ואעידה בך אלהים אלהיך אנכי | 7 |
౭నా ప్రజలారా, వినండి. నేను మాట్లాడతాను. నేను దేవుణ్ణి. మీ దేవుణ్ణి.
לא על-זבחיך אוכיחך ועולתיך לנגדי תמיד | 8 |
౮నీ బలుల విషయమై నేను నిన్ను నిందించడం లేదు. మీ దహనబలులు ఎప్పుడూ నా ఎదుటే ఉన్నాయి.
לא-אקח מביתך פר ממכלאתיך עתודים | 9 |
౯నీ ఇంటి నుండి ఎద్దునైనా, నీ మందలోని మేకపోతులనైనా నేను తీసుకోను.
כי-לי כל-חיתו-יער בהמות בהררי-אלף | 10 |
౧౦ఎందుకంటే అడవిలో ఉన్న ప్రతి మృగమూ నాదే. వెయ్యి కొండలపై తిరుగాడే పశువులన్నీ నావే.
ידעתי כל-עוף הרים וזיז שדי עמדי | 11 |
౧౧కొండల్లోని పక్షులన్నీ నాకు తెలుసు. పొలాల్లోని మృగాలు నా వశమే.
אם-ארעב לא-אמר לך כי-לי תבל ומלאה | 12 |
౧౨నాకు ఒకవేళ ఆకలివేస్తే అది నీకు చెప్పను. ఎందుకంటే ఈ ప్రపంచమంతా నాదే. భూమిలో ఉండేదంతా నాదే.
האוכל בשר אבירים ודם עתודים אשתה | 13 |
౧౩ఎద్దుల మాంసం నేను తింటానా? మేకల రక్తం తాగుతానా?
זבח לאלהים תודה ושלם לעליון נדריך | 14 |
౧౪దేవునికి నీ కృతజ్ఞతార్పణ సమర్పించు. మహోన్నతుడికి నీ ప్రమాణాలను నెరవేర్చు.
וקראני ביום צרה אחלצך ותכבדני | 15 |
౧౫సమస్యలు చుట్టుముట్టిన రోజున నాకు ప్రార్థించు. నేను నిన్ను కాపాడతాను. నువ్వు నన్ను కీర్తిస్తావు.
ולרשע אמר אלהים מה-לך לספר חקי ותשא בריתי עלי-פיך | 16 |
౧౬కానీ దుర్మార్గులతో దేవుడు ఇలా అంటున్నాడు. నా నియమాలను ప్రకటించడానికి నీకేం పని? నా నిబంధన నీ నోట పలకాల్సిన అవసరం ఏమిటి?
ואתה שנאת מוסר ותשלך דברי אחריך | 17 |
౧౭ఆదేశాలను నువ్వు అసహ్యించుకుంటావు. నా మాటలు పట్టించుకోకుండా తోసివేస్తావు.
אם-ראית גנב ותרץ עמו ועם מנאפים חלקך | 18 |
౧౮నువ్వు దొంగను చూసి వాడితో ఏకీభవిస్తావు. వ్యభిచారం చేసే వాళ్ళతో కలుస్తావు.
פיך שלחת ברעה ולשונך תצמיד מרמה | 19 |
౧౯ఎవరికైనా అపకారం తలపెట్టడానికి నోరు తెరుస్తావు. నీ నాలుక వంచన చేస్తుంది.
תשב באחיך תדבר בבן-אמך תתן-דפי | 20 |
౨౦కూర్చుని నీ సోదరుడికి వ్యతిరేకంగా మాట్లాడుతావు. నీ స్వంత సోదరుడిపై అపనిందలు మోపుతావు.
אלה עשית והחרשתי-- דמית היות-אהיה כמוך אוכיחך ואערכה לעיניך | 21 |
౨౧నువ్వు ఇలాంటి పనులు చేస్తున్నా నేను మౌనంగానే ఉన్నాను. దాంతో నన్ను నీతో సమానంగా జమ కట్టావు. కానీ నేను నువ్వు చేసిన పనులన్నిటినీ నీ కళ్ళ ఎదుటికి తీసుకువస్తాను. నిన్ను గద్దిస్తాను.
בינו-נא זאת שכחי אלוה פן-אטרף ואין מציל | 22 |
౨౨దేవుణ్ణి మర్చిపోయే వాళ్ళు ఈ సంగతి ఆలోచించండి. లేదా నేను మిమ్మల్ని ముక్కలుగా చీల్చి వేస్తాను. మీకు సహాయం చేయడానికి ఎవరూ రారు.
זבח תודה יכבדנני ושם דרך--אראנו בישע אלהים | 23 |
౨౩కృతజ్ఞతార్పణ అర్పించే వాడు నన్ను స్తుతిస్తున్నాడు. తన ప్రయాణం సరైన మార్గంలో చేయాలని ఆలోచించే వాళ్లకు నేను దేవుని ముక్తిని చూపిస్తాను.