< Προς Εβραιους 1 >
1 πολυμερωσ και πολυτροπωσ παλαι ο θεοσ λαλησασ τοισ πατρασιν εν τοισ προφηταισ επ εσχατου των ημερων τουτων ελαλησεν ημιν εν υιω
౧పురాతన కాలంలో అనేక సమయాల్లో అనేక రకాలుగా ప్రవక్తల ద్వారా దేవుడు మన పూర్వీకులతో మాట్లాడాడు.
2 ον εθηκεν κληρονομον παντων δι ου και τουσ αιωνασ εποιησεν (aiōn )
౨ఇటీవలి కాలంలో ఆయన తన కుమారుడి ద్వారా మనతో మాట్లాడాడు. ఆయన ఆ కుమారుణ్ణి సమస్తానికీ వారసుడిగా నియమించాడు. ఆ కుమారుడి ద్వారానే ఆయన విశ్వాన్నంతా చేశాడు. (aiōn )
3 οσ ων απαυγασμα τησ δοξησ και χαρακτηρ τησ υποστασεωσ αυτου φερων τε τα παντα τω ρηματι τησ δυναμεωσ αυτου δι εαυτου καθαρισμον ποιησαμενοσ των αμαρτιων ημων εκαθισεν εν δεξια τησ μεγαλωσυνησ εν υψηλοισ
౩దేవుని మహిమా ప్రభావాల ఘన తేజస్సు ఆయనే. దైవత్వ స్వభావ సారాంశ సంపూర్ణత ఆయనే. బల ప్రభావాలు గల తన వాక్కు చేత ఆయన సమస్తాన్నీ వహిస్తూ ఉన్నాడు. పాపాల శుద్ధీకరణం చేసిన తరువాత, మహా ఘనత వహించి ఉన్నత స్థలంలో విరాజిల్లే దేవుని కుడి పక్కన కూర్చున్నాడు.
4 τοσουτω κρειττων γενομενοσ των αγγελων οσω διαφορωτερον παρ αυτουσ κεκληρονομηκεν ονομα
౪దేవదూతల కంటే ఎంతో శ్రేష్ఠమైన నామాన్ని ఆయన వారసత్వంగా పొందాడు కాబట్టి ఆయన వారి కంటే ఎంతో శ్రేష్ఠుడయ్యాడు.
5 τινι γαρ ειπεν ποτε των αγγελων υιοσ μου ει συ εγω σημερον γεγεννηκα σε και παλιν εγω εσομαι αυτω εισ πατερα και αυτοσ εσται μοι εισ υιον
౫ఎందుకంటే దేవుడు, “నువ్వు నా కుమారుడివి. ఈ రోజు నేను నీకు తండ్రినయ్యాను.” అని గానీ, “నేను అతనికి తండ్రిగా ఉంటాను, అతడు నాకు కుమారుడిగా ఉంటాడు” అని గానీ తన దూతల్లో ఎవరి గురించైనా అన్నాడా?
6 οταν δε παλιν εισαγαγη τον πρωτοτοκον εισ την οικουμενην λεγει και προσκυνησατωσαν αυτω παντεσ αγγελοι θεου
౬అంతేగాక ఆయన సృష్టికి ముందు ఉన్న ప్రథముణ్ణి భూమి పైకి తీసుకు వచ్చినప్పుడు, “దేవదూతలందరూ ఆయనను పూజించాలి” అన్నాడు.
7 και προσ μεν τουσ αγγελουσ λεγει ο ποιων τουσ αγγελουσ αυτου πνευματα και τουσ λειτουργουσ αυτου πυροσ φλογα
౭తన దూతల గూర్చి చెప్పినప్పుడు ఆయన, “దేవదూతలను ఆత్మలుగానూ, తన సేవకులను అగ్ని జ్వాలలుగానూ చేసుకునేవాడు” అని చెప్పాడు.
8 προσ δε τον υιον ο θρονοσ σου ο θεοσ εισ τον αιωνα του αιωνοσ ραβδοσ ευθυτητοσ η ραβδοσ τησ βασιλειασ σου (aiōn )
౮అయితే తన కుమారుణ్ణి గూర్చి ఇలా అన్నాడు. “దేవా, నీ సింహాసనం కలకాలం ఉంటుంది. నీ రాజదండం న్యాయదండం. (aiōn )
9 ηγαπησασ δικαιοσυνην και εμισησασ ανομιαν δια τουτο εχρισεν σε ο θεοσ ο θεοσ σου ελαιον αγαλλιασεωσ παρα τουσ μετοχουσ σου
౯నువ్వు నీతిని ప్రేమించి అక్రమాన్ని అసహ్యించుకున్నావు. కాబట్టి దేవా, నీ దేవుడు నీ సహచరుల కంటే ఎక్కువగా ఆనంద తైలంతో నిన్ను అభిషేకించాడు.
10 και συ κατ αρχασ κυριε την γην εθεμελιωσασ και εργα των χειρων σου εισιν οι ουρανοι
౧౦ప్రభూ, ప్రారంభంలో నువ్వు భూమికి పునాది వేశావు. నీ చేతులతోనే ఆకాశాలను చేశావు.
11 αυτοι απολουνται συ δε διαμενεισ και παντεσ ωσ ιματιον παλαιωθησονται
౧౧అవి నాశనమై పోతాయి. కానీ నువ్వు కొనసాగుతావు. బట్టలు ఎలా మాసిపోతాయో అలాగే అవి కూడా మాసిపోతాయి.
12 και ωσει περιβολαιον ελιξεισ αυτουσ και αλλαγησονται συ δε ο αυτοσ ει και τα ετη σου ουκ εκλειψουσιν
౧౨వాటిని అంగవస్త్రంలాగా చుట్టి వేస్తావు. బట్టలను మార్చినట్టు వాటిని మార్చి వేస్తావు. కానీ నువ్వు ఒకేలా ఉంటావు. నీ సంవత్సరాలు ముగిసిపోవు.”
13 προσ τινα δε των αγγελων ειρηκεν ποτε καθου εκ δεξιων μου εωσ αν θω τουσ εχθρουσ σου υποποδιον των ποδων σου
౧౩“నేను నీ శత్రువులను నీ పాదాల కింద పీటగా చేసే వరకూ నా కుడి వైపున కూర్చో” అని దేవుడు తన దూతల్లో ఎవరితోనైనా ఎప్పుడైనా చెప్పాడా?
14 ουχι παντεσ εισιν λειτουργικα πνευματα εισ διακονιαν αποστελλομενα δια τουσ μελλοντασ κληρονομειν σωτηριαν
౧౪ఈ దూతలంతా రక్షణను వారసత్వంగా పొందబోయే వారికి సేవ చేయడానికి పంపించిన సేవక ఆత్మలే కదా?