< Ezayi 36 >

1 Alò, nan katòzyèm ane a Wa Ézéchias la, Sanchérib, wa Assyrie a, te monte kont tout vil ranfòse Juda yo e te sezi yo.
హిజ్కియా రాజు పరిపాలన 14 వ సంవత్సరంలో అష్షూరురాజు సన్హెరీబు యూదా దేశంలో సరిహద్దు గోడలు ఉన్న పట్టణాలన్నిటిపై దండెత్తి వాటిని ఆక్రమించాడు.
2 Konsa, wa Assyrie a te voye Rabschaké sòti Lakis nan Jérusalem vè wa Ézéchias avèk yon gwo lame. Li te kanpe kote kanal la sou gran chemen a ki rele Chan Foule a.
తరువాత అతడు రబ్షాకేను లాకీషు పట్టణం నుండి యెరూషలేములో ఉన్న హిజ్కియా రాజు పైకి పెద్ద సైన్యాన్ని ఇచ్చి పంపాడు. అతడు చాకిరేవు దారిలో ఉన్న మెరక కొలను కాలవ దగ్గరికి వచ్చాడు.
3 Epi Éliakim, fis a Hilkija a, ki te chèf sou kay wa a, Schebna, grefye a ak Joach, fis a Asaph la, grefye achiv la, te sòti vin kote l.
అప్పుడు హిల్కీయా కొడుకు, రాజు గృహనిర్వాహకుడు ఎల్యాకీము, శాస్త్రి షెబ్నా, రాజ్యం దస్తావేజుల అధికారి, ఆసాపు కొడుకు యోవాహు వారి దగ్గరికి వెళ్ళారు.
4 Rabschaké te di yo: “Pale koulye a a Ézéchias; ‘Se konsa gran wa a, wa Assyrie a pale: “Ki konfyans sa ou genyen an?
అప్పుడు రబ్షాకే వారితో ఇలా అన్నాడు. “హిజ్కియాతో ఈ మాట చెప్పండి, మహారాజైన అష్షూరురాజు నన్నిలా చెప్పమన్నాడు, దేనిపైన నువ్వు నమ్మకం పెట్టుకున్నావు?
5 Mwen di ou ke Konsèy nou ak fòs pou fè lagè nou pa plis pase pawòl vid. Alò, de kilès nou va depann lè nou fè rebelyon kont mwen an?
యుద్ధం విషయంలో నీ ఆలోచన, నీ బలం వ్యర్ధం. ఎవరి భరోసాతో నా మీద తిరగబడుతున్నావు?
6 Gade byen, ou depann de baton a wozo kraze sila a. Égypte menm. Men si yon nonm apiye kote li, baton li an ap antre nan men l e frennen l nèt. Se konsa Farawon, wa Égypte la ye pou tout sila ki depann de li yo.
నలిగిపోయిన గడ్డిపరక లాంటి ఐగుప్తుపై ఆధారపడుతున్నావు గదా! ఎవరైనా దాని మీద ఆనుకుంటే అది అతని చేతికి గుచ్చుకుంటుంది. ఐగుప్తు రాజు ఫరో కూడా అలాంటివాడే.
7 Men si ou di m: ‘Nou mete konfyans nan SENYÈ a, Bondye nou an’, èske se pa wo plas ak lotèl a Li menm yo ke Ézéchias te retire e te di Juda ak Jérusalem: ‘Ou va adore isit la devan lotèl sila a’?
మా దేవుడైన యెహోవాను నమ్ముకుంటున్నాం అని అంటారా? ఆ యెహోవా ఉన్నత స్థలాలను, బలిపీఠాలనే కదా హిజ్కియా పడగొట్టి యెరూషలేములో ఉన్న ఈ బలిపీఠం దగ్గర మాత్రమే మీరు పూజలు చేయాలి అని యూదావారికి, యెరూషలేము వారికి ఆజ్ఞ ఇచ్చింది?
8 Alò, pou rezon sa a, vin fè yon antant ak mèt mwen an, wa Assyrie a, e mwen va bannou de-mil cheval, si nou ka jwenn chevalye kont pou mete sou yo.
కాబట్టి నా యజమాని అయిన అష్షూరు రాజుతో పందెం వెయ్యి. రెండు వేల గుర్రాలకు సరిపడిన రౌతులు నీ దగ్గర ఉంటే చెప్పు, నేను వాటిని నీకిస్తాను.
9 Kijan, alò, nou ka refize menm youn nan pi piti ofisye a mèt mwen yo pou depann de Égypte pou cha ak chevalye?
నా యజమాని సేవకుల్లో తక్కువ వాడైన ఒక్క అధిపతిని నువ్వు ఎదిరించగలవా? రథాలను, రౌతులను పంపుతాడని ఐగుప్తురాజు మీద ఆశ పెట్టుకున్నావా?
10 Èske konsa, mwen te monte san pèmisyon SENYÈ a, kont peyi sa a pou detwi l? SENYÈ a te di mwen: “Ale monte kont peyi sa a pou detwi l.”’”
౧౦అయినా యెహోవా అనుమతి లేకుండానే ఈ దేశాన్ని నాశనం చేయడానికి నేను వచ్చాననుకున్నావా? లేదు, ఈ దేశం పైకి దండెత్తి దీన్ని నాశనం చేయమని యెహోవాయే నాకు ఆజ్ఞాపించాడు.”
11 Epi Éliakim, Schebna ak Joach te di a Rabschaké: “Alò, pale ak sèvitè ou yo an Arameyen, paske nou konprann li. Pa pale ak nou an Jideyen nan zòrèy a moun ki sou miray yo.”
౧౧అప్పుడు ఎల్యాకీము, షెబ్నా, యోవాహులు రబ్షాకేతో “మేము నీ దాసులం. మాకు సిరియా భాష తెలుసు కాబట్టి దయచేసి ఆ భాషలో మాట్లాడు. ప్రాకారం మీద ఉన్న ప్రజలకు అర్థమయ్యేలా యూదుల భాషలో మాట్లాడవద్దు” అని అన్నారు.
12 Men Rabschaké te di: “Èske mèt mwen an te voye m sèlman a mèt nou ak nou menm pou pale pawòl sa yo, e pa a moun sila yo ki chita sou miray la, ki va oblije manje pwòp poupou yo e bwè dlo pipi yo ansanm avèk nou?”
౧౨అయితే రబ్షాకే “ఈ మాటలు చెప్పడానికేనా, నా యజమాని నన్ను నీ యజమాని దగ్గరకీ నీ దగ్గరకీ పంపింది? నీతో కలిసి తమ స్వంత మలాన్ని తిని, తమ మూత్రాన్ని తాగబోతున్న ప్రాకారం మీద ఉన్న వారి దగ్గరకి కూడా పంపాడు కదా” అన్నాడు.
13 Konsa Rabschaké te kanpe e te kriye ak yon gwo vwa an Jideyen. Li te di: “Tande pawòl a gran wa a, wa Assyrie a.
౧౩యూదుల భాషతో అతడు బిగ్గరగా ఇలా అన్నాడు. “మహారాజైన అష్షూరు రాజు చెబుతున్న మాటలు వినండి.
14 Konsa pale wa a: ‘Pa kite Ézéchias pase nou nan tenten, paske li p ap ka delivre nou!
౧౪హిజ్కియా చేతిలో మోసపోకండి. మిమ్మల్ని విడిపించడానికి అతని శక్తి సరిపోదు.
15 Ni pa kite Ézéchias fè nou mete konfyans nan SENYÈ a, oswa di nou: “Anverite SENYÈ a va delivre nou, vil sa a p ap bay nan men a wa Assyrie a.”’
౧౫‘యెహోవా మనలను విడిపిస్తాడు, ఈ పట్టణం అష్షూరు రాజు చేతిలో చిక్కదు’ అని చెబుతూ హిజ్కియా మిమ్మల్ని నమ్మిస్తున్నాడు.
16 Pa koute Ézéchias, paske konsa pale wa Assyrie a: ‘Fè lapè ak mwen, vin jwenn mwen, chak moun va manje nan pwòp chan rezen pa li, chak moun nan pwòp pye fig pa li, e chak moun va bwè dlo nan pwòp sitèn pa li,
౧౬హిజ్కియా చెప్పిన ఆ మాట మీరు అంగీకరించవద్దు. అష్షూరు రాజు చెబుతున్నదేమిటంటే, మీరు బయటికి వచ్చి, నాతో సంధి చేసుకోండి. అప్పుడు మీలో ప్రతి ఒక్కరూ తన ద్రాక్ష, అంజూరు చెట్ల పండ్లు తింటూ తన బావిలో నీళ్లు తాగుతూ ఉంటారు.
17 jiskaske m vin mennen nou ale nan yon peyi tankou peyi pa nou an, yon peyi ak anpil sereyal ak diven nèf, yon peyi ak pen ak chan rezen.
౧౭ఆ తరవాత నేను వచ్చి మీ దేశంలాంటి దేశానికి, అంటే గోదుమలు, ద్రాక్షరసం దొరికే దేశానికి, ఆహారం, ద్రాక్షచెట్లు ఉన్న దేశానికి మిమ్మల్ని తీసుకుపోతాను. యెహోవా మిమ్మల్ని విడిపిస్తాడని చెప్పి హిజ్కియా మిమ్మల్ని మోసం చేస్తున్నాడు.
18 Veye pou Ézéchias pa egare nou e di nou: “SENYÈ a va delivre nou”. Èske youn nan dye a nasyon yo te delivre tè li a anba men a wa Assyrie la?
౧౮వివిధ ప్రజల దేవుళ్ళలో ఎవరైనా తన దేశాన్ని అష్షూరు రాజు చేతిలో నుండి విడిపించాడా? హమాతు దేవుళ్ళేమయ్యారు?
19 Kote dye a Hamath ak Arpad yo? Kote dye a Sepharvaïm yo? Epi kilè yo te delivre Samarie nan men m?”
౧౯అర్పాదు దేవుళ్ళేమయ్యారు? సెపర్వయీము దేవుళ్ళేమయ్యారు? షోమ్రోను దేశపు దేవుడు నా చేతిలో నుండి షోమ్రోనును విడిపించాడా?
20 Se kilès pami tout dye peyi sila yo ki te delivre peyi pa yo nan men m, pou SENYÈ a ta delivre Jérusalem nan soti men m?’”
౨౦ఈ దేవుళ్ళలో ఎవరైనా తన దేశాన్ని నా చేతిలో నుండి విడిపించి ఉంటేనే కదా యెహోవా యెరూషలేమును విడిపిస్తాడు అనుకోడానికి?” అన్నాడు.
21 Men yo te pe la e pa t di l yon mo, paske lòd a wa a se te: “Pa reponn li”.
౨౧అయితే అతనికి జవాబు చెప్పవద్దని రాజు ఆజ్ఞాపించడం వలన వారు బదులు పలకలేదు.
22 Epi Éliakim, fis a Hilkija a, ki te chèf sou kay la, Schebna, sekretè a ak Joach, fis a Asaph, achivist la, te rive kote Ézéchias ak rad yo chire, e te di li pawòl a Rabschaké yo.
౨౨రాజ గృహనిర్వాహకుడు, హిల్కీయా కొడుకు అయిన ఎల్యాకీము, శాస్త్రి షెబ్నా, రాజ్యందస్తావేజుల మీద అధికారి, ఆసాపు కొడుకు యోవాహు తమ బట్టలు చింపుకుని హిజ్కియా దగ్గరికి వచ్చి రబ్షాకే పలికిన మాటలన్నిటినీ తెలియజేశారు.

< Ezayi 36 >