< איוב 10 >
נקטה נפשי בחיי אעזבה עלי שיחי אדברה במר נפשי | 1 |
౧నా బ్రతుకు మీద నాకు అసహ్యం కలుగుతుంతోంది. నేను అడ్డూ అదుపూ లేకుండా అంగలారుస్తాను. నా మనసులో ఉన్న బాధ కొద్దీ మాట్లాడతాను.
אמר אל-אלוה אל-תרשיעני הודיעני על מה-תריבני | 2 |
౨నేను దేవునితో మాట్లాడతాను. నా మీద నేరం మోపకు. నువ్వు నాతో ఎందుకు వాదం పెట్టుకున్నావో చెప్పమని అడుగుతాను.
הטוב לך כי תעשק--כי-תמאס יגיע כפיך ועל-עצת רשעים הופעת | 3 |
౩నువ్వు ఇలా క్రూరంగా ప్రవర్తించడం నీకు ఇష్టమా? దుర్మార్గుల ఆలోచనలు నెరవేరేలా వాళ్ళపై నీ దయ చూపడం నీకు సంతోషం కలిగిస్తుందా? నీ చేతిపనులను తిరస్కరించడం నీకు సంతోషమా?
העיני בשר לך אם-כראות אנוש תראה | 4 |
౪మనుషులు చూస్తున్నట్టు నువ్వు కూడా చూస్తున్నావా? నీ ఆలోచనలు మనుషుల ఆలోచనల వంటివా?
הכימי אנוש ימיך אם-שנותיך כימי גבר | 5 |
౫నీ జీవితకాలం మనుషుల జీవితకాలం వంటిదా? నీ సంవత్సరాలు మనుషుల ఆయుష్షు వంటివా?
כי-תבקש לעוני ולחטאתי תדרוש | 6 |
౬నేను ఎలాంటి నేరం చేయలేదనీ, నీ చేతిలోనుండి నన్ను ఎవ్వరూ విడిపించలేరనీ నీకు తెలుసు.
על-דעתך כי-לא ארשע ואין מידך מציל | 7 |
౭అయినప్పటికీ నా నేరాలను గూర్చి ఎందుకు విచారణ చేస్తున్నావు? నాలో పాపాలు ఎందుకు వెతుకుతున్నావు?
ידיך עצבוני ויעשוני יחד סביב ותבלעני | 8 |
౮నీ సొంత చేతులతో నా శరీరంలోని అవయవాలు నిర్మించి నన్ను నిలబెట్టావు. అలాంటిది నువ్వే నన్ను మింగివేస్తున్నావు.
זכר-נא כי-כחמר עשיתני ואל-עפר תשיבני | 9 |
౯ఒక విషయం జ్ఞాపకం చేసుకో, నువ్వే నన్ను బంకమట్టితో నిర్మించావు. మళ్ళీ నువ్వే నన్ను మట్టిలో కలిసిపోయేలా చేస్తావా?
הלא כחלב תתיכני וכגבנה תקפיאני | 10 |
౧౦ఒకడు పాలు ఒలకబోసినట్టు నువ్వు నన్ను ఒలకబోస్తున్నావు. పాలను పెరుగులా చేసినట్టు నన్ను పేరబెడుతున్నావు.
עור ובשר תלבישני ובעצמות וגידים תשככני | 11 |
౧౧మాంసం, చర్మాలతో నన్ను కప్పావు. ఎముకలు, నరాలతో నన్ను రూపొందించావు.
חיים וחסד עשית עמדי ופקדתך שמרה רוחי | 12 |
౧౨నాకు ప్రాణం పోసి నాపై కృప చూపించావు. నీ కాపుదలతో నా ఆత్మను రక్షించావు.
ואלה צפנת בלבבך ידעתי כי-זאת עמך | 13 |
౧౩అయినా నేను చేసే దోషాలను గూర్చి నీ హృదయంలో ఆలోచించావు. అలాంటి అభిప్రాయం నీకు ఉన్నదని నాకు తెలుసు.
אם-חטאתי ושמרתני ומעוני לא תנקני | 14 |
౧౪ఒకవేళ నేనేదైనా పాపం చేస్తే నీకు తెలిసిపోతుంది. నాకు శిక్ష విధించాలని నన్ను గమనిస్తూ ఉంటావు.
אם רשעתי אללי לי-- וצדקתי לא-אשא ראשי שבע קלון וראה עניי | 15 |
౧౫నేను గనక పాప క్రియలు జరిగిస్తే అవి నన్నెంతో బాధిస్తాయి. నేను నిర్దోషిని అయినప్పటికీ నా తల ఎత్తుకోలేను. ఎందుకంటే నేను అవమానంతో నిండి పోయి నాకు కలిగిన బాధను తలంచుకుంటూ ఉంటాను.
ויגאה כשחל תצודני ותשב תתפלא-בי | 16 |
౧౬నా తల పైకెత్తితే సింహం వేటాడినట్టు నన్ను వేటాడతావు. నీ బలప్రభావాలు మళ్లీ నా మీద చూపిస్తావు.
תחדש עדיך נגדי ותרב כעשך עמדי חליפות וצבא עמי | 17 |
౧౭ఎడతెగని నీ కోపం పెరిగిపోతుంది. ఎప్పుడూ సేనల వెనుక సేనలను నా మీదికి దండెత్తేలా చేస్తూ ఉంటావు.
ולמה מרחם הצאתני אגוע ועין לא-תראני | 18 |
౧౮నా తల్లి గర్భం నుండి నన్నెందుకు బయటకు రప్పించావు? పుట్టినప్పుడే ఎవరూ నన్ను చూడకుండా ఉన్నప్పుడే ప్రాణం వదిలితే బాగుండేది.
כאשר לא-הייתי אהיה מבטן לקבר אובל | 19 |
౧౯అప్పుడు నా ఉనికే ఉండేది కాదు. తల్లి గర్భం నుండే నేరుగా సమాధికి తిరిగి వెళ్ళిపోయి ఉండేవాణ్ణి.
הלא-מעט ימי יחדל (וחדל) ישית (ושית) ממני ואבליגה מעט | 20 |
౨౦నేను జీవించే రోజులు స్వల్పమే. అక్కడికి వెళ్లక ముందు కొంచెం సేపు నేను ఊరట చెందేలా నా జోలికి రాకుండా నన్ను విడిచిపెట్టు.
בטרם אלך ולא אשוב-- אל-ארץ חשך וצלמות | 21 |
౨౧నేను తిరిగిరాని లోకానికి వెళ్ళిపోతున్నాను. ఆ లోకమంతా మరణాంధకారం ఆవరించి ఉంది.
ארץ עפתה כמו אפל--צלמות ולא סדרים ותפע כמו-אפל | 22 |
౨౨అక్కడ అర్థరాత్రి వలె దట్టమైన కటిక చీకటి. ఎంత మాత్రం క్రమం అనేది లేని ఆ మరణాంధకార దేశంలో వెలుగు అర్థరాత్రివేళ చీకటిలాగా ఉంది.