< Korineto I 8 >
1 MA na mea i kaumahaia na na kii, ua ike no kakou, ua naauao no kakou a pau. He mea hookiekie ka naauao: o ke aloha nae ka mea e nui ai ka ikaika.
౧ఇప్పుడిక గ్రహాలకు బలి అర్పించిన వాటి విషయం: మనమంతా తెలివైన వారమే అని మనకి తెలుసు. తెలివి మిడిసిపడేలా చేస్తుంది గాని ప్రేమ క్షేమాభివృద్ధిని కలిగిస్తుంది.
2 Ina i manao kekahi, ua akamai ia, aole ia e akamai iki e like me ke akamai e pono ai oia.
౨ఎవరైనా తనకు ఏదైనా తెలుసు అని భావిస్తే, అతడు గ్రహించ వలసిందేమంటే తాను తెలుసుకోవలసినంత ఇంకా తెలుసుకోలేదు అని.
3 Aka, ina i aloha aku kekahi i ke Akua, ua ikea mai oia e ia.
౩ఎవరైనా దేవుణ్ణి ప్రేమిస్తూ ఉంటే దేవునికి అతడు తెలుసన్నమాట.
4 Ma ka ai ana i na mea i kaumahaia na na kii, ua ike no kakou, he mea ole ke kii, ma ka honua nei, aole hoi he Akua e ae, hookahi wale no.
౪అందుచేత విగ్రహాలకు అర్పించిన వాటిని తినే విషయానికి వస్తే, ఈ లోకంలో విగ్రహం అనేది వట్టిది అని మనకు తెలుసు. ఒకే ఒక దేవుడు తప్ప వేరొక దేవుడు లేడని మనకు తెలుసు.
5 He mea no nae i kapaia, he Akua, ma ka lani paha, ma ka hopua paha, no ka mea, ua nui na'kua, a ua nui na haku:
౫దేవుళ్ళు, ప్రభువులు అని అందరూ పిలిచే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఆకాశంలో, భూమి మీదా దేవుళ్ళనే వారు ఎంతమంది ఉన్నప్పటికీ,
6 Aka, ia kakou, hookahi no Akua, o ka Makua, a nana mai na mea a pau, a ia ia hoi kakou nei: hookaihi no Haku, o Iesu Kristo, ma ona la na mea a pau, a ma ona la hoi kakou.
౬మనకైతే ఒకే దేవుడున్నాడు. ఆయన తండ్రి అయిన దేవుడు. ఆయన నుండి సమస్తమూ కలిగింది. ఆయన కోసమే మనమున్నాం. అలాగే మనకు ప్రభువు ఒక్కడే ఉన్నాడు. ఆయన యేసు క్రీస్తు. ఆయన ద్వారా అన్నీ కలిగాయి. మనం కూడా ఆయన ద్వారానే ఉనికి కలిగి ఉన్నాం.
7 Aka, aole i na kanaka a pau keia ike; no ka mea, i keia wa no, me ka manao i na kii, ai no kekahi poe me he mea la i mohaiia na ke kii; a no ka nawaliwali o ko lakou naau, ua haumia.
౭అయితే ఈ తెలివి అందరికీ లేదు. కొందరు ఇంతకు ముందు విగ్రహాలను ఆరాధించే వారు కాబట్టి తాము తినే పదార్ధాలు విగ్రహార్పితాలని భావించి తింటారు. వారి మనస్సాక్షి బలహీనం కావడం వలన అది వారికి అపరాధం అవుతుంది.
8 Aole hoi kakou e aponoia e ke Akua no ka ai; no ka mea, ina e ai kakou, aole e oi ko kakou maikai ilaila; a i ai ole kakou, aole e oi ko kakou ino ilaila.
౮భోజనం విషయంలో మనకు దేవుని నుండి ఏమీ మెప్పు కలగదు. మనం దేనినైనా తినకపోవడం వలన మనం తక్కువ వారం కాదు, తినడం వలన ఎక్కువ వారం కాదు.
9 E malama hoi oukou, o lilo auanei keia pono o oukou, i mea e hihia ai, no ka poe hawawa.
౯అయితే మీకున్న ఈ స్వేచ్ఛ విశ్వాసంలో బలహీనులైన వారికి అభ్యంతర కారణం కాకుండా చూసుకోండి.
10 Ina i ike mai kekahi ia oe, i ka mea naauao, e noho ana e ai iloko o ka heiau o ke kii, aole anei e eueu ka manao o ke kanaka hawawa, e ai i na mea i mohaiia na na kii?
౧౦ఎలా అంటే, సత్యం గురించిన అవగాహన కలిగిన నీవు విగ్రహాలు నిలిపి ఉన్న స్థలంలో తింటూ ఉండగా బలహీనమైన మనస్సాక్షి గలవాడు చూస్తే, అతడు విగ్రహాలకు అర్పించిన పదార్ధాలను తినడానికి ధైర్యం తెచ్చుకుంటాడు కదా?
11 Alaila, no kou naauao ana, e make no ka hoahanau hawawa, nona i make ai o Kristo.
౧౧తద్వారా ఎవరి కోసం క్రీస్తు చనిపోయాడో విశ్వాసంలో బలహీనుడైన ఆ నీ సోదరుడు లేక సోదరి నీ తెలివి వలన పాడైపోతాడు.
12 A i ka oukou hana hewa ana pela i na hoahanau, a i ko oukou hoeha ana i ko lakou naau nawaliwali, ua hana hewa oukou ia Kristo.
౧౨ఈ విధంగా మీరు మీ సోదరులకు వ్యతిరేకంగా పాపం చేయడం ద్వారా, విశ్వాసంలో బలహీనమైన వారి మనస్సాక్షిని నొప్పించడం ద్వారా, మీరు క్రీస్తుకు వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు.
13 No ia mea, ina o ka io ka mea e hewa ai ko'u hoahanau, ma keia hope aku, aole loa au e ai hou i ka io, o hoolilo au i ko'u hoahanau i ka hewa. (aiōn )
౧౩కాబట్టి నా భోజనం నా సోదరుడు విశ్వాసంలో జారిపోవడానికి కారణమైతే, నా సోదరునికి అభ్యంతరం కలిగించకుండేలా ఇక నేనెన్నడూ మాంసం తినను. (aiōn )