< תהילים 108 >
שיר מזמור לדוד נכון לבי אלהים אשירה ואזמרה אף-כבודי | 1 |
౧లలిత గీతం. దావీదు కీర్తన దేవా, నా హృదయం నిబ్బరంగా ఉంది. నేను పాడుతూ నా ఆత్మతో స్తుతిగానం చేస్తాను.
עורה הנבל וכנור אעירה שחר | 2 |
౨స్వరమండలమా, సితారా, మేలు మేలుకోండి. నేను వేకువనే లేస్తాను.
אודך בעמים יהוה ואזמרך בלאמים | 3 |
౩ప్రజలమధ్య నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. ప్రజల్లో నిన్ను కీర్తిస్తాను.
כי-גדול מעל-שמים חסדך ועד-שחקים אמתך | 4 |
౪యెహోవా, నీ కృప ఆకాశం కంటే ఎత్తయినది. నీ సత్యం మేఘాలంత ఎత్తుగా ఉంది.
רומה על-שמים אלהים ועל כל-הארץ כבודך | 5 |
౫దేవా, ఆకాశం కంటే అత్యున్నతుడవుగా నిన్ను కనుపరచుకో.
למען יחלצון ידידיך הושיעה ימינך וענני | 6 |
౬నీ ప్రభావం భూమి అంతటిమీదా కనబడనియ్యి. నీకు ఇష్టమైన వారు విమోచన పొందేలా నీ కుడిచేతితో నన్ను రక్షించి నాకు జవాబియ్యి.
אלהים דבר בקדשו--אעלזה אחלקה שכם ועמק סכות אמדד | 7 |
౭తన పరిశుద్ధత తోడని దేవుడు మాట ఇచ్చాడు. నేను హర్షిస్తాను. షెకెమును పంచిపెడతాను. సుక్కోతు లోయను కొలిపిస్తాను.
לי גלעד לי מנשה ואפרים מעוז ראשי יהודה מחקקי | 8 |
౮గిలాదు నాది, మనష్షే నాది, ఎఫ్రాయిము నాకు శిరస్త్రాణం, యూదా నా రాజ దండం.
מואב סיר רחצי--על-אדום אשליך נעלי עלי-פלשת אתרועע | 9 |
౯మోయాబు నేను కాళ్లు కడుక్కునే పళ్ళెం. ఎదోముపైకి నా చెప్పు విసిరేస్తాను. ఫిలిష్తియనుబట్టి జయోత్సవం చేశాను.
מי יבלני עיר מבצר מי נחני עד-אדום | 10 |
౧౦కోటగల పట్టణంలోకి నన్ను ఎవరు తోడుకుపోతారు? ఎదోములోకి నన్నెవరు నడిపిస్తారు?
הלא-אלהים זנחתנו ולא-תצא אלהים בצבאתינו | 11 |
౧౧దేవా, నీవు మమ్మల్ని విడనాడావు గదా? దేవా, మా సేనలతో నీవు కూడా బయలుదేరడం చాలించుకున్నావు గదా?
הבה-לנו עזרת מצר ושוא תשועת אדם | 12 |
౧౨మనుష్యుల సహాయం వ్యర్థం. శత్రువులను జయించడానికి నీవు మాకు సహాయం చెయ్యి.
באלהים נעשה-חיל והוא יבוס צרינו | 13 |
౧౩దేవుని వలన మేము శూరకార్యాలు జరిగిస్తాము. మా శత్రువులను అణగదొక్కేవాడు ఆయనే.