< 1 Samũeli 30 >
1 Na rĩrĩ, Daudi na andũ ake maakinyire Zikilagi mũthenya wa gatatũ. Nao Amaleki magĩkorwo nĩ matharĩkĩire Negevu na Zikilagi. Nĩmahũrĩte Zikilagi na makarĩcina,
౧దావీదు, అతనితో ఉన్నవారు మూడవ రోజున సిక్లగు వచ్చారు. అంతలో అమాలేకీయులు దండెత్తి దక్షిణ దేశం మీదా సిక్లగు మీదా దాడిచేసి, దోచుకుని సిక్లగు ప్రజలను ఓడించి, ఊరు తగలబెట్టి,
2 na nĩmatahĩte andũ-a-nja arĩa othe maarĩ kuo, andũ ethĩ o na arĩa akũrũ. Matiigana kũũraga mũndũ o na ũmwe, no nĩmamakuuire magĩthiĩ nao.
౨పెద్దలనూ పిల్లలనూ అందులో ఉన్న స్త్రీలతో సహా చంపకుండా చెరబట్టి తీసుకుపోయారు.
3 Rĩrĩa Daudi na andũ ake mookire Zikilagi, maakorire rĩcinĩtwo na mwaki, na atumia ao na ariũ ao na airĩtu ao magatahwo.
౩దావీదు, అతని మనుషులు అ ఊరికి వచ్చి అది కాలిపోయి ఉండడం, తమ భార్యలూ, కొడుకులూ కూతుర్లూ చెరలోకి పోయి ఉండడం చూసి
4 Nĩ ũndũ ũcio Daudi na andũ ake makĩrĩra maanĩrĩire nginya makĩaga hinya wa kũrĩra rĩngĩ.
౪ఇక ఏడవడానికి ఓపిక లేనంత గట్టిగా ఏడ్చారు.
5 Atumia a Daudi eerĩ nĩmatahĩtwo, Ahinoamu wa Jezireeli, na Abigaili ũrĩa warĩ mũtumia wa ndigwa wa Nabali kuuma Karimeli.
౫యజ్రెయేలీయురాలు అహీనోయము, కర్మెలు వాడైన నాబాలు భార్యగా ఉన్న అబీగయీలు అనే దావీదు ఇద్దరు భార్యలు కూడా చెరలోకి పోవడం చూసి
6 Daudi akĩnyariirĩka mũno nĩ ũndũ andũ nĩmaciirĩire kũmũhũũra na mahiga; o mũndũ arĩ na marũrũ ngoro nĩ ũndũ wa aanake na airĩtu ake. No Daudi akĩgĩa na hinya thĩinĩ wa Jehova Ngai wake.
౬దావీదు చాలా దుఃఖపడ్డాడు. తమ తమ కొడుకులూ కూతుర్లను బట్టి వారందరికీ ప్రాణం విసికి పోయి దావీదును రాళ్లు రువ్వి చంపాలని చెప్పుకున్నారు. దావీదు తన దేవుడు, యెహోవాను బట్టి ధైర్యం తెచ్చుకున్నాడు.
7 Daudi agĩcooka akĩĩra Abiatharu, mũthĩnjĩri-Ngai, mũrũ wa Ahimeleku atĩrĩ, “Ndeehera ebodi.” Nake Abiatharu akĩmũrehera ebodi,
౭అప్పుడు దావీదు ఏఫోదు తెమ్మని యాజకుడైన అహీమెలెకు కుమారుడు అబ్యాతారుతో చెప్పాడు. అబ్యాతారు ఏఫోదును దావీదు దగ్గరికి తీసుకు వచ్చాడు.
8 nake Daudi agĩtuĩria ũhoro kũrĩ Jehova, akĩũria atĩrĩ, “Nyingatithie mbũtũ ĩyo ĩtũtharĩkĩire? Nĩngũmĩkinyĩra?” Akĩmũcookeria atĩrĩ, “Mĩrũmĩrĩre, hatarĩ nganja nĩũkũmĩkinyĩra na nĩũkũhota gũcookia kĩrĩa gĩtahe.”
౮“నేను ఈ సేనను తరిమితే దాని కలుసుకోగలుగుతానా?” అని యెహోవా దగ్గర దావీదు విచారణ చేశాడు. అందుకు యెహోవా “తరుము, తప్పకుండా నీవు వాళ్ళని కలుసుకుని నీవారినందరినీ విడిపించుకుంటావు” అని చెప్పాడు.
9 Daudi na andũ magana matandatũ arĩa maarĩ hamwe nake magĩkinya Mũkuru wa Besori, harĩa amwe ao maatigirwo thuutha,
౯కాబట్టి దావీదు, అతనితో ఉన్న 600 మంది బయలుదేరి, బెసోరు వాగు గట్టుకు వస్తే వారిలో 200 మంది ఆగిపోయారు.
10 nĩgũkorwo andũ ta magana meerĩ maarĩ anogu mũno, makĩremwo nĩ kũringa mũkuru ũcio. No Daudi na andũ magana mana magĩthiĩ na mbere kũmarũmĩrĩra.
౧౦దావీదు, ఇంకా 400 మంది తరుముతూ పోయారు గానీ ఆ 200 మంది అలిసి పోయి బెసోరు వాగు దాటలేక ఆగిపోయారు. ఆ 400 మంది పోతుంటే
11 Nao magĩkorerera Mũmisiri werũ-inĩ, makĩmũtwara kũrĩ Daudi. Makĩmũhe maaĩ ma kũnyua na irio cia kũrĩa,
౧౧ఒక పొలంలో ఒక ఐగుప్తీయుడు తారసపడ్డాడు. వారు దావీదు దగ్గరికి అతణ్ణి తీసుకు వచ్చి భోజనం పెడితే, తిన్నాడు. దాహానికి నీరిస్తే, తాగాడు.
12 na kĩenyũ kĩa ngũyũ hihe na imanjĩka igĩrĩ cia thabibũ nyũmithie. Akĩrĩa agĩcookwo nĩ hinya, nĩ ũndũ ndaarĩte irio kana akanyua maaĩ handũ ha mĩthenya ĩtatũ, ũtukũ na mũthenya.
౧౨వారు అతనికి అంజూరపు ముద్ద తుంచి ఇచ్చారు. రెండు ఎండు ద్రాక్ష ముద్దలు అతనికిచ్చారు. అతడు మూడు రోజులనుండి పస్తులున్నాడు. భోజనం చేసిన తరువాత అతడి ప్రాణం తెప్పరిల్లింది.
13 Daudi akĩmũũria atĩrĩ, “We ũrĩ wa ũ na uumĩte kũ?” Agĩcookia atĩrĩ, “Ndĩ Mũmisiri, ngombo ya mũndũ Mũamaleki. Mwathi wakwa aandiganĩirie ndarũara, mĩthenya ĩtatũ ĩthirĩte.
౧౩అప్పుడు దావీదు “నీవు ఏ దేశం వాడివి? ఎక్కడనుండి వచ్చావు?” అని అడిగాడు. అందుకు వాడు “నేను ఐగుప్తు వాణ్ణి. ఒక అమాలేకీయుడికి బానిసనయ్యాను. మూడు రోజుల క్రితం నాకు జబ్బు చేసింది. నా యజమాని నన్ను వదిలి వెళ్ళిపోయాడు.
14 Nĩtwatharĩkĩire Negevu ya Akerethi, na rũgongo rwa bũrũri wa Juda, na Negevu ya Kalebu, na tũgĩcina Zikilagi.”
౧౪మేము దండెత్తి కెరేతీ జాతి వారుండే దక్షిణ దేశానికి, యూదా దేశానికి, కాలేబు దక్షిణ దేశానికి వచ్చి వాటిని దోచుకుని సిక్లగును కాల్చివేశాం” అని చెప్పాడు.
15 Daudi akĩmũũria atĩrĩ, “Wahota kũndongoria ũnjikũrũkie kũrĩ mbũtũ ĩyo ĩraatharĩkĩire?” Mũndũ ũcio agĩcookia atĩrĩ, “Wĩhĩte na mwĩhĩtwa mbere ya Ngai atĩ ndũkũnjũraga, kana ũneane kũrĩ mwathi wakwa, na nĩngũgũtwara, tũikũrũke tũthiĩ kũrĩa marĩ.”
౧౫“ఆ దోపిడీ గుంపును కలుసుకొనేందుకు నీవు నాకు దారి చూపుతావా” అని దావీదు అడిగితే అతడు “నేను నిన్ను చంపననీ నీ యజమాని వశం చేయననీ దేవుని పేరున నాకు మాట ఇస్తే ఆ గుంపును కలుసుకోవడానికి నీకు దారి చూపుతాను” అన్నాడు.
16 Agĩtongoria Daudi, magĩikũrũka, nao makĩmakora kũu, maharaganĩte bũrũri-inĩ ũcio, makĩrĩa na makĩnyua, magĩĩkenagia nĩ ũndũ wa ũrĩa maatahĩte indo nyingĩ kuuma bũrũri wa Afilisti, na kuuma Juda.
౧౬తరువాత వాడు వారి దగ్గరికి దావీదును తోడుకుని పోయాడు. ఆ దోపిడీ వారు ఫిలిష్తీయుల దేశంలోనుండి, యూదా దేశం లోనుండి తాము దోచి తెచ్చుకొన్న కొల్ల సొమ్ముతో, ఆ ప్రదేశమంతా చెల్లాచెదరుగా తింటూ, తాగుతూ ఆటపాటల్లో ఉన్నారు.
17 Daudi akĩmahũũra kuuma hwaĩ-inĩ kũrĩ mairia nginya hwaĩ-inĩ wa mũthenya ũyũ ũngĩ, na gũtirĩ mũndũ o na ũmwe worire, tiga o aanake magana mana arĩa maahaicire ngamĩĩra ciao makĩũra.
౧౭దావీదు అదను కనిపెట్టి సంధ్యవేళ మొదలు మరునాటి సాయంత్రం వరకూ వారిని చంపుతూ ఉంటే ఒంటెల మీద ఎక్కి పారిపోయిన 400 మంది యువకులు తప్ప ఒక్కడు కూడా తప్పించుకొన్నవాడు లేకపోయాడు.
18 Daudi agĩcookia indo ciothe iria Aamaleki maakuuĩte, o hamwe na atumia ake eerĩ.
౧౮ఇలా దావీదు అమాలేకీయులు దోచుకు పోయిన దానంతటినీ తిరిగి తెచ్చుకున్నాడు. అంతేకాదు, అతడు తన ఇద్దరు భార్యలను కూడా రక్షించుకున్నాడు.
19 Gũtirĩ kĩndũ o na kĩmwe kĩagire: mũndũ mwĩthĩ kana mũkũrũ, kamwana kana kairĩtu, indo iria ciothe ciatahĩtwo kana kĩndũ o gĩothe kĩrĩa maakuuĩte. Daudi agĩcookithia indo ciothe.
౧౯కొడుకులూ కూతుర్లూ దోపుడు సొమ్ము, ఇలా వారు ఎత్తుకుపోయిన దానంతటిలో ఏదీ తక్కువ కాకుండా మొత్తం దావీదు దక్కించుకున్నాడు.
20 Nake akĩoya ndũũru ciothe cia mbũri na ngʼombe, nao andũ ake magĩcitwara mbere ya mahiũ marĩa mangĩ, makiugaga atĩrĩ, “Ici nĩ indo iria Daudi aatahĩte.”
౨౦దావీదు ఇంకా అమాలేకీయుల గొర్రెలన్నిటినీ గొడ్లన్నిటినీ చేజిక్కించుకున్నాడు. ఇవి దావీదుకు దోపుడు సొమ్ము అని భావించి తక్కిన వారు మిగిలిన తమ సొంత పశువులకు ముందుగా వీటిని తోలారు.
21 Ningĩ Daudi agĩkinya harĩ andũ arĩa magana meerĩ arĩa maanogete mũno makaremwo nĩ kũmũrũmĩrĩra na magatigwo thuutha hau mũkuru-inĩ wa Besori. Magĩũka gũthagaana Daudi na andũ arĩa maarĩ nake. Rĩrĩa Daudi na andũ ake maakuhĩrĩirie, akĩmageithia.
౨౧అలిసి పోయి దావీదుతో కలిసి రాలేక బెసోరు వాగు దగ్గర నిలిచిపోయిన ఆ 200 మంది దగ్గరకి దావీదు తిరిగి వెళ్ళాడు. వారు దావీదును అతనితో ఉన్నవారిని ఎదుర్కొనడానికి బయలుదేరి వచ్చారు. దావీదు వారి దగ్గరకి వచ్చి వారి యోగక్షేమాలు అడిగాడు.
22 No andũ arĩa othe aaganu na arĩa a haaro thĩinĩ wa arũmĩrĩri a Daudi makiuga atĩrĩ, “Tondũ matiathiire hamwe na ithuĩ-rĩ, tũtikũgayana nao indo cia gũtahwo iria tũcookithĩtie. No rĩrĩ, o mũndũ no oe mũtumia wake na ciana athiĩ.”
౨౨దావీదుతో కూడా వెళ్లిన వారిలో దుష్టులు, పనికిమాలిన వారు కొంతమంది “వీళ్ళు మనతో కూడా రాలేదు గనక వారి భార్యలనూ పిల్లలనూ తప్ప మనకు దక్కిన దోపుడు సొమ్ములో ఏమీ వీరికి ఇవ్వనక్కర లేదు. తమ భార్య పిల్లలను మాత్రం వారు తీసికోవచ్చు” అన్నారు.
23 Daudi agĩcookia atĩrĩ, “Aca, ariũ a baba, mũtingĩĩka ũguo na indo iria Jehova atũheete. Nĩatũgitĩire na akaneana mbũtũ iria ciatũũkĩrĩire moko-inĩ maitũ.
౨౩అందుకు దావీదు వారితో “నా సోదరులారా, యెహోవా మనలను కాపాడి మనమీదికి వచ్చిన ఈ దండును మన వశం చేసి, మనకు దయచేసిన కొల్ల సొమ్ము విషయంలో మీరు ఇలా చేయడం తగదు.
24 Nũũ ũngĩthikĩrĩria ũguo mũroiga? Igai rĩa mũndũ ũrĩa watigirwo akĩrora indo rĩkũiganana na rĩa ũrĩa waikũrũkire agĩthiĩ mbaara-inĩ. Othe mekũgayana o ũndũ ũmwe.”
౨౪మీరంటున్నది ఎవరు ఒప్పుకుంటారు? యుద్దానికి పోయినవాడికీ సామాను దగ్గర కావలి ఉన్న వాడికి ఒకటే భాగం కదా. అందరూ సమానంగానే పాలు పంచుకుంటారు గదా”
25 Daudi agĩtua ũndũ ũcio ũtuĩke kĩrĩra na watho wa kũrũmagĩrĩrwo kũu Isiraeli kuuma mũthenya ũcio nginya ũmũthĩ.
౨౫ఆ విధంగా అప్పటి నుండి ఇప్పటి వరకూ దావీదు ఇశ్రాయేలీయుల్లో అలాటి పంపకం కట్టడగా న్యాయవిధిగా ఏర్పరచి నియమించాడు.
26 Rĩrĩa Daudi aakinyire Zikilagi, agĩtũmĩra athuuri a Juda arĩa maarĩ arata ake indo imwe cia iria ciatahĩtwo, akĩmeera atĩrĩ, “Gĩkĩ nĩ kĩheo kĩanyu harĩ indo iria itahĩtwo kuuma kũrĩ thũ cia Jehova.”
౨౬దావీదు సిక్లగుకు చేరుకుని దోపుడు సొమ్ములో కొంత తన స్నేహితులైన యూదా పెద్దలకు పంపించాడు. యెహోవా శత్రువులనుండి నేను దోచుకొన్న సొమ్ములో కొంత కానుకగా మీకు ఇస్తున్నానని చెప్పి వారికి పంపించాడు.
27 Agĩcitũmĩra arĩa maarĩ Betheli, na Ramothu-Negevu, na Jatiri;
౨౭బేతేలులో, దక్షిణ రామోతులో, యత్తీరులో,
28 na arĩa maarĩ Aroeri, na Sifimothu, na Eshitemoa,
౨౮అరోయేరులో, షిప్మోతులో, ఎష్టేమోలో,
29 na Rakali; na arĩa maarĩ matũũra ma Ajerameeli, na Akeni;
౨౯రాకాలులో, యెరహ్మెయేలీయుల గ్రామాల్లో, కేనీయుల గ్రామాల్లో,
30 o na arĩa maarĩ Horoma, na Bori-Ashani, na Athaki,
౩౦హోర్మాలో బోరాషానులో, అతాకులో
31 na Hebironi; na arĩa maarĩ kũndũ guothe kũrĩa Daudi na andũ ake moorũũrĩte.
౩౧హెబ్రోనులో దావీదూ అతని మనుషులూ తిరుగాడిన స్థలాలన్నిటిలో ఉన్న పెద్దలకు దావీదు ఇలా పంపించాడు.