< איוב 40 >
ויען יהוה את-איוב ויאמר | 1 |
౧యెహోవా యోబుకు ఇలా జవాబు ఇచ్చాడు.
הרב עם-שדי יסור מוכיח אלוה יעננה | 2 |
౨ఆక్షేపణలు చేయాలని చూసేవాడు సర్వశక్తుడైన దేవుణ్ణి సరిదిద్దాలని చూడవచ్చా? దేవునితో వాదించేవాడు ఇప్పుడు జవాబియ్యాలి.
ויען איוב את-יהוה ויאמר | 3 |
౩అప్పుడు యోబు యెహోవాకు ఇలా జవాబిచ్చాడు.
הן קלתי מה אשיבך ידי שמתי למו-פי | 4 |
౪చూడు, నేను నీచుణ్ణి. నేను నీకు ఏమని ప్రత్యుత్తరమిస్తాను? నా నోటి మీద చెయ్యి ఉంచుకుంటాను.
אחת דברתי ולא אענה ושתים ולא אוסיף | 5 |
౫ఒక సారి మాట్లాడాను. నేను మళ్ళీ నోరెత్తను. రెండు సార్లు మాట్లాడాను. ఇకపై పలకను.
ויען-יהוה את-איוב מנסערה (מן סערה) ויאמר | 6 |
౬అప్పుడు యెహోవా సుడిగాలిలోనుండి యోబుకు ఇలా జవాబు ఇచ్చాడు.
אזר-נא כגבר חלציך אשאלך והודיעני | 7 |
౭పౌరుషం తెచ్చుకుని నీ నడుము కట్టుకో. నేను నీకు ప్రశ్నవేస్తాను. జవాబియ్యి.
האף תפר משפטי תרשיעני למען תצדק | 8 |
౮నేను అన్యాయం చేసానని అంటావా? నిర్దోషివని నువ్వు తీర్పు పొందడం కోసం నా మీద అపరాధం మోపుతావా?
ואם-זרוע כאל לך ובקול כמהו תרעם | 9 |
౯దేవునికి ఉన్న బాహుబలం నీకు ఉందా? ఆయన ఉరుము ధ్వనిలాంటి స్వరంతో నువ్వు గర్జించగలవా?
עדה נא גאון וגבה והוד והדר תלבש | 10 |
౧౦ఆడంబర మహాత్మ్యాలతో నిన్ను నువ్వు అలంకరించుకో. గౌరవప్రభావాలు ధరించుకో.
הפץ עברות אפך וראה כל-גאה והשפילהו | 11 |
౧౧నీ ఆగ్రహాన్ని నలుదెసలా విసిరి వెయ్యి. గర్విష్టులందరినీ చూసి వారిని కూలగొట్టు.
ראה כל-גאה הכניעהו והדך רשעים תחתם | 12 |
౧౨గర్విష్టులైన వారిని చూసి వారిని అణగదొక్కు. దుష్టులు ఎక్కడుంటే అక్కడ వారిని అణిచి వెయ్యి.
טמנם בעפר יחד פניהם חבש בטמון | 13 |
౧౩కనబడకుండా వారినందరినీ బూడిదలో పాతిపెట్టు. సమాధిలో వారిని బంధించు.
וגם-אני אודך כי-תושע לך ימינך | 14 |
౧౪అప్పుడు నీ కుడి చెయ్యి నిన్ను రక్షించగలదని నేను నిన్ను గూర్చి ఒప్పుకుంటాను.
הנה-נא בהמות אשר-עשיתי עמך חציר כבקר יאכל | 15 |
౧౫నిన్ను చేసినట్టే నేను చేసిన మరొక జీవి నీటి ఏనుగును నువ్వు చూశావు గదా? ఎద్దులాగా అది గడ్డి మేస్తుంది.
הנה-נא כחו במתניו ואונו בשרירי בטנו | 16 |
౧౬చూడు, దాని శక్తి దాని నడుములో ఉంది. దాని బలం దాని కడుపు నరాల్లో ఉంది.
יחפץ זנבו כמו-ארז גידי פחדו ישרגו | 17 |
౧౭దేవదారు చెట్టు ఊగినట్టు దాని తోక ఊగుతుంది. దాని తొడ కండరాలు దృఢంగా అతికి ఉన్నాయి.
עצמיו אפיקי נחשה גרמיו כמטיל ברזל | 18 |
౧౮దాని ఎముకలు ఇత్తడి గొట్టాల్లాగా ఉన్నాయి. దాని కాళ్ళు ఇనప కడ్డీల్లాగా ఉన్నాయి.
הוא ראשית דרכי-אל העשו יגש חרבו | 19 |
౧౯అది దేవుడు సృష్టించిన వాటిలో ముఖ్యమైనది. దాన్ని చేసిన దేవుడే దాన్ని ఓడించ గలడు.
כי-בול הרים ישאו-לו וכל-חית השדה ישחקו-שם | 20 |
౨౦పర్వతాలు దానికి మేత మొలిపిస్తాయి. అడవి మృగాలన్నీ అక్కడ ఆడుకుంటాయి.
תחת-צאלים ישכב-- בסתר קנה ובצה | 21 |
౨౧తామర చెట్ల కింద జమ్ముగడ్డి చాటున పర్రలో అది పండుకుంటుంది.
יסכהו צאלים צללו יסבוהו ערבי-נחל | 22 |
౨౨తామర తూడులు దానికి నీడనిస్తాయి. సెలయేరు ఒడ్డున ఉన్న నిరవంజి చెట్లు దాని చుట్టూ ఉంటాయి.
הן יעשק נהר לא יחפוז יבטח כי-יגיח ירדן אל-פיהו | 23 |
౨౩నదీప్రవాహం పొంగి పొర్లినా అది భయపడదు. యొర్దాను లాంటి ప్రవాహం పొంగి దాని ముట్టె దాకా వచ్చినా అది బెదరదు.
בעיניו יקחנו במוקשים ינקב-אף | 24 |
౨౪ఎవరైనా దాన్ని కొక్కీ వేసి పట్టుకోగలరా? ముక్కుకు పగ్గం వేయగలరా?