< Ναούμ 2 >
1 ἀνέβη ἐμφυσῶν εἰς πρόσωπόν σου ἐξαιρούμενος ἐκ θλίψεως σκόπευσον ὁδόν κράτησον ὀσφύος ἄνδρισαι τῇ ἰσχύι σφόδρα
౧నీనెవే పట్టణమా, నాశనకారుడు నీ మీదికి వస్తున్నాడు. నీ కోటలకు, దారుల వెంబడి కాపలా ఉంచుకో. నడుం బిగించుకుని తీవ్రంగా ఎదిరించు.
2 διότι ἀπέστρεψεν κύριος τὴν ὕβριν Ιακωβ καθὼς ὕβριν τοῦ Ισραηλ διότι ἐκτινάσσοντες ἐξετίναξαν αὐτοὺς καὶ τὰ κλήματα αὐτῶν διέφθειραν
౨దోపిడీ దారులు యాకోబు సంతతి వారిని దోచుకున్నా వాళ్ళ ద్రాక్ష తోటలను నరికివేసినా ఇశ్రాయేలీయుల వైభవం వలే యెహోవా యాకోబు సంతతి వారికి పూర్వ వైభవం తిరిగి కల్పిస్తాడు.
3 ὅπλα δυναστείας αὐτῶν ἐξ ἀνθρώπων ἄνδρας δυνατοὺς ἐμπαίζοντας ἐν πυρί αἱ ἡνίαι τῶν ἁρμάτων αὐτῶν ἐν ἡμέρᾳ ἑτοιμασίας αὐτοῦ καὶ οἱ ἱππεῖς θορυβηθήσονται
౩ఆయన శూరుల డాళ్లు ఎర్రగా ఉన్నాయి. పరాక్రమశాలురు ఎర్రని వస్త్రాలు ధరించుకుని ఉన్నారు, వ్యూహాలు పన్నే రోజున ఆయన సైన్యం, రథాలు మెరుగు పెట్టిన ఉక్కులాగా మెరిసిపోతున్నాయి. సరళవృక్షం కలపతో చేసిన ఈటెలను వీరులు అటూ ఇటూ ఊపుతున్నారు.
4 ἐν ταῖς ὁδοῖς καὶ συγχυθήσονται τὰ ἅρματα καὶ συμπλακήσονται ἐν ταῖς πλατείαις ἡ ὅρασις αὐτῶν ὡς λαμπάδες πυρὸς καὶ ὡς ἀστραπαὶ διατρέχουσαι
౪వీధుల్లో రథాలు అతి వేగంగా పరుగులు పెడుతున్నాయి. రాజ వీధుల్లో రథాలు ఒక దానిపై ఒకటి పడేంత వేగంగా పరుగెత్తుతున్నాయి, అవి దివిటీల్లాగా కనిపిస్తున్నాయి. మెరుపుల్లాగా వేగంగా వెళ్తున్నాయి.
5 καὶ μνησθήσονται οἱ μεγιστᾶνες αὐτῶν καὶ φεύξονται ἡμέρας καὶ ἀσθενήσουσιν ἐν τῇ πορείᾳ αὐτῶν καὶ σπεύσουσιν ἐπὶ τὰ τείχη καὶ ἑτοιμάσουσιν τὰς προφυλακὰς αὐτῶν
౫మిమ్మల్ని ముక్కలుచెక్కలు చేసే వాడు తన పరాక్రమశాలురను పిలిపిస్తున్నాడు. వాళ్ళు రహదారుల్లో పరుగులు పెడుతూ తొట్రుపడతారు. ప్రాకారం దగ్గరికి పరుగెత్తి వచ్చి దాడి చేసే వారి భద్రత కోసం ఏర్పాట్లు చేస్తారు.
6 πύλαι τῶν ποταμῶν διηνοίχθησαν καὶ τὰ βασίλεια διέπεσεν
౬నదులకు ఎదురుగా ఉన్న ద్వారాలను తెరుస్తున్నారు. రాజ నగరు కూలిపోతున్నది.
7 καὶ ἡ ὑπόστασις ἀπεκαλύφθη καὶ αὕτη ἀνέβαινεν καὶ αἱ δοῦλαι αὐτῆς ἤγοντο καθὼς περιστεραὶ φθεγγόμεναι ἐν καρδίαις αὐτῶν
౭రాణిని నగ్నంగా చేసి ఈడ్చుకుపోతున్నారు. ఆమె దాసీలు గువ్వల్లాగా మూలుగుతున్నారు. రొమ్ము కొట్టుకుంటున్నారు.
8 καὶ Νινευη ὡς κολυμβήθρα ὕδατος τὰ ὕδατα αὐτῆς καὶ αὐτοὶ φεύγοντες οὐκ ἔστησαν καὶ οὐκ ἦν ὁ ἐπιβλέπων
౮నీనెవె పట్టణం నిర్మాణమైనప్పటి నుండి నీటికొలనులాగా ఉంది. ఆ పట్టణ ప్రజలు పారిపోతున్నారు. ఆగండి, ఆగండి అని పిలుస్తున్నా వెనక్కి తిరిగి చూసేవాడు ఒక్కడు కూడా లేడు.
9 διήρπαζον τὸ ἀργύριον διήρπαζον τὸ χρυσίον καὶ οὐκ ἦν πέρας τοῦ κόσμου αὐτῆς βεβάρυνται ὑπὲρ πάντα τὰ σκεύη τὰ ἐπιθυμητὰ αὐτῆς
౯అది లెక్కలేనన్ని వివిధ విచిత్ర ఆభరణాలతో నిండి ఉంది. వెండి కొల్లగొట్టండి, బంగారం కొల్లగొట్టండి.
10 ἐκτιναγμὸς καὶ ἀνατιναγμὸς καὶ ἐκβρασμὸς καὶ καρδίας θραυσμὸς καὶ ὑπόλυσις γονάτων καὶ ὠδῖνες ἐπὶ πᾶσαν ὀσφύν καὶ τὸ πρόσωπον πάντων ὡς πρόσκαυμα χύτρας
౧౦అది ఏమీ లేకుండా ఖాళీగా, పాడుబడిపోతుంది. ప్రజల గుండెలు నీరైపోతున్నాయి. వాళ్ళ మోకాళ్లు వణకుతున్నాయి, అందరిలో వేదన ఉంది. అందరి ముఖాలు తెల్లబోతున్నాయి.
11 ποῦ ἐστιν τὸ κατοικητήριον τῶν λεόντων καὶ ἡ νομὴ ἡ οὖσα τοῖς σκύμνοις οὗ ἐπορεύθη λέων τοῦ εἰσελθεῖν ἐκεῖ σκύμνος λέοντος καὶ οὐκ ἦν ὁ ἐκφοβῶν
౧౧సింహాల గుహ ఏమయింది? సింహపు పిల్లల మేత మేసే స్థలం ఏమయింది? ఎవరి భయం లేకుండా సింహం, ఆడ సింహం, సింహం పిల్లలు తిరిగిన స్థలం ఏమయింది?
12 λέων ἥρπασεν τὰ ἱκανὰ τοῖς σκύμνοις αὐτοῦ καὶ ἀπέπνιξεν τοῖς λέουσιν αὐτοῦ καὶ ἔπλησεν θήρας νοσσιὰν αὐτοῦ καὶ τὸ κατοικητήριον αὐτοῦ ἁρπαγῆς
౧౨తన పిల్లలకు కావలసినంత తిండి సమకూరుస్తూ, ఆడ సింహాలకు కావలసినంత ఎర కడుపారా నింపుతూ, తన గుహలను, నివాసాలను వేటాడి తెచ్చిన మాంసంతో నింపిన సింహం ఏమైయింది?
13 ἰδοὺ ἐγὼ ἐπὶ σέ λέγει κύριος παντοκράτωρ καὶ ἐκκαύσω ἐν καπνῷ πλῆθός σου καὶ τοὺς λέοντάς σου καταφάγεται ῥομφαία καὶ ἐξολεθρεύσω ἐκ τῆς γῆς τὴν θήραν σου καὶ οὐ μὴ ἀκουσθῇ οὐκέτι τὰ ἔργα σου
౧౩సేనల ప్రభువైన యెహోవా ఇలా చెప్పాడు, నేను నీకు విరోధిని. నీ రథాలను వాటి పొగ పైకి ఎగబ్రాకేలా కాల్చివేస్తాను. సింహం పిల్లలు నీ కత్తి వేటుకు గురౌతాయి. నీకు ఏమీ దొరకకుండా నీకు చెందినదంతా భూమిలో నుండి తీసివేస్తాను. నీ వార్తాహరుల స్వరం ఇకపై వినబడకుండా చేస్తాను.