< Ἱερεμίας 2 >
1 Και έγεινε λόγος Κυρίου προς εμέ λέγων,
౧యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలా చెప్పాడు.
2 Ύπαγε και βόησον εις τα ώτα της Ιερουσαλήμ λέγων, Ούτω λέγει Κύριος· Ενθυμούμαι περί σου την προς σε ευμένειάν μου εν τη νεότητί σου, την αγάπην της νυμφεύσεώς σου, ότε με ηκολούθεις εν τη ερήμω, εν γη ασπάρτω·
౨“యెరూషలేము నివాసులకు ఇలా ప్రకటించు. యెహోవా చెప్పేదేమిటంటే, నువ్వు అరణ్యంలో, పంటలు పండని ప్రాంతాల్లో నా వెంట నడుస్తూ నీ యవ్వనకాలంలో నీవు నాపై చూపిన నిబంధన నమ్మకత్వం, నీ వైవాహిక ప్రేమ, నేను గుర్తు చేసుకుంటున్నాను.
3 ο Ισραήλ ήτο άγιος εις τον Κύριον, απαρχή των γεννημάτων αυτού· πάντες οι κατατρώγοντες αυτόν ήσαν ένοχοι· κακόν ήλθεν επ' αυτούς, λέγει Κύριος.
౩అప్పుడు ఇశ్రాయేలు యెహోవాకు ప్రతిష్ఠిత జనంగా, ఆయన పంటలో ప్రథమ ఫలంగా ఉంది. వారిని బాధించే వారందరూ శిక్షకు పాత్రులు. వారిపైకి కీడు దిగి వస్తుంది.” ఇదే యెహోవా వాక్కు.
4 Ακούσατε τον λόγον του Κυρίου, οίκος Ιακώβ και πάσαι αι συγγένειαι του οίκου Ισραήλ·
౪యాకోబు సంతానమా, ఇశ్రాయేలు ప్రజలారా, మీరంతా యెహోవా మాట వినండి.
5 Ούτω λέγει Κύριος· Ποίαν αδικίαν εύρηκαν εν εμοί οι πατέρες σας, ώστε απεμακρύνθησαν απ' εμού και περιεπάτηααν οπίσω της ματαιότητος και εματαιώθησαν;
౫యెహోవా ఇలా సెలవిస్తున్నాడు. “నాలో ఏ తప్పిదం చూసి మీ పూర్వికులు నాకు దూరమై వ్యర్థమైన విగ్రహాలను పూజించి వారూ వ్యర్థులుగా మారిపోయారు?
6 και δεν είπον, Που είναι ο Κύριος, ο αναβιβάσας ημάς εκ γης Αιγύπτου, ο οδηγήσας ημάς διά της ερήμου, διά τόπου ερημίας και χασμάτων, διά τόπου ανυδρίας και σκιάς θανάτου, διά τόπου τον οποίον δεν επέρασεν άνθρωπος και όπου άνθρωπος δεν κατώκησε;
౬‘ఐగుప్తు దేశంలో నుండి మమ్మల్ని తెచ్చిన యెహోవా ఏడీ’ అని అడగలేదు. అంటే ‘అరణ్యంలో, చవిటి నేలలతో, గోతులతో నిండిన ప్రదేశంలో, అనావృష్టీ చీకటీ నిండిన, ఎవరూ తిరగని, నివసించని దేశంలో మమ్మల్ని నడిపించిన యెహోవా ఎక్కడ ఉన్నాడు?’ అని ప్రజలు అడగడం లేదు.
7 Και σας εισήγαγον εις τόπον καρποφόρον, διά να τρώγητε τους καρπούς αυτού και τα αγαθά αυτού· αφού όμως εισήλθετε, εμιάνατε την γην μου και κατεστήσατε βδέλυγμα την κληρονομίαν μου.
౭ఫలవంతమైన దేశంలోకి మిమ్మల్ని తీసుకువచ్చి దాని పంటను, దానిలోని శ్రేష్ఠమైన పదార్థాలను తినేలా చేశాను. అయితే మీరు నా దేశాన్ని అపవిత్రం చేసి నా వారసత్వాన్ని హేయపరిచారు.”
8 Οι ιερείς δεν είπον, Που είναι ο Κύριος; και οι κρατούντες τον νόμον δεν με εγνώρισαν· και οι ποιμένες εγίνοντο παραβάται εναντίον μου, και οι προφήται προεφήτευον διά του Βάαλ και περιεπάτουν οπίσω πραγμάτων ανωφελών.
౮“యెహోవా ఎక్కడ ఉన్నాడు?” అని యాజకులు వెతకడం లేదు. ధర్మశాస్త్ర బోధకులకు నేనెవరో తెలియదు. ప్రజల నాయకులు నా మీద తిరుగుబాటు చేశారు. ప్రవక్తలు బయలు దేవుడి పేరట ప్రవచించి, వ్యర్ధమైన వాటిని అనుసరించారు.
9 Διά τούτο έτι θέλω κριθή με εσάς, λέγει Κύριος, και με τους υιούς των υιών σας θέλω κριθή.
౯కాబట్టి నేనికనుండి మీపైనా మీ పిల్లల పైనా వారి పిల్లల పైనా నేరం మోపుతాను. ఇది యెహోవా వాక్కు.
10 Διότι διάβητε εις τας νήσους των Κητιαίων και ιδέτε· και πέμψατε εις Κηδάρ· και παρατηρήσατε επιμελώς, και ιδέτε αν εστάθη τοιούτον πράγμα.
౧౦కిత్తీయుల ద్వీపాలకు వెళ్లి చూడండి, కేదారుకు దూతలను పంపి విచారించండి. మీలో జరుగుతున్న ప్రకారం ఇంకెక్కడైనా జరుగుతున్నదా?
11 Ήλλαξεν έθνος θεούς, αν και ούτοι δεν ήναι θεοί; ο λαός μου όμως ήλλαξε την δόξαν αυτού με πράγμα ανωφελές.
౧౧దేవుళ్ళు కాని వారితో తమ దేవుళ్ళను ఏ ప్రజలైనా ఎప్పుడైనా మార్చుకున్నారా? కానీ నా ప్రజలు ప్రయోజనం లేని దాని కోసం తమ మహిమను మార్చుకున్నారు.
12 Εκπλάγητε, ουρανοί, διά τούτο, και φρίξατε, συνταράχθητε σφόδρα, λέγει Κύριος.
౧౨ఆకాశమా, దీని గురించి విస్మయం చెందు. భయపడి వణుకు. ఇదే యెహోవా వాక్కు.
13 Διότι δύο κακά έπραξεν ο λαός μου· εμέ εγκατέλιπον, την πηγήν των ζώντων υδάτων, και έσκαψαν εις εαυτούς λάκκους, λάκκους συντετριμμένους, οίτινες δεν δύνανται να κρατήσωσιν ύδωρ.
౧౩నా ప్రజలు రెండు తప్పులు చేశారు. జీవజలాల ఊటనైన నన్ను విడిచి పెట్టేశారు. తమకోసం తొట్లు, అంటే నీటిని నిలపలేక బద్దలైపోయే తొట్లను తొలిపించుకున్నారు.
14 Μήπως είναι δούλος ο Ισραήλ; ή δούλος οικογενής; διά τι κατεστάθη λάφυρον;
౧౪ఇశ్రాయేలు ఒక బానిసా? అతడు ఇంటిలో జన్మించిన వాడే కదా? మరెందుకు అతడు దోపుడు సొమ్ముగా మారాడు?
15 Οι σκύμνοι εβρύχησαν επ' αυτόν, εξέδωκαν την φωνήν αυτών και κατέστησαν την γην αυτού έρημον· αι πόλεις αυτού κατεκάησαν και έμειναν ακατοίκητοι.
౧౫కొదమ సింహాలు అతనిపై గర్జించాయి, అతనిపై పెద్దగా అరుస్తూ అతని దేశాన్ని భయకంపితం చేశాయి. అతని పట్టణాలు ప్రజలు నివసించలేనంతగా నాశనం అయ్యాయి.
16 Οι υιοί προσέτι της Νωφ και της Τάφνης συνέτριψαν την κορυφήν σου.
౧౬నోపు, తహపనేసు అనే పట్టణాల ప్రజలు నీకు బోడిగుండు చేసి నిన్ను బానిసగా చేసుకున్నారు.
17 Δεν έκαμες τούτο συ εις σεαυτόν, διότι εγκατέλιπες Κύριον τον Θεόν σου ότε σε ώδήγει εν τη οδώ;
౧౭నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపిస్తున్నప్పుడు నువ్వు ఆయన్ని విడిచి వేరైపోయి నీకు నీవే ఈ బాధ తెచ్చిపెట్టుకున్నావు గదా?
18 Και τώρα τι έχεις να κάμης εν τη οδώ της Αιγύπτου, διά να πίης τα ύδατα Σιώρ; ή τι έχεις να κάμης εν τη οδώ της Ασσυρίας, διά να πίης τα ύδατα του ποταμού;
౧౮ఐగుప్తు దారిలో వెళ్లి షీహోరు నీళ్లు తాగడానికి నీకేం పని? అష్షూరు దారిలో వెళ్లి యూఫ్రటీసు నది నీళ్లు తాగడానికి నీకేం పని?
19 Η ασέβειά σου θέλει σε παιδεύσει και αι παραβάσεις σου θέλουσι σε ελέγξει· γνώρισον λοιπόν και ιδέ, ότι είναι κακόν και πικρόν, το ότι εγκατέλιπες Κύριον τον Θεόν σου, και δεν είναι ο φόβος μου εν σοι, λέγει Κύριος ο Θεός των δυνάμεων.
౧౯నీ చెడుతనం నీ శిక్షకు కారణమౌతుంది. నువ్వు చేసిన ద్రోహం నిన్ను దండిస్తుంది అని ప్రభువు, సేనల ప్రభువు అయిన యెహోవా సెలవిస్తున్నాడు. ఎందుకంటే నీ దేవుడైన యెహోవాను నీవు విడిచిపెట్టావు. నేనంటే నీకెంత మాత్రం భయం లేదు.
20 Επειδή προ πολλού συνέτριψα τον ζυγόν σου, διέσπασα τα δεσμά σου, και συ είπας, δεν θέλω σταθή παραβάτης πλέον· ενώ επί πάντα υψηλόν λόφον και υποκάτω παντός δένδρου πρασίνου περιεπλανήθης εκπορνεύων.
౨౦పూర్వకాలం నుండి ఉన్న నీ కాడిని విరగగొట్టి, నీ బంధకాలను తెంపివేశాను. అయినా “నేను నిన్ను పూజించను” అని చెబుతున్నావు. ఎత్తయిన ప్రతి కొండ మీదా పచ్చని ప్రతి చెట్టు కిందా వేశ్యలాగా వ్యభిచారం చేశావు.
21 Εγώ δε σε εφύτευσα άμπελον εκλεκτήν, σπέρμα όλως αληθινόν· πως λοιπόν μετεβλήθης εις παρεφθαρμένον κλήμα αμπέλου ξένης εις εμέ;
౨౧శ్రేష్ఠమైన ద్రాక్షావల్లిగా నేను నిన్ను నాటాను. నిక్కచ్చి విత్తనం గల చెట్టులాగా నిన్ను నాటాను. అయినా నా పట్ల ఎందుకు నువ్వు పిచ్చి ద్రాక్షాతీగెలాగా నిష్ప్రయోజనం అయిపోయావు?
22 Διά τούτο και εάν πλυθής με νίτρον και πληθύνης εις σεαυτόν το σμήγμα, η ανομία σου μένει σεσημειωμένη ενώπιόν μου, λέγει Κύριος ο Θεός.
౨౨నువ్వు నదిలో కడుక్కున్నా, ఎక్కువ సబ్బు రాసుకున్నా నీ దోషం నాకు గొప్ప మరకలాగా కనిపిస్తున్నది. ఇది ప్రభువైన యెహోవా వాక్కు.
23 Πως δύνασαι να είπης, δεν εμιάνθην, δεν υπήγα οπίσω των Βααλείμ; ιδέ την οδόν σου εν τη φάραγγι, γνώρισον τι έπραξας· είσαι ταχεία δρομάς διατρέχουσα εν ταις οδοίς αυτής·
౨౩“నాలో అపవిత్రత లేదు, బయలు దేవుళ్ళ వెనక నేను వెళ్ళడం లేదు” అని నువ్వు ఎలా అనుకుంటున్నావు? లోయల్లో నీవెలా ప్రవర్తించావో చూడు. నువ్వు చేసిన దాన్ని గమనించు. నువ్వు విచ్చలవిడిగా తిరిగే ఒంటెవి.
24 όνος αγρία συνειθισμένη εις την έρημον, αναπνέουσα τον αέρα κατά την επιθυμίαν της καρδίας αυτής· την ορμήν αυτής, τις δύναται να επιστρέψη αυτήν; πάντες οι ζητούντες αυτήν δεν θέλουσι κοπιάζει· εν τω μηνί αυτής θέλουσιν ευρεί αυτήν.
౨౪అరణ్యానికి అలవాటు పడిన అడవి గాడిదవు. అది కామంతో దీర్ఘంగా శ్వాస తీసుకుంటుంది. మగ గాడిదను కలిసినప్పుడు దాన్ని ఆపగల వాడెవడు? దాని వెంటబడే గాడిదలకు అలుపు రాదు. తన జత కోసం వెదికే కాలంలో అది తేలికగా కనిపిస్తుంది.
25 Κράτησον τον πόδα σου από του να περιπατήσης ανυπόδητος, και τον λάρυγγά σου από δίψης· αλλά συ είπας, εις μάτην· ουχί· διότι ηγάπησα ξένους και κατόπιν αυτών θέλω υπάγει.
౨౫నీ పాదాలకు చెప్పులు తొడుక్కుని జాగ్రత్త పడు, నీ గొంతు ఆరిపోకుండా జాగ్రత్తపడు, అని నేను చెప్పాను. కాని “నీ మాట వినను, కొత్తవారిని మోహించాను, వారి వెంట వెళ్తాను” అని చెబుతున్నావు.
26 Καθώς ο κλέπτης αισχύνεται όταν ευρεθή, ούτω θέλει αισχυνθή ο οίκος Ισραήλ, αυτοί, οι βασιλείς αυτών, οι άρχοντες αυτών και οι ιερείς αυτών και οι προφήται αυτών·
౨౬దొంగ దొరికిపోయినప్పుడు సిగ్గుపడే విధంగా ఇశ్రాయేలు కుటుంబం సిగ్గుపడుతుంది. చెట్టుతో “నువ్వు మా తండ్రివి” అనీ, రాయితో “నువ్వే నన్ను పుట్టించావు” అనీ చెబుతూ, ఇశ్రాయేలు ప్రజలు, వారి రాజులు, అధిపతులు, యాజకులు, ప్రవక్తలు అవమానం పొందుతారు.
27 οίτινες λέγουσι προς το ξύλον, Πατήρ μου είσαι· και προς τον λίθον, Συ με εγέννησας· διότι έστρεψαν νώτα προς εμέ και ουχί πρόσωπον· εν τω καιρώ όμως της συμφοράς αυτών θέλουσιν ειπεί, Ανάστηθι και σώσον ημάς.
౨౭వారు నా వైపు నేరుగా చూడకుండా తమ వీపు తిప్పుకున్నారు. అయినా ఆపద సమయంలో మాత్రం, “వచ్చి మమ్మల్ని రక్షించు” అని నన్ను వేడుకుంటారు.
28 Και που είναι οι θεοί σου, τους οποίους έκαμες εις σεαυτόν; ας αναστηθώσιν, εάν δύνανται να σε σώσωσιν εν τω καιρώ της συμφοράς σου· διότι κατά τον αριθμόν των πόλεών σου ήσαν οι θεοί σου, Ιούδα.
౨౮నీ కోసం చేసుకున్న దేవుళ్ళు ఎక్కడ ఉన్నారు? నీ ఆపదలో వాళ్ళు వచ్చి నిన్ను రక్షిస్తారేమో. యూదా, నీ పట్టణాలెన్ని ఉన్నాయో నీ దేవతా విగ్రహాలు కూడా అన్ని ఉన్నాయి కదా.
29 Διά τι ηθέλετε κριθή μετ' εμού; σεις πάντες είσθε παραβάται εις εμέ, λέγει Κύριος.
౨౯మీరంతా నా మీద తిరగబడి పాపం చేశారు. ఇంకా ఎందుకు నాతో వాదిస్తారు? అని యెహోవా అడుగుతున్నాడు.
30 Εις μάτην επάταξα τα τέκνα σας· δεν εδέχθησαν διόρθωσιν· η μάχαιρά σας κατέφαγε τους προφήτας σας ως λέων εξολοθρεύων.
౩౦నేను మీ ప్రజలను శిక్షించడం వ్యర్థమే. ఎందుకంటే వారు శిక్షకు లోబడరు. నాశనవాంఛ గల సింహంలాగా మీ ఖడ్గం మీ ప్రవక్తలను చంపుతూ ఉంది.
31 Ω γενεά, ιδέτε τον λόγον του Κυρίου· Εστάθην έρημος εις τον Ισραήλ, γη σκότους; διά τι λέγει ο λαός μου, Ημείς είμεθα κύριοι· δεν θέλομεν ελθεί πλέον προς σε;
౩౧ఇప్పటి తరం ప్రజలు యెహోవా చెప్పే మాట వినండి, నేను ఇశ్రాయేలుకు ఒక అరణ్యం లాగా అయ్యానా? గాఢాంధకారంతో నిండిన దేశంలా అయ్యానా? “మాకు స్వేచ్ఛ లభించింది, ఇంక నీ దగ్గరికి రాము” అని నా ప్రజలెందుకు చెబుతున్నారు?
32 Δύναται η κόρη να λησμονήση τους στολισμούς αυτής, η νύμφη τον καλλωπισμόν αυτής; και όμως ο λαός μου με ελησμόνησεν ημέρας αναριθμήτους.
౩౨ఒక కన్య తన ఆభరణాలు మర్చిపోతుందా? పెళ్ళికూతురు తన మేలిముసుగులు మర్చిపోతుందా? అయితే నా ప్రజలు లెక్కలేనన్ని దినాలు నన్ను మర్చిపోయారు.
33 Διά τι καλλωπίζεις την οδόν σου διά να ζητής εραστάς; εις τρόπον ώστε και εδίδαξας τας οδούς σου εις τας κακάς.
౩౩కామం తీర్చుకోడానికి నీవెంత తెలివిగా నటిస్తున్నావు? కులటలకు కూడా నువ్వు ఇలాటివి నేర్పించగలవు.
34 Έτι εις τα κράσπεδά σου ευρέθησαν αίματα ψυχών πτωχών αθώων· δεν εύρηκα αυτά ανορύττων, αλλ' επί πάντα ταύτα.
౩౪నిర్దోషులైన దీనుల ప్రాణరక్తం నీ బట్ట చెంగుల మీద కనబడుతూ ఉంది. వారేమీ నిన్ను దోచుకోడానికి వచ్చినవారు కాదు.
35 Και όμως λέγεις, Επειδή είμαι αθώος, βεβαίως ο θυμός αυτού θέλει αποστραφή απ' εμού. Ιδού, εγώ θέλω κριθή μετά σου, διότι λέγεις, Δεν ημάρτησα.
౩౫ఇంతా చేసినా నువ్వు “నేను నిర్దోషిని, యెహోవా కోపం నా మీదికి రాదులే” అని చెప్పుకుంటున్నావు. ఇదిగో చూడు, “నేను పాపం చేయలేదు” అని నువ్వు చెప్పిన దాన్నిబట్టి నిన్ను శిక్షిస్తాను.
36 Διά τι περιπλανάσαι τόσον διά να αλλάξης την οδόν σου; θέλεις καταισχυνθή και υπό της Αιγύπτου, καθώς κατησχύνθης υπό της Ασσυρίας.
౩౬నీ ప్రవర్తనలో మార్పును అంత తేలికగా ఎలా తీసుకోగలుగుతున్నావు? నువ్వు అష్షూరుపై ఆధారపడి సిగ్గుపడినట్టు ఐగుప్తు విషయంలో కూడా సిగ్గుపడతావు.
37 Ναι, θέλεις εξέλθει εντεύθεν με τας χείρας σου επί την κεφαλήν σου· διότι ο Κύριος απέβαλε τας ελπίδας σου και δεν θέλεις ευημερήσει εις αυτάς.
౩౭ఆ జనం దగ్గర నుండి నిరాశతో చేతులు తలపై పెట్టుకుని తిరిగి వెళ్తావు. నువ్వు నమ్ముకున్న వారిని యెహోవా తోసిపుచ్చాడు. వారు నీకు ఏ విధంగానూ సహాయం చేయలేరు.