< Ƙidaya 26 >

1 Bayan annobar, sai Ubangiji ya yi magana da Musa da Eleyazar ɗan Haruna, firist ya ce,
ఆ తెగులు పోయిన తరువాత యెహోవా మోషేతో, యాజకుడైన అహరోను కొడుకు ఎలియాజరుతో మాట్లాడుతూ,
2 “Ku ƙidaya dukan jama’ar Isra’ila daga mai shekaru ashirin zuwa gaba da za su iya aikin sojan Isra’ila.”
“మీరు ఇశ్రాయేలీయుల సమాజమంతట్లో 20 సంవత్సరాలు మొదలుకుని ఆ పై వయస్సు ఉన్న ఇశ్రాయేలీయుల్లో యుద్ధం చెయ్యగల సామర్థ్యం ఉన్న వారిని, తమ పితరుల కుటుంబాల ప్రకారం లెక్కపెట్టండి” అన్నాడు.
3 Musa da Eleyazar firist suka yi musu magana a filayen Mowab kusa da Urdun daga ƙetaren Yeriko, suka ce,
కాబట్టి మోషే, యాజకుడైన ఎలియాజరు యెరికో దగ్గర యోర్దాను తీరంలో మోయాబు మైదానాల్లో సమాజమంతటితో మాట్లాడుతూ,
4 “Ku ƙidaya maza daga mai shekara ashirin zuwa gaba yadda Ubangiji ya umarci Musa.” Waɗannan su ne Isra’ilawan da suka fito daga Masar.
“20 సంవత్సరాలు, ఆ పై వయస్సు కలిగి, ఐగుప్తులోనుంచి బయటకు వచ్చిన వారిని లెక్కపెట్టమని యెహోవా ఆజ్ఞ ఇచ్చాడు” అన్నారు.
5 Zuriyar Ruben ɗan fari na Isra’ila, daga Hanok; kabilar Hanokawa; daga Fallu; kabilar Falluyawa;
ఇశ్రాయేలు పెద్దకొడుకు రూబేను. రూబేను కొడుకు హనోకు నుంచి హనోకీయులు హనోకు వంశస్థులు,
6 daga Hezron, kabilar Hezronawa; daga Karmi, kabilar Karmiyawa.
పల్లువీయులు పల్లు వంశస్థులు. హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు, కర్మీయులు కర్మీ వంశస్థులు.
7 Waɗannan su ne kabilan Ruben; jimillarsu ta kai 43,730.
వీరు రూబేనీయుల వంశస్థులు. వారిల్లో లెక్కకు వచ్చినవారు 43, 730 మంది పురుషులు.
8 Ɗan Fallu kuwa shi ne Eliyab,
పల్లు కొడుకు ఏలీయాబు. ఏలీయాబు కొడుకులు నెమూయేలు, దాతాను, అబీరాము.
9 ’ya’yan Eliyab maza kuwa su ne, Nemuwel, Datan da Abiram. Datan da Abiram nan, su ne shugabannin mutanen da suka tayar wa Musa da Haruna, suna kuma cikin waɗanda suka bi Kora sa’ad da ya tayar wa Ubangiji.
కోరహు, అతని సమాజం యెహోవాకు విరోధంగా వాదించినప్పుడు సమాజంలో మోషే అహరోనులకు విరోధంగా వాదించిన దాతాను అబీరాములు వీరే.
10 Ƙasa kuwa ta buɗe ta haɗiye su tare da Kora, wanda ƙungiyarsa ta mutu sa’ad da wuta ta cinye mutum 250. Wannan kuwa ya zama alamar faɗakarwa.
౧౦ఆ సమాజం వారు చనిపోయినప్పుడు అగ్ని 250 మందిని కాల్చేసినందువల్ల, భూమి తన నోరు తెరచి వారిని, కోరహును మింగేసినందువల్ల, వారు ఒక హెచ్చరికగా అయ్యారు.
11 Amma fa, zuriyar Kora ba tă mutu ba.
౧౧అయితే కోరహు కొడుకులు చనిపోలేదు.
12 Zuriyar Simeyon bisa ga kabilansu, daga Nemuwel, kabilar Nemuwelawa; daga Yamin, kabilar Yaminawa; daga Yakin, kabilar Yakinawa;
౧౨షిమ్యోను కొడుకుల వంశంలో నెమూయేలీయులు నెమూయేలు వంశస్థులు, యామీనీయులు యామీను వంశస్థులు, యాకీనీయులు యాకీను వంశస్థులు,
13 daga Zera, kabilar Zerawa; daga Sha’ul, kabilar Sha’ul.
౧౩జెరహీయులు జెరహు వంశస్థులు, షావూలీయులు షావూలు వంశస్థులు.
14 Waɗannan su ne kabilan Simeyon; jimillarsu ta kai 22,200.
౧౪ఇవి షిమ్యోనీయుల వంశాలు. వారు 22, 200 మంది పురుషులు.
15 Zuriyar Gad bisa ga kabilansu, daga Zafon, kabilar Zafonawa; daga Haggi, kabilar Haggiwa; daga Shuni, kabilar Shunawa;
౧౫గాదు కొడుకుల వంశాల్లో సెపోనీయులు సెపోను వంశస్థులు, హగ్గీయులు హగ్గీ వంశస్థులు, షూనీయులు షూనీ వంశస్థులు,
16 daga Ozni, kabilar Ozniyawa daga Eri, kabilar Eriyawa;
౧౬ఓజనీయులు ఓజని వంశస్థులు, ఏరీయులు ఏరీ వంశస్థులు,
17 daga Arod, kabilar Arodiyawa; daga Areli, kabilar Areliyawa.
౧౭ఆరోదీయులు ఆరోదు వంశస్థులు, అరేలీయులు అరేలీ వంశస్థులు.
18 Waɗannan su ne kabilan Gad, jimillarsu ta kai 40,500.
౧౮వీరు గాదీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 40, 500 మంది పురుషులు.
19 Er da Onan,’ya’yan Yahuda ne, amma sun mutu a Kan’ana.
౧౯యూదా కొడుకులు ఏరు, ఓనాను. ఏరు, ఓనాను, కనాను ప్రదేశంలో చనిపోయారు.
20 Zuriyar Yahuda bisa ga kabilansu, daga Shela, kabilar Shelayawa daga Ferez, kabilar Ferezawa; daga Zera, kabilar Zerawa;
౨౦యూదావారి వంశాల్లో షేలాహీయులు షేలా వంశస్థులు, పెరెసీయులు పెరెసు వంశస్థులు, జెరహీయులు జెరహు వంశస్థులు,
21 Zuriyar Ferez kuwa, daga Hezron, kabilar Hezronawa; daga Hamul; kabilar Hamulawa.
౨౧పెరెసీయుల్లో హెస్రోనీయులు హెస్రోను వంశస్థులు, హామూలీయులు హామూలు వంశస్థులు.
22 Waɗannan su ne kabilan Yahuda; jimillarsu ta kai 76,500.
౨౨వీరు యూదా వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 76, 500 మంది పురుషులు.
23 Zuriyar Issakar bisa ga kabilansu, daga Tola, kabilar Tolatawa; daga Fuwa, kabilar Fuwayawa;
౨౩ఇశ్శాఖారు కొడుకుల వంశస్థుల్లో తోలాహీయులు తోలా వంశస్థులు, పువ్వీయులు పువ్వా వంశస్థులు, యాషూబీయులు యాషూబు వంశస్థులు, షిమ్రోనీయులు షిమ్రోను వంశస్థులు. వీరు ఇశ్శాఖారీయుల వంశస్థులు.
24 daga Yashub, kabilar Yashubawa; daga Shimron, kabilar Shimronawa.
౨౪రాసిన వారి లెక్క ప్రకారం వీరు 64, 300 మంది పురుషులు.
25 Waɗannan su ne kabilan Issakar; jimillarsu ta kai 64,300.
౨౫జెబూలూను కొడుకుల వంశస్థుల్లో సెరెదీయులు సెరెదు వంశస్థులు,
26 Zuriyar Zebulun bisa ga kabilansu, daga Sered, kabilar Seredawa; daga Elon kabilar Elonawa; daga Yaleyel; kabilar Yaleyewa.
౨౬ఏలోనీయులు ఏలోను వంశస్థులు, యహలేలీయులు యహలేలు వంశస్థులు.
27 Waɗannan su ne kabilan Zebulun, jimillarsu ta kai 60,500.
౨౭రాసిన వారి లెక్క ప్రకారం వీరు 60, 500 మంది పురుషులు.
28 Zuriyar Yusuf bisa ga kabilansu ta wurin Manasse da Efraim.
౨౮యోసేపు వంశస్థులు అతని కొడుకులు మనష్షే, ఎఫ్రాయిము.
29 Zuriyar Manasse, daga Makir, kabilar Makiriyawa (Makir shi ne mahaifin Gileyad); daga Gileyad, kabilar Gileyadawa.
౨౯మనష్షే కొడుకుల్లో మాకీరీయులు మాకీరు వంశస్థులు. మాకీరు గిలాదుకు తండ్రి. గిలాదీయులు గిలాదు వంశస్థులు. వీరు గిలాదు కొడుకులు.
30 Waɗannan su ne zuriya Gileyad, daga Iyezer, kabilar Iyezerawa; daga Helek, kabilar Helekawa;
౩౦ఈజరీయులు ఈజరు వంశస్థులు, హెలకీయులు హెలకు వంశస్థులు,
31 daga Asriyel, kabilar Asriyelawa; daga Shekem, kabilar Shekem;
౩౧అశ్రీయేలీయులు అశ్రీయేలు వంశస్థులు, షెకెమీయులు షెకెము వంశస్థులు,
32 daga Shemida, kabilar Shemadawa; daga Hefer, kabilar Heferawa.
౩౨షెమీదాయీయులు షెమీదా వంశస్థులు, హెపెరీయులు హెపెరు వంశస్థులు.
33 (Zelofehad ɗan Hefer, ba shi da’ya’ya maza;’yan mata ne kaɗai ya haifa, sunayensu kuwa su ne Mala, Nowa, Hogla, Milka da Tirza.)
౩౩హెపెరు కొడుకు సెలోపెహాదుకు కూతుళ్ళేగాని కొడుకులు పుట్టలేదు. సెలోపెహాదు కూతుళ్ళ పేర్లు మహలా, నోయా, హొగ్లా, మిల్కా, తిర్సా.
34 Waɗannan su ne kabilan Manasse, jimillarsu ta kai 52,700.
౩౪వీరు మనష్షీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 52, 700 మంది పురుషులు.
35 Waɗannan su ne kabilan Efraim bisa ga kabilansu, daga Shutela, kabilar Shutelawa; daga Beker, kabilar Bekerawa; daga Tahan, kabilar Tahanawa.
౩౫ఇవి ఎఫ్రాయిము కొడుకుల వంశాలు-షూతలహీయులు షూతలహు వంశస్థులు, బేకరీయులు బేకరు వంశస్థులు, తహనీయులు తహను వంశస్థులు.
36 Waɗannan su ne kabilan Shutelawa, daga Eran, kabilar Eranawa.
౩౬షూతలహు వంశస్థుడు ఏరాను. అతని వంశం ఏరాను వంశం.
37 Waɗannan su ne kabilan Efraim; jimillarsu ta kai 32,500. Waɗannan su ne kabilan Yusuf ta wurin kabilansu.
౩౭వీరు ఎఫ్రాయిమీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 32, 500 మంది పురుషులు. వీరు యోసేపు కొడుకుల వంశస్థులు.
38 Zuriyar Benyamin bisa ga kabilansu, daga Bela, kabilar Belawa; daga Ashbel, kabilar Ashbelawa; daga Ahiram, kabilar Ahiramawa;
౩౮బెన్యామీను కొడుకుల వంశాల్లో బెలీయులు బెల వంశస్థులు, అష్బేలీయులు అష్బేల వంశస్థులు,
39 daga Shufam, kabilar Shufamawa; daga Hufam, kabilar Hufamawa.
౩౯అహీరామీయులు అహీరాము వంశస్థులు,
40 Zuriyar Bela daga Ard da Na’aman, daga Ard, kabilar Ardawa; daga Na’aman, kabilar Na’amawa;
౪౦షూఫామీయులు షూపఫాము వంశస్థులు. బెల కొడుకులు ఆర్దు, నయమాను. ఆర్దీయులు ఆర్దు వంశస్థులు, నయమానీయులు నయమాను వంశస్థులు.
41 Waɗannan su ne kabilan Benyamin, jimillarsu ta kai 45,600.
౪౧వీరు బెన్యామీనీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 45, 600 మంది పురుషులు.
42 Waɗannan su ne kabilan Dan bisa ga kabilarsu, daga Shuham, kabilar Shuhamawa. Waɗannan su ne kabilan Dan.
౪౨దాను కొడుకుల వంశాల్లో షూహామీయులు షూహాము వంశస్థులు.
43 Dukansu kabilan Shuhamawa ne, jimillarsu ta kai 64,400.
౪౩రాసిన వారి లెక్క ప్రకారం వీరు 64, 400 మంది పురుషులు.
44 Zuriyar Asher bisa ga kabilansu, daga Imna, kabilar Imnawa daga Ishbi, kabilar Ishbiyawa; daga Beriya, kabilar Beriyawa;
౪౪ఆషేరు కొడుకుల వంశాల్లో యిమ్నీయులు యిమ్నా వంశస్థులు, ఇష్వీయులు ఇష్వీ వంశస్థులు, బెరీయులు బెరీయా వంశస్థులు.
45 daga zuriyar Beriya kuwa, daga Heber, kabilar Heberawa; daga Malkiyel, kabilar Malkiyelawa.
౪౫బెరీయానీయుల్లో హెబెరీయులు హెబెరు వంశస్థులు, మల్కీయేలీయులు మల్కీయేలు వంశస్థులు.
46 (Asher yana da’ya mace da ake kira Sera.)
౪౬ఆషేరు కూతురు పేరు శెరహు.
47 Waɗannan su ne kabilan Asher; jimillarsu ta kai 53,400.
౪౭రాసిన వారి లెక్క ప్రకారం వీరు 53, 400 మంది పురుషులు.
48 Zuriyar Naftali bisa ga kabilansu, daga Yazeyel, kabilar Yazeyelawa; daga Guni, kabilar Guniyawa;
౪౮నఫ్తాలీ కొడుకుల వంశాల్లో యహసయేలీయులు యహసయేలు వంశస్థులు, గూనీయులు గూనీ వంశస్థులు,
49 daga Yezer, kabilar Yezerawa; daga Shillem, kabilar Shillemawa.
౪౯యేసెరీయులు యేసెరు వంశస్థులు, షిల్లేమీయులు షిల్లేము వంశస్థులు.
50 Waɗannan su ne kabilan Naftali, jimillarsu ta kai 45,400.
౫౦వీరు నఫ్తాలీయుల వంశస్థులు. రాసిన వారి లెక్క ప్రకారం వీరు 45, 400 మంది పురుషులు.
51 Dukan jimillar mazan Isra’ila ta kai 601,730.
౫౧ఇశ్రాయేలీయుల్లో లెక్కకు వచ్చినవారు 6,01,730 మంది పురుషులు.
52 Ubangiji ya ce wa Musa,
౫౨యెహోవా మోషేతో “వీళ్ళ పేర్ల లెక్క ప్రకారం ఆ దేశాన్ని వీళ్ళకు స్వాస్థ్యంగా పంచిపెట్టాలి.
53 “Ka rarraba musu ƙasar a matsayin gādo, bisa ga yawan kabila.
౫౩తమ తమ లెక్క ప్రకారం ఆ స్వాస్థ్యం వాళ్లకు ఇవ్వాలి.
54 Ga ƙungiya mafi girma, ka ba ta rabo mafi girma; ga ƙaramar ƙungiya kuwa, ka ba ta ƙarami rabo; kowane zai karɓa rabonsa ga yawan mutanen da aka rubuta.
౫౪ఎక్కువమంది ఉన్న వంశాలకు ఎక్కువ స్వాస్థ్యం, తక్కువమంది ఉన్నవారికి తక్కువ స్వాస్థ్యం ఇవ్వాలి. తమ తమ లెక్కను బట్టి వివిధ గోత్రాలకు స్వాస్థ్యం ఇవ్వాలి.
55 Ka tabbatar an rarraba ƙasar ta wurin rabo. Abin da kowace ƙungiya ta gāda zai zama bisa ga sunayen kabilar kakanninta.
౫౫చీటీలు వేసి ఆ భూమిని పంచిపెట్టాలి. వారు తమ తమ పితరుల గోత్రాల జనాభా లెక్క ప్రకారం స్వాస్థ్యం పొందాలి.
56 Za a raba kowane gādo bisa ga rabo tsakanin manyan da ƙanana ƙungiyoyi.”
౫౬ఎక్కువ మందికైనా తక్కువ మందికైనా చీటీలు వేసి, ఎవరి స్వాస్థ్యం వారికి పంచిపెట్టాలి.”
57 Waɗannan su ne Lawiyawa da a ƙidaya bisa ga kabilansu, daga Gershom, kabilar Gershonawa; daga Kohat, kabilar Kohatawa; daga Merari, kabilar Merari.
౫౭వీరు తమ తమ వంశాల్లో లెక్కకు వచ్చిన లేవీయులు. గెర్షోనీయులు గెర్షోను వంశస్థులు, కహాతీయులు కహాతు వంశస్థులు, మెరారీయులు మెరారి వంశస్థులు.
58 Waɗannan kuma su ne kabilan Lawiyawa, kabilar Libniyawa, kabilar Hebronawa, kabilar Maliyawa, kabilar Mushiyawa, kabilar Korayawa (Kohat shi ne kakan Amram;
౫౮లేవీయుల వంశాలు ఏవంటే, లిబ్నీయుల వంశం, హెబ్రోనీయుల వంశం, మహలీయుల వంశం, మూషీయుల వంశం, కోరహీయుల వంశం.
59 sunan matan Amram shi ne Yokebed, ita zuriyar Lawi ce, wadda aka haifa wa Lawiyawa a Masar. A wajen Amram kuwa ta haifi Haruna, Musa da kuma’yar’uwarsu Miriyam.
౫౯కహాతు అమ్రాము తండ్రి. అమ్రాము భార్య పేరు యోకెబెదు. ఆమె లేవీ కూతురు. ఆమె ఐగుప్తులో లేవీకి పుట్టింది. ఆమె అమ్రామువల్ల అహరోను, మోషే, వీళ్ళ సహోదరి మిర్యాములను కన్నది.
60 Haruna shi ne mahaifin Nadab, Abihu, Eleyazar da kuma Itamar.
౬౦అహరోనుకు నాదాబు, అబీహు, ఎలియాజరు, ఈతామారు పుట్టారు.
61 Amma Nadab da Abihu sun mutu sa’ad da suka miƙa hadaya da haramtacciyar wuta a gaban Ubangiji.)
౬౧నాదాబు అబీహులు యెహోవా సన్నిధిలో అంగీకారం కాని అగ్ని అర్పణ చేసినప్పుడు చనిపోయారు.
62 Dukan’ya’yan Lawiyawa maza daga wata ɗaya zuwa gaba, jimillarsu ta kai 23,000. Ba a ƙidaya su tare da sauran Isra’ilawa ba, domin ba a ba su gādo tare da su ba.
౬౨వారిల్లో నెల మొదలుకొని పై వయస్సు కలిగి లెక్కకు వచ్చిన వాళ్లందరూ 23,000 మంది పురుషులు. వారు ఇశ్రాయేలీయుల్లో లెక్కకు రాని వారు గనక ఇశ్రాయేలీయుల్లో వాళ్లకు స్వాస్థ్యం దక్కలేదు.
63 Waɗannan su ne waɗanda Musa da Eleyazar firist, suka ƙidaya sa’ad da suka ƙidaya Isra’ilawa a filaye Mowab kusa da Urdun a hayen Yeriko.
౬౩యెరికో ప్రాంతాల్లో యొర్దాను దగ్గరున్న మోయాబు మైదానాల్లో మోషే, యాజకుడైన ఎలియాజరు, ఇశ్రాయేలీయుల జనాభా లెక్కపెట్టినప్పుడు లెక్కకు వచ్చిన వారు వీరు.
64 Ba ko ɗayansu da yake cikin waɗanda Musa da Haruna firist, suka ƙidaya sa’ad da suka ƙidaya Isra’ilawa a Hamadar Sinai.
౬౪మోషే అహరోనులు సీనాయి ఎడారిలో ఇశ్రాయేలీయుల జనాభా లెక్కపెట్టినప్పుడు లెక్కకు వచ్చిన వారిలో ఒక్కడైనా వీళ్ళల్లో లేడు.
65 Gama Ubangiji ya riga ya gaya wa waɗancan Isra’ilawa cewa lalle za su mutu a hamada, kuma ba ko ɗayansu da ya rage, sai Kaleb ɗan Yefunne da Yoshuwa ɗan Nun.
౬౫ఎందుకంటే వారు కచ్చితంగా ఎడారిలో చనిపోతారని యెహోవా వారి గురించి చెప్పాడు. యెపున్నె కొడుకు కాలేబు, నూను కొడుకు యెహోషువ తప్ప వారిల్లో ఒక్కడైనా మిగల్లేదు.

< Ƙidaya 26 >