< Προς Κορινθιους Α΄ 4 >
1 ουτωσ ημασ λογιζεσθω ανθρωποσ ωσ υπηρετασ χριστου και οικονομουσ μυστηριων θεου
౧కాబట్టి ప్రతి ఒక్కరూ మమ్మల్ని క్రీస్తు సేవకులమనీ, దేవుని మర్మాల విషయంలో నిర్వాహకులమనీ పరిగణించాలి.
2 ο δε λοιπον ζητειται εν τοισ οικονομοισ ινα πιστοσ τισ ευρεθη
౨నిర్వాహకుల్లో ప్రతి ఒక్కడూ నమ్మకంగా ఉండడం చాలా అవసరం.
3 εμοι δε εισ ελαχιστον εστιν ινα υφ υμων ανακριθω η υπο ανθρωπινησ ημερασ αλλ ουδε εμαυτον ανακρινω
౩మీరు గానీ, ఇతరులు గానీ నాకు తీర్పు తీర్చడమనేది నాకు చాలా చిన్న విషయం. నన్ను నేనే తీర్పు తీర్చుకోను.
4 ουδεν γαρ εμαυτω συνοιδα αλλ ουκ εν τουτω δεδικαιωμαι ο δε ανακρινων με κυριοσ εστιν
౪నాలో నాకు ఏ దోషమూ కనిపించదు. అంత మాత్రం చేత నేను నీతిమంతుడిని అని కాదు. అయితే, ప్రభువే నాకు తీర్పు తీర్చేవాడు.
5 ωστε μη προ καιρου τι κρινετε εωσ αν ελθη ο κυριοσ οσ και φωτισει τα κρυπτα του σκοτουσ και φανερωσει τασ βουλασ των καρδιων και τοτε ο επαινοσ γενησεται εκαστω απο του θεου
౫కాబట్టి ఆ కాలం రాకముందే, అంటే ప్రభువు వచ్చేంత వరకూ, దేనిని గూర్చీ తీర్పు తీర్చవద్దు. ఆయన చీకటిలో ఉన్న రహస్యాలను వెలుగులోకి తెచ్చి మనుషుల అంతరంగంలో ఉన్న ఉద్దేశ్యాలను బట్టబయలు చేస్తాడు. అప్పుడు ప్రతి ఒక్కరికీ తగిన ప్రశంస దేవుని నుండి కలుగుతుంది.
6 ταυτα δε αδελφοι μετεσχηματισα εισ εμαυτον και απολλω δι υμασ ινα εν ημιν μαθητε το μη υπερ ο γεγραπται φρονειν ινα μη εισ υπερ του ενοσ φυσιουσθε κατα του ετερου
౬సోదరీ సోదరులారా, “రాసి ఉన్నవాటిని మించి వెళ్లవద్దు” అనే మాట అర్థం మీరు గ్రహించాలని ఈ మాటలు మీ మేలు కోసం నాకూ అపొల్లోకూ ఆపాదించుకుని ఉదాహరణగా చెప్పాను. మీరు ఒకరి మీద ఒకరు విర్రవీగ కూడదని ఈ విధంగా వివరించాను.
7 τισ γαρ σε διακρινει τι δε εχεισ ο ουκ ελαβεσ ει δε και ελαβεσ τι καυχασαι ωσ μη λαβων
౭ఎందుకంటే నీకొక్కడికే ఉన్న గొప్పతనం ఏమిటి? నీకు ఉన్నదానిలో నువ్వు ఉచితంగా పొందనిది ఏమిటి? ఇతరుల నుండి పొంది కూడా అది నీ సొంతమే అన్నట్టు గొప్పలు చెప్పుకోవడమెందుకు?
8 ηδη κεκορεσμενοι εστε ηδη επλουτησατε χωρισ ημων εβασιλευσατε και οφελον γε εβασιλευσατε ινα και ημεισ υμιν συμβασιλευσωμεν
౮ఇప్పటికే మీకు అవసరమైనవన్నీ మీరు సంపాదించుకున్నారంటనే! ఇప్పటికే ధనవంతులయ్యారంటనే! మా ప్రమేయం లేకుండానే మీరు రాజులైపోయారంటనే! అయినా, మీరు రాజులు కావడం మంచిదేగా, మేము కూడా మీతో కలిసి ఏలవచ్చు!
9 δοκω γαρ οτι ο θεοσ ημασ τουσ αποστολουσ εσχατουσ απεδειξεν ωσ επιθανατιουσ οτι θεατρον εγενηθημεν τω κοσμω και αγγελοισ και ανθρωποισ
౯దేవుడు క్రీస్తు అపొస్తలులమైన మమ్మల్ని ఊరేగింపులో చివరి వరసలో ఉంచి మరణశిక్ష పొందిన వారిలా ఉంచాడని నాకనిపిస్తున్నది. మేము లోకమంతటికీ, అంటే దేవదూతలకూ మనుషులకూ ఒక వింత ప్రదర్శనలాగా ఉన్నాం.
10 ημεισ μωροι δια χριστον υμεισ δε φρονιμοι εν χριστω ημεισ ασθενεισ υμεισ δε ισχυροι υμεισ ενδοξοι ημεισ δε ατιμοι
౧౦క్రీస్తు కోసం మేము బుద్ధిహీనులం, మీరు తెలివైనవారు! మేము బలం లేని వాళ్ళం, మీరు బలమైనవారు, ఘనత పొందినవారు! మేమైతే అవమానం పాలైన వాళ్ళం.
11 αχρι τησ αρτι ωρασ και πεινωμεν και διψωμεν και γυμνητευομεν και κολαφιζομεθα και αστατουμεν
౧౧ఈ గంట వరకూ మేము ఆకలిదప్పులతో అలమటిస్తున్నాం, సరైన బట్టలు లేవు. క్రూరంగా దెబ్బలు తింటున్నాం, నిలువ నీడ లేని వాళ్ళం.
12 και κοπιωμεν εργαζομενοι ταισ ιδιαισ χερσιν λοιδορουμενοι ευλογουμεν διωκομενοι ανεχομεθα
౧౨మా చేతులతో కష్టపడి పని చేసుకుంటున్నాం. ప్రజలు మమ్మల్ని నిందించినా ప్రతిగా దీవిస్తున్నాం. ఎన్ని బాధలు పెట్టినా ఓర్చుకుంటున్నాం.
13 βλασφημουμενοι παρακαλουμεν ωσ περικαθαρματα του κοσμου εγενηθημεν παντων περιψημα εωσ αρτι
౧౩మమ్మల్ని తిట్టిన వారితో దయగానే మాట్లాడుతున్నాం. ఇప్పటికీ మమ్మల్ని అందరూ ఈ లోకంలోని మురికిగా, పారేసిన కసువులాగా ఎంచుతున్నారు.
14 ουκ εντρεπων υμασ γραφω ταυτα αλλ ωσ τεκνα μου αγαπητα νουθετω
౧౪నేను ఈ మాటలు రాస్తున్నది మీరు నా ప్రియమైన పిల్లలని మీకు బుద్ధి చెప్పడానికే గానీ మిమ్మల్ని సిగ్గు పరచాలని కాదు.
15 εαν γαρ μυριουσ παιδαγωγουσ εχητε εν χριστω αλλ ου πολλουσ πατερασ εν γαρ χριστω ιησου δια του ευαγγελιου εγω υμασ εγεννησα
౧౫ఎందుకంటే క్రీస్తులో మీకు సంరక్షకులు పదివేల మంది ఉన్నా, అనేకమంది తండ్రులు లేరు. క్రీస్తు యేసులో సువార్త ద్వారా నేను మిమ్మల్ని కన్నాను.
16 παρακαλω ουν υμασ μιμηται μου γινεσθε
౧౬కాబట్టి నన్ను పోలి నడుచుకోమని మిమ్మల్ని వేడుకుంటున్నాను.
17 δια τουτο επεμψα υμιν τιμοθεον οσ εστιν τεκνον μου αγαπητον και πιστον εν κυριω οσ υμασ αναμνησει τασ οδουσ μου τασ εν χριστω καθωσ πανταχου εν παση εκκλησια διδασκω
౧౭అందుకే ప్రభువులో నాకు ప్రియమైన, నమ్మకమైన నా కుమారుడు తిమోతిని మీ దగ్గరికి పంపాను. అతడు నేను ఏ విధంగా ప్రతి స్థలంలో, ప్రతి సంఘంలో ఏమి బోధిస్తున్నానో, వాటిని క్రీస్తులో ఏ విధంగా అనుసరిస్తున్నానో, మీకు జ్ఞాపకం చేస్తాడు.
18 ωσ μη ερχομενου δε μου προσ υμασ εφυσιωθησαν τινεσ
౧౮నేను మీ దగ్గరికి రాననుకుని కొందరు మిడిసిపడుతున్నారు.
19 ελευσομαι δε ταχεωσ προσ υμασ εαν ο κυριοσ θεληση και γνωσομαι ου τον λογον των πεφυσιωμενων αλλα την δυναμιν
౧౯ప్రభువు చిత్తమైతే త్వరలోనే మీ దగ్గరికి వచ్చి, అలా మిడిసి పడేవారి మాటలు కాదు, వారి బలమేమిటో తెలుసుకుంటాను.
20 ου γαρ εν λογω η βασιλεια του θεου αλλ εν δυναμει
౨౦దేవుని రాజ్యం అంటే ఒట్టి మాటలు కాదు, అది బలప్రభావాలతో కూడినది.
21 τι θελετε εν ραβδω ελθω προσ υμασ η εν αγαπη πνευματι τε πραοτητοσ
౨౧మీకేం కావాలి? మీ దగ్గరికి నేను బెత్తంతో రావాలా, ప్రేమతో, మృదువైన మనసుతో రావాలా?