< איוב 9 >
౧అప్పుడు యోబు ఇలా జవాబు చెప్పాడు.
אמנם ידעתי כי-כן ומה-יצדק אנוש עם-אל | 2 |
౨నిజమే, ఆ విషయం అలాగే ఉంటుందని నాకు తెలుసు. మనిషి దేవుని దృష్టిలో లోపం లేనివాడుగా ఎలా ఉండగలడు?
אם-יחפץ לריב עמו-- לא-יעננו אחת מני-אלף | 3 |
౩మనిషి ఆయనతో వివాదం పెట్టుకుంటే ఆయన అడిగే వెయ్యి ప్రశ్నల్లో ఒక్కదానికైనా జవాబు చెప్పలేడు.
חכם לבב ואמיץ כח-- מי-הקשה אליו וישלם | 4 |
౪ఆయన అత్యంత వివేకం, బల ప్రభావాలు గలవాడు. ఆయనతో పోరాడాలని తెగించిన వాళ్ళు తప్పక కీడు పాలవుతారు.
המעתיק הרים ולא ידעו-- אשר הפכם באפו | 5 |
౫పర్వతాలను వాటికి తెలియకుండానే ఆయన తొలగిస్తాడు. కోపంతో వాటిని బోర్లాపడేలా చేస్తాడు.
המרגיז ארץ ממקומה ועמודיה יתפלצון | 6 |
౬భూమిని కూడా అది ఉన్న స్థలం నుండి కదిలించివేస్తాడు. భూమి పునాదులు ఊగిపోయేలా చేస్తాడు.
האמר לחרס ולא יזרח ובעד כוכבים יחתם | 7 |
౭ఆయన సూర్యుడికి ఉదయించవద్దని ఆజ్ఞాపిస్తే సూర్యుడు ఉదయించడు. ఆయన నక్షత్రాలను కనబడకుండా దాచివేస్తాడు.
נטה שמים לבדו ודורך על-במתי ים | 8 |
౮ఆయన మాత్రమే ఆకాశాన్ని విశాలం చేస్తాడు. సముద్ర అలల మీద ఆయన నడుస్తున్నాడు.
עשה-עש כסיל וכימה וחדרי תמן | 9 |
౯స్వాతి, మృగశీర్షం, కృత్తిక అనే నక్షత్రాలను, దక్షిణ నక్షత్రాల రాశిని ఆయనే కలగజేశాడు.
עשה גדלות עד-אין חקר ונפלאות עד-אין מספר | 10 |
౧౦ఎవరికీ అంతు చిక్కని మహిమ గల కార్యాలు, లెక్కలేనన్ని అద్భుత క్రియలు ఆయన చేస్తున్నాడు.
הן יעבר עלי ולא אראה ויחלף ולא-אבין לו | 11 |
౧౧ఇదిగో, ఆయన నా సమీపంలో ఉంటున్నాడు, కానీ నేను ఆయనను గుర్తించలేదు. నా పక్కనుండి నడుస్తూ వెళ్తున్నాడు కానీ ఆయన నాకు కనబడడు.
הן יחתף מי ישיבנו מי-יאמר אליו מה-תעשה | 12 |
౧౨ఆయన తీసుకువెళ్తుంటే ఆయనను అడ్డగించేవాడెవడు? “నువ్వేం చేస్తున్నావు?” అని ఆయనను అడగగలిగే వాళ్ళు ఎవరు?
אלוה לא-ישיב אפו תחתו שחחו עזרי רהב | 13 |
౧౩దేవుని కోపం చల్లారదు. రాహాబుకు సహాయం చేసిన వాళ్ళు ఆయనకు లొంగిపోయారు.
אף כי-אנכי אעננו אבחרה דברי עמו | 14 |
౧౪కాబట్టి ఆయనకు జవాబివ్వడానికి నేనేపాటి వాణ్ణి? సూటియైన మాటలు పలుకుతూ ఆయనతో వాదించడానికి నేనెంతటి వాణ్ణి?
אשר אם-צדקתי לא אענה למשפטי אתחנן | 15 |
౧౫నేను న్యాయవంతుణ్ణి అయినా ఆయనకు జవాబు చెప్పలేను. నా న్యాయాధిపతిని కరుణించమని వేడుకోవడం మాత్రమే చేయగలను.
אם-קראתי ויענני-- לא-אאמין כי-יאזין קולי | 16 |
౧౬నేను మొరపెట్టినప్పుడు ఆయన నాకు జవాబిచ్చినా ఆయన నా మాట వింటాడని నాకు నమ్మకం లేదు.
אשר-בשערה ישופני והרבה פצעי חנם | 17 |
౧౭ఆయన నా మొర వినకుండా నన్ను తుఫాను చేత నలగగొడుతున్నాడు. కారణం లేకుండా నా గాయాలను రేగగొడుతున్నాడు.
לא-יתנני השב רוחי כי ישבעני ממררים | 18 |
౧౮ఆయన నన్ను ఊపిరి పీల్చుకోనివ్వడు. చేదు పదార్థాలు నాకు తినిపిస్తాడు.
אם-לכח אמיץ הנה ואם-למשפט מי יועידני | 19 |
౧౯బలవంతుల శక్తిని గూర్చి ప్రశ్న వస్తే “నేనే ఉన్నాను” అని ఆయన అంటాడు. న్యాయ నిర్ణయం గూర్చి వివాదం రేగినప్పుడు “నాకు విరోధంగా వాదించేది ఎవరు?” అని ఆయన అడుగుతాడు.
אם-אצדק פי ירשיעני תם-אני ויעקשני | 20 |
౨౦నేను చేసే వాదన న్యాయంగా ఉన్నప్పటికీ నా మాటలే నా మీద నేరం మోపుతాయి. నేను న్యాయవంతుడినైప్పటికీ దోషినని నా మాటలు రుజువు చేస్తాయి.
תם-אני לא-אדע נפשי אמאס חיי | 21 |
౨౧నేను నిర్దోషిని అయినప్పటికీ నా మీద నాకు ఇష్టం పోయింది. నా ప్రాణం అంటే నాకు లెక్క లేదు.
אחת היא על-כן אמרתי--תם ורשע הוא מכלה | 22 |
౨౨తేడా ఏమీ లేదు. అందుకే అంటున్నాను, ఆయన నీతిమంతులు, దుర్మార్గులు అనే భేదం లేకుండా అందరినీ నాశనం చేస్తున్నాడు.
אם-שוט ימית פתאם-- למסת נקים ילעג | 23 |
౨౩ఆకస్మాత్తుగా సమూల నాశనం సంభవిస్తే నిరపరాధులు పడే అవస్థను చూసి ఆయన నవ్వుతాడు.
ארץ נתנה ביד-רשע-- פני-שפטיה יכסה אם-לא אפוא מי-הוא | 24 |
౨౪భూమి దుర్మార్గుల ఆధీనంలో ఉంది. ఆయన న్యాయాధిపతులకు మంచి చెడ్డల విచక్షణ లేకుండా చేస్తాడు. ఇవన్నీ చేయగలిగేది ఆయన గాక ఇంకెవరు?
וימי קלו מני-רץ ברחו לא-ראו טובה | 25 |
౨౫పరుగు తీసే వాడి కంటే వేగంగా, ఎలాంటి మంచీ లేకుండానే నా రోజులు గడిచిపోతున్నాయి.
חלפו עם-אניות אבה כנשר יטוש עלי-אכל | 26 |
౨౬రెల్లుతో కట్టిన పడవలు సాగిపోతున్నట్టు, గరుడపక్షి ఎరను చూసి హటాత్తుగా దానిపై వాలినట్టు నా రోజులు దొర్లిపోతున్నాయి.
אם-אמרי אשכחה שיחי אעזבה פני ואבליגה | 27 |
౨౭నా బాధలు మరచిపోతాననీ, నా దుఃఖం పోయి సంతోషంగా ఉంటాననీ నేను అనుకున్నానా?
יגרתי כל-עצבתי ידעתי כי-לא תנקני | 28 |
౨౮నాకు వచ్చిన బాధలన్నిటిని బట్టి భయపడుతున్నాను. నువ్వు నన్ను నిర్దోషిగా ఎంచవన్న విషయం నాకు స్పష్టంగా తెలిసిపోయింది.
אנכי ארשע למה-זה הבל איגע | 29 |
౨౯నేను దోషిని అని నిర్ణయం అయిపొయింది గదా. ఇక నాకెందుకు ఈ వృథా ప్రయాస?
אם-התרחצתי במו- (במי-) שלג והזכותי בבר כפי | 30 |
౩౦నన్ను నేను మంచులాగా శుభ్రం చేసుకున్నా, సబ్బుతో నా చేతులు తోముకున్నా,
אז בשחת תטבלני ותעבוני שלמותי | 31 |
౩౧నువ్వు నన్ను గుంటలో పడేస్తావు. అప్పుడు నేను వేసుకున్న బట్టలే నన్ను అసహ్యించుకుంటాయి.
כי-לא-איש כמוני אעננו נבוא יחדו במשפט | 32 |
౩౨ఆయనకు జవాబు చెప్పడానికి దేవుడు నాలాగా మనిషి కాదు. ఆయనతో వాదించడానికి మేమిద్దరం కలసి న్యాయస్థానానికి వెళ్ళడం ఎలా?
לא יש-בינינו מוכיח-- ישת ידו על-שנינו | 33 |
౩౩మా ఇద్దరి మీద చెయ్యి ఉంచి తీర్పు చెప్పగలిగే వ్యక్తి మాకు లేడు.
יסר מעלי שבטו ואמתו אל-תבעתני | 34 |
౩౪ఆయన శిక్షాదండం నా మీద నుండి తొలగించాలి. ఆయన భయంకర చర్యలు నాలో వణుకు పుట్టించకుండా ఉండాలి.
אדברה ולא איראנו כי לא-כן אנכי עמדי | 35 |
౩౫అప్పుడు నేను భయం లేకుండా ఆయనతో మాట్లాడతాను, అయితే ఇప్పుడున్న పరిస్థితిని బట్టి నేను అలా చెయ్యలేను.