< Προς Ρωμαιους 3 >

1 τι ουν το περισσον του ιουδαιου η τισ η ωφελεια τησ περιτομησ
అలాగైతే యూదుల గొప్పతనం ఏమిటి? సున్నతి వలన ప్రయోజనం ఏమిటి?
2 πολυ κατα παντα τροπον πρωτον μεν γαρ οτι επιστευθησαν τα λογια του θεου
ప్రతి విషయంలో ఎక్కువే. మొదటిది, దేవుని వాక్కులు యూదులకే అప్పగించబడ్డాయి.
3 τι γαρ ει ηπιστησαν τινεσ μη η απιστια αυτων την πιστιν του θεου καταργησει
కొందరు యూదులు నమ్మదగని వాళ్ళు అయినంత మాత్రాన దేవుడు నమ్మదగినవాడు కాకపోతాడా?
4 μη γενοιτο γινεσθω δε ο θεοσ αληθησ πασ δε ανθρωποσ ψευστησ καθωσ γεγραπται οπωσ αν δικαιωθησ εν τοισ λογοισ σου και νικησησ εν τω κρινεσθαι σε
కానేకాదు. “నీ మాటల్లో నీవు నీతిమంతుడుగా కనిపించడానికి, నీపై విచారణ జరిగినప్పుడు గెలవడానికి” అని రాసి ఉన్న ప్రకారం మనుషులంతా అబద్ధికులైనా సరే, దేవుడు మాత్రం సత్యవంతుడే.
5 ει δε η αδικια ημων θεου δικαιοσυνην συνιστησιν τι ερουμεν μη αδικοσ ο θεοσ ο επιφερων την οργην κατα ανθρωπον λεγω
మన దుర్నీతి దేవుని న్యాయాన్ని వెల్లడి చేస్తున్నప్పటికీ కోపం చూపే దేవుడు అన్యాయం చేసేవాడని చెప్పాలా? నేను మానవ వ్యవహార రీతిలో మాట్లాడుతున్నాను.
6 μη γενοιτο επει πωσ κρινει ο θεοσ τον κοσμον
అలా కానే కాదు. అలాగైతే దేవుడు లోకానికి ఎలా తీర్పు తీరుస్తాడు?
7 ει γαρ η αληθεια του θεου εν τω εμω ψευσματι επερισσευσεν εισ την δοξαν αυτου τι ετι καγω ωσ αμαρτωλοσ κρινομαι
నా అబద్ధం ద్వారా దేవుని సత్యం విస్తరించి ఆయనకు మహిమ కలిగితే నేను పాపినని తీర్పు పొందడం ఎందుకు?
8 και μη καθωσ βλασφημουμεθα και καθωσ φασιν τινεσ ημασ λεγειν οτι ποιησωμεν τα κακα ινα ελθη τα αγαθα ων το κριμα ενδικον εστιν
మంచి జరగడం కోసం చెడు జరిగిద్దాం అని మేము బోధిస్తున్నామని ఇప్పటికే కొందరు మాపై నిందారోపణ చేసినట్టు మేము నిజంగానే ఆ ప్రకారం చెప్పవచ్చు కదా? వారి మీదికి వచ్చే శిక్ష న్యాయమైనదే.
9 τι ουν προεχομεθα ου παντωσ προητιασαμεθα γαρ ιουδαιουσ τε και ελληνασ παντασ υφ αμαρτιαν ειναι
అలాగని మేము వారికంటే మంచివారమా? ఎంతమాత్రం కాదు. యూదులైనా, యూదేతరులైనా, అందరూ పాపం కింద ఉన్నారని ఇప్పటికే దోషారోపణ చేశాం కదా.
10 καθωσ γεγραπται οτι ουκ εστιν δικαιοσ ουδε εισ
౧౦దీని విషయంలో ఏమని రాసి ఉన్నదంటే, “నీతిమంతుడు లేడు, ఒక్కడు కూడా లేడు.
11 ουκ εστιν ο συνιων ουκ εστιν ο εκζητων τον θεον
౧౧గ్రహించేవాడెవడూ లేడు, దేవుణ్ణి వెదికే వాడెవడూ లేడు.
12 παντεσ εξεκλιναν αμα ηχρειωθησαν ουκ εστιν ποιων χρηστοτητα ουκ εστιν εωσ ενοσ
౧౨అందరూ దారి తప్పిపోయారు, అందరూ ఏకంగా పనికిమాలినవారయ్యారు. మంచి జరిగించేవాడు లేడు, ఒక్కడు కూడా లేడు.
13 ταφοσ ανεωγμενοσ ο λαρυγξ αυτων ταισ γλωσσαισ αυτων εδολιουσαν ιοσ ασπιδων υπο τα χειλη αυτων
౧౩వారి గొంతుక తెరచి ఉన్న సమాధిలాగా ఉంది. వారు నాలుకతో మోసం చేస్తూ ఉంటారు. వారి పెదవుల కింద పాము విషం ఉంది.
14 ων το στομα αρασ και πικριασ γεμει
౧౪వారి నోటినిండా శాపనార్ధాలు, పగ ఉన్నాయి.
15 οξεισ οι ποδεσ αυτων εκχεαι αιμα
౧౫రక్తం చిందించడానికి వారి పాదాలు పరిగెడుతూ ఉన్నాయి.
16 συντριμμα και ταλαιπωρια εν ταισ οδοισ αυτων
౧౬వారి మార్గాల్లో నాశనం, కష్టం ఉన్నాయి.
17 και οδον ειρηνησ ουκ εγνωσαν
౧౭వారికి శాంతిమార్గం తెలియదు.
18 ουκ εστιν φοβοσ θεου απεναντι των οφθαλμων αυτων
౧౮వారి దృష్టికి దేవుని భయం అంటే తెలియదు.”
19 οιδαμεν δε οτι οσα ο νομοσ λεγει τοισ εν τω νομω λαλει ινα παν στομα φραγη και υποδικοσ γενηται πασ ο κοσμοσ τω θεω
౧౯ప్రతి నోటికీ మూతపడాలనీ, లోకమంతా దేవుని తీర్పు కిందికి రావాలనీ ధర్మశాస్త్రం చెప్పే మాటలన్నీ దానికి లోబడి ఉన్నవారితోనే చెబుతున్నదని మనకు తెలుసు.
20 διοτι εξ εργων νομου ου δικαιωθησεται πασα σαρξ ενωπιον αυτου δια γαρ νομου επιγνωσισ αμαρτιασ
౨౦ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని పాటించడం ద్వారా ఏ మనిషీ దేవుని దృష్టికి నీతిమంతుడు కాలేడు. ధర్మశాస్త్రం వలన పాపమంటే ఏమిటో తెలుస్తున్నది.
21 νυνι δε χωρισ νομου δικαιοσυνη θεου πεφανερωται μαρτυρουμενη υπο του νομου και των προφητων
౨౧ఇదిలా ఉంటే ధర్మశాస్త్రంతో సంబంధం లేకుండా దేవుని న్యాయం వెల్లడైంది. ధర్మశాస్త్రమూ ప్రవక్తలూ రాసింది దానికి సాక్ష్యంగా ఉన్నాయి.
22 δικαιοσυνη δε θεου δια πιστεωσ ιησου χριστου εισ παντασ και επι παντασ τουσ πιστευοντασ ου γαρ εστιν διαστολη
౨౨అది యేసు క్రీస్తులో విశ్వాసమూలంగా నమ్మే వారందరికీ కలిగే దేవుని నీతి.
23 παντεσ γαρ ημαρτον και υστερουνται τησ δοξησ του θεου
౨౩భేదమేమీ లేదు. అందరూ పాపం చేసి దేవుడు ఇవ్వజూపిన మహిమను అందుకోలేక పోతున్నారు.
24 δικαιουμενοι δωρεαν τη αυτου χαριτι δια τησ απολυτρωσεωσ τησ εν χριστω ιησου
౨౪నమ్మేవారు దేవుని కృప చేతా, క్రీస్తు యేసులోని విమోచన ద్వారా, ఉచితంగా నీతిమంతులని తీర్పు పొందుతున్నారు.
25 ον προεθετο ο θεοσ ιλαστηριον δια τησ πιστεωσ εν τω αυτου αιματι εισ ενδειξιν τησ δικαιοσυνησ αυτου δια την παρεσιν των προγεγονοτων αμαρτηματων
౨౫క్రీస్తు యేసు రక్తంలో విశ్వాసం ద్వారా పాప పరిహారం పొందేలా దేవుడు తన కోపాగ్నిని తొలగించే పాప పరిహారార్ధ బలిగా ఆయనను కనుపరిచాడు. అందులో దేవుని ఉద్దేశం తన న్యాయాన్ని ప్రదర్శించడమే. ఎందుకంటే, గతంలోని పాపాలను దేవుడు సహనంతో దాటిపోయాడు.
26 εν τη ανοχη του θεου προσ ενδειξιν τησ δικαιοσυνησ αυτου εν τω νυν καιρω εισ το ειναι αυτον δικαιον και δικαιουντα τον εκ πιστεωσ ιησου
౨౬ప్రస్తుత కాలంలో తన న్యాయాన్ని కనబరిచే నిమిత్తం తాను న్యాయవంతుడుగా, యేసులో విశ్వాసంగల వాణ్ణి న్యాయవంతుని తీర్చే వాడుగా ఉండడానికి దేవుడు ఇలా చేశాడు.
27 που ουν η καυχησισ εξεκλεισθη δια ποιου νομου των εργων ουχι αλλα δια νομου πιστεωσ
౨౭కాబట్టి మనం గొప్పలు చెప్పుకోడానికి కారణమేది? దాన్ని కొట్టివేయడం అయిపోయింది. ఏ నియమాన్ని బట్టి? క్రియలను బట్టా? కాదు, విశ్వాస నియమాన్ని బట్టే.
28 λογιζομεθα ουν πιστει δικαιουσθαι ανθρωπον χωρισ εργων νομου
౨౮కాబట్టి మనుషులు ధర్మశాస్త్ర క్రియలు లేకుండానే విశ్వాసం వలన నీతిమంతులని తీర్పు పొందుతున్నారని నిర్ణయిస్తున్నాము.
29 η ιουδαιων ο θεοσ μονον ουχι δε και εθνων ναι και εθνων
౨౯దేవుడు యూదులకు మాత్రమేనా దేవుడు? యూదేతరులకు కాడా? అవును, వారికి కూడా దేవుడే.
30 επειπερ εισ ο θεοσ οσ δικαιωσει περιτομην εκ πιστεωσ και ακροβυστιαν δια τησ πιστεωσ
౩౦దేవుడు ఒక్కడే కాబట్టి, ఆయన సున్నతి గలవారిని విశ్వాసం ద్వారా, సున్నతి లేని వారిని విశ్వాసం మూలంగా నీతిమంతులుగా తీరుస్తాడు.
31 νομον ουν καταργουμεν δια τησ πιστεωσ μη γενοιτο αλλα νομον ιστωμεν
౩౧విశ్వాసం ద్వారా ధర్మశాస్త్రాన్ని కొట్టివేస్తున్నామా? కాదు, ధర్మశాస్త్రాన్ని స్థిరపరుస్తున్నాము.

< Προς Ρωμαιους 3 >