< Προς Ρωμαιους 13 >

1 πασα ψυχη εξουσιαισ υπερεχουσαισ υποτασσεσθω ου γαρ εστιν εξουσια ει μη υπο θεου αι δε ουσαι εξουσιαι υπο του θεου τεταγμεναι εισιν
ప్రతి ఒక్కడూ తన పై అధికారులకు లోబడాలి. ఎందుకంటే దేవుని వల్ల కలిగింది తప్ప అధికారం మరేదీ లేదు. ఇప్పుడు ఉన్న అధికారాలు దేవుడు నియమించినవే.
2 ωστε ο αντιτασσομενοσ τη εξουσια τη του θεου διαταγη ανθεστηκεν οι δε ανθεστηκοτεσ εαυτοισ κριμα ληψονται
కాబట్టి అధికారాన్ని ఎదిరించేవాడు దేవుని నియామకాన్ని ఎదిరిస్తున్నాడు. తద్వారా అతడు తన మీదికి తానే శిక్ష తెచ్చుకొంటాడు.
3 οι γαρ αρχοντεσ ουκ εισιν φοβοσ των αγαθων εργων αλλα των κακων θελεισ δε μη φοβεισθαι την εξουσιαν το αγαθον ποιει και εξεισ επαινον εξ αυτησ
పాలనాధికారులు చెడు పనులకే భయకారకులు గానీ మంచి పనులకు కాదు. వారికి భయపడకుండా ఉండాలంటే, మంచి పనులు చెయ్యి. అప్పుడు వారు నిన్ను మెచ్చుకుంటారు.
4 θεου γαρ διακονοσ εστιν σοι εισ το αγαθον εαν δε το κακον ποιησ φοβου ου γαρ εικη την μαχαιραν φορει θεου γαρ διακονοσ εστιν εκδικοσ εισ οργην τω το κακον πρασσοντι
వారు నీ మేలు కోసం ఉన్న దేవుని సేవకులు. అయితే నీవు చెడ్డ పని చేసినప్పుడు భయపడాలి. వారు కారణం లేకుండా కత్తిని ధరించరు. వారు చెడు జరిగించే వారి మీద కోపంతో ప్రతీకారం చేసే దేవుని సేవకులు.
5 διο αναγκη υποτασσεσθαι ου μονον δια την οργην αλλα και δια την συνειδησιν
కాబట్టి కేవలం వారి కోపం గురించిన భయంతోనే కాక నీ మనస్సాక్షిని బట్టి కూడా అధికారులకు లోబడాలి.
6 δια τουτο γαρ και φορουσ τελειτε λειτουργοι γαρ θεου εισιν εισ αυτο τουτο προσκαρτερουντεσ
ఈ కారణం చేతనే మీరు పన్నులు కడుతున్నారు. ఎందుకంటే అధికారులు ఎప్పుడూ ఈ పనిలోనే దేవుని సేవకులుగా సేవ చేస్తుంటారు.
7 αποδοτε ουν πασιν τασ οφειλασ τω τον φορον τον φορον τω το τελοσ το τελοσ τω τον φοβον τον φοβον τω την τιμην την τιμην
ఎవరికేది రుణ పడి ఉంటే అది వాళ్ళకివ్వండి. పన్నులు రుణపడి ఉంటే పన్నులు, సుంకాలు రుణ పడి ఉంటే సుంకాలు చెల్లించండి. మర్యాద ఇవ్వవలసి ఉంటే మర్యాదను, గౌరవం ఇవ్వవలసి ఉంటే గౌరవాన్ని ఇవ్వండి.
8 μηδενι μηδεν οφειλετε ει μη το αγαπαν αλληλουσ ο γαρ αγαπων τον ετερον νομον πεπληρωκεν
ప్రేమ విషయంలో తప్ప మరి ఏమీ ఎవరికీ రుణ పడి ఉండవద్దు. పొరుగువాణ్ణి ప్రేమించేవాడే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చిన వాడు.
9 το γαρ ου μοιχευσεισ ου φονευσεισ ου κλεψεισ ουκ επιθυμησεισ και ει τισ ετερα εντολη εν τουτω τω λογω ανακεφαλαιουται εν τω αγαπησεισ τον πλησιον σου ωσ σεαυτον
ఎందుకంటే వ్యభిచరించవద్దు, నరహత్య చేయవద్దు, దొంగతనం చేయవద్దు, వేరొకరిది ఆశించవద్దు అనేవీ, మరింకే ఆజ్ఞ అయినా ఉంటే అదీ, “నిన్ను నీవు ప్రేమించుకున్నట్టే నీ పొరుగువాణ్ణి ప్రేమించు” అనే వాక్యంలో ఇమిడి ఉన్నాయి.
10 η αγαπη τω πλησιον κακον ουκ εργαζεται πληρωμα ουν νομου η αγαπη
౧౦ప్రేమ పొరుగు వారికి కీడు చేయదు కాబట్టి ప్రేమ కలిగి ఉండడం అంటే ధర్మశాస్త్రాన్ని నెరవేర్చడమే.
11 και τουτο ειδοτεσ τον καιρον οτι ωρα ημασ ηδη εξ υπνου εγερθηναι νυν γαρ εγγυτερον ημων η σωτηρια η οτε επιστευσαμεν
౧౧కాబట్టి మీరు కాలాన్ని పరిశీలించి, నిద్ర నుండి మేల్కొన వలసిన సమయం అయ్యిందని గ్రహించండి. మనం మొదట విశ్వాసులం అయినప్పటి కంటే, మన రక్షణ ఇప్పుడు మరింత దగ్గరగా ఉంది.
12 η νυξ προεκοψεν η δε ημερα ηγγικεν αποθωμεθα ουν τα εργα του σκοτουσ και ενδυσωμεθα τα οπλα του φωτοσ
౧౨రాత్రి చాలా వరకూ గడిచిపోయి పగలు సమీపంగా వచ్చింది కాబట్టి మనం చీకటి కార్యాలను విడిచిపెట్టి, వెలుగు సంబంధమైన ఆయుధాలను ధరించుదాం.
13 ωσ εν ημερα ευσχημονωσ περιπατησωμεν μη κωμοισ και μεθαισ μη κοιταισ και ασελγειαισ μη εριδι και ζηλω
౧౩పోకిరీ వినోదాలతో, తాగిన మత్తులో, లైంగిక దుర్నీతితో హద్దూ అదుపూ లేని కామంతో, కలహాలతో, అసూయలతో కాకుండా పగటి వెలుగులోలాగా మర్యాదగా నడుచుకుందాం.
14 αλλ ενδυσασθε τον κυριον ιησουν χριστον και τησ σαρκοσ προνοιαν μη ποιεισθε εισ επιθυμιασ
౧౪చివరగా ప్రభు యేసు క్రీస్తును ధరించుకోండి. శరీరానికీ దాని వాంఛలకు చోటియ్యకండి.

< Προς Ρωμαιους 13 >