< תהילים 107 >
הדו ליהוה כי-טוב כי לעולם חסדו | 1 |
౧యెహోవా దయాళుడు. ఆయనకు కృతజ్ఞతా స్తుతులు చెల్లించండి. ఆయన కృప నిత్యం ఉంటుంది.
יאמרו גאולי יהוה-- אשר גאלם מיד-צר | 2 |
౨యెహోవా విమోచించినవారు ఆ మాట పలుకుతారు గాక. విరోధుల చేతిలోనుండి ఆయన విమోచించిన వారూ,
ומארצות קבצם ממזרח וממערב מצפון ומים | 3 |
౩తూర్పు నుండి, పడమర నుండి, ఉత్తరం నుండి, దక్షిణం నుండి నానాదేశాల నుండి ఆయన పోగు చేసినవారూ ఆ మాట పలుకుతారు గాక.
תעו במדבר בישימון דרך עיר מושב לא מצאו | 4 |
౪వారు అరణ్యమార్గాల్లో ఎడారి త్రోవల్లో తిరుగులాడుతూ ఉండే వారు. నివాస పురమేదీ వారికి దొరకలేదు.
רעבים גם-צמאים-- נפשם בהם תתעטף | 5 |
౫ఆకలి దప్పుల వల్ల వారి ప్రాణం వారిలో సొమ్మసిల్లిపోయింది.
ויצעקו אל-יהוה בצר להם ממצוקותיהם יצילם | 6 |
౬వారు కష్టకాలంలో యెహోవాకు మొర్రపెట్టారు. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించాడు.
וידריכם בדרך ישרה-- ללכת אל-עיר מושב | 7 |
౭వారొక నివాస పురం చేరేలా చక్కని దారిలో ఆయన వారిని నడిపించాడు.
יודו ליהוה חסדו ונפלאותיו לבני אדם | 8 |
౮ఆయన నిబంధన విశ్వసనీయతను బట్టి, మనుషులకు ఆయన చేసే ఆశ్చర్య కార్యాలనుబట్టి, వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.
כי-השביע נפש שקקה ונפש רעבה מלא-טוב | 9 |
౯ఎందుకంటే దాహం గొన్న వారిని ఆయన తృప్తిపరచాడు. ఆకలి గొన్నవారిని మేలుతో నింపాడు.
ישבי חשך וצלמות אסירי עני וברזל | 10 |
౧౦చీకటిలో మసక చీకటిలో కొందరు బాధతో, ఇనప గొలుసులతో బంధితులై కూర్చున్నారు.
כי-המרו אמרי-אל ועצת עליון נאצו | 11 |
౧౧దేవుని మాటపై తిరుగుబాటు చేసినందువల్ల, మహోన్నతుని సూచనలను త్రోసిపుచ్చినందువల్ల ఇది జరిగింది.
ויכנע בעמל לבם כשלו ואין עזר | 12 |
౧౨కడగండ్ల మూలంగా ఆయన వారి హృదయాలను లొంగదీశాడు. వారు తొట్రుపడినప్పుడు ఆదుకునేవాడు లేకపోయాడు.
ויזעקו אל-יהוה בצר להם ממצקותיהם יושיעם | 13 |
౧౩కష్టకాలంలో వారు యెహోవాకు మొర్రపెట్టారు. ఆయన వారి దురవస్థలోనుండి వారిని విడిపించాడు
יוציאם מחשך וצלמות ומוסרותיהם ינתק | 14 |
౧౪వారి కట్లను తెంపివేసి చీకటిలోనుండి, మరణాంధకారంలో నుండి వారిని బయటికి రప్పించాడు.
יודו ליהוה חסדו ונפלאותיו לבני אדם | 15 |
౧౫ఆయన కృపను బట్టి, మనుషులకు ఆయన చేసే ఆశ్చర్యకార్యాలను బట్టి, వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.
כי-שבר דלתות נחשת ובריחי ברזל גדע | 16 |
౧౬ఎందుకంటే ఆయన ఇత్తడి తలుపులను పగలగొట్టాడు, ఇనపగడియలను విరగగొట్టాడు.
אולים מדרך פשעם ומעונתיהם יתענו | 17 |
౧౭బుద్ధిహీనులు తమ దుష్టప్రవర్తన చేత, తమ దోషం చేత, బాధ కొనితెచ్చుకుంటారు.
כל-אכל תתעב נפשם ויגיעו עד-שערי מות | 18 |
౧౮భోజనపదార్థాలన్నీ వారి ప్రాణానికి అసహ్యమై పోతాయి. వారు మరణద్వారాలను సమీపిస్తారు.
ויזעקו אל-יהוה בצר להם ממצקותיהם יושיעם | 19 |
౧౯కష్టకాలంలో వారు యెహోవాకు మొర్రపెట్టారు. ఆయన వారి ఆపదలలో నుండి వారిని విడిపించాడు.
ישלח דברו וירפאם וימלט משחיתותם | 20 |
౨౦ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. ఆయన వారు పడిన గుంటల్లో నుండి వారిని విడిపించాడు.
יודו ליהוה חסדו ונפלאותיו לבני אדם | 21 |
౨౧ఆయన కృపను బట్టి, మనుషులకు ఆయన చేసే ఆశ్చర్య కార్యాలనుబట్టి, వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.
ויזבחו זבחי תודה ויספרו מעשיו ברנה | 22 |
౨౨వారు కృతజ్ఞతార్పణలు చెల్లించుదురు గాక. ఉత్సాహధ్వనితో ఆయన కార్యాలను ప్రకటించుదురు గాక.
] יורדי הים באניות עשי מלאכה במים רבים | 23 |
౨౩ఓడలెక్కి సముద్ర ప్రయాణం చేసేవారు మహాజలాల మీద తిరుగుతూ వ్యాపారం చేసేవారు
] המה ראו מעשי יהוה ונפלאותיו במצולה | 24 |
౨౪యెహోవా కార్యాలను, సముద్రంలో ఆయన చేసే అద్భుతాలను చూశారు.
] ויאמר--ויעמד רוח סערה ותרומם גליו | 25 |
౨౫ఆయన సెలవియ్యగా తుఫాను పుట్టింది. అది దాని తరంగాలను పైకెత్తింది.
] יעלו שמים ירדו תהומות נפשם ברעה תתמוגג | 26 |
౨౬వారు ఆకాశందాకా ఎక్కుతూ అగాధానికి దిగుతూ ఉన్నారు. బాధతో వారి ప్రాణం కరిగిపోయింది.
] יחוגו וינועו כשכור וכל-חכמתם תתבלע | 27 |
౨౭మత్తెక్కిన వారివలె వారు ముందుకి, వెనక్కి దొర్లుతూ ఇటు అటు తూలుతూ ఉన్నారు. వారు ఏమీ తోచక ఉన్నారు.
] ויצעקו אל-יהוה בצר להם וממצוקתיהם יוציאם | 28 |
౨౮బాధకు తాళలేక వారు యెహోవాకు మొర్రపెట్టారు. ఆయన వారి ఆపదల్లో నుండి వారిని విడిపించాడు.
יקם סערה לדממה ויחשו גליהם | 29 |
౨౯ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగాలు అణిగిపోయాయి.
וישמחו כי-ישתקו וינחם אל-מחוז חפצם | 30 |
౩౦అవి నిమ్మళమైపోయాయని వారు సంతోషించారు. వారు కోరిన రేవుకు ఆయన వారిని నడిపించాడు.
יודו ליהוה חסדו ונפלאותיו לבני אדם | 31 |
౩౧ఆయన కృపను బట్టి, మనుషులకు ఆయన చేసే ఆశ్చర్య కార్యాలను బట్టి, వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు గాక.
וירוממוהו בקהל-עם ובמושב זקנים יהללוהו | 32 |
౩౨జనసమాజంలో వారాయనను ఘనపరచుదురు గాక. పెద్దల సభలో ఆయనను కీర్తించుదురు గాక.
ישם נהרות למדבר ומצאי מים לצמאון | 33 |
౩౩ఆయన నదులను అడవిగాను నీటి బుగ్గలను ఎండిన నేలగాను,
ארץ פרי למלחה מרעת יושבי בה | 34 |
౩౪దేశనివాసుల చెడుతనాన్ని బట్టి సారవంతమైన భూమిని చవిటిపర్రగాను మార్చాడు.
ישם מדבר לאגם-מים וארץ ציה למצאי מים | 35 |
౩౫అడివిని నీటిమడుగుగాను, ఎండిన నేలను నీటి ఊటల తావుగాను ఆయన మార్చాడు.
ויושב שם רעבים ויכוננו עיר מושב | 36 |
౩౬వారు అక్కడ నివాసస్థలం ఏర్పరచుకునేలా పొలంలో విత్తనాలు చల్లి, ద్రాక్షతోటలు నాటి,
ויזרעו שדות ויטעו כרמים ויעשו פרי תבואה | 37 |
౩౭వాటివలన మంచి పంటలు పండిస్తూ ఉండేలా ఆయన ఆకలిగొన్న వారిని అక్కడ కాపురముంచాడు.
ויברכם וירבו מאד ובהמתם לא ימעיט | 38 |
౩౮ఆయన వారిని ఆశీర్వదించగా వారికి సంతానాభివృద్ధి కలిగింది. ఆయన వారి పశువులను తగ్గిపోనియ్యలేదు.
וימעטו וישחו-- מעצר רעה ויגון | 39 |
౩౯వారు బాధ వలనా ఇబ్బంది వలనా దుఃఖం వలనా తగ్గిపోయినప్పుడు,
] שפך בוז על-נדיבים ויתעם בתהו לא-דרך | 40 |
౪౦శత్రువులు రాజులను తృణీకరిస్తూ దారిలేని ఎడారిలో వారిని తిరుగులాడజేశాడు.
וישגב אביון מעוני וישם כצאן משפחות | 41 |
౪౧అలాటి దరిద్రుల బాధను పొగొట్టి వారిని లేవనెత్తాడు. వారి వంశాన్ని మందవలె వృద్ధి చేశాడు.
יראו ישרים וישמחו וכל-עולה קפצה פיה | 42 |
౪౨యథార్థవంతులు దాన్ని చూసి సంతోషిస్తారు. మోసగాళ్ళు మౌనంగా ఉంటారు.
מי-חכם וישמר-אלה ויתבוננו חסדי יהוה | 43 |
౪౩బుద్ధిమంతుడు ఈ విషయాలను ఆలోచిస్తాడు. యెహోవా కృపాతిశయాలను ప్రజలు తలపోస్తారు గాక.