< Προς Κορινθιους Β΄ 11 >
1 οφελον ανειχεσθε μου μικρον τη αφροσυνη αλλα και ανεχεσθε μου
౧నా బుద్దిహీనతను దయతో సహించమని కోరుతున్నాను, నిజానికి మీరు సహిస్తూనే ఉన్నారు.
2 ζηλω γαρ υμασ θεου ζηλω ηρμοσαμην γαρ υμασ ενι ανδρι παρθενον αγνην παραστησαι τω χριστω
౨మీ గురించి నేను రోషంతో ఉన్నాను. మీ పట్ల నాకు దైవిక రోషం ఉంది. ఎందుకంటే పవిత్ర కన్యగా ఒక్క భర్తకే, అంటే క్రీస్తుకు సమర్పించాలని మిమ్మల్ని ప్రదానం చేశాను. అయితే,
3 φοβουμαι δε μηπωσ ωσ ο οφισ ευαν εξηπατησεν εν τη πανουργια αυτου ουτωσ φθαρη τα νοηματα υμων απο τησ απλοτητοσ τησ εισ τον χριστον
౩సర్పం తన కుయుక్తితో హవ్వను మోసగించినట్టు మీ మనసులు క్రీస్తులో ఉన్న నిజాయితీ నుండి, పవిత్ర భక్తి నుండి తొలగిపోతాయేమో అని నేను భయపడుతున్నాను.
4 ει μεν γαρ ο ερχομενοσ αλλον ιησουν κηρυσσει ον ουκ εκηρυξαμεν η πνευμα ετερον λαμβανετε ο ουκ ελαβετε η ευαγγελιον ετερον ο ουκ εδεξασθε καλωσ ηνειχεσθε
౪ఎందుకంటే ఎవరైనా వచ్చి మేము ప్రకటించిన యేసును కాక మరొకరిని ప్రకటించినా, లేక మీరు పొందని వేరొక ఆత్మను పొందినా, మీరు అంగీకరించని వేరొక సువార్త మీరు అంగీకరించినా, మీరు వాటిని బాగానే సహిస్తున్నారు.
5 λογιζομαι γαρ μηδεν υστερηκεναι των υπερ λιαν αποστολων
౫ఆ “గొప్ప అపొస్తలుల” కంటే నేనేమాత్రం తక్కువ వాణ్ణి కానని అనుకుంటున్నాను.
6 ει δε και ιδιωτησ τω λογω αλλ ου τη γνωσει αλλ εν παντι φανερωθεντεσ εν πασιν εισ υμασ
౬ఎలా బోధించాలో నేను నేర్చుకోక పోయినా తెలివిలో నేర్పులేని వాడిని కాను. అన్ని రకాలుగా అన్ని విషయాల్లో దీన్ని మీకు తెలియజేసాం.
7 η αμαρτιαν εποιησα εμαυτον ταπεινων ινα υμεισ υψωθητε οτι δωρεαν το του θεου ευαγγελιον ευηγγελισαμην υμιν
౭మీకు దేవుని సువార్త ఉచితంగా ప్రకటిస్తూ మిమ్మల్ని హెచ్చించడానికి నన్ను నేనే తగ్గించుకుని తప్పు చేశానా?
8 αλλασ εκκλησιασ εσυλησα λαβων οψωνιον προσ την υμων διακονιαν
౮మీకు సేవ చేయడానికి ఇతర సంఘాల నుంచి జీతం తీసుకుని, నేను ఒక విధంగా ఆ సంఘాలను “దోచుకున్నాను.”
9 και παρων προσ υμασ και υστερηθεισ ου κατεναρκησα ουδενοσ το γαρ υστερημα μου προσανεπληρωσαν οι αδελφοι ελθοντεσ απο μακεδονιασ και εν παντι αβαρη υμιν εμαυτον ετηρησα και τηρησω
౯నేను మీతో ఉన్నప్పుడు నాకు అక్కర కలిగితే మీలో ఎవరి మీదా భారం మోపలేదు. మాసిదోనియ ప్రాంతం నుండి వచ్చిన సోదరులు నా అవసరాలు తీర్చారు. ప్రతి విషయంలో నేను మీకు భారంగా ఉండకుండాా చూసుకున్నాను. ఇంకా అలానే చేస్తూ ఉంటాను.
10 εστιν αληθεια χριστου εν εμοι οτι η καυχησισ αυτη ου φραγησεται εισ εμε εν τοισ κλιμασιν τησ αχαιασ
౧౦క్రీస్తు సత్యం నాలో ఉండడం వలన అకయ ప్రాంతాల్లో నా అతిశయాన్ని ఎవరూ ఆపలేకపోయారు.
11 δια τι οτι ουκ αγαπω υμασ ο θεοσ οιδεν
౧౧ఎందుకు? నేను మిమ్మల్ని ప్రేమించనందుకా? నేను ప్రేమిస్తున్నట్టు దేవునికే తెలుసు.
12 ο δε ποιω και ποιησω ινα εκκοψω την αφορμην των θελοντων αφορμην ινα εν ω καυχωνται ευρεθωσιν καθωσ και ημεισ
౧౨అయితే ప్రస్తుతం నేను చేసేది తరువాత కూడా చేస్తాను. ఎందుకంటే, కొందరు ఏఏ విషయాల్లో గర్వంగా చెప్పుకొంటారో ఆ విషయాల్లో తాము మాలాగే ఉన్నట్టు అనిపించుకోవాలని చూస్తున్నారు. అలా గర్వంతో చెప్పే అవకాశమేమీ వారికి లేకుండా చేయాలని కోరుతున్నాను.
13 οι γαρ τοιουτοι ψευδαποστολοι εργαται δολιοι μετασχηματιζομενοι εισ αποστολουσ χριστου
౧౩అలాంటి వారు క్రీస్తు అపొస్తలుల వేషం వేసుకున్న అబద్ధ అపొస్తలులు, మోసకరమైన సేవకులు.
14 και ου θαυμαστον αυτοσ γαρ ο σατανασ μετασχηματιζεται εισ αγγελον φωτοσ
౧౪ఇందులో ఆశ్చర్యమేమీ లేదు. సాతాను కూడా వెలుగు దూత వేషం వేసుకుంటాడు.
15 ου μεγα ουν ει και οι διακονοι αυτου μετασχηματιζονται ωσ διακονοι δικαιοσυνησ ων το τελοσ εσται κατα τα εργα αυτων
౧౫అందుచేత, వాడి సేవకులు కూడా నీతి పరిచారకుల వేషం వేసుకోవడం వింతేమీ కాదు. వారి పనులనుబట్టే వారి అంతముంటుంది.
16 παλιν λεγω μη τισ με δοξη αφρονα ειναι ει δε μηγε καν ωσ αφρονα δεξασθε με ινα καγω μικρον τι καυχησωμαι
౧౬మళ్ళీ చెబుతున్నాను. నేను బుద్ధిహీనుడినని ఎవరూ అనుకోవద్దు. అలా అనుకుంటే, నేను కొంచెం అతిశయపడేలా, నన్ను బుద్ధిహీనుడిగానే చేర్చుకోండి.
17 ο λαλω ου λαλω κατα κυριον αλλ ωσ εν αφροσυνη εν ταυτη τη υποστασει τησ καυχησεωσ
౧౭గొప్పలు చెప్పుకుంటూ నేను అతిశయంగా చెప్పే ఈ విషయాలు ప్రభువు మాటగా చెప్పడం లేదు, బుద్ధిహీనుడిలా చెబుతున్నాను.
18 επει πολλοι καυχωνται κατα την σαρκα καγω καυχησομαι
౧౮చాలామంది శరీరానుసారంగా అతిశయిస్తున్నారు. నేనూ అతిశయిస్తాను.
19 ηδεωσ γαρ ανεχεσθε των αφρονων φρονιμοι οντεσ
౧౯తెలివిగల మీరు బుద్ధిహీనులను సంతోషంతో సహిస్తున్నారు.
20 ανεχεσθε γαρ ει τισ υμασ καταδουλοι ει τισ κατεσθιει ει τισ λαμβανει ει τισ επαιρεται ει τισ υμασ εισ προσωπον δερει
౨౦ఎవరైనా మిమ్మల్ని బానిసలుగా చేసినా, మీలో విభేదాలు కలిగించినా, మిమ్మల్ని వశం చేసుకున్నా, తన గురించి గొప్పలు చెప్పుకుంటున్నా, చెంప దెబ్బ కొట్టినా మీరు సహిస్తున్నారు.
21 κατα ατιμιαν λεγω ωσ οτι ημεισ ησθενησαμεν εν ω δ αν τισ τολμα εν αφροσυνη λεγω τολμω καγω
౨౧వారు చేసినట్టు చేయలేని బలహీనులమని సిగ్గుతో చెబుతున్నాను. అయితే, ఎవరైనా ఎపుడైనా అతిశయిస్తుంటే-బుద్ధిహీనుడిలా మాట్లాడుతున్నాను-నేనూ అతిశయిస్తాను.
22 εβραιοι εισιν καγω ισραηλιται εισιν καγω σπερμα αβρααμ εισιν καγω
౨౨వారు హెబ్రీయులా? నేను కూడా హెబ్రీయుడినే. వారు ఇశ్రాయేలీయులా? నేను కూడా ఇశ్రాయేలీయుడినే. వారు అబ్రాహాము సంతానమా? నేను కూడా.
23 διακονοι χριστου εισιν παραφρονων λαλω υπερ εγω εν κοποισ περισσοτερωσ εν πληγαισ υπερβαλλοντωσ εν φυλακαισ περισσοτερωσ εν θανατοισ πολλακισ
౨౩వారు క్రీస్తు సేవకులా? (వెర్రివాడిలాగా మాట్లాడుతున్నాను) నేను కూడా ఇంకా ఎక్కువగా క్రీస్తు సేవకుణ్ణి. వారికంటే చాలా ఎక్కువగా కష్టపడ్డాను. అనేక సార్లు చెరసాల పాలయ్యాను. లెక్కలేనన్ని సార్లు దెబ్బలు తిన్నాను. అనేకమార్లు ప్రాణాపాయ స్థితిలో ఉన్నాను.
24 υπο ιουδαιων πεντακισ τεσσαρακοντα παρα μιαν ελαβον
౨౪యూదుల చేత ఐదు సార్లు “ఒకటి తక్కువ నలభై” కొరడా దెబ్బలు తిన్నాను.
25 τρισ εραβδισθην απαξ ελιθασθην τρισ εναυαγησα νυχθημερον εν τω βυθω πεποιηκα
౨౫మూడు సార్లు నన్ను బెత్తాలతో కొట్టారు. ఒకసారి రాళ్లతో కొట్టారు. మూడుసార్లు నేనెక్కిన ఓడలు పగిలిపోయాయి. ఒక పగలు, ఒక రాత్రి సముద్రంలో గడిపాను.
26 οδοιποριαισ πολλακισ κινδυνοισ ποταμων κινδυνοισ ληστων κινδυνοισ εκ γενουσ κινδυνοισ εξ εθνων κινδυνοισ εν πολει κινδυνοισ εν ερημια κινδυνοισ εν θαλασση κινδυνοισ εν ψευδαδελφοισ
౨౬తరచుగా ప్రయాణాల్లో అపాయాలకు గురయ్యాను. నదుల్లో అపాయాలూ దోపిడీ దొంగల వలన అపాయాలూ నా సొంత ప్రజల వలన అపాయాలూ యూదేతరుల వలన అపాయాలూ పట్టణాల్లో అపాయాలూ అరణ్యాల్లో అపాయాలూ సముద్రంలో అపాయాలూ కపట సోదరుల వల్ల అపాయాలూ నాకు ఎదురయ్యాయి.
27 εν κοπω και μοχθω εν αγρυπνιαισ πολλακισ εν λιμω και διψει εν νηστειαισ πολλακισ εν ψυχει και γυμνοτητι
౨౭కష్ట పడ్డాను. వేదన అనుభవించాను. నిద్ర కరువైన అనేక రాత్రులు గడిపాను. చలితో, ఆకలి దప్పులతో, తినడానికి ఏమీ లేక, బట్టల్లేక ఉన్నాను.
28 χωρισ των παρεκτοσ η επισυστασισ μου η καθ ημεραν η μεριμνα πασων των εκκλησιων
౨౮ఈ విషయాలు మాత్రమే కాకుండా క్రీస్తు సంఘాలన్నిటిని గురించిన దిగులు రోజూ నా మీద భారంగా ఉంది.
29 τισ ασθενει και ουκ ασθενω τισ σκανδαλιζεται και ουκ εγω πυρουμαι
౨౯మీలో ఒకడు బలహీనుడైతే, నేనూ బలహీనుణ్ణి కాకుండా ఉండగలనా? ఒకడు ఇతరుల వల్ల పాపంలో పడితే, నేను నా అంతరంగంలో మండిపోకుండా ఉండగలనా?
30 ει καυχασθαι δει τα τησ ασθενειασ μου καυχησομαι
౩౦అతిశయపడాల్సి వస్తే నేను నా బలహీనతలను కనపరిచే వాటిలోనే అతిశయిస్తాను.
31 ο θεοσ και πατηρ του κυριου ιησου χριστου οιδεν ο ων ευλογητοσ εισ τουσ αιωνασ οτι ου ψευδομαι (aiōn )
౩౧ఎప్పటికీ స్తుతి పాత్రుడైన మన ప్రభు యేసు తండ్రి అయిన దేవునికి నేను అబద్ధమాడడం లేదని తెలుసు. (aiōn )
32 εν δαμασκω ο εθναρχησ αρετα του βασιλεωσ εφρουρει την δαμασκηνων πολιν πιασαι με θελων
౩౨దమస్కులో అరెత అనే రాజు కింద ఉన్న అధికారి నన్ను పట్టుకోవడం కోసం దమస్కు పట్టణానికి కాపలా పెట్టాడు.
33 και δια θυριδοσ εν σαργανη εχαλασθην δια του τειχουσ και εξεφυγον τασ χειρασ αυτου
౩౩అప్పుడు నన్ను కిటికీ గుండా గోడ మీద నుంచి గంపలో దించితే అతని చేతికి చిక్కకుండా తప్పించుకున్నాను.