< מִשְׁלֵי 4 >

שמעו בנים מוסר אב והקשיבו לדעת בינה 1
కుమారులారా, తండ్రి చెప్పే మంచి మాటలు విని వివేకం తెచ్చుకోండి.
כי לקח טוב נתתי לכם תורתי אל-תעזבו 2
నేను మీకు మంచి మాటలు చెబుతాను. నా మాటలు పెడచెవిన పెట్టకండి.
כי-בן הייתי לאבי רך ויחיד לפני אמי 3
నేను నా తండ్రి కుమారుణ్ణి. నా తల్లికి నేను అందమైన ఏకైక కుమారుణ్ణి.
וירני--ויאמר לי יתמך-דברי לבך שמר מצותי וחיה 4
ఆయన నాకు బోధ చేస్తూ ఇలా చెప్పాడు “నేను చెప్పే మాటలు శ్రద్ధగా విని వాటిని నీ హృదయంలో నిలిచిపోనివ్వు. వాటిని విని వాటి ప్రకారం నడుచుకుంటే నువ్వు జీవిస్తావు.
קנה חכמה קנה בינה אל-תשכח ואל-תט מאמרי-פי 5
జ్ఞానం, వివేకం సంపాదించుకో. నా మాటలను విస్మరించ వద్దు, వాటినుండి తొలగిపోవద్దు.
אל-תעזבה ותשמרך אהבה ותצרך 6
జ్ఞానాన్ని విడిచిపెట్టకుండా ఉంటే అది నిన్ను కాపాడుతుంది. దాన్ని ప్రేమిస్తూ ఉంటే అది నిన్ను రక్షిస్తుంది.
ראשית חכמה קנה חכמה ובכל-קנינך קנה בינה 7
జ్ఞానం సంపాదించుకోవడమే బుద్ధి వివేకాలకు మూలం. జ్ఞానం కోసం నీకు ఉన్నదంతా ఖర్చు పెట్టు.
סלסלה ותרוממך תכבדך כי תחבקנה 8
నువ్వు జ్ఞానాన్ని గౌరవిస్తే అది నిన్ను గొప్ప చేస్తుంది. దాన్ని హత్తుకుని ఉంటే అది నీకు పేరు ప్రతిష్టలు తెస్తుంది.
תתן לראשך לוית-חן עטרת תפארת תמגנך 9
అది నీ తలపై అందమైన పాగా ఉంచుతుంది. ప్రకాశవంతంగా వెలిగే అందమైన కిరీటం నీకు దయచేస్తుంది.
שמע בני וקח אמרי וירבו לך שנות חיים 10
౧౦కుమారా, నీవు నా మాటలు విని, వాటి ప్రకారం నడుచుకుంటే నీకు అధిక ఆయుష్షు కలుగుతుంది.
בדרך חכמה הריתיך הדרכתיך במעגלי-ישר 11
౧౧జ్ఞానం కలిగి ఉండే మార్గం నీకు బోధించాను. యథార్థమైన బాటలో నిన్ను నడిపించాను.
בלכתך לא-יצר צעדך ואם-תרוץ לא תכשל 12
౧౨నువ్వు నడుస్తూ ఉన్నప్పుడు నీ అడుగులు చిక్కుపడవు. నీవు పరుగెత్తే సమయంలో నీ పాదాలు తొట్రుపడవు.
החזק במוסר אל-תרף נצרה כי-היא חייך 13
౧౩అది నీ ఊపిరి కనుక దాన్ని సంపాదించుకో. దాన్ని విడిచిపెట్టకుండా భద్రంగా పదిలం చేసుకో.
בארח רשעים אל-תבא ואל-תאשר בדרך רעים 14
౧౪భక్తిహీనుల గుంపులో చేరవద్దు. దుర్మార్గుల ఆలోచనలతో ఏకీభవించవద్దు.
פרעהו אל-תעבר-בו שטה מעליו ועבר 15
౧౫అందులోకి వెళ్ళకుండా తప్పించుకు తిరుగు. దాని నుండి తొలగిపోయి ముందుకు సాగిపో.
כי לא ישנו אם-לא ירעו ונגזלה שנתם אם-לא יכשולו (יכשילו) 16
౧౬ఇతరులకు కీడు చేస్తేనేగాని అలాంటి వాళ్లకి నిద్ర పట్టదు. ఎదుటి వారిని కించపరచకుండా వారు నిద్రపోరు.
כי לחמו לחם רשע ויין חמסים ישתו 17
౧౭వాళ్ళు దౌర్జన్యం చేసి తమ ఆహారం సంపాదించుకుంటారు. బలవంతంగా ద్రాక్షారసం లాక్కుని తాగుతారు.
וארח צדיקים כאור נגה הולך ואור עד-נכון היום 18
౧౮ఉదయాన్నే మొదలైన సూర్యుని వెలుగు మరింతగా పెరుగుతున్నట్టు నీతిమంతుల మార్గం అంతకంతకూ ప్రకాశిస్తుంది.
דרך רשעים כאפלה לא ידעו במה יכשלו 19
౧౯దుష్టుల మార్గం చీకటిమయం. వాళ్ళు ఎక్కడెక్కడ పడిపోతారో వాళ్ళకే తెలియదు.
בני לדברי הקשיבה לאמרי הט-אזנך 20
౨౦కుమారా, నేను చెప్పే మాటలు విను. నా నీతి బోధలు మనసులో ఉంచుకో.
אל-יליזו מעיניך שמרם בתוך לבבך 21
౨౧నీ మార్గం అంతటిలో నుండి వాటిని అనుసరించు. నీ హృదయంలో వాటిని భద్రంగా దాచుకో.
כי-חיים הם למצאיהם ולכל-בשרו מרפא 22
౨౨అవి దొరికిన వారికి జీవం కలుగుతుంది. వాళ్ళ శరీరమంతటికీ ఆరోగ్యం కలిగిస్తాయి.
מכל-משמר נצר לבך כי-ממנו תוצאות חיים 23
౨౩అన్నిటికంటే ముఖ్యంగా వాటిని నీ హృదయంలో భద్రంగా కాపాడుకో. అప్పుడు నీ హృదయంలో నుండి జీవధారలు ప్రవహిస్తాయి.
הסר ממך עקשות פה ולזות שפתים הרחק ממך 24
౨౪నీ నోటి నుండి కుటిలమైన మాటలు, మోసకరమైన మాటలు రానియ్యకు.
עיניך לנכח יביטו ועפעפיך יישרו נגדך 25
౨౫నీ కంటిచూపు సూటిగా ఉండనియ్యి. నీ ఆలోచనల్లో ముందు చూపు కలిగి ఉండు.
פלס מעגל רגלך וכל-דרכיך יכנו 26
౨౬నువ్వు నడిచే మార్గం సరళం చెయ్యి. అప్పుడు నీ దారులన్నీ స్థిరపడతాయి.
אל-תט-ימין ושמאול הסר רגלך מרע 27
౨౭కుడివైపుకు గానీ, ఎడమవైపుకు గానీ తొలగిపోవద్దు. దుర్మార్గం వైపు నడవకుండా నీ అడుగులు తప్పించుకో.”

< מִשְׁלֵי 4 >