< Ezekyèl 12 >
1 Pawòl SENYÈ a te vin kote mwen. Li te di:
౧యెహోవా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాకు ఇలా చెప్పాడు.
2 Fis a lòm, ou rete nan mitan yon kay rebèl, ki gen zye pou wè, men yo pa wè, e zòrèy pou tande, men yo pa tande; paske se kay rebèl yo ye.
౨“నరపుత్రుడా, నువ్వు తిరగబడే ప్రజల మధ్య నివసిస్తున్నావు. వాళ్లకు కళ్ళు ఉన్నాయి. కానీ వాళ్ళు చూడరు. వాళ్లకి చెవులు ఉన్నాయి. కానీ వినరు.
3 “Pou sa, fis a lòm, prepare valiz ou menm pou ou ekzile e antre an egzil nan mitan jounen an kote yo ka wè l byen klè. Nan egzil, ou va deplase yon kote pou rive yon lòt kote devan zye yo. Petèt yo va konprann, malgre se yon kay rebèl yo ye.
౩నరపుత్రుడా, నువ్వైతే దేశాంతరం వెళ్ళడానికి సామాను సిద్ధం చేసుకో. పగలు వాళ్ళు చూస్తుండగానే నువ్వు నీ స్థలాన్ని విడిచి ప్రయాణమై వేరే స్థలానికి దేశాంతరం పోవాలి. వాళ్ళు తిరగబడే వాళ్ళే అయినా ఇదంతా గమనించడం మొదలు పెడతారేమో.
4 Mete bagaj ou deyò devan zye yo, kon bagaj pou egzil. Konsa, ou va sòti deyò nan aswè devan zye yo, tankou sila ki prale an egzil yo.
౪వాళ్ళు చూస్తుండగానే పగటి వేళ దేశాంతరం వెళ్ళడానికి నీ సామాను బయటకి తీయాలి. అలాగే మరో దేశం ప్రయాణమయ్యే వాడు వెళ్ళినట్టుగా వాళ్ళు చూస్తుండగా సాయంత్రం వేళలో వెళ్ళాలి.
5 Fouye yon twou nan miray la devan zye yo, e sòti ladann pou vin deyò.
౫వాళ్ళు చూస్తుండగా గోడకి కన్నం వేసి దానిలో నుండి బయల్దేరు.
6 Mete bagaj ou sou zepòl ou devan yo pou yo wè e pote li sòti deyò nan aswè. Ou va kouvri figi ou pou ou pa ka wè peyi a, paske Mwen plase ou kon yon sign pou lakay Israël.”
౬వాళ్ళు చూస్తుండగా నీ వస్తువులను భుజం మీదికెత్తుకో. వాటిని రాత్రివేళ బయటకు తీసుకు రా. నీకు నేల కనపడకుండా ముఖం కప్పుకో. ఎందుకంటే ఇశ్రాయేలు ప్రజలకు నేను నిన్ను ఒక సూచనగా నిర్ణయించాను.”
7 Mwen te fè sa konsa jan mwen te kòmande a. Nan lajounen, mwen te mennen bagaj mwen deyò, tankou bagaj a yon egzile. Epi nan aswè, mwen te fouye yon twou nan miray la ak men m. Mwen te sòti deyò nan fènwa a e te pote li sou zepòl mwen pou yo ta ka wè l.
౭ఆయన నాకాజ్ఞాపించినట్టే నేను చేశాను. దేశాంతరం వెళ్ళడానికి పగలు సామాను బయటకు తెచ్చాను. సాయంత్రం నా చేత్తో గోడకి కన్నం వేసి నా వస్తువులను చీకట్లో బయటకు తెచ్చాను. వాళ్ళు చూస్తుండగా వాటిని నా భుజం పైకెత్తుకున్నాను. నేను దేశాంతరం పోతున్నట్టుగా పగటివేళ నా సామాను బయటికి తెచ్చి పొద్దుగుంకే వేళ నా చేత్తో గోడకు కన్నం వేసి, వారు చూస్తుండగా సామగ్రిని తీసుకుని మూట భుజం మీద పెట్టుకున్నాను.
8 Nan maten, pawòl SENYÈ a te rive kote mwen e te di:
౮తరువాత ఉదయం యెహోవా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాకిలా చెప్పాడు.
9 “Fis a lòm, èske lakay Israël, kay rebèl sa a, pa t di ou: ‘Kisa w ap fè la a?’
౯“నరపుత్రుడా, ఇశ్రాయేలు ప్రజలు, ఆ తిరగబడే జనం ‘నువ్విలా చేస్తున్నావేమిటి?’ అని అడగడం లేదా?
10 “Di yo: ‘Konsa pale Senyè BONDYE a: “Fado sa a se pou prens Jérusalem nan, li menm ak tout lakay Israël ki ladann nan.”’
౧౦వాళ్ళకిలా చెప్పు. ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. ఈ ప్రవచనాత్మక సందేశం యెరూషలేములోని పరిపాలకుడికీ దానిలో ఉన్న ఇశ్రాయేలు ప్రజలందరికీ చెందుతుంది.
11 “Di yo: ‘Mwen se yon sign pou nou. Jan mwen te fè, se konsa l ap vin rive nou. Konsa, yo va ale an egzil, an kaptivite.
౧౧నేను మీకు ఒక సూచనగా ఉన్నాను. నేను చేసి చూపినదే వాళ్ళకీ జరుగుతుంది. వాళ్ళు చెరలోకి వెళ్తారు. బందీలుగా దేశాంతరం పోతారు.
12 “‘Prens ki pami yo a va chaje bagaj li sou zepòl li nan aswè pou sòti. Yo va fouye yon twou nan miray la pou fè l sòti. Li va kouvri figi li pou li pa wè peyi a ak pwòp zye li.
౧౨వాళ్ళలో ఉన్న పరిపాలకుడు తన సామాను భుజం మీద ఎత్తుకుని రాత్రివేళ గోడలో నుండి వెళ్తాడు. వాళ్ళు గోడ తవ్వి దాంట్లో నుండి తమ వస్తువులు బయటకు తీసుకువస్తారు. అతడు నేలను చూడకుండా తన ముఖాన్ని కప్పుకుంటాడు.
13 Anplis, Mwen va voye filè Mwen sou li e li va vin kenbe nan pèlen Mwen. Konsa, Mwen va mennen li Babylone, nan peyi a Kaldeyen yo. Men li p ap wè l; malgre sa, se la l ap mouri.
౧౩నేను అతణ్ణి పట్టుకోడానికి వల విసురుతాను. అతడు నా వలలో చిక్కుకుంటాడు. అతణ్ణి కల్దీయ ప్రజల దేశమైన బబులోనుకి తీసుకు వస్తాను. కానీ అతడు ఆ స్థలాన్ని చూడకుండానే మరణిస్తాడు.
14 Mwen va gaye nan tout van, tout sila ki antoure li yo, moun k ap ede li yo ak tout sòlda li yo. Epi se nepe a Mwen va rale dèyè yo.
౧౪అతనికి సహాయం చేయడానికి వచ్చిన వారినీ, అతని మొత్తం సైన్యాన్నీ నేను అన్ని దిక్కులకీ చెదరగొడతాను. వాళ్ళ వెనుకే ఒక కత్తిని పంపి తరుముతాను.
15 “‘Pou yo ka konnen ke Mwen se SENYÈ a lè Mwen gaye yo pami nasyon yo e pwopaje yo pami peyi yo.
౧౫నేను వాళ్ళని అనేక జనాల్లోకి చెదరగొట్టి, అనేక దేశాల్లోకి పంపిన తరువాత వాళ్ళు నేనే యెహోవాను అని తెలుసుకుంటారు.
16 Men Mwen va epanye kèk nan yo de nepe a, gwo grangou a, ak epidemi a, pou yo ka pale tout abominasyon yo pami nasyon kote yo prale yo. Konsa, yo va konnen ke Mwen se SENYÈ a.’”
౧౬ఇతర ప్రజలకు తమ అసహ్యమైన పనులను గూర్చి వివరించడానికి నేను కొంతమందిని కత్తీ, కరువూ, తెగులు బారిన పడకుండా కాపాడతాను.”
17 Anplis, pawòl SENYÈ a te vin kote mwen e te di:
౧౭యెహోవా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాతో ఇలా చెప్పాడు.
18 “Fis a lòm, manje pen ou ak tranbleman, e bwè dlo ou ak tranbleman e ak kè twouble.
౧౮“నరపుత్రుడా, భయపడుతూ నీ ఆహారం తిను. చింతా ఆందోళనలతో నీళ్ళు తాగు.
19 Di a pèp peyi a: ‘Konsa pale Senyè BONDYE a konsènan moun ki rete Jérusalem yo nan peyi Israël la: “Yo va manje pen yo ak kè twouble e bwè dlo ak gwo laperèz, akoz peyi yo va depouye nèt de tout bonte li, akoz vyolans a tout moun ki demere ladann yo.
౧౯తరువాత, దేశ ప్రజలకు ఇలా ప్రకటించు. యెరూషలేములో నివసించే వాళ్ళను గూర్చీ ఇశ్రాయేలు దేశాన్ని గూర్చీ ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. వాళ్ళు వణికిపోతూ తమ ఆహారం తింటారు. భయపడి పోతూ నీళ్ళు తాగుతారు. ఎందుకంటే అక్కడ నివసించే వాళ్ళు చేసే హింస, దౌర్జన్యాల వల్ల దేశంలోని సౌభాగ్యం నాశనం అయింది.
20 Vil kote moun rete yo va vin devaste nèt e peyi a va vin yon dezolasyon. Konsa, ou va konnen ke Mwen se SENYÈ a.”’”
౨౦పట్టణాలు నిర్జనంగానూ, శిథిలంగానూ మారతాయి. దేశం నిస్సారం అవుతుంది. అప్పుడు మీరు నేనే యెహోవాను అని తెలుసుకుంటారు.”
21 Pawòl SENYÈ a te vin kote mwen e te di:
౨౧తిరిగి యెహోవా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాకిలా చెప్పాడు.
22 “Fis a lòm, ki pwovèb sa a, ke nou menm pèp la, gen konsènan peyi Israël, ki di: ‘Jou yo long e tout vizyon yo vin gate’?
౨౨“నరపుత్రుడా, ‘రోజులు గడిచి పోతున్నాయి, ప్రతి దర్శనమూ విఫలమవుతుంది’ అని సామెత చెప్తారే. దాని అర్థం ఏమిటి?
23 Pou sa, di yo: ‘Konsa pale Senyè BONDYE a: “Mwen va fè pwovèb sa a sispann pou yo pa sèvi l ankò kon pwovèb an Israël.”’ Men di yo: “Jou yo ap apwoche ansanm ak lè pou tout vizyon yo akonpli.
౨౩కాబట్టి నువ్వు వాళ్లకి ఇలా చెప్పు. ప్రభువైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలు ఈ సామెత చెప్పకుండా నేను ఈ సామెతకి ముగింపు పలుకుతున్నాను. దాన్ని వ్యర్ధం చేస్తున్నాను. ఇలా చెప్పి వాళ్ళకి ‘ప్రతి దర్శనమూ నెరవేరే రోజులు దగ్గర పడుతున్నాయి.’ అని ప్రకటించు.”
24 Paske p ap gen ankò okenn fo vizyon ni okenn divinasyon flatè anndan kay Israël la.
౨౪“ఇశ్రాయేలు ప్రజల్లో ఇక మీదట తప్పుడు దర్శనాలూ, అనుకూల జోస్యాలూ ఉండవు.
25 Paske Mwen menm, SENYÈ a va pale e nenpòt pawòl ke M di, va vin acheve. Sa p ap pran reta ankò, paske nan jou ou yo, O lakay rebèl, Mwen va pale pawòl la e Mwen va akonpli li,” deklare Senyè BONDYE a.’”
౨౫నేను యెహోవాను. నేనే మాట్లాడుతున్నాను. నా మాటలు నేను నెరవేరుస్తాను. ఏమాత్రం ఆలస్యం కాకుండా ఇదంతా జరుగుతుంది. తిరగబడే జనమా, మీ రోజుల్లోనే నేను ఈ మాట చెప్పి దాన్ని నెరవేరుస్తాను. ఇదే ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన.”
26 Anplis, pawòl SENYÈ a te vin kote mwen e te di:
౨౬తిరిగి యెహోవా వాక్కు నా దగ్గరకి వచ్చింది. ఆయన నాకిలా చెప్పాడు.
27 “Fis a lòm, gade byen, lakay Israël ap di: ‘Vizyon ke li fè a se pou anpil ane k ap vini e li pwofetize pou yon tan ki lwen.’
౨౭“నరపుత్రుడా, చూడు. ‘ఇతడు చూస్తున్న దర్శనం జరగడానికి ఇంకా ఎన్నో రోజులు పడుతుంది. చాలా కలం తరవాత జరిగే వాటిని గూర్చి ఇతడు ఇప్పుడే ప్రవచనం చెప్తున్నాడు’ అని ఇశ్రాయేలు ప్రజలు చెప్తున్నారు.
28 “Pou sa, di yo: ‘Konsa pale Senyè BONDYE a: “Okenn nan pawòl Mwen yo p ap pran reta ankò. Nenpòt sa ke M pale, va vin akonpli,” deklare Senyè BONDYE a.’”
౨౮అయితే నువ్వు వాళ్ళకి ఇలా చెప్పు. ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. నా మాటలు ఇక ఆలస్యం కావు. నేను పలికినది తప్పక నెరవేరుతుంది. ఇది ప్రభువైన యెహోవా చేస్తున్న ప్రకటన.”