< Hoikeana 13 >
1 KU iho la au ma ke one o ke kai, a ike aku la i kekahi holoholona e hoea mai ana, mailoko mai o ke kai, me na pepeiaohao he umi a me na poo ehiku, a ma kona mau pepeiaohao, he umi leialii, a maluna o kona mau poo na inoa o ka hoomainoino.
౧దానికోసం ఆ మహా సర్పం సముద్ర తీరంలో ఇసుక తిన్నెలపై నిలబడింది. తరువాత క్రూర మృగం ఒకటి సముద్రంలో నుండి బయటకు రావడం చూశాను. దానికి పది కొమ్ములూ, ఏడు తలలూ ఉన్నాయి. దాని కొమ్ములపై పది కిరీటాలున్నాయి. దాని తలల మీద దేవుణ్ణి అవమానపరిచే పేర్లు ఉన్నాయి.
2 A o ua holoholona la a'u i ike ai, ua like ia me ka leopadi, a o kona wawae ua like me ko ka hea, o kona waha me ka waha o ka liona. A haawi hoi ka deragona ia ia i kona mana a me kona nohoalii a me ka ikaika nui.
౨నేను చూసిన ఆ మృగం చిరుత పులిలా ఉంది. దాని కాళ్ళు ఎలుగుబంటి కాళ్ళలాగానూ దాని నోరు సింహం నోరులాగానూ ఉన్నాయి. ఆ మహాసర్పం ఈ మృగానికి తన శక్తినీ, తన సింహాసనాన్నీ, గొప్ప అధికారాన్నీ ఇచ్చాడు.
3 A ike au, ua eha hoi kekahi o kona mau poo, aneane make; a hoolaia'ku la kona eha make. Mahalo aku la ko ke ao nei a pau mamuli o ka holoholona.
౩దాని తలల్లో ఒకదానికి చావు దెబ్బ తగిలినట్టుగా కనిపించింది. అయితే ఆ గాయం మానిపోయింది. భూమిపైన మనుషులందరూ ఆశ్చర్యచకితులై ఆ మృగం వెంట పడి వెళ్ళారు.
4 Hoomana aku la lakou i ka deragona nana i haawi i ka ikaika no ua holoholona la; a hoomana lakou i ka holoholona, i ae la, Owai la ka mea like me ia holoholona? owai hoi ka mea hiki ke kaua aku ia ia?
౪ఆ మృగానికి అధికారమిచ్చాడని వారంతా మహాసర్పానికి కూడా పూజలు చేశారు. “ఈ మృగంలాంటి వాడు ఎవడన్నా ఉన్నాడా? ఇతనితో యుద్ధం చేయగల వారెవరు?” అని చెప్పుకుంటూ వారంతా మృగానికి కూడా పూజలు చేశారు.
5 A ua haawiia ka waha e olelo i na mea nui a me na mea hoomainoino: a ua haawiia mai nana e hana i na malama hookahi kanaha a me kumamalua.
౫బడాయి మాటలూ దైవ దూషణలూ చేసే నోరూ వాడికి ఉంది. నలభై రెండు నెలలు అధికారం చలాయించడానికి వాడికి అనుమతి ఉంది.
6 Hoaka ae la oia i kona waha e hoomainoino i ke Akua, e hoomainoino i kona inoa, a me kona halelewa a me ka poe e noho la ma ka lani.
౬కాబట్టి దేవుణ్ణి దూషించడానికీ, ఆయన పేరునీ, ఆయన నివాస స్థలాన్నీ, పరలోకంలో నివసించే వారినందరినీ దూషించడానికి వాడు నోరు తెరిచాడు.
7 Ua haawiia mai nana e kaua i na haipule, a e lanakila maluna o lakou; a ua haawiia mai la nana ka mana maluna o na ohana a pau, a me na olelo a pau, a me na lahuikanaka a pau.
౭ఇంకా పరిశుద్ధులతో యుద్ధం చేసి వారిని జయించడానికి వాడికి అధికారం ఇవ్వడం జరిగింది. ప్రతి వంశం పైనా, ప్రజల పైనా, భిన్నమైన భాషలు మాట్లాడే వారిపైనా, ప్రతి జాతి పైనా అధికారం వాడికివ్వడం జరిగింది.
8 A e hoomana aku ia ia ka poe a pau e noho aua ma ka honua, ka poe aole i kakauia ko lakou inoa ma ka buke o ke ola a ke Keikihipa, ka mea i pepehiia mai ka hookumu ana mai o ka honua nei.
౮భూమిపై నివసించే వారంతా, అంటే సృష్టి ప్రారంభం నుండీ వధ అయిన గొర్రెపిల్లకు చెందిన జీవ గ్రంథంలో పేర్లు లేని వారంతా ఆ మృగాన్ని పూజిస్తారు.
9 Ina he pepeiao ko kekahi, e hoolohe mai ia.
౯మీకు చెవులుంటే వినండి!
10 Ina e alakai pio aku kekahi, oia kekahi e hele pio. O ka mea pepehi aku me ka pahikaua, e pepehiia oia me ka pahikaua. Eia ka hoomanawanui a me ka manaoio o ka poe haipule.
౧౦చెరలోకి పోవలసిన వాడు చెరలోకి పోతాడు. కత్తితో హతం కావలసిన వాడు కత్తితో హతమౌతాడు. పరిశుద్ధులైన వారు ఈ విషయంలో సహనం, విశ్వాసం కలిగి ఉండాలి.
11 A ike aku la au i kahi holoholona hou e hoea mai ana, mailoko mai o ka honua; elua ona pepeiaohao e like me ke keikihipa, a olelo ae la ia e like me ka deragona.
౧౧అప్పుడు భూమిలో నుండి మరో క్రూర మృగం పైకి రావడం చూశాను. వాడికి గొర్రెపిల్ల కొమ్ముల వంటి కొమ్ములు రెండు ఉన్నాయి. ఆ మృగం మహాసర్పంలాగా మాట్లాడుతూ ఉన్నాడు.
12 Hana iho la no ia me ka mana a pau o ka holoholona mua ma kona alo, a nana no i hoohuli i ka honua a me ka poe e noho ana maluna iho, e hoomana i ka holoholona mua nona ka eha make i hoolaia.
౧౨వాడు ప్రాణాంతకమైన దెబ్బ తగిలి పూర్తిగా నయమైన మొదటి క్రూర మృగానికున్న అధికారాన్ని, వాడి సమక్షంలో ఉపయోగిస్తూ ఉన్నాడు. తద్వారా ఆ మొదటి మృగాన్ని భూమీ, దానిలో నివసించే వారంతా పూజించేలా చేశాడు.
13 A hana iho la ia i na mea kupanaha loa, a hoohaule mai la oia i ke ahi, mai ka lani mai a ka honua imua i ke alo o kanaka;
౧౩వాడు అనేక చిత్ర విచిత్రాలు చేస్తున్నాడు. మనుషులంతా చూస్తుండగా ఆకాశం నుండి భూమికి అగ్ని రప్పించడం వంటి అద్భుతాలు చేస్తున్నాడు.
14 A hoowalewale oia i ka poe i noho ma ka honua, ma na mea kupanaha i haawiia mai nana e hana, imua o ka holoholona. I mai kela i ka poe e noho ana ma ka honua, e hana lakou i kii no ka holoholona i loaa ka eha i ka pahikaua, a ola hoi.
౧౪తనకు అనుమతి ఉన్నంత మేర తాను చేస్తున్న అద్భుతాలతో భూమిపై అందర్నీ మోసం చేస్తూ ఉన్నాడు. కత్తి దెబ్బ తిన్నా బతికే ఉన్న మొదటి క్రూరమృగానికి ఒక విగ్రహాన్ని స్థాపించాలని వాడు అందరికీ చెబుతూ ఉన్నాడు.
15 A ua haawiia mai nana e hookomo i ke ola iloko o ua kii nei o ka holoholona, i olelo mai ke kii o ka holoholona, a nana no e pepehi a make ka poe a pau i hoomana ole i ke kii o ka holoholona.
౧౫పైగా ఆ మృగం విగ్రహానికి ప్రాణం పోసి అది మాట్లాడేలా చేయడానికీ, ఆ మృగం విగ్రహాన్ని పూజించని వారిని చంపడానికీ వాడికి అధికారం ఇవ్వడం జరిగింది.
16 Nana no i hana aku i ka poe uuku a me ka poe nui, i ka poe waiwai a me ka poe hune, i ka poe paa ole, a me ka poe paa, e haawi ia lakou i hoailona ma ko lakou lima akau, a i ole ia, ma ko lakou lae:
౧౬ఇంకా తమ కుడి చేతిపై గానీ నుదిటిపై గానీ ముద్ర వేయించుకోవాలని ప్రముఖులనూ, అనామకులనూ, ధనవంతులనూ, నిరుపేదలనూ, స్వతంత్రులనూ, బానిసలనూ అందర్నీ వాడు బలవంతం చేశాడు.
17 I ole ai e hiki i kekahi ke kuai aku a kuai mai, ke loaa ole ia ia ka hoailona, ka inoa o ka holoholona, a o ka heluna paha o kona inoa.
౧౭ఆ ముద్ర, అంటే ఆ మృగం పేరు గానీ వాడి సంఖ్య గానీ లేకుండా ఎవరికైనా అమ్మడం గానీ కొనడం గానీ అసాధ్యం.
18 Maanei no ke akamai: o ka mea noonoo, e helu oia i ka heluna o ua holoholona nei; no ka mea, oia no ka heluna o ke kanaka, a o kona heluna eono haneri ia me ke kanaonokumamaono.
౧౮ఇందులో జ్ఞానం ఉంది. వివేకి అయినవాడు ఆ మృగం సంఖ్యను లెక్కించాలి. అది ఒక మనిషి సంఖ్య. వాడి సంఖ్య 666.