< Πετρου Α΄ 4 >

1 χριστου ουν παθοντοσ υπερ ημων σαρκι και υμεισ την αυτην εννοιαν οπλισασθε οτι ο παθων εν σαρκι πεπαυται αμαρτιασ
క్రీస్తు శరీర హింసలు పొందాడు కాబట్టి, మీరు కూడా అలాంటి మనసునే ఆయుధంగా ధరించుకోండి. శరీర హింసలు పొందిన వాడు పాపం చేయడం మానేస్తాడు.
2 εισ το μηκετι ανθρωπων επιθυμιαισ αλλα θεληματι θεου τον επιλοιπον εν σαρκι βιωσαι χρονον
ఈ వ్యక్తి తన శేష జీవితాన్ని ఇకమీదట మానవ కోరికలను అనుసరించక, దేవుని ఇష్టం కోసమే జీవిస్తాడు.
3 αρκετοσ γαρ ημιν ο παρεληλυθωσ χρονοσ του βιου το θελημα των εθνων κατεργασασθαι πεπορευμενουσ εν ασελγειαισ επιθυμιαισ οινοφλυγιαισ κωμοισ ποτοισ και αθεμιτοισ ειδωλολατρειαισ
యూదేతరులు చేసినట్టు చేయడానికి గతించిన కాలం చాలు. గతంలో మీరు లైంగిక పరమైన అనైతిక కార్యాలూ, చెడ్డ కోరికలు, మద్యపానం, అల్లరి చిల్లరి వినోదాలూ, విచ్చలవిడి విందులూ, నిషిద్ధమైన విగ్రహ పూజలూ చేశారు.
4 εν ω ξενιζονται μη συντρεχοντων υμων εισ την αυτην τησ ασωτιασ αναχυσιν βλασφημουντεσ
వారితోబాటుగా మీరూ ఇలాటి విపరీతమైన తెలివిమాలిన పనులు ఇప్పుడు చేయడం లేదని వారు మిమ్మల్ని వింతగా చూస్తున్నారు. అందుకే వారు మీ గురించి చెడ్డగా చెబుతున్నారు.
5 οι αποδωσουσιν λογον τω ετοιμωσ εχοντι κριναι ζωντασ και νεκρουσ
బతికున్న వారికీ చనిపోయిన వారికీ తీర్పు తీర్చడానికి సిద్ధంగా ఉన్నవాడికి వారు లెక్క అప్పజెప్పాలి.
6 εισ τουτο γαρ και νεκροισ ευηγγελισθη ινα κριθωσιν μεν κατα ανθρωπουσ σαρκι ζωσιν δε κατα θεον πνευματι
అందుకే చనిపోయిన వారు మానవ రీతిగా వారి శరీరానికి తీర్పు జరిగినా వారి ఆత్మ దేవునిలో జీవించేలా వారికి కూడా సువార్త ప్రకటించబడింది.
7 παντων δε το τελοσ ηγγικεν σωφρονησατε ουν και νηψατε εισ τασ προσευχασ
అన్నిటికీ అంతం సమీపించింది. కాబట్టి మెలకువగా, ప్రార్థనల్లో చైతన్య వంతులుగా ఉండండి.
8 προ παντων δε την εισ εαυτουσ αγαπην εκτενη εχοντεσ οτι αγαπη καλυψει πληθοσ αμαρτιων
అన్నిటి కంటే ప్రధానంగా ఒకరిపట్ల ఒకరు గాఢమైన ప్రేమతో ఉండండి. ప్రేమ ఇతరుల పాపాలను వెతికి పట్టుకోడానికి ప్రయత్నించదు.
9 φιλοξενοι εισ αλληλουσ ανευ γογγυσμων
ఏ మాత్రమూ సణుక్కోకుండా ఒకరికొకరు అతిథి సత్కారం చేసుకోండి.
10 εκαστοσ καθωσ ελαβεν χαρισμα εισ εαυτουσ αυτο διακονουντεσ ωσ καλοι οικονομοι ποικιλησ χαριτοσ θεου
౧౦దేవుని అనేక ఉచిత వరాలకు మంచి నిర్వాహకులుగా ఉంటూ, మీలో ప్రతి ఒక్కడూ కృపావరంగా పొందిన వాటిని ఒకరికొకరికి సేవ చేసుకోడానికి వాడండి.
11 ει τισ λαλει ωσ λογια θεου ει τισ διακονει ωσ εξ ισχυοσ ωσ χορηγει ο θεοσ ινα εν πασιν δοξαζηται ο θεοσ δια ιησου χριστου ω εστιν η δοξα και το κρατοσ εισ τουσ αιωνασ των αιωνων αμην (aiōn g165)
౧౧ఎవరైనా బోధిస్తే, దైవోక్తుల్లా బోధించాలి. ఎవరైనా సేవ చేస్తే దేవుడు అనుగ్రహించే సామర్ధ్యంతో చేయాలి. దేవునికి యేసు క్రీస్తు ద్వారా అన్నిటిలోనూ మహిమ కలుగుతుంది. మహిమ, ప్రభావం ఎప్పటికీ ఆయనకే చెందుతాయి. ఆమేన్‌. (aiōn g165)
12 αγαπητοι μη ξενιζεσθε τη εν υμιν πυρωσει προσ πειρασμον υμιν γινομενη ωσ ξενου υμιν συμβαινοντοσ
౧౨ప్రియులారా, మిమ్మల్ని పరీక్షించడానికి మీకు వచ్చే అగ్నిలాంటి విపత్తును గురించి మీకేదో వింత సంభవిస్తున్నట్టు ఆశ్చర్యపోవద్దు.
13 αλλα καθο κοινωνειτε τοισ του χριστου παθημασιν χαιρετε ινα και εν τη αποκαλυψει τησ δοξησ αυτου χαρητε αγαλλιωμενοι
౧౩క్రీస్తు మహిమ వెల్లడి అయ్యేటప్పుడు మీరు మహానందంతో సంతోషించేలా, క్రీస్తు పడిన హింసల్లో మీరు పాలివారైనట్టు ఆనందించండి.
14 ει ονειδιζεσθε εν ονοματι χριστου μακαριοι οτι το τησ δοξησ και το του θεου πνευμα εφ υμασ αναπαυεται κατα μεν αυτουσ βλασφημειται κατα δε υμασ δοξαζεται
౧౪క్రీస్తు నామాన్ని బట్టి మిమ్మల్ని ఎవరైనా అవమానిస్తే మీరు ధన్యులు. ఎందుకంటే మహిమా స్వరూపి అయిన ఆత్మ, అంటే దేవుని ఆత్మ మీమీద నిలిచి ఉన్నాడు.
15 μη γαρ τισ υμων πασχετω ωσ φονευσ η κλεπτησ η κακοποιοσ η ωσ αλλοτριοεπισκοποσ
౧౫మీలో ఎవడూ హంతకుడుగా, దొంగగా, దుర్మార్గుడుగా, పరుల జోలికి పోయేవాడుగా బాధ అనుభవించకూడదు.
16 ει δε ωσ χριστιανοσ μη αισχυνεσθω δοξαζετω δε τον θεον εν τω μερει τουτω
౧౬ఎవరైనా క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించవలసి వస్తే సిగ్గు పడకూడదు. ఆ పేరును బట్టి అతడు దేవుణ్ణి మహిమ పరచాలి.
17 οτι ο καιροσ του αρξασθαι το κριμα απο του οικου του θεου ει δε πρωτον αφ ημων τι το τελοσ των απειθουντων τω του θεου ευαγγελιω
౧౭దేవుని ఇంటి వారికి తీర్పు మొదలయ్యే సమయం వచ్చింది. అది మనతోనే మొదలయితే, దేవుని సువార్తకు లోబడని వారి గతేంటి?
18 και ει ο δικαιοσ μολισ σωζεται ο ασεβησ και αμαρτωλοσ που φανειται
౧౮నీతిమంతుడే రక్షణ పొందడం కష్టమైతే ఇక భక్తిహీనుడు, పాపి సంగతి ఏమిటి?
19 ωστε και οι πασχοντεσ κατα το θελημα του θεου ωσ πιστω κτιστη παρατιθεσθωσαν τασ ψυχασ αυτων εν αγαθοποιια
౧౯కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడే వారు మేలు చేస్తూ నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకోవాలి.

< Πετρου Α΄ 4 >