< Προς Κορινθιους Α΄ 16 >

1 περι δε τησ λογιασ τησ εισ τουσ αγιουσ ωσπερ διεταξα ταισ εκκλησιαισ τησ γαλατιασ ουτωσ και υμεισ ποιησατε
పరిశుద్ధుల కోసం చందా విషయంలో నేను గలతీయ సంఘాలకు నియమించిన ప్రకారమే మీరు కూడా చేయండి.
2 κατα μιαν σαββατων εκαστοσ υμων παρ εαυτω τιθετω θησαυριζων ο τι αν ευοδωται ινα μη οταν ελθω τοτε λογιαι γινωνται
నేను వచ్చినప్పుడే చందా పోగు చేయడం కాకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి ఒక్కడూ తాను అభివృద్ధి చెందిన కొద్దీ తన దగ్గర కొంత డబ్బు తీసి దాచి పెట్టాలి.
3 οταν δε παραγενωμαι ουσ εαν δοκιμασητε δι επιστολων τουτουσ πεμψω απενεγκειν την χαριν υμων εισ ιερουσαλημ
నేను వచ్చినప్పుడు ఎవరిని ఈ పనికి మీరు నిర్ణయిస్తారో వారికి ఉత్తరాలిచ్చి, వారిచేత మీ చందాను యెరూషలేముకు పంపిస్తాను.
4 εαν δε η αξιον του καμε πορευεσθαι συν εμοι πορευσονται
నేను కూడా వెళ్ళడం మంచిదైతే వారు నాతో వస్తారు.
5 ελευσομαι δε προσ υμασ οταν μακεδονιαν διελθω μακεδονιαν γαρ διερχομαι
నేను మాసిదోనియ మీదుగా వెళ్తున్నాను. కాబట్టి ఆ సమయంలో మీ దగ్గరికి వస్తాను.
6 προσ υμασ δε τυχον παραμενω η και παραχειμασω ινα υμεισ με προπεμψητε ου εαν πορευωμαι
అప్పుడు మీ దగ్గర కొంతకాలం ఆగవచ్చు, ఒక వేళ శీతకాలమంతా గడుపుతానేమో. ఆ తర్వాత నా ముందు ప్రయాణం ఎక్కడికైతే అక్కడికి వెళ్ళటానికి మీరు సహాయపడవచ్చు.
7 ου θελω γαρ υμασ αρτι εν παροδω ιδειν ελπιζω δε χρονον τινα επιμειναι προσ υμασ εαν ο κυριοσ επιτρεπη
ప్రభువు అనుమతిస్తే మీ దగ్గర కొంతకాలం ఉండాలని ఎదురు చూస్తున్నాను. కాబట్టి ఇప్పుడు మార్గమధ్యంలో మిమ్మల్ని దర్శించడం నాకిష్టం లేదు.
8 επιμενω δε εν εφεσω εωσ τησ πεντηκοστησ
కానీ పెంతెకొస్తు వరకూ ఎఫెసులో ఉంటాను.
9 θυρα γαρ μοι ανεωγεν μεγαλη και ενεργησ και αντικειμενοι πολλοι
ఎందుకంటే ఒక విశాలమైన ద్వారం నా ఎదుట తెరిచి ఉంది. ఎదిరించే వారు కూడా అనేకమంది ఉన్నారు.
10 εαν δε ελθη τιμοθεοσ βλεπετε ινα αφοβωσ γενηται προσ υμασ το γαρ εργον κυριου εργαζεται ωσ και εγω
౧౦తిమోతి వచ్చినప్పుడు అతడు మీ దగ్గర నిశ్చింతగా నివసించేలా చూసుకోండి. నాలాగా అతడు కూడా ప్రభువు పని చేస్తున్నాడు.
11 μη τισ ουν αυτον εξουθενηση προπεμψατε δε αυτον εν ειρηνη ινα ελθη προσ με εκδεχομαι γαρ αυτον μετα των αδελφων
౧౧కాబట్టి ఎవరూ అతన్ని చిన్న చూపు చూడవద్దు. నా దగ్గరికి అతనిని శాంతితో సాగనంపండి. అతడు సోదరులతో కలిసి వస్తాడని ఎదురు చూస్తున్నాను.
12 περι δε απολλω του αδελφου πολλα παρεκαλεσα αυτον ινα ελθη προσ υμασ μετα των αδελφων και παντωσ ουκ ην θελημα ινα νυν ελθη ελευσεται δε οταν ευκαιρηση
౧౨సోదరుడైన అపొల్లో విషయమేమంటే, అతనిని ఈ సోదరులతో కలిసి మీ దగ్గరికి వెళ్ళమని నేను చాలా బతిమాలాను గాని ఇప్పుడు రావడానికి అతనికి ఎంతమాత్రం ఇష్టం లేదు. అతనికి వీలైనప్పుడు వస్తాడు.
13 γρηγορειτε στηκετε εν τη πιστει ανδριζεσθε κραταιουσθε
౧౩మెలకువగా ఉండండి, విశ్వాసంలో నిలకడగా ఉండండి, ధైర్యం గలిగి, బలవంతులై ఉండండి.
14 παντα υμων εν αγαπη γινεσθω
౧౪మీరు చేసే పనులన్నీ ప్రేమతో చేయండి.
15 παρακαλω δε υμασ αδελφοι οιδατε την οικιαν στεφανα οτι εστιν απαρχη τησ αχαιασ και εισ διακονιαν τοισ αγιοισ εταξαν εαυτουσ
౧౫స్తెఫను ఇంటివారు అకయ ప్రాంతానికి ప్రథమ ఫలమనీ, వారు పరిశుద్ధులకు సేవ చేయడానికి తమను అంకితం చేసుకున్నారనీ మీకు తెలుసు.
16 ινα και υμεισ υποτασσησθε τοισ τοιουτοισ και παντι τω συνεργουντι και κοπιωντι
౧౬కాబట్టి సోదరులారా, అలాటి వారికి, పనిలో సహాయం చేసే వారికి, కష్టపడే వారికందరికీ లోబడి ఉండమని మిమ్మల్ని బతిమాలుతూ ఉన్నాను.
17 χαιρω δε επι τη παρουσια στεφανα και φουρτουνατου και αχαικου οτι το υμων υστερημα ουτοι ανεπληρωσαν
౧౭స్తెఫను, ఫొర్మూనాతు, అకాయికు అనే వారు రావడం సంతోషంగా ఉంది. మీరు లేని కొరత నాకు వీరి వల్ల తీరింది.
18 ανεπαυσαν γαρ το εμον πνευμα και το υμων επιγινωσκετε ουν τουσ τοιουτουσ
౧౮నా ఆత్మకు, మీ ఆత్మకు వీరు ఆదరణ కలిగించారు. అలాటి వారిని గుర్తించి గౌరవించండి.
19 ασπαζονται υμασ αι εκκλησιαι τησ ασιασ ασπαζονται υμασ εν κυριω πολλα ακυλασ και πρισκιλλα συν τη κατ οικον αυτων εκκλησια
౧౯ఆసియలోని సంఘాల వారు మీకు అభివందనాలు చెబుతున్నారు. అకుల, ప్రిస్కిల్ల, వారి ఇంట్లో ఉన్న సంఘమూ ప్రభువులో మీకు అనేక అభివందనాలు చెబుతున్నారు.
20 ασπαζονται υμασ οι αδελφοι παντεσ ασπασασθε αλληλουσ εν φιληματι αγιω
౨౦ఇక్కడి సోదరులంతా మీకు అభివందనాలు చెబుతున్నారు. పవిత్రమైన ముద్దుపెట్టుకుని, మీరు ఒకరికి ఒకరు అభివందనాలు చెప్పుకోండి.
21 ο ασπασμοσ τη εμη χειρι παυλου
౨౧పౌలు అనే నేను నా స్వహస్తంతో ఈ అభివందనం రాస్తున్నాను.
22 ει τισ ου φιλει τον κυριον ιησουν χριστον ητω αναθεμα μαραν αθα
౨౨ఎవరైనా ప్రభువును ప్రేమించకుండా ఉంటే వారికి శాపం కలుగు గాక. ప్రభువు వస్తున్నాడు.
23 η χαρισ του κυριου ιησου χριστου μεθ υμων
౨౩ప్రభు యేసు క్రీస్తు కృప మీకు తోడుగా ఉండుగాక.
24 η αγαπη μου μετα παντων υμων εν χριστω ιησου αμην
౨౪క్రీస్తు యేసులో ఉన్న నా ప్రేమ మీ అందరితో ఉంటుంది. ఆమేన్‌.

< Προς Κορινθιους Α΄ 16 >