< מִשְׁלֵי 19 >

טוב-רש הולך בתמו-- מעקש שפתיו והוא כסיל 1
బుద్ధిహీనుడై కుటిలంగా మాట్లాడే వాడి కంటే యథార్థంగా ప్రవర్తించే పేదవాడే గొప్ప.
גם בלא-דעת נפש לא-טוב ואץ ברגלים חוטא 2
ఆలోచన లేకుండా కోరికలుండడం మంచిది కాదు. తొందరపడి పరిగెత్తేవాడు దారి తప్పిపోతాడు.
אולת אדם תסלף דרכו ועל-יהוה יזעף לבו 3
ఒకడి మూర్ఖత్వం వాడి బ్రతుకును ధ్వంసం చేస్తుంది. అలాటి వాడు యెహోవా మీద మండిపడతాడు.
הון--יסיף רעים רבים ודל מרעהו יפרד 4
సంపద స్నేహితులను సమకూరుస్తుంది. దరిద్రుడికి స్నేహితులు దూరమౌతారు.
עד שקרים לא ינקה ויפיח כזבים לא ימלט 5
అబద్ద సాక్షికి శిక్ష తప్పదు. అబద్ధాలాడేవాడు తప్పించుకోలేడు.
רבים יחלו פני-נדיב וכל-הרע לאיש מתן 6
ఉదార గుణం గలవారిని చాలామంది సహాయం కోసం అడుగుతారు. ఇచ్చేవాడికి అందరూ స్నేహితులే.
כל אחי-רש שנאהו-- אף כי מרעהו רחקו ממנו מרדף אמרים לא- (לו-) המה 7
పేదవాణ్ణి అతని బంధువులంతా ఏవగించుకుంటారు. అలాగైతే అతని స్నేహితులు మరింకెంతగా దూరమైపోతారు! వాడు వాళ్ళను పిలుస్తాడు గానీ వాళ్ళక్కడ ఉండరు.
קנה-לב אהב נפשו שמר תבונה למצא-טוב 8
బుద్ధి సంపాదించుకొనేవాడు తనకు తాను మేలు చేసుకుంటాడు. అవగాహన కలిగిన వాడు మేలైనదాన్ని కనుగొంటాడు.
עד שקרים לא ינקה ויפיח כזבים יאבד 9
అబద్ద సాక్షికి శిక్ష తప్పదు. అబద్ధాలాడేవాడు నాశనమౌతాడు.
לא-נאוה לכסיל תענוג אף כי-לעבד משל בשרים 10
౧౦బుద్ధిహీనుడు సుఖ భోగాలనుభవించడం తగదు. ఒక బానిస రాజులపై ఏలుబడి చేయడం అంతకన్నా తగదు.
שכל אדם האריך אפו ותפארתו עבר על-פשע 11
౧౧విచక్షణ ఒక మనిషికి సహనం ఇస్తుంది. తప్పులు చూసీ చూడనట్టు పోవడం అతనికి ఘనత.
נהם ככפיר זעף מלך וכטל על-עשב רצונו 12
౧౨రాజు కోపం సింహగర్జన లాంటిది. అతని అనుగ్రహం గడ్డి మీద కురిసే మంచు లాంటిది.
הות לאביו בן כסיל ודלף טרד מדיני אשה 13
౧౩మూర్ఖుడైన కొడుకు తన తండ్రికి కీడు తెస్తాడు. గయ్యాళి భార్య ఆగకుండా పడుతూ ఉండే నీటి బిందువులతో సమానం.
בית והון נחלת אבות ומיהוה אשה משכלת 14
౧౪ఇల్లు, ధనం పూర్వికులనుండి వారసత్వంగా వస్తుంది. అయితే వివేకవతియైన ఇల్లాలిని ఇచ్చేది యెహోవాయే.
עצלה תפיל תרדמה ונפש רמיה תרעב 15
౧౫సోమరితనం గాఢనిద్రలో పడేస్తుంది. పని చేయడం ఇష్టం లేని వాడు పస్తులుంటాడు.
שמר מצוה שמר נפשו בוזה דרכיו יומת (ימות) 16
౧౬ఆజ్ఞ పాటించేవాడు తన ప్రాణం కాపాడుకుంటాడు. తన ప్రవర్తన విషయం జాగ్రత్తగా చూసుకోనివాడు చచ్చిపోతాడు.
מלוה יהוה חונן דל וגמלו ישלם-לו 17
౧౭పేదలను ఆదుకోవడం అంటే యెహోవాకు అప్పివ్వడమే. ఆయన తప్పకుండా ఆ రుణం తీరుస్తాడు.
יסר בנך כי-יש תקוה ואל-המיתו אל-תשא נפשך 18
౧౮అనువైన కాలంలోనే నీ కుమారుణ్ణి శిక్షించు. అయితే వాణ్ణి చంపాలని చూడొద్దు.
גרל- (גדל-) חמה נשא ענש כי אם-תציל ועוד תוסף 19
౧౯పట్టరాని కోపంతో మండిపడే వాడు తప్పకుండా అందుకు తగిన శిక్ష పొందుతాడు. నువ్వు వాణ్ణి తప్పించినా పదే పదే అదే పని నువ్వు చేయవలసి వస్తుంది.
שמע עצה וקבל מוסר-- למען תחכם באחריתך 20
౨౦సలహా వినిపించుకో, సూచనలను అంగీకరించు. అలా చేశావంటే పెద్దవాడయ్యే నాటికి జ్ఞానివి అవుతావు.
רבות מחשבות בלב-איש ועצת יהוה היא תקום 21
౨౧మనిషి హృదయంలో ఆలోచనలు అనేకం. అయితే యెహోవా ఉద్దేశాలే నిలబడతాయి.
תאות אדם חסדו וטוב-רש מאיש כזב 22
౨౨మనిషి హృదయం కోరేది నిబద్ధతే. అబద్ధికుడికంటే దరిద్రుడే మేలు.
יראת יהוה לחיים ושבע ילין בל-יפקד רע 23
౨౩యెహోవాకు చెందవలసిన భయభక్తులు ఆయనకి చెల్లించాలి. అది జీవ సాధనం. అది ఉన్న వాడు తృప్తిగా బ్రతుకుతాడు.
טמן עצל ידו בצלחת גם-אל-פיהו לא ישיבנה 24
౨౪సోమరిపోతు గిన్నెలో చెయ్యి పెడతాడుగానీ తన నోటికి దాన్ని ఎత్తనైనా ఎత్తడు.
לץ תכה ופתי יערם והוכיח לנבון יבין דעת 25
౨౫హేళన చేసే వారిని దండించు, అది చూసి ఆజ్ఞానులు బుద్ధి తెచ్చుకుంటారు. వివేకులను గద్దించినట్టయితే వారు జ్ఞానంలో ఎదుగుతారు.
משדד-אב יבריח אם-- בן מביש ומחפיר 26
౨౬తండ్రిని బాధిస్తూ తల్లిని తరిమేసేవాడు సిగ్గు, అపకీర్తి తెచ్చే కొడుకు.
חדל-בני לשמע מוסר לשגות מאמרי-דעת 27
౨౭కుమారా, బుద్ధి చెప్పే మాటలు వినడం మానుకుంటే జ్ఞాన వాక్కులకు నీవు దూరమై పోతావు.
עד בליעל יליץ משפט ופי רשעים יבלע-און 28
౨౮చెడిపోయిన సాక్షి న్యాయాన్ని గేలి చేస్తాడు. దుర్మార్గుల నోరు దోషాన్ని జుర్రుకుంటుంది.
נכונו ללצים שפטים ומהלמות לגו כסילים 29
౨౯అపహాస్యం చేసేవారికి తీర్పు, బుద్ధిహీనుల వీపుకు దెబ్బలు.

< מִשְׁלֵי 19 >