< איוב 15 >
ויען אליפז התימני ויאמר | 1 |
౧అప్పుడు తేమానీయుడు ఎలీఫజు ఇలా జవాబు ఇచ్చాడు,
החכם יענה דעת-רוח וימלא קדים בטנו | 2 |
౨“జ్ఞానం గలవాడు గాలితో తన కడుపు నింపుకుని తెలివి తక్కువతనంగా వ్యర్ధమైన మాటలు మాట్లాడడం మంచిదేనా?
הוכח בדבר לא-יסכון ומלים לא-יועיל בם | 3 |
౩వ్యర్థమైన పదాలు పలకడం వల్ల ప్రయోజనం ఏమిటి? ప్రయోజనం లేని మాటలతో వాదించడం ఎందుకు?
אף-אתה תפר יראה ותגרע שיחה לפני-אל | 4 |
౪అలాంటి మాటలతో నీకున్న భయభక్తులను హీనపరుస్తున్నావు. నీ దేవుని ధ్యానాన్ని ఆటంకపరుస్తున్నావు.
כי יאלף עונך פיך ותבחר לשון ערומים | 5 |
౫నువ్వు మాట్లాడే మాటల వల్ల నీ పాపాలు బయటపడుతున్నాయి. కపటంగా మాట్లాడాలని నువ్వు చూస్తున్నావు.
ירשיעך פיך ולא-אני ושפתיך יענו-בך | 6 |
౬నేను కాదు, నీ మాటలే నువ్వు నేరం చేశావని ప్రకటిస్తున్నాయి. నీకు వ్యతిరేకంగా నీ పెదవులే సాక్ష్యం పలుకుతున్నాయి.
הראישון אדם תולד ולפני גבעות חוללת | 7 |
౭మనిషిగా పుట్టిన వాళ్ళలో మొదటివాడివి నువ్వే అనుకుంటున్నావా? కొండలకన్నా నువ్వు ముందుగా ఉన్నావా?
הבסוד אלוה תשמע ותגרע אליך חכמה | 8 |
౮నువ్వేమైనా దేవుని సమాలోచన సభలో సభ్యుడివా? నువ్వొక్కడివే జ్ఞానం గలవాడివా?
מה-ידעת ולא נדע תבין ולא-עמנו הוא | 9 |
౯మాకు తెలియని విషయాలు నీకేం తెలుసు? మేము గ్రహించలేని విషయాలు నువ్వేం గ్రహించావు?
גם-שב גם-ישיש בנו-- כביר מאביך ימים | 10 |
౧౦మాలో తల నెరసిన వృద్ధులు అనేకమంది ఉన్నారు. వాళ్ళు నీ తండ్రి కంటే చాలా పెద్దవాళ్ళు.
המעט ממך תנחומות אל ודבר לאט עמך | 11 |
౧౧దేవుడిచ్చిన ఓదార్పు నీకు తేలికగా అనిపిస్తుందా? ఆయన నీతో పలికిన మృదువైన మాటలు నీకు మనసులోకి ఎక్కడం లేదా?
מה-יקחך לבך ומה-ירזמון עיניך | 12 |
౧౨నీ హృదయం ఎందుకు క్రుంగిపోయింది? నీ కళ్ళు ఎందుకలా ఎర్రబడ్డాయి?
כי-תשיב אל-אל רוחך והצאת מפיך מלין | 13 |
౧౩దేవునిపై నీకెందుకు కోపం వస్తుంది? నీ నోట వెంట అలాంటి మాటలు ఎందుకు వెలువడుతున్నాయి?
מה-אנוש כי-יזכה וכי-יצדק ילוד אשה | 14 |
౧౪కళంకం లేనివాడు అనిపించుకోడానికి మనిషి ఎంతటివాడు? స్త్రీకి పుట్టినవాడు పవిత్రుడుగా ఎలా ఎంచబడతాడు?
הן בקדשו לא יאמין ושמים לא-זכו בעיניו | 15 |
౧౫ఆలోచించు, దేవుడు తన పవిత్ర దూతలను కూడా నమ్మడు. ఆకాశ విశాలాలు ఆయన దృష్టికి పవిత్రం కావు.
אף כי-נתעב ונאלח איש-שתה כמים עולה | 16 |
౧౬అలా ఉండగా, మనుషులు మరింత దుర్మార్గులు. వాళ్ళు నీచులు, దుష్టకార్యాలు చేసేవాళ్ళు, అన్యాయాన్ని నీళ్ళు తాగినట్టు తాగేవాళ్లు.
אחוך שמע-לי וזה-חזיתי ואספרה | 17 |
౧౭నేను చెప్పేది విను. నేను నీకు సంగతులు చెబుతాను. నా అనుభవాలను నీకు వివరిస్తాను.
אשר-חכמים יגידו ולא כחדו מאבותם | 18 |
౧౮జ్ఞానులు తమ పూర్వీకుల ద్వారా నేర్చుకుని, ఏమీ దాచుకోకుండా చెప్పిన ఉపదేశాలు నీకు చెబుతాను.
להם לבדם נתנה הארץ ולא-עבר זר בתוכם | 19 |
౧౯జ్ఞానులకే ఆ దేశం వారసత్వంగా ఇవ్వబడింది. అన్యజనులు ఎవ్వరూ ఆ దేశంలో లేరు. ఆ జ్ఞానులు బోధించినది నీకు తెలియజేస్తాను.
כל-ימי רשע הוא מתחולל ומספר שנים נצפנו לעריץ | 20 |
౨౦దుర్మార్గుడు తాను బ్రతికినంత కాలం వేదనలు అనుభవిస్తాడు. దుర్మార్గం చేసే వాళ్ళకు నియమించిన సంవత్సరాలన్నిటిలో బాధలు తప్పవు.
קול-פחדים באזניו בשלום שודד יבואנו | 21 |
౨౧అతడి చెవుల్లో భయంకరమైన శబ్దాలు మారుమ్రోగుతాయి. అతడు క్షేమంగా ఉన్న సమయంలో కీడు చేసేవాడు అతని మీద పడతాడు.
לא-יאמין שוב מני-חשך וצפו (וצפוי) הוא אלי-חרב | 22 |
౨౨చీకటిలోనుండి తాను తిరిగి రాగలనన్న నమ్మకం అతనికి ఉండదు. వాడు కత్తివాతకు గురి అవుతాడు.
נדד הוא ללחם איה ידע כי-נכון בידו יום-חשך | 23 |
౨౩‘ఆహారం ఎక్కడ దొరుకుతుంది?’ అనుకుంటూ దాని కోసం తిరుగుతూ ఉంటాడు. చీకటి రోజులు దాపురించాయని వాడికి తెలుసు.
יבעתהו צר ומצוקה תתקפהו כמלך עתיד לכידור | 24 |
౨౪యుద్ధం చేయడానికి సన్నద్ధుడై వచ్చిన రాజు శత్రువుని పట్టుకుని బంధించినట్టు బాధ, వేదన అతణ్ణి పట్టుకుని భయకంపితుణ్ణి చేస్తాయి.
כי-נטה אל-אל ידו ואל-שדי יתגבר | 25 |
౨౫వాడు దేవునికి విరోధంగా చెయ్యి చాపుతున్నాడు. సర్వశక్తుడైన దేవుణ్ణి ధిక్కరించి మాట్లాడుతున్నాడు.
ירוץ אליו בצואר בעבי גבי מגניו | 26 |
౨౬మెడ వంచని వైఖరితో మూర్ఖత్వంగా తన దిట్టమైన డాలుతో ఆయన మీదికి దండెత్తుతాడు.
כי-כסה פניו בחלבו ויעש פימה עלי-כסל | 27 |
౨౭అతని ముఖమంతా కొవ్వు పేరుకుపోయింది. నడుం చుట్టూ కొవ్వు పెరిగిపోయింది.
וישכון ערים נכחדות--בתים לא-ישבו למו אשר התעתדו לגלים | 28 |
౨౮అలాంటివాడు పాడైపోయిన పట్టణాల్లో నివసిస్తాడు. ఎవ్వరూ నివసించలేని ఇళ్ళలో, శిథిలం కాబోతున్న ఇళ్ళలో నివసిస్తాడు.
לא-יעשר ולא-יקום חילו ולא-יטה לארץ מנלם | 29 |
౨౯కాబట్టి వాడు ఎప్పటికీ భాగ్యవంతుడు కాలేకపోతాడు. అతడి ధనం నిలబడదు. అతడి పంటల పైరు బరువెక్కి నేలను తాకేలా కిందకు వంగదు.
לא-יסור מני-חשך--ינקתו תיבש שלהבת ויסור ברוח פיו | 30 |
౩౦అతడు చీకటి నుండి తప్పించుకోలేడు. అగ్నిజ్వాలలు వాడి లేత కొమ్మలను దహించివేస్తాయి. దేవుని నోటి నుండి వచ్చిన ఊపిరి వాణ్ణి నాశనం చేస్తుంది.
אל-יאמן בשו נתעה כי-שוא תהיה תמורתו | 31 |
౩౧వాడు వ్యర్ధమైన వాటిని నమ్ముకోకుండా ఉండు గాక. వాడు మోసపోయినవాడు. వాడికి దక్కే ప్రతిఫలం శూన్యం.
בלא-יומו תמלא וכפתו לא רעננה | 32 |
౩౨వాడి ఆయుష్షు తీరకముందే ముసలివాడు అయిపోతాడు. వాడు ఎండిపోయిన కొమ్మలాగా వాడిపోతాడు.
יחמס כגפן בסרו וישלך כזית נצתו | 33 |
౩౩పిందెలు రాలిపోయిన ద్రాక్షచెట్టులాగా, పువ్వులు రాలిపోయిన ఒలీవచెట్టులాగా ఆయన వారిని చేస్తాడు.
כי-עדת חנף גלמוד ואש אכלה אהלי-שחד | 34 |
౩౪దైవభక్తి లేని భక్తిహీనుల కుటుంబాలు నిర్జీవంగా మారతాయి. లంచగొండుల నివాసాలు అగ్నికి ఆహుతి అవుతాయి.
הרה עמל וילד און ובטנם תכין מרמה | 35 |
౩౫వాళ్ళ కడుపులో ఉన్న కపటాన్ని వాళ్ళు బయటకు వెళ్ళగక్కుతారు. వాళ్ళ అంతరంగంలో వంచన నివసిస్తుంది.”