< תהילים 2 >
למה רגשו גוים ולאמים יהגו-ריק | 1 |
౧జాతులు ఎందుకు తిరుగుబాటు చేస్తున్నాయి? ప్రజా సమూహాలు ఎందుకు వ్యర్ధమైన కుట్ర చేస్తున్నాయి?
יתיצבו מלכי-ארץ-- ורוזנים נוסדו-יחד על-יהוה ועל-משיחו | 2 |
౨భూరాజులు కుమ్మక్కై యెహోవాకూ ఆయన అభిషిక్తుడికీ విరోధంగా నిలబడ్డారు. పాలకులు ఏకీభవించి కుట్ర చేస్తున్నారు.
ננתקה את-מוסרותימו ונשליכה ממנו עבתימו | 3 |
౩వాళ్ళు మనకు వేసిన సంకెళ్ళు తెంపేద్దాం రండి. వాళ్ళ గొలుసులు విసిరి పారేద్దాం రండి, అని చెప్పుకుంటున్నారు.
יושב בשמים ישחק אדני ילעג-למו | 4 |
౪ఆకాశాల్లో కూర్చున్నవాడు వెక్కిరిస్తున్నాడు. ప్రభువు వాళ్ళను చూసి హేళన చేస్తున్నాడు.
אז ידבר אלימו באפו ובחרונו יבהלמו | 5 |
౫ఆయన ఉగ్రుడై వారితో మాట్లాడతాడు. విపరీతమైన కోపంతో వాళ్ళను భయభీతులకు గురి చేస్తాడు
ואני נסכתי מלכי על-ציון הר-קדשי | 6 |
౬నా పవిత్ర పర్వతం సీయోను మీద నేనే నా రాజును అభిషేకించాను.
אספרה אל-חק יהוה אמר אלי בני אתה--אני היום ילדתיך | 7 |
౭యెహోవా శాసనాన్ని నేను ప్రకటిస్తాను. యెహోవా నాకు ఇలా చెప్పాడు, నువ్వు నా కుమారుడివి. ఈ రోజు నేను నీకు తండ్రినయ్యాను.
שאל ממני--ואתנה גוים נחלתך ואחזתך אפסי-ארץ | 8 |
౮నన్ను అడుగు. జాతులను నీకు వారసత్వంగానూ భూమిని దాని సుదూర ప్రాంతాల వరకూ నీ ఆస్తిగానూ ఇస్తాను.
תרעם בשבט ברזל ככלי יוצר תנפצם | 9 |
౯ఇనపదండంతో నువ్వు వాళ్ళను నలగగొడతావు, మట్టి కుండలాగా వాళ్ళను ముక్కలు చెక్కలు చేస్తావు.
ועתה מלכים השכילו הוסרו שפטי ארץ | 10 |
౧౦కాబట్టి ఇప్పుడు రాజులారా, ఇదుగో హెచ్చరిక. భూలోక పాలకులారా, మిమ్మల్ని మీరు సరిచేసుకోండి.
עבדו את-יהוה ביראה וגילו ברעדה | 11 |
౧౧భయంతో యెహోవాను ఆరాధించండి, గడగడ వణకుతూ ఆనందించండి.
נשקו-בר פן-יאנף ותאבדו דרך-- כי-יבער כמעט אפו אשרי כל-חוסי בו | 12 |
౧౨దేవుడు కుమారుని పక్షం చేరండి. అప్పుడు దేవుడు మీపై కోపించడు. ఆయన కోపం త్వరగా రగులుకున్నప్పుడు మీరు చనిపోరు. దేవునిలో ఆశ్రయం పొందినవాళ్ళు ధన్యులు.