< מִשְׁלֵי 5 >
בני לחכמתי הקשיבה לתבונתי הט-אזנך | 1 |
౧కుమారా, నేను బోధించే జ్ఞానవాక్కులు విను. నా తెలివి గల మాటలు శ్రద్ధగా ఆలకించు.
לשמר מזמות ודעת שפתיך ינצרו | 2 |
౨అప్పుడు నువ్వు జ్ఞానయుక్తంగా నడుచుకుంటావు. నీ తెలివితేటలను బట్టి నీ నోరు మాట్లాడుతుంది.
כי נפת תטפנה שפתי זרה וחלק משמן חכה | 3 |
౩వ్యభిచారిణి పెదవుల నుండి తేనెలాంటి మాటలు వెలువడతాయి. దాని నోటి మాటలు నూనె కంటే మృదువుగా ఉంటాయి.
ואחריתה מרה כלענה חדה כחרב פיות | 4 |
౪చివరికి ఆమె వసనాభి కాయలాగా ఉంటుంది. రెండంచుల కత్తి వలే ఉంటుంది.
רגליה ירדות מות שאול צעדיה יתמכו (Sheol ) | 5 |
౫దాని ప్రవర్తన మరణంలో పడిపోవడానికి దారితీస్తుంది. దాని మార్గం సూటిగా పాతాళానికి చేరుస్తుంది. (Sheol )
ארח חיים פן-תפלס נעו מעגלתיה לא תדע | 6 |
౬జీవమార్గం గురించి వ్యభిచారిణి ఎంతమాత్రం ఆలోచించదు. ఆమె ఎటు వెళ్తుందో ఆమెకే తెలియక అటూ ఇటూ సంచరిస్తుంది.
ועתה בנים שמעו-לי ואל-תסורו מאמרי-פי | 7 |
౭కుమారులారా, నేను చెప్పే బోధ ఆలకించండి. నేను చెప్పే ఉపదేశం నుండి పక్కకు మళ్ళుకోవద్దు.
הרחק מעליה דרכך ואל-תקרב אל-פתח ביתה | 8 |
౮వ్యభిచారిణి నివసించే స్థలాల నుండి నీ అడుగులు దూరం చేసుకో. ఆమె యింటి వాకిలి వైపు పోవద్దు.
פן-תתן לאחרים הודך ושנתיך לאכזרי | 9 |
౯నువ్వు గనుక వ్యభిచారిణి దగ్గరికి వెళ్లిన పక్షంలో నీ ప్రతిష్ట నవ్వుల పాలౌతుంది. నీ జీవిత కాలమంతా దుష్టుల చేతిల్లోకి వెళ్తుంది.
פן-ישבעו זרים כחך ועצביך בבית נכרי | 10 |
౧౦అన్యులు నీ ఆస్తిని అనుభవిస్తారు. నీ కష్టార్జితమంతా పరుల ఇల్లు చేరుతుంది.
ונהמת באחריתך בכלות בשרך ושארך | 11 |
౧౧చివరికి నీ కండరాలు, నీ శరీరం క్షీణించిపోతాయి.
ואמרת--איך שנאתי מוסר ותוכחת נאץ לבי | 12 |
౧౨అప్పుడు నువ్వు, అయ్యో, ఉపదేశాన్ని నేనెందుకు లక్ష్యపెట్టలేదు? నా మనస్సాక్షి గద్దింపును ఎందుకు తిరస్కరించాను?
ולא-שמעתי בקול מורי ולמלמדי לא-הטיתי אזני | 13 |
౧౩నా బోధకులు చెప్పిన మంచి మాటలు వినలేకపోయాను. నా గురువుల ఉపదేశాలను పట్టించుకోలేదు.
כמעט הייתי בכל-רע-- בתוך קהל ועדה | 14 |
౧౪సమాజంలో నేను అన్ని రకాల కీడులకు దగ్గరగా వచ్చాను, అని నీకు నువ్వు చెప్పుకుంటూ మధనపడతావు.
שתה-מים מבורך ונזלים מתוך בארך | 15 |
౧౫నీ ఇంటి బావిలో ఉబుకుతున్న నీళ్ళు, నీ సొంత కుండలోని నీళ్లు తాగు.
יפוצו מעינתיך חוצה ברחבות פלגי-מים | 16 |
౧౬నీ ఇంట ఉబికే నీటి ఊటలు బయటికి పారవచ్చా? అవి కాలువల్లాగా వీధుల్లో ప్రవహించవచ్చా?
יהיו-לך לבדך ואין לזרים אתך | 17 |
౧౭పరాయి వ్యక్తులు నీతోబాటు వాటిని అనుభవించకూడదు. ఆ నీరు నీ కోసమే ఉండాలి గదా.
יהי-מקורך ברוך ושמח מאשת נעורך | 18 |
౧౮నీ జలాశయం దీవెనలు పొందుతుంది. నీ యవ్వన కాలంలో పెళ్ళాడిన నీ భార్యతో సంతోషించు.
אילת אהבים ויעלת-חן דדיה ירוך בכל-עת באהבתה תשגה תמיד | 19 |
౧౯ఆమె నీకు రమణీయమైన లేడి వంటిది. అందమైన దుప్పిలాంటిది. ఆమె రొమ్ములు నీకు ఎల్లప్పుడూ తృప్తి కలిగించనియ్యి. ఆమె ప్రేమకు బద్ధుడివై చిరకాలం జీవించు.
ולמה תשגה בני בזרה ותחבק חק נכריה | 20 |
౨౦కుమారా, నువ్వు ఎందుకు వ్యభిచారిణి వలలో పడిపోయి ఉంటావు? ఆమె రొమ్మును ఎందుకు కౌగలించుకుంటావు?
כי נכח עיני יהוה--דרכי-איש וכל-מעגלתיו מפלס | 21 |
౨౧మనుషుల ప్రవర్తన యెహోవాకు తెలుసు. వారి నడతలన్నిటినీ ఆయన గుర్తిస్తాడు.
עוונתיו--ילכדנו את-הרשע ובחבלי חטאתו יתמך | 22 |
౨౨దుష్టుడు చేసే పనులు వాణ్ణి ఇరకాటంలో పడవేస్తాయి. వాడు తన పాప కార్యాల వల్ల శిక్షకు గురౌతాడు.
הוא--ימות באין מוסר וברב אולתו ישגה | 23 |
౨౩అలాంటివాడు క్రమశిక్షణ లేకపోవడం వల్ల పరమ మూర్ఖుడై దారి తప్పి నాశనానికి గురౌతాడు.