< תהילים 105 >
הודו ליהוה קראו בשמו הודיעו בעמים עלילותיו | 1 |
౧యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించండి. ఆయన నామాన్ని ప్రకటన చేయండి. జాతుల్లో ఆయన కార్యాలను తెలియచేయండి.
שירו-לו זמרו-לו שיחו בכל-נפלאותיו | 2 |
౨ఆయనను గూర్చి పాడండి. ఆయనను కీర్తించండి. ఆయన ఆశ్చర్య కార్యాలన్నిటిని గూర్చి సంభాషణ చేయండి.
התהללו בשם קדשו ישמח לב מבקשי יהוה | 3 |
౩ఆయన పరిశుద్ధ నామాన్నిబట్టి అతిశయించండి. యెహోవాను వెతికేవారు హృదయంలో సంతోషించుదురు గాక.
דרשו יהוה ועזו בקשו פניו תמיד | 4 |
౪యెహోవాను వెదకండి. ఆయన బలాన్ని వెదకండి. ఆయన సన్నిధిని నిత్యం అన్వేషించండి.
זכרו--נפלאותיו אשר-עשה מפתיו ומשפטי-פיו | 5 |
౫ఆయన సేవకుడైన అబ్రాహాము వంశస్థులారా, ఆయన ఏర్పరచుకున్న యాకోబు సంతతివారలారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోండి.
זרע אברהם עבדו בני יעקב בחיריו | 6 |
౬ఆయన చేసిన సూచక క్రియలను, ఆయన నోటి తీర్పులను జ్ఞాపకం చేసుకోండి.
הוא יהוה אלהינו בכל-הארץ משפטיו | 7 |
౭ఆయన మన దేవుడైన యెహోవా. ఆయన తీర్పులు భూమి అంతటా అమలు అవుతున్నాయి.
זכר לעולם בריתו דבר צוה לאלף דור | 8 |
౮తాను సెలవిచ్చిన మాటను వెయ్యి తరాల వరకూ ఆయన గుర్తుంచుకుంటాడు. అబ్రాహాముతో తాను చేసిన నిబంధనను,
אשר כרת את-אברהם ושבועתו לישחק | 9 |
౯ఇస్సాకుతో తాను చేసిన ప్రమాణాన్ని, నిత్యం ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు.
ויעמידה ליעקב לחק לישראל ברית עולם | 10 |
౧౦వారి సంఖ్య కొద్దిగా ఉన్నప్పుడు, ఆ కొద్ది మంది ఆ దేశంలో పరదేశులుగా ఉన్నప్పుడు,
לאמר--לך אתן את-ארץ-כנען חבל נחלתכם | 11 |
౧౧కొలిచిన వారసత్వంగా కనాను దేశం మీకిస్తానని ఆయన చెప్పాడు.
בהיותם מתי מספר כמעט וגרים בה | 12 |
౧౨ఆ మాట యాకోబుకు శాసనంగాను ఇశ్రాయేలుకు నిత్య నిబంధనగాను స్థిరపరచాడు.
ויתהלכו מגוי אל-גוי מממלכה אל-עם אחר | 13 |
౧౩వారు జనం నుండి జనానికి, రాజ్యం నుండి రాజ్యానికి తిరుగులాడుతుండగా
לא-הניח אדם לעשקם ויוכח עליהם מלכים | 14 |
౧౪వారిని హింసించడానికి ఆయన ఎవరినీ అనుమతించలేదు. ఆయన వారి కోసం రాజులను శిక్షించాడు.
אל-תגעו במשיחי ולנביאי אל-תרעו | 15 |
౧౫నేను అభిషేకించిన వారిని తాకవద్దు, నా ప్రవక్తలకు హాని చేయవద్దు అని ఆయన చెప్పాడు.
ויקרא רעב על-הארץ כל-מטה-לחם שבר | 16 |
౧౬దేశం మీదికి ఆయన కరువు రప్పించాడు. జీవనాధారమైన ధాన్యమంతా ధ్వంసం చేశాడు.
שלח לפניהם איש לעבד נמכר יוסף | 17 |
౧౭వారికంటే ముందుగా ఆయన ఒకణ్ణి పంపించాడు. వారు యోసేపును బానిసగా అమ్మేశారు.
ענו בכבל רגליו (רגלו) ברזל באה נפשו | 18 |
౧౮వారు సంకెళ్లతో అతని కాళ్లు నొప్పించారు. ఇనుము అతని ప్రాణాన్ని బాధించింది.
עד-עת בא-דברו-- אמרת יהוה צרפתהו | 19 |
౧౯అతడు చెప్పిన సంగతి నెరవేరేదాకా యెహోవా వాక్కు అతణ్ణి పరీక్షించాడు.
שלח מלך ויתירהו משל עמים ויפתחהו | 20 |
౨౦రాజు వర్తమానం పంపి అతణ్ణి విడిపించాడు. ప్రజల పాలకుడు అతణ్ణి విడుదల చేశాడు.
שמו אדון לביתו ומשל בכל-קנינו | 21 |
౨౧ఇష్టప్రకారం అతడు తన అధిపతులపై పెత్తనం చెయ్యడానికి, తన పెద్దలకు బుద్ధి చెప్పడానికి,
לאסר שריו בנפשו וזקניו יחכם | 22 |
౨౨తన ఇంటికి యజమానిగా, తన ఆస్తి అంతటిపై అధికారిగా అతణ్ణి నియమించాడు.
ויבא ישראל מצרים ויעקב גר בארץ-חם | 23 |
౨౩ఇశ్రాయేలు ఈజిప్టులోకి వచ్చాడు. యాకోబు హాము దేశంలో పరదేశిగా ఉన్నాడు.
ויפר את-עמו מאד ויעצמהו מצריו | 24 |
౨౪ఆయన తన ప్రజల సంతానాన్ని వృద్ధి చేశాడు. వారి విరోధులకంటే వారికి అధికబలం దయచేశాడు.
הפך לבם לשנא עמו להתנכל בעבדיו | 25 |
౨౫తన ప్రజలపై పగబట్టేలా తన సేవకుల పట్ల కుయుక్తిగా నడుచుకునేలా ఆయన వారి హృదయాలను మళ్ళించాడు.
שלח משה עבדו אהרן אשר בחר-בו | 26 |
౨౬ఆయన తన సేవకుడైన మోషేను, తాను ఏర్పరచుకున్న అహరోనును పంపించాడు.
שמו-בם דברי אתותיו ומפתים בארץ חם | 27 |
౨౭వారు ఐగుప్తీయుల మధ్య ఆయన సూచక క్రియలను, హాము దేశంలో మహత్కార్యాలను జరిగించారు.
שלח חשך ויחשך ולא-מרו את-דבריו (דברו) | 28 |
౨౮ఆయన అంధకారం పంపించి చీకటి కమ్మేలా చేశాడు. వారు ఆయన మాటను ఎదిరించలేదు.
הפך את-מימיהם לדם וימת את-דגתם | 29 |
౨౯ఆయన వారి జలాలను రక్తంగా మార్చాడు. వారి చేపలను చంపాడు.
שרץ ארצם צפרדעים בחדרי מלכיהם | 30 |
౩౦వారి దేశంలో కప్పలు నిండిపోయాయి. అవి వారి రాజుల గదుల్లోకి వచ్చాయి.
אמר ויבא ערב כנים בכל-גבולם | 31 |
౩౧ఆయన ఆజ్ఞ ఇయ్యగా జోరీగలు పుట్టాయి. వారి ప్రాంతాలన్నిటిలోకీ దోమలు వచ్చాయి.
נתן גשמיהם ברד אש להבות בארצם | 32 |
౩౨ఆయన వారిమీద వడగండ్ల వాన కురిపించాడు. వారి దేశంలో అగ్నిజ్వాలలు పుట్టించాడు.
ויך גפנם ותאנתם וישבר עץ גבולם | 33 |
౩౩వారి ద్రాక్షతీగెలను, వారి అంజూరు చెట్లను పడగొట్టాడు. వారి ప్రాంతాల్లో వృక్షాలను విరగగొట్టాడు.
אמר ויבא ארבה וילק ואין מספר | 34 |
౩౪ఆయన ఆజ్ఞ ఇయ్యగా పెద్ద మిడతలు, లెక్కలేనన్ని చీడపురుగులు వచ్చాయి,
ויאכל כל-עשב בארצם ויאכל פרי אדמתם | 35 |
౩౫అవి వారి దేశంలోని కూరగాయల చెట్లన్నిటిని, వారి భూమి పంటలను తినివేశాయి.
ויך כל-בכור בארצם ראשית לכל-אונם | 36 |
౩౬వారి దేశంలోని జ్యేష్ఠులను, వారి ప్రథమ సంతానాన్ని ఆయన హతం చేశాడు.
ויוציאם בכסף וזהב ואין בשבטיו כושל | 37 |
౩౭అక్కడనుండి తన ప్రజలను వెండి బంగారాలతో ఆయన రప్పించాడు. వారి గోత్రాల్లో నిస్సత్తువ చేత తొట్రిల్లేవాడొక్కడైనా లేడు.
שמח מצרים בצאתם כי-נפל פחדם עליהם | 38 |
౩౮వారివలన ఐగుప్తీయులకు భయం వేసింది. వారు వెళ్లిపోయినప్పుడు ఐగుప్తీయులు సంతోషించారు.
פרש ענן למסך ואש להאיר לילה | 39 |
౩౯వారికి నీడగా ఆయన మేఘాన్ని కల్పించాడు. రాత్రి వెలుగివ్వడానికి అగ్నిని కలగజేశాడు.
שאל ויבא שלו ולחם שמים ישביעם | 40 |
౪౦వారు మనవి చేయగా ఆయన పూరేళ్లను రప్పించాడు. ఆకాశంలోనుండి ఆహారాన్నిచ్చి వారిని తృప్తి పరిచాడు.
פתח צור ויזובו מים הלכו בציות נהר | 41 |
౪౧శిలను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చాయి. ఎడారుల్లో అవి ఏరులై ప్రవహించాయి.
כי-זכר את-דבר קדשו את-אברהם עבדו | 42 |
౪౨ఎందుకంటే ఆయన తన పరిశుద్ధ వాగ్దానాన్ని, తన సేవకుడైన అబ్రాహామును జ్ఞాపకం చేసుకుని,
ויוצא עמו בששון ברנה את-בחיריו | 43 |
౪౩తన ప్రజలను సంతోషంతోను, తాను ఏర్పరచుకున్న వారిని ఉత్సాహధ్వనితోను బయటికి రప్పించాడు.
ויתן להם ארצות גוים ועמל לאמים יירשו | 44 |
౪౪అన్యజనుల భూములను ఆయన వారికప్పగించాడు. ఇతర జాతుల సౌభాగ్యాన్ని వారు స్వాధీనపరచుకున్నారు.
בעבור ישמרו חקיו-- ותורתיו ינצרו הללו-יה | 45 |
౪౫వారు తన కట్టడలను గైకొనేలా, తన ధర్మశాస్త్రవిధులను ఆచరించేలా చేయడానికి ఆయనిలా చేశాడు. యెహోవాను స్తుతించండి.