< מִשְׁלֵי 17 >
טוב פת חרבה ושלוה-בה-- מבית מלא זבחי-ריב | 1 |
౧ఎంత రుచికరమైన భోజనం ఉన్నా కలహాలతో ఉన్న ఇంట్లో ఉండడం కంటే ప్రశాంతంగా వట్టి రొట్టెముక్క తినడం మంచిది.
עבד-משכיל--ימשל בבן מביש ובתוך אחים יחלק נחלה | 2 |
౨బుద్ధిమంతుడైన సేవకుడు సిగ్గు కలిగించే కొడుకు మీద అధికారం సంపాదించుకుంటాడు. అన్నదమ్ములతో పాటు వాడు పిత్రార్జితం పంచు కుంటాడు.
מצרף לכסף וכור לזהב ובחן לבות יהוה | 3 |
౩వెండికి మూస, బంగారానికి కొలిమి కావాలి. హృదయాలను శుద్ధి చేసేది యెహోవాయే.
מרע מקשיב על-שפת-און שקר מזין על-לשון הות | 4 |
౪చెడు నడవడిక గలవాడు చెప్పుడు మాటలు వింటాడు. హానికరమైన మాటలు పలుకుతుంటే అబద్ధికుడు శ్రద్ధగా వింటాడు.
לעג לרש חרף עשהו שמח לאיד לא ינקה | 5 |
౫పేదలను వెక్కిరించేవాడు వారి సృష్టికర్తను నిందిస్తున్నాడు. ఆపద కలగడం చూసి సంతోషించేవాడికి శిక్ష తప్పదు.
עטרת זקנים בני בנים ותפארת בנים אבותם | 6 |
౬మనవలు ముసలివారికి కిరీటాలు. తమ పిల్లలకు ప్రతిష్ట తెచ్చేది తల్లి దండ్రులే.
לא-נאוה לנבל שפת-יתר אף כי-לנדיב שפת-שקר | 7 |
౭అతి వాగుడు బుద్ధిలేనివాడికి తగదు. అంతకన్నా ముఖ్యంగా అబద్ధమాడడం అధిపతికి పనికిరాదు.
אבן-חן השחד בעיני בעליו אל-כל-אשר יפנה ישכיל | 8 |
౮లంచం ఇచ్చేవాడికి అదొక మహిమగల మణి లాగా ఉంటుంది. అలాంటివాడు చేసేవన్నీ నెరవేరుతున్నట్టు ఉంటుంది.
מכסה-פשע מבקש אהבה ושנה בדבר מפריד אלוף | 9 |
౯ప్రేమను కోరేవాడు జరిగిన తప్పును గుట్టుగా ఉంచుతాడు. జరిగిన సంగతి మాటిమాటికీ ఎత్తేవాడు దగ్గర స్నేహితులను కూడా పాడు చేసుకుంటాడు.
תחת גערה במבין-- מהכות כסיל מאה | 10 |
౧౦బుద్ధిహీనుడికి నూరుదెబ్బల కంటే బుద్ధిమంతుడికి ఒక గద్దింపు మాట మరింత లోతుగా నాటుతుంది.
אך-מרי יבקש-רע ומלאך אכזרי ישלח-בו | 11 |
౧౧దుర్మార్గుడు ఎప్పుడూ తిరుగుబాటు చేయడానికే చూస్తాడు. అలాటి వాడికి వ్యతిరేకంగా క్రూరుడైన వార్తాహరుణ్ణి పంపిస్తారు.
פגוש דב שכול באיש ואל-כסיל באולתו | 12 |
౧౨మూర్ఖపు పనులు చేస్తున్న మూర్ఖుడికి ఎదురు పడడం కంటే పిల్లలను పోగొట్టుకున్న ఎలుగుబంటిని కలుసుకోవడమే క్షేమం.
משיב רעה תחת טובה-- לא-תמיש (תמוש) רעה מביתו | 13 |
౧౩మేలుకు ప్రతిగా కీడు చేసేవాడి లోగిలిలో నుండి కీడు ఎన్నటికీ తొలగిపోదు.
פוטר מים ראשית מדון ולפני התגלע הריב נטוש | 14 |
౧౪పోట్లాట మొదలు పెట్టడం నీటిని వదిలిపెట్టినట్టే. కాబట్టి వివాదం పెరగక ముందే దాన్ని వదిలెయ్యి.
מצדיק רשע ומרשיע צדיק-- תועבת יהוה גם-שניהם | 15 |
౧౫దుర్మార్గులను నిర్దోషులుగా, మంచి చేసే వారిని దోషులుగా తీర్పు తీర్చేవాడు వీరిద్దరూ యెహోవాకు అసహ్యం.
למה-זה מחיר ביד-כסיל-- לקנות חכמה ולב-אין | 16 |
౧౬బుద్ధిహీనుడు జ్ఞానం సంపాదించడానికి డబ్బు ఇవ్వడం దేనికి? నేర్చుకునే సామర్థ్యం వాడికి లేదు గదా?
בכל-עת אהב הרע ואח לצרה יולד | 17 |
౧౭స్నేహితుడు ఎప్పుడూ ప్రేమిస్తూనే ఉంటాడు. కష్టకాలంలో ఆదుకోడానికే సోదరులు పుట్టేది.
אדם חסר-לב תוקע כף ערב ערבה לפני רעהו | 18 |
౧౮తన పొరుగువాడికి జామీను ఉండి అతడి అప్పులకు హామీ ఉండే వాడు తెలివితక్కువ వాడు.
אהב פשע אהב מצה מגביה פתחו מבקש-שבר | 19 |
౧౯కలహాలంటే ఇష్టం ఉన్నవాడు పాపాన్ని ప్రేమించేవాడు. తన ఇంటి వాకిళ్ళు ఎత్తు పెంచేవాడు ఎముకలు విరగడానికి కారణం అవుతాడు.
עקש-לב לא ימצא-טוב ונהפך בלשונו יפול ברעה | 20 |
౨౦దుష్ట హృదయం గలవాడికి మేలు జరగదు. కుటిలంగా మాట్లాడే వాడు ప్రమాదంలో చిక్కుకుంటాడు.
ילד כסיל לתוגה לו ולא-ישמח אבי נבל | 21 |
౨౧బుద్ధిలేని వాడి తండ్రికి దుఃఖమే. తెలివిలేని వాణ్ణి కన్నవాడికి సంతోషం లేదు.
לב שמח ייטיב גהה ורוח נכאה תיבש-גרם | 22 |
౨౨ఆహ్లాదకరమైన మనస్సు మంచి ఔషధం. చితికిపోయిన మనస్సు వల్ల ఎముకలు ఎండిపోతాయి.
שחד מחק רשע יקח-- להטות ארחות משפט | 23 |
౨౩న్యాయాన్ని తారుమారు చేయడానికి దుష్టుడు రహస్యంగా లంచం తీసుకుంటాడు.
את-פני מבין חכמה ועיני כסיל בקצה-ארץ | 24 |
౨౪వివేకం గలవాడు తన ముఖాన్ని జ్ఞానం కేసి తిప్పుకుంటాడు. బుద్ధిలేని వాడి కళ్ళు భూమి కొనల వైపు తిరిగి ఉంటాయి.
כעס לאביו בן כסיל וממר ליולדתו | 25 |
౨౫బుద్ధిలేని కొడుకు తన తండ్రికి దుఃఖం తెస్తాడు. కన్న తల్లికి వాడు వేదన కలిగిస్తాడు.
גם ענוש לצדיק לא-טוב-- להכות נדיבים על-ישר | 26 |
౨౬మంచి చేసే వారిని శిక్షించడం న్యాయం కాదు. యథార్థత గల ఉదాత్తులను కొరడాలతో కొట్టడం తగదు.
חושך אמריו יודע דעת וקר- (יקר-) רוח איש תבונה | 27 |
౨౭జ్ఞానం గలవాడు తక్కువగా మాట్లాడతాడు. అవగాహన గలవాడు శాంత గుణం కలిగి ఉంటాడు.
גם אויל מחריש חכם יחשב אטם שפתיו נבון | 28 |
౨౮మూర్ఖుడు సైతం మౌనంగా ఉంటే చాలు, అందరూ అతడు జ్ఞాని అనుకుంటారు. అలాటి వాడు నోరు మూసుకుని ఉంటే చాలు, అతడు తెలివి గలవాడని అందరూ అనుకుంటారు.