< Nehemiya 7 >

1 Bayan an sāke gina katangar na kuma sa ƙofofi a wurarensu, sai aka naɗa masu tsaro, da mawaƙa, da Lawiyawa.
నేను సరిహద్దు గోడలు కట్టి, తలుపులు నిలబెట్టిన తరువాత కాపలా కాసేవాళ్లను, గాయకులను, లేవీయులను నియమించాను.
2 Na sa ɗan’uwana Hanani tare da Hananiya shugaban fada aikin riƙon Urushalima, domin shi Hananiya mutum mai mutunci ne, mai tsoron Allah fiye da yawancin mutane.
తరువాత నా సహోదరుడు హనానీ, కోట అధికారి హనన్యాలకు యెరూషలేం బాధ్యతలు అప్పగించాను. హనన్యా అందరికంటే ఎక్కువగా దేవుడంటే భయం గల నమ్మకమైన వ్యక్తి.
3 Na ce musu, “Kada a buɗe ƙofofin Urushalima da sassafe sai rana ta fito sosai. Yayinda matsaran ƙofofi suna aiki, a kulle ƙofofin a sa musu sakata kafin matsaran su tashi, wajen fāɗuwar rana. Ku kuma naɗa mazaunan Urushalima a matsayin masu tsaro, waɗansunsu a wuraren aiki, waɗansun kuma kusa da gidajensu.”
అప్పుడు నేను “బాగా పొద్దెక్కే దాకా యెరూషలేం ద్వారాలు తెరవ వద్దు. ప్రజలంతా దగ్గరగా నిలబడి ఉన్నప్పుడు ద్వారపాలకులు తలుపులు మూసి వాటికి అడ్డగడియలు పెట్టాలి. అంతేకాక, యెరూషలేంలో నివాసముండే వారంతా తమ వంతుల ప్రకారం తమ ఇళ్ళకు ఎదురు కాపలా కాసేలా నియమించుకోవాలి” అని చెప్పాను.
4 Birnin Urushalima kuwa tana da fāɗi da girma, amma mutanen da suke zama a cikinta kaɗan ne, ba a kuma gina gidaje da yawa ba tukuna.
ఇప్పుడు పట్టణం విశాలంగా పెద్దదిగా ఉంది. జనాభా కొద్దిమందే ఉన్నారు. ఎవరూ ఇంకా ఇళ్ళు కట్టుకోలేదు.
5 Sai Allahna ya sa a zuciyata in tara manyan gari, shugabanni da talakawa don a rubuta su bisa ga iyalansu. Na sami littafin asali na waɗanda suka fara dawowa. Ga abin da na tarar an rubuta a ciki.
ప్రధానులను, అధికారులను, ప్రజలను వంశాల వారీగా సమకూర్చి జనాభా లెక్క సేకరించాలని నా దేవుడు నా హృదయంలో ఆలోచన పుట్టించాడు. ఆ సమయంలో మొదట తిరిగి వచ్చిన వారి గురించి రాసిన వంశావళి ఉన్న గ్రంథం నాకు కనబడింది. అందులో రాసి ఉన్న వంశావళులు ఇవి.
6 Waɗannan su ne mutanen yankin da suka dawo daga zaman bautar da Nebukadnezzar sarkin Babilon ya kame (sun dawo Urushalima da Yahuda, kowanne zuwa garinsa.
బబులోను రాజు నెబుకద్నెజరు చెరలోకి తీసుకు పోగా తిరిగి యెరూషలేం, యూదా దేశంలోని తమ తమ పట్టణాలకు తిరిగి వచ్చిన జెరుబ్బాబెలు, యేషూవ, నెహెమ్యా, అజర్యా, రయమ్యా, నహమానీ, మొర్దెకై, బిల్షాను, మిస్పెరేతు, బిగ్వయి, నెహూము, బయనా అనే వాళ్ళతోపాటు
7 Sun dawo tare da Zerubbabel, da Yeshuwa, da Nehemiya, da Azariya, da Ra’amiya, da Nahamani, da Mordekai, da Bilshan, da Misfar, da Bigwai, da Nehum da kuma Ba’ana). Ga jerin mutanen Isra’ila.
తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయుల జనసంఖ్య యిదే.
8 Zuriyar Farosh mutum 2,172
పరోషు వంశం వారు 2, 172 మంది.
9 ta Shefatiya 372
షెఫట్య వంశం వారు 372 మంది.
10 ta Ara 652
౧౦ఆరహు వంశం వారు 652 మంది.
11 ta Fahat-Mowab (ta wurin Yeshuwa da Yowab) 2,818
౧౧యేషూవ, యోవాబు వంశాల్లోని పహత్మోయాబు కుటుంబీకులు 2, 818 మంది.
12 ta Elam 1,254
౧౨ఏలాము వంశం వారు 1, 254 మంది.
13 ta Zattu 845
౧౩జత్తూ వంశం వారు 845 మంది.
14 ta Zakkai 760
౧౪జక్కయి వంశం వారు 760 మంది.
15 ta Binnuyi 648
౧౫బిన్నూయి వంశం వారు 648 మంది.
16 ta Bebai 628
౧౬బేబై వంశం వారు 628 మంది.
17 ta Azgad 2,322
౧౭అజ్గాదు వంశం వారు 2, 322 మంది.
18 ta Adonikam 667
౧౮అదోనీకాము వంశం వారు 667 మంది.
19 ta Bigwai 2,067
౧౯బిగ్వయి వంశం వారు 2,067 మంది.
20 ta Adin 655
౨౦ఆదీను వంశం వారు 655 మంది.
21 ta Ater (ta wurin Hezekiya) 98
౨౧హిజ్కియా బంధువైన అటేరు వంశం వారు 98 మంది.
22 ta Hashum 328
౨౨హాషుము వంశం వారు 328 మంది.
23 ta Bezai 324
౨౩జేజయి వంశం వారు 324 మంది.
24 ta Harif 112
౨౪హారీపు వంశం వారు 112 మంది.
25 ta Gibeyon 95.
౨౫గిబియోను వంశం వారు 95 మంది.
26 Mutanen Betlehem da na Netofa 188
౨౬బేత్లెహేముకు చెందిన నెటోపా వంశం వారు 188 మంది.
27 na Anatot 128
౨౭అనాతోతు గ్రామం వారు 128 మంది.
28 na Bet-Azmawet 42
౨౮బేతజ్మావెతు గ్రామం వారు 42 మంది.
29 na Kiriyat Yeyarim, Kefira da na Beyerot 743
౨౯కిర్యత్యారీము, కెఫీరా, బెయేరోతు గ్రామాల వారు 743 మంది.
30 na Rama da na Geba 621
౩౦రమా, గెబ గ్రామాల వారు 621 మంది.
31 na Mikmash 122
౩౧మిక్మషు గ్రామం వారు 122 మంది.
32 na Betel da na Ai 123
౩౨బేతేలు, హాయి గ్రామాల వారు 123 మంది.
33 na ɗayan Nebo 52
౩౩రెండవ నెబో గ్రామం వారు 52 మంది.
34 na ɗayan Elam 1,254
౩౪రెండవ ఏలాము గ్రామం వారు 1, 254 మంది.
35 na Harim 2 320
౩౫హారిము వంశం వారు 320 మంది.
36 na Yeriko 345
౩౬యెరికో వంశం వారు 345 మంది.
37 na Lod, da na Hadid, da na Ono 721
౩౭లోదు, హదీదు, ఓనో వంశాల వారు 721 మంది.
38 na Sena’a 3,930.
౩౮సెనాయా వంశం వారు 3, 930 మంది.
39 Ga zuriyar Firistoci. Zuriyar Yedahiya (ta wurin iyalin Yeshuwa) 973
౩౯యాజకుడు యేషూవ కుటుంబీకుడైన యెదాయా వంశం వారు 973 మంది.
40 ta Immer 1,052
౪౦ఇమ్మేరు వంశం వారు 1,052 మంది.
41 ta Fashhur 1,247
౪౧పషూరు వంశం వారు 1, 247 మంది.
42 ta Harim 1,017.
౪౨హారిము వంశం వారు 1,017 మంది.
43 Ga zuriyar Lawiyawa. Zuriyar Yeshuwa da Kadmiyel (ta wurin Hodeba) 74.
౪౩లేవీ గోత్రికులైన యేషూవ, హోదవ్యా, కద్మీయేలు వంశాల వారు 74 మంది.
44 Mawaƙa. Zuriyar Asaf mutum 148.
౪౪పాటలు పాడే ఆసాపు వంశం వారు 148 మంది.
45 Ga zuriyar Matsaran Ƙofofi. Zuriyar Shallum, Ater, Talmon, Akkub, Hatita da Shobai 138.
౪౫ద్వారపాలకులైన షల్లూము, అటేరు, టల్మోను, అక్కూబు, హటీటా, షోబయి వంశాల వారు 138 మంది.
46 Ma’aikatan haikali. Zuriyar Ziha, Hasufa, Tabbawot,
౪౬నెతీనీయులైన జీహా, హశూపా, టబ్బాయోతు వంశాల వారు.
47 da ta Keros, da ta Siya, da ta Fadon,
౪౭కేరోసు, సీయహా, పాదోను వంశాల వారు.
48 da ta Lebana, da ta Hagaba, da ta Shalmai,
౪౮లెబానా, హగాబా, షల్మయి వంశాల వారు.
49 da ta Hanan, da ta Giddel, da ta Gahar,
౪౯హానాను, గిద్దేలు, గహరు వంశాల వారు.
50 da ta Reyahiya, da ta Rezin, da ta Nekoda,
౫౦రెవాయ, రెజీను, నెకోదా వంశాల వారు.
51 da ta Gazzam, da ta Uzza, da ta Faseya,
౫౧గజ్జాము, ఉజ్జా, పాసెయ వంశాల వారు.
52 da ta Besai, da ta Meyunawa, da ta Nefussiyawa,
౫౨బేసాయి, మెహూనీము, నెపూషేసీము వంశాల వారు.
53 da ta Bakbuk, da ta Hakufa, da ta Harhur,
౫౩బక్బూకు, హకూపా, హర్హూరు వంశాల వారు.
54 da ta Bazlit, da ta Mehida, da ta Harsha,
౫౪బజ్లీతు, మెహీదా, హర్షా వంశాల వారు.
55 da ta Barkos, da ta Sisera, da ta Tema,
౫౫బర్కోసు, సీసెరా, తెమహు.
56 da ta Neziya, da kuma ta Hatifa.
౫౬నెజీయహు, హటీపా వంశాల వారు.
57 Ga zuriyar bayin Solomon. Zuriyar Sotai, da ta Soferet, da ta Ferida,
౫౭సొలొమోను సేవకుల, దాసుల వంశాల వారు, సొటయి వంశం వారు. సోపెరెతు, పెరూదా వంశాల వారు.
58 da ta Ya’ala, da ta Darkon, da ta Giddel,
౫౮యహలా, దర్కోను, గిద్దేలు వంశాల వారు.
59 Shefatiya, Hattil, Fokeret-Hazzebayim, da Amon.
౫౯షెఫట్య, హట్టీలు, జెబాయీం బంధువు పొకెరెతు, ఆమోను వంశాల వారు.
60 Zuriyar ma’aikatan haikali da ta bayin Solomon su 392.
౬౦దేవాలయ సేవకులందరూ, సొలొమోను దాసుల వంశాల వారు 392 మంది.
61 Waɗansu sun hauro daga garuruwan Tel-Mela, Tel-Harsha, Kerub, Addon da Immer, amma ba su iya nuna cewa iyalansu su zuriyar Isra’ila ce ba,
౬౧తేల్మెలహు, తేల్హర్షా, కెరూబు, అదోను, ఇమ్మేరు మొదలైన గ్రామాల నుండి కొందరు వచ్చారు. కానీ వాళ్ళు తమ పూర్వీకుల కుటుంబాలు, వంశాలు ఇశ్రాయేలు గోత్రాల్లో ఉన్నట్టు రుజువులు చూపించ లేకపోయారు.
62 zuriyar Delahiya, Tobiya, da Nekoda 642.
౬౨వీళ్ళెవరంటే, దెలాయ్యా, టోబీయా, నెరోదా వంశాల వారు 642 మంది,
63 Na wajen firistoci kuwa su ne, Zuriyar Hobahiya, da ta Hakkoz, da ta Barzillai (wani mutumin da ya auri’yar Barzillai mutumin Gileyad, aka kuma kira shi da wannan suna).
౬౩హబాయ్యా, హక్కోజు, బర్జిల్లయి వంశాల వారు. అంటే, గిలాదీయుడు బర్జిల్లయి కూతుళ్ళలో ఒకామెను పెళ్లి చేసుకోవడం ద్వారా ఆ పేరుతో పిలువ బడిన బర్జిల్లయి వంశస్థులు, యాజక సంతానం వారు.
64 Waɗannan ne aka nemi sunayensu a cikin tarihin asalin iyalai, amma ba a same su a ciki ba, saboda haka aka hana su shiga cikin firistoci, sun zama kamar marasa tsarki.
౬౪వారు వంశావళి గ్రంథంలో తమ పేర్లు వెదికారు గానీ అవి కనబడలేదు. కాబట్టి వారిని అపవిత్రమైన వారుగా ఎంచి యాజకుల జాబితా నుండి తొలగించారు.
65 Sai gwamna ya umarce su kada su ci wani abinci mafi tsarki, sai akwai firist da zai nemi nufin Ubangiji ta wurin Urim da Tummim.
౬౫ఊరీం, తుమ్మీం, ధరించగల ఒక యాజకుణ్ణి నియమించేదాకా దేవునికి ప్రతిష్టితమైన పదార్ధాలను తినకూడదని ప్రజల అధికారి వాళ్ళకు ఆదేశించాడు.
66 Yawan jama’ar duka ya kai mutum 42,360,
౬౬అక్కడ సమకూడిన ప్రజలంతా మొత్తం 42, 360 మంది.
67 ban da bayinsu maza da mata 7,337. Suna kuma da mawaƙa maza da mata 245.
౬౭వీరు కాకుండా వీరి పనివారు, పనికత్తెలు 7, 337 మంది. గాయకుల్లో స్త్రీలు, పురుషులు కలిపి 245 మంది.
68 Akwai dawakai 736, alfadarai 245
౬౮వారి దగ్గర 736 గుర్రాలు, 245 కంచర గాడిదలు,
69 raƙuma 435, da kuma jakuna 6,720.
౬౯435 ఒంటెలు, 6, 720 గాడిదలు ఉన్నాయి.
70 Waɗansu shugabannin iyalai suka ba da kyautai domin taimakon aiki. Gwamna ya ba da darik 1,000 na zinariya, kwanoni 50, da riguna 530 don firistoci.
౭౦వంశాల నాయకుల్లో కొందరు పని కోసం ఆర్ధిక సహాయం చేశారు. అధికారి 120 తులాల బంగారం, 50 పళ్ళాలు, 530 యాజక వస్త్రాలు ఖజానాలో జమ చేశాడు.
71 Waɗansu shugabannin iyalai sun ba da darik 20,000 na zinariya da mina 2,200 na azurfa don aiki.
౭౧వంశాల ప్రముఖుల్లో కొందరు 2, 400 తులాల బంగారం, 14 లక్షల తులాల వెండి ఖజానాలోకి ఇచ్చారు.
72 Jimillar da sauran mutane suka bayar ta kai darik 20,000 na zinariya, minas 2,000 na azurfa, da riguna sittin da bakwai don firistoci.
౭౨మిగతా ప్రజలు ఇచ్చినవి 2, 400 తులాల బంగారం, 12, 72, 720 తులాల వెండి, 67 యాజక వస్త్రాలు.
73 Firistoci, da Lawiyawa, da matsaran ƙofofi, da mawaƙa, da ma’aikatan haikali tare da waɗansu mutane da kuma sauran mutanen Isra’ila, suka zauna a garuruwansu. Da wata na bakwai ya zo, Isra’ilawa kuwa sun riga sun zauna a garuruwansu,
౭౩అప్పుడు యాజకులు, లేవీ గోత్రం వారు, ద్వారపాలకులు, గాయకులు, దేవాలయ సేవకులు, ప్రజల్లో కొందరు, ఇశ్రాయేలీయులంతా ఏడవ నెలకల్లా తమ తమ గ్రామాల్లో కాపురం ఉన్నారు.

< Nehemiya 7 >