< תהילים 121 >

שיר למעלות אשא עיני אל-ההרים-- מאין יבא עזרי 1
యాత్రల కీర్తన కొండల వైపు నా కన్నులు ఎత్తి చూస్తున్నాను. నాకు సహాయం ఎక్కడనుండి వస్తుంది?
עזרי מעם יהוה-- עשה שמים וארץ 2
యెహోవాయే నాకు సహాయం చేస్తాడు. భూమిని, ఆకాశాలను సృష్టించింది ఆయనే.
אל-יתן למוט רגלך אל-ינום שמרך 3
ఆయన నీ పాదాలను జారనియ్యడు. నిన్ను కాపాడేవాడు కునికిపాట్లు పడదు.
הנה לא-ינום ולא יישן-- שומר ישראל 4
ఇశ్రాయేలు ప్రజల సంరక్షకుడు కునికిపాట్లు పడడు, నిద్రపోడు.
יהוה שמרך יהוה צלך על-יד ימינך 5
నిన్ను కాపాడేవాడు యెహోవాయే. నీ కుడి పక్కన యెహోవా నీకు తోడూనీడా.
יומם השמש לא-יככה וירח בלילה 6
పగలు సూర్యుడు గానీ రాత్రి చంద్రుడు గానీ నీకు హాని చెయ్యరు.
יהוה ישמרך מכל-רע ישמר את-נפשך 7
ఎలాంటి ప్రమాదం జరగకుండా యెహోవా నిన్ను కాపాడతాడు. నీ ప్రాణాన్ని కాపాడేది ఆయనే.
יהוה ישמר-צאתך ובואך-- מעתה ועד-עולם 8
ఇకనుండి అన్ని వేళలా నువ్వు చేసే వాటన్నిటిలో యెహోవా నిన్ను కాపాడతాడు.

< תהילים 121 >