< מִשְׁלֵי 27 >
אל-תתהלל ביום מחר כי לא-תדע מה-ילד יום | 1 |
౧రేపటి రోజును గూర్చి డంబాలు పలక వద్దు. ఏ రోజున ఏమి జరుగుతుందో ఎవరికి తెలుసు?
יהללך זר ולא-פיך נכרי ואל-שפתיך | 2 |
౨నీ నోరు కాదు, వేరొకరు ఎవరన్నా, నీ స్వంత పెదవులు కాదు ఇతరులే నిన్ను పొగడాలి.
כבד-אבן ונטל החול וכעס אויל כבד משניהם | 3 |
౩రాయి బరువు ఇసక భారం గదా. మూర్ఖుడి కోపం ఆ రెంటికంటే బరువు.
אכזריות חמה ושטף אף ומי יעמד לפני קנאה | 4 |
౪క్రోధం క్రూరమైనది. కోపం వరదలాగా ముంచెత్తుతుంది. రోషం ఎదుట నిలవ గలిగేది ఎవరు?
טובה תוכחת מגלה-- מאהבה מסתרת | 5 |
౫లోలోపల ప్రేమించడం కంటే బహిరంగంగా గద్దించడం మేలు.
נאמנים פצעי אוהב ונעתרות נשיקות שונא | 6 |
౬స్నేహితుడు మేలు కోరి గాయాలు చేస్తాడు. శత్రువు లెక్క లేనన్ని ముద్దులు పెడతాడు.
נפש שבעה תבוס נפת ונפש רעבה כל-מר מתוק | 7 |
౭కడుపు నిండిన వాడు తేనెపట్టునైనా సరే కాళ్ళతో తొక్కేస్తాడు. ఆకలి వేసిన వాడికి చేదు పదార్థమైనా తియ్యగా ఉంటుంది.
כצפור נודדת מן-קנה-- כן-איש נודד ממקומו | 8 |
౮తన సొంత ఇల్లు విడిచిపెట్టి తిరిగేవాడు గూడు విడిచి తిరిగే పక్షితో సమానం.
שמן וקטרת ישמח-לב ומתק רעהו מעצת-נפש | 9 |
౯పరిమళం, సుగంధం హృదయాన్ని సంతోషపెడుతుంది. అలాగే మిత్రుడి హృదయంలో నుండి వచ్చే మధుర వాక్కులు హృదయాన్ని సంతోషపెడతాయి.
רעך ורעה (ורע) אביך אל-תעזב-- ובית אחיך אל-תבוא ביום אידך טוב שכן קרוב מאח רחוק | 10 |
౧౦నీ స్నేహితుడినైనా నీ తండ్రి స్నేహితుడినైనా విడిచి పెట్టవద్దు. నీ ఆపద దినాన నీ అన్నదమ్ముల ఇళ్ళకు వెళ్లకు. దూరంగా ఉన్న సోదరుడి కంటే దగ్గరున్న పొరుగువాడే మంచిది.
חכם בני ושמח לבי ואשיבה חרפי דבר | 11 |
౧౧కుమారా, జ్ఞానం సంపాదించి నా హృదయాన్ని సంతోషపెట్టు. అప్పుడు నన్ను నిందించే వారితో నేను ధైర్యంగా మాటలాడతాను.
ערום ראה רעה נסתר פתאים עברו נענשו | 12 |
౧౨బుద్ధిమంతుడు అపాయం రావడం చూసి దాక్కుంటాడు. జ్ఞానం లేనివారు నిర్లక్ష్యంగా ఆపదలో పడతారు.
קח-בגדו כי-ערב זר ובעד נכריה חבלהו | 13 |
౧౩ఎదుటి మనిషి విషయంలో హామీ ఉండే వాడి నుంచి అతని వస్త్రం తీసుకో. ఇతరుల కోసం పూచీ తీసుకున్న వాడిచేత వాడి వస్తువులు తాకట్టు పెట్టించు.
מברך רעהו בקול גדול--בבקר השכים קללה תחשב לו | 14 |
౧౪పొద్దున్నే లేచి పెద్ద గొంతుకతో తన స్నేహితుణ్ణి దీవించే వాడి దీవెన అతని పాలిట శాపమే.
דלף טורד ביום סגריר ואשת מדונים (מדינים) נשתוה | 15 |
౧౫ముసురు పట్టిన రోజున ఏక ధారగా కురుస్తూ ఉండే నీళ్లు, గయ్యాళి ఇల్లాలు ఒకటే.
צפניה צפן-רוח ושמן ימינו יקרא | 16 |
౧౬ఆమెను ఆపాలని ప్రయత్నించేవాడు గాలిని ఆపాలని ప్రయత్నించే వాడితో సమానం. తన కుడిచేతిలో నూనె పట్టుకోవాలని ప్రయత్నించడంతో సమానం.
ברזל בברזל יחד ואיש יחד פני-רעהו | 17 |
౧౭ఇనుము చేత ఇనుము పదును అవుతుంది. అలాగే ఒక మనిషి తన సాటి మనిషికి పదును పెడతాడు.
נצר תאנה יאכל פריה ושמר אדניו יכבד | 18 |
౧౮అంజూరు చెట్టు పెంచేవాడు దాని పండ్లు తింటాడు. తన యజమానిని గౌరవించే వాడు ఘనత పొందుతాడు.
כמים הפנים לפנים-- כן לב-האדם לאדם | 19 |
౧౯నీటిలో ముఖానికి ముఖం కనబడినట్టు ఒకడి మనస్సుకు మరొకడి మనస్సు కనబడుతుంది.
שאול ואבדה לא תשבענה ועיני האדם לא תשבענה (Sheol ) | 20 |
౨౦పాతాళానికి, అగాధానికి తృప్తి ఉండదు. అలానే మనిషి కోరికలకు ఎప్పటికీ తృప్తి ఉండదు. (Sheol )
מצרף לכסף וכור לזהב ואיש לפי מהללו | 21 |
౨౧మూసతో వెండిని కొలిమితో బంగారాన్ని తాను పొందిన కీర్తితో మనిషిని పరీక్షించి చూడ వచ్చు.
אם תכתוש-את-האויל במכתש בתוך הריפות-- בעלי לא-תסור מעליו אולתו | 22 |
౨౨మూర్ఖుడిని గోదుమలలోబాటు రోకలితో దంచినా వాడి మూఢత వాణ్ణి వదలిపోదు.
ידע תדע פני צאנך שית לבך לעדרים | 23 |
౨౩నీ పశువుల స్థితి జాగ్రత్తగా తెలిసుకో. నీ మందల మీద మనస్సు ఉంచు.
כי לא לעולם חסן ואם-נזר לדור דור (ודור) | 24 |
౨౪డబ్బు శాశ్వతం కాదు. కిరీటం తరతరాలు ఉంటుందా?
גלה חציר ונראה-דשא ונאספו עשבות הרים | 25 |
౨౫ఎండిన గడ్డి వామి వేస్తారు. పచ్చిక ఇక కనిపించడం లేదు. మొలకలు వస్తున్నాయి. ఆలమందల కోసం కొండగడ్డి కోసుకొస్తున్నారు.
כבשים ללבושך ומחיר שדה עתודים | 26 |
౨౬నీకు వెచ్చటి బట్టల కోసం గొర్రెపిల్లలున్నాయి. ఒక చేను కొనడానికి మేకలు సరిపోతాయి.
ודי חלב עזים--ללחמך ללחם ביתך וחיים לנערותיך | 27 |
౨౭నీ ఆహారానికి, నీ కుటుంబం తినే ఆహారానికి, నీ దాసదాసీల పోషణకు మేకపాలు ఉంటాయి.