< Πραξεις 11 >
1 ηκουσαν δε οι αποστολοι και οι αδελφοι οι οντεσ κατα την ιουδαιαν οτι και τα εθνη εδεξαντο τον λογον του θεου
౧యూదేతరులు కూడా దేవుని వాక్కు అంగీకరించారని అపొస్తలులు, యూదయలోని సోదరులు విన్నారు.
2 και οτε ανεβη πετροσ εισ ιεροσολυμα διεκρινοντο προσ αυτον οι εκ περιτομησ
౨పేతురు యెరూషలేముకు వచ్చినపుడు సున్నతి పొందినవారు,
3 λεγοντεσ οτι προσ ανδρασ ακροβυστιαν εχοντασ εισηλθεσ και συνεφαγεσ αυτοισ
౩“నీవు సున్నతి లేని వారి దగ్గరికి పోయి వారితో భోజనం చేశావు” అని అతనిని విమర్శించారు.
4 αρξαμενοσ δε ο πετροσ εξετιθετο αυτοισ καθεξησ λεγων
౪అందుకు పేతురు మొదట నుండి వరుసగా వారికి ఆ సంగతి ఇలా వివరిస్తూ,
5 εγω ημην εν πολει ιοππη προσευχομενοσ και ειδον εν εκστασει οραμα καταβαινον σκευοσ τι ωσ οθονην μεγαλην τεσσαρσιν αρχαισ καθιεμενην εκ του ουρανου και ηλθεν αχρι εμου
౫“నేను యొప్పే ఊరిలో ప్రార్థన చేసుకుంటుంటే, పారవశ్యంలో ఒక దర్శనం చూశాను. దానిలో నాలుగు చెంగులు పట్టి దింపిన పెద్ద దుప్పటి వంటి ఒక విధమైన పాత్ర ఆకాశం నుండి దిగి నా దగ్గరికి వచ్చింది.
6 εισ ην ατενισασ κατενοουν και ειδον τα τετραποδα τησ γησ και τα θηρια και τα ερπετα και τα πετεινα του ουρανου
౬దాన్ని నేను నిదానించి చూస్తే భూమి మీద ఉండే వివిధ రకాల నాలుగు కాళ్ళ జంతువులూ అడవి జంతువులూ పాకే పురుగులూ ఆకాశపక్షులూ నాకు కనబడ్డాయి.
7 ηκουσα δε φωνησ λεγουσησ μοι αναστασ πετρε θυσον και φαγε
౭అప్పుడు, ‘పేతురూ, నీవు లేచి చంపుకుని తిను’ అనే ఒక శబ్దం నాతో చెప్పడం విన్నాను.
8 ειπον δε μηδαμωσ κυριε οτι παν κοινον η ακαθαρτον ουδεποτε εισηλθεν εισ το στομα μου
౮అందుకు నేను, ‘వద్దు ప్రభూ, నిషిద్ధమైనది అపవిత్రమైనది ఏదీ నేనెన్నడూ తినలేదు’ అని జవాబిచ్చాను.
9 απεκριθη δε μοι φωνη εκ δευτερου εκ του ουρανου α ο θεοσ εκαθαρισεν συ μη κοινου
౯రెండవసారి ఆ శబ్దం ఆకాశం నుండి, ‘దేవుడు పవిత్రం చేసిన వాటిని నీవు నిషిద్ధమైనవిగా ఎంచవద్దు’ అని వినిపించింది.
10 τουτο δε εγενετο επι τρισ και παλιν ανεσπασθη απαντα εισ τον ουρανον
౧౦ఈ విధంగా మూడుసార్లు జరిగింది. తరువాత అదంతా ఆకాశానికి తిరిగి వెళ్ళిపోయింది.
11 και ιδου εξαυτησ τρεισ ανδρεσ επεστησαν επι την οικιαν εν η ημην απεσταλμενοι απο καισαρειασ προσ με
౧౧వెంటనే కైసరయ నుండి నా దగ్గరికి వచ్చిన ముగ్గురు మనుషులు మేమున్న ఇంటి దగ్గర నిలబడ్డారు.
12 ειπεν δε μοι το πνευμα συνελθειν αυτοισ μηδεν διακρινομενον ηλθον δε συν εμοι και οι εξ αδελφοι ουτοι και εισηλθομεν εισ τον οικον του ανδροσ
౧౨అప్పుడు ఆత్మ, ‘నీవు ఏ భేదం చూపకుండా వారితో కూడా వెళ్ళు’ అని ఆజ్ఞాపించాడు. ఈ ఆరుగురు సోదరులు నాతో వచ్చారు. మేము కొర్నేలి ఇంటికి వెళ్ళాం.
13 απηγγειλεν τε ημιν πωσ ειδεν τον αγγελον εν τω οικω αυτου σταθεντα και ειποντα αυτω αποστειλον εισ ιοππην ανδρασ και μεταπεμψαι σιμωνα τον επικαλουμενον πετρον
౧౩అతడు తన యింట్లో నిలబడిన దూతను తానెలా చూశాడో చెబుతూ, ‘నీవు యొప్పేకు మనుషులను పంపి పేతురు అనే పేరున్న సీమోనును పిలిపించు.
14 οσ λαλησει ρηματα προσ σε εν οισ σωθηση συ και πασ ο οικοσ σου
౧౪నీవూ, నీ ఇంటివారంతా రక్షణ పొందే మాటలు అతడు నీతో చెబుతాడు’ అని అన్నాడని తెలియజేశాడు.
15 εν δε τω αρξασθαι με λαλειν επεπεσεν το πνευμα το αγιον επ αυτουσ ωσπερ και εφ ημασ εν αρχη
౧౫నేను మాట్లాడడం మొదలుపెట్టినపుడు పరిశుద్ధాత్మ ప్రారంభంలో మన మీదికి దిగినట్టుగానే వారి మీదికీ దిగాడు.
16 εμνησθην δε του ρηματοσ κυριου ωσ ελεγεν ιωαννησ μεν εβαπτισεν υδατι υμεισ δε βαπτισθησεσθε εν πνευματι αγιω
౧౬అప్పుడు, ‘యోహాను నీళ్లతో బాప్తిసమిచ్చాడు గాని మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుతారు’ అని ప్రభువు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకున్నాను.
17 ει ουν την ισην δωρεαν εδωκεν αυτοισ ο θεοσ ωσ και ημιν πιστευσασιν επι τον κυριον ιησουν χριστον εγω δε τισ ημην δυνατοσ κωλυσαι τον θεον
౧౭“కాబట్టి ప్రభువైన యేసు క్రీస్తులో విశ్వాసముంచిన మనకు అనుగ్రహించినట్టు దేవుడు వారికి కూడా అదే వరం ఇస్తే, దేవుణ్ణి అడ్డగించడానికి నేనెవర్ని?” అని వారితో అన్నాడు.
18 ακουσαντεσ δε ταυτα ησυχασαν και εδοξαζον τον θεον λεγοντεσ αρα γε και τοισ εθνεσιν ο θεοσ την μετανοιαν εδωκεν εισ ζωην
౧౮వారీ మాటలు విని ఇంకేమీ అడ్డు చెప్పకుండా “అలాగయితే యూదేతరులకు కూడా దేవుడు నిత్యజీవాన్ని మారుమనసును దయచేశాడు” అని చెప్పుకొంటూ దేవుణ్ణి మహిమ పరిచారు.
19 οι μεν ουν διασπαρεντεσ απο τησ θλιψεωσ τησ γενομενησ επι στεφανω διηλθον εωσ φοινικησ και κυπρου και αντιοχειασ μηδενι λαλουντεσ τον λογον ει μη μονον ιουδαιοισ
౧౯స్తెఫను విషయంలో కలిగిన హింస వలన చెదరిపోయిన వారు యూదులకు తప్ప మరి ఎవరికీ వాక్కు బోధించకుండా ఫేనీకే, సైప్రస్, అంతియొకయ వరకూ సంచరించారు.
20 ησαν δε τινεσ εξ αυτων ανδρεσ κυπριοι και κυρηναιοι οιτινεσ εισελθοντεσ εισ αντιοχειαν ελαλουν προσ τουσ ελληνιστασ ευαγγελιζομενοι τον κυριον ιησουν
౨౦వారిలో కొంతమంది సైప్రస్ వారూ, కురేనీ వారూ అంతియొకయ వచ్చి గ్రీకు వారితో మాట్లాడుతూ యేసు ప్రభువును ప్రకటించారు.
21 και ην χειρ κυριου μετ αυτων πολυσ τε αριθμοσ πιστευσασ επεστρεψεν επι τον κυριον
౨౧ప్రభువు హస్తం వారికి తోడై ఉంది. అనేక మంది నమ్మి ప్రభువు వైపు తిరిగారు.
22 ηκουσθη δε ο λογοσ εισ τα ωτα τησ εκκλησιασ τησ εν ιεροσολυμοισ περι αυτων και εξαπεστειλαν βαρναβαν διελθειν εωσ αντιοχειασ
౨౨వారిని గూర్చిన సమాచారం యెరూషలేములో ఉన్న సంఘం విని బర్నబాను అంతియొకయకు పంపింది.
23 οσ παραγενομενοσ και ιδων την χαριν του θεου εχαρη και παρεκαλει παντασ τη προθεσει τησ καρδιασ προσμενειν τω κυριω
౨౩అతడు వచ్చి దైవానుగ్రహాన్ని చూసి సంతోషించి, ప్రభువులో పూర్ణ హృదయంతో నిలిచి ఉండాలని అందరినీ ప్రోత్సాహపరిచాడు.
24 οτι ην ανηρ αγαθοσ και πληρησ πνευματοσ αγιου και πιστεωσ και προσετεθη οχλοσ ικανοσ τω κυριω
౨౪అతడు పరిశుద్ధాత్మతో విశ్వాసంతో నిండిన మంచి వ్యక్తి గనుక చాలామంది ప్రభువును నమ్మారు.
25 εξηλθεν δε εισ ταρσον ο βαρναβασ αναζητησαι σαυλον
౨౫బర్నబా సౌలును వెదకడానికి తార్సు ఊరు వెళ్ళి, అతనిని వెదికి కనుగొని అంతియొకయ తోడుకుని వచ్చాడు.
26 και ευρων ηγαγεν αυτον εισ αντιοχειαν εγενετο δε αυτουσ ενιαυτον ολον συναχθηναι τη εκκλησια και διδαξαι οχλον ικανον χρηματισαι τε πρωτον εν αντιοχεια τουσ μαθητασ χριστιανουσ
౨౬వారు కలిసి ఒక సంవత్సరమంతా సంఘంతో ఉండి చాలామందికి బోధించారు. అంతియొకయలోని శిష్యులను మొట్టమొదటి సారిగా ‘క్రైస్తవులు’ అన్నారు.
27 εν ταυταισ δε ταισ ημεραισ κατηλθον απο ιεροσολυμων προφηται εισ αντιοχειαν
౨౭ఆ రోజుల్లో కొంతమంది ప్రవక్తలు యెరూషలేము నుండి అంతియొకయ వచ్చారు.
28 αναστασ δε εισ εξ αυτων ονοματι αγαβοσ εσημανεν δια του πνευματοσ λιμον μεγαν μελλειν εσεσθαι εφ ολην την οικουμενην οστισ και εγενετο επι κλαυδιου καισαροσ
౨౮వారిలో అగబు అనే ఒకడు నిలబడి, లోకమంతటా తీవ్రమైన కరువు రాబోతున్నదని ఆత్మ ద్వారా సూచించాడు. ఇది క్లాడియస్ చక్రవర్తి రోజుల్లో జరిగింది.
29 των δε μαθητων καθωσ ευπορειτο τισ ωρισαν εκαστοσ αυτων εισ διακονιαν πεμψαι τοισ κατοικουσιν εν τη ιουδαια αδελφοισ
౨౯అప్పుడు శిష్యుల్లో ప్రతివారూ తమ శక్తి కొద్దీ యూదయలోని సోదరులకు సహయం పంపడానికి నిశ్చయించుకున్నారు.
30 ο και εποιησαν αποστειλαντεσ προσ τουσ πρεσβυτερουσ δια χειροσ βαρναβα και σαυλου
౩౦వారు అలా చేసి, బర్నబా, సౌలుల ద్వారా పెద్దలకు డబ్బు పంపించారు.