< תהילים 16 >
מכתם לדוד שמרני אל כי-חסיתי בך | 1 |
౧దావీదు మిఖ్తీమ్ (ప్రశస్థ) కీర్తన. దేవా, నీ ఆశ్రయం కోరాను, నన్ను కాపాడు.
אמרת ליהוה אדני אתה טובתי בל-עליך | 2 |
౨నేను యెహోవాతో అంటాను. నువ్వు నా ప్రభువు. నీకు వేరుగా నాకు ఏ మంచీ లేదు.
לקדושים אשר-בארץ המה ואדירי כל-חפצי-בם | 3 |
౩భూమి మీద ఉన్న భక్తుల విషయానికి వస్తే, వాళ్ళు శ్రేష్టులు. నా ఆనందం అంతా వాళ్ళే.
ירבו עצבותם אחר מהרו בל-אסיך נסכיהם מדם ובל-אשא את-שמותם על-שפתי | 4 |
౪యెహోవాను విడిచి ఇతర దేవుళ్ళను ఆశించే వాళ్లకు సమస్యలు ఎక్కువౌతాయి. వాళ్ళు అర్పించే రక్తపానీయ అర్పణలు నేను అర్పించను. నా పెదాలతో వాళ్ళ పేర్లు ఎత్తను.
יהוה מנת-חלקי וכוסי-- אתה תומיך גורלי | 5 |
౫యెహోవా, నాకు వారసత్వంగా వచ్చిన వాటా నువ్వే. నువ్వే నా గిన్నె. నా అంతిమ గమ్యం నీ చేతుల్లోనే ఉంది.
חבלים נפלו-לי בנעמים אף-נחלת שפרה עלי | 6 |
౬మనోహరమైన స్థలాల్లో నాకోసం హద్దులు గీసి ఉన్నాయి. కచ్చితంగా శ్రేష్ఠమైన స్వాస్థ్యం నాది.
אברך--את-יהוה אשר יעצני אף-לילות יסרוני כליותי | 7 |
౭నాకు ఆలోచనకర్త అయిన యెహోవాను స్తుతిస్తాను, రాత్రివేళల్లో కూడా నా మనసు నాకు ఉపదేశిస్తూ ఉంది.
שויתי יהוה לנגדי תמיד כי מימיני בל-אמוט | 8 |
౮అన్నివేళలా యెహోవా వైపు నేను చూస్తూ ఉంటాను, ఆయన కుడిచేతిలోనుంచి నేను కదిలిపోను!
לכן שמח לבי--ויגל כבודי אף-בשרי ישכן לבטח | 9 |
౯అందువల్ల నా హృదయం సంతోషంగా ఉంది. నా పూర్ణ హృదయం ఆయనను పొగడుతూ ఉంది. కచ్చితంగా నేను సురక్షితంగా ఉంటాను.
כי לא-תעזב נפשי לשאול לא-תתן חסידך לראות שחת (Sheol ) | 10 |
౧౦ఎందుకంటే నువ్వు నా ఆత్మను పాతాళంలో విడిచి పెట్టవు. నిబంధన నమ్మకత్వం ఉన్నవాణ్ణి చావు చూడనివ్వవు. (Sheol )
תודיעני ארח חיים שבע שמחות את-פניך נעמות בימינך נצח | 11 |
౧౧జీవమార్గం నువ్వు నాకు తెలియజేస్తావు. నీ సన్నిధిలో మహానందం ఉంది. నీ కుడిచేతిలో నిత్యానందం ఉంది.