< 1 Akorinitho 10 >
1 Na rĩrĩ, ariũ na aarĩ a Ithe witũ, ndikwenda mũkorwo mũtooĩ ũndũ ũyũ, atĩ maithe maitũ ma tene othe maatongoragio nĩ itu, na atĩ othe nĩmaringire iria.
౧సొదరీ సోదరులారా, మన పితరులు మేఘం కిందుగా ప్రయాణాలు చేశారు. వారంతా సముద్రంలో గుండా నడిచి వెళ్ళారు.
2 Othe nĩmabatithirio matuĩke andũ a Musa marĩ rungu rwa itu rĩu, o na marĩ iria-inĩ rĩu.
౨అందరూ మోషేను వెంబడించి అతనిని బట్టి మేఘంలో, సముద్రంలో, బాప్తిసం పొందారు.
3 Na othe maarĩĩaga irio o imwe cia kĩĩroho,
౩వారంతా ఆధ్యాత్మికమైన ఒకే ఆహారం తిన్నారు.
4 na maanyuuaga maaĩ o mamwe ma kĩĩroho; nĩgũkorwo maanyuire kuuma rwaro-inĩ rwa ihiga rwa kĩĩroho rũrĩa rwatwaranaga nao, naruo rwaro rũu rwarĩ Kristũ.
౪ఆధ్యాత్మికమైన ఒకే పానీయాన్ని తాగారు. ఎలాగంటే వారు తమ వెంటే వచ్చిన ఆత్మసంబంధమైన బండలో నుండి ప్రవహించిన నీటిని తాగారు. ఆ బండ క్రీస్తే.
5 O na kũrĩ ũguo-rĩ, aingĩ ao matiigana gũkenia Ngai; nacio ciimba ciao ikĩhurunjwo werũ-inĩ.
౫అయితే వారిలో అత్యధికులు తమ జీవితాల్లో దేవుణ్ణి సంతోషపెట్టలేదు. కాబట్టి వారి శవాలు అరణ్యంలోనే రాలిపోయేలా వారంతా చనిపోయారు.
6 Na rĩrĩ, maũndũ macio meekĩkire marĩ ta cionereria, nĩgeetha ngoro ciitũ itikerirĩrie gwĩka maũndũ mooru ta macio meekire.
౬వారు చేసినట్టుగా మనం కూడా చెడ్డ సంగతులను ఆశించకుండా ఉండాలని ఈ సంగతులు ఉదాహరణలుగా మన కోసం రాసి ఉన్నాయి.
7 Mũtigatuĩke ahooi mĩhianano, ta ũrĩa amwe ao maatariĩ; o ta ũrĩa kwandĩkĩtwo atĩrĩ: “Andũ acio magĩikara thĩ kũrĩa na kũnyua, magĩcooka magĩũkĩra kũina na gwĩkenia.”
౭“ప్రజలు తినడానికీ తాగడానికీ కూర్చున్నారు, కామసంబంధమైన నాట్యాలకు లేచారు” అని రాసి ఉన్నట్టు వారిలాగా మీరు విగ్రహారాధకులు కావద్దు.
8 Ningĩ tũtikahũũre ũmaraya, ta ũrĩa amwe ao meekire, nao magĩkua andũ ngiri mĩrongo ĩĩrĩ na ithatũ mũthenya ũmwe.
౮వారిలాగా లైంగిక దుర్నీతిలో మునిగిపోవద్దు. వారిలో కొందరు వ్యభిచారం జరిగించి ఒక్క రోజునే ఇరవై మూడు వేలమంది చనిపోయారు.
9 O na ningĩ tũtikanagerie Mwathani, ta ũrĩa amwe ao meekire, nao makĩniinwo nĩ nyoka.
౯వారిలో చాలామంది ప్రభువును వ్యతిరేకించి పాము కాటుకు లోనై చనిపోయినట్టు మనమూ చేసి ప్రభువును పరీక్షించవద్దు.
10 Na mũtikae gũteta, ta ũrĩa amwe ao meekire, nao makĩũragwo nĩ mũraika ũrĩa mũniinani.
౧౦అలాగే మీరు సణుక్కోవద్దు. వారిలో చాలామంది దేవునిపై సణిగి సంహార దూత చేతిలో నాశనమయ్యారు.
11 Maũndũ macio meekĩkire kũrĩ o marĩ cionereria, na makĩandĩkwo marĩ ma gũtũkaania, ithuĩ tũkinyĩrĩirwo nĩ kũhingio kwa mahinda. (aiōn )
౧౧నాశనమయ్యారు మనకు ఉదాహరణలుగా ఉండడానికే. వాటిని చూసి ఈ చివరి రోజుల్లో మనం బుద్ధి తెచ్చుకోడానికి అవి రాసి ఉన్నాయి. (aiōn )
12 Nĩ ũndũ ũcio, ũngĩĩra nĩũrũgamĩte wega-rĩ, menyerera ndũkae kũgũa!
౧౨కాబట్టి ఎవరైతే తాను సరిగా నిలబడి ఉన్నానని భావిస్తాడో, అతడు పడిపోకుండా ఉండడానికి జాగ్రత్త తీసుకోవాలి.
13 Mũtirĩ mwagerio na magerio mangĩ tiga o marĩa makoraga andũ. Nake Ngai nĩmwĩhokeku; ndangĩtĩkĩra mũgerio na magerio marĩa mũtangĩhota gwĩtiiria. No rĩrĩa mũkũgerio-rĩ, nĩarĩmuonagĩrĩria njĩra ya kũũrĩra nĩguo mũhotage gwĩtiiria magerio macio.
౧౩ఇప్పటి వరకూ మీరు ఎదుర్కొన్న పరీక్షలు సాధారణంగా మనుషులందరికీ కలిగేవే. దేవుడు నమ్మదగినవాడు. సహించడానికి మీకున్న సామర్ధ్యం కంటే మించిన పరీక్షలు మీకు రానివ్వడు. అంతేకాదు, సహించడానికి వీలుగా ఆ కష్టంతో బాటు దానినుండి తప్పించుకునే మార్గం కూడా మీకు ఏర్పాటు చేస్తాడు.
14 Nĩ ũndũ ũcio, arata akwa endwa, ũragĩrai ũhoro wa kũhooya mĩhianano.
౧౪కాబట్టి నా ప్రియులారా, విగ్రహారాధనకు దూరంగా పారిపొండి.
15 Ndĩraarĩria andũ oogĩ; mwĩkũũranĩrei ũrĩa ndĩroiga.
౧౫తెలివైన వారితో మాట్లాడినట్టు మీతో మాట్లాడుతున్నాను. నేను చెప్పిన విషయాలను మీకై మీరే ఆలోచించి నిర్ణయించుకోండి.
16 Gĩkombe gĩa gũcookia ngaatho kĩrĩa tũcookagia ngaatho nĩ ũndũ wakĩo-rĩ, githĩ ti kũgwatanĩra thakame ya Kristũ? Na githĩ mũgate ũrĩa twenyũraga ti kũgwatanĩra mwĩrĩ wa Kristũ?
౧౬మనం స్తుతులు చెల్లించే పాత్రలో నుండి తాగడం క్రీస్తు రక్తంలో భాగం పంచుకోవడమే. మనం రొట్టె విరిచి తినడం క్రీస్తు శరీరంలో భాగం పంచుకోవడమే.
17 Na tondũ mũgate ũcio nĩ ũmwe-rĩ, ithuĩ, o na tũrĩ aingĩ, tũrĩ o mwĩrĩ ũmwe, nĩgũkorwo ithuĩ othe tũrĩĩaga mũgate o ũcio ũmwe.
౧౭మనమంతా ఒకే రొట్టెలో భాగం పంచుకొంటున్నాం. రొట్టె ఒక్కటే కాబట్టి దాన్ని తీసుకొనే మనం అనేకులమైనప్పటికీ ఒక్కటే శరీరం అయ్యాం.
18 Ta mwĩcũraniei ũhoro wa andũ a Isiraeli: Arĩa marĩĩaga irio cia igongona-rĩ, githĩ matigwatanagĩra kĩgongona kĩu?
౧౮ఇశ్రాయేలీయులను చూడండి. బలిపీఠం మీద అర్పించిన వాటిని తినేవారు బలిపీఠంలో పాలిభాగస్తులే కదా?
19 Ndĩrenda kuuga atĩa? Atĩ kĩrĩa kĩrutĩirwo mũhianano nĩ kĩndũ kũrĩ, kana atĩ mũhianano guo mwene nĩ kĩndũ kũrĩ?
౧౯ఈ విషయంలో అభిప్రాయం ఇది. విగ్రహాల్లో గాని, వాటికి అర్పించిన వాటిలో గానీ ఏమైనా ఉన్నదని నేను చెప్పడం లేదు.
20 Aca! Ũrĩa ndĩroiga nĩ atĩ magongona ma andũ arĩa matarĩ na ũngai marutagĩrwo ndaimono, na ti Ngai, na ndikwenda mũgĩe ngwatanĩro na ndaimono.
౨౦యూదేతరులు అర్పించే బలులు దేవునికి కాక దయ్యాలకే అర్పిస్తున్నారు. మీరు దయ్యాలతో పాలి భాగస్తులు కావడం నాకిష్టం లేదు.
21 Mũtingĩhota kũnyuĩra gĩkombe kĩa Mwathani, na mũnyuĩre gĩkombe kĩa ndaimono o nakĩo; mũtingĩhota kũgwatanĩra metha-inĩ ya Mwathani, na mũgwatanĩre metha-inĩ ya ndaimono.
౨౧మీరు ప్రభువు పాత్రలోనిదీ, దయ్యాల పాత్రలోనిదీ ఒకేసారి తాగలేరు. ప్రభువు బల్లమీదా, దయ్యాల బల్ల మీదా, ఈ రెంటి మీదా ఉన్నవాటిలో ఒకేసారి భాగం పొందలేరు.
22 Kaĩ tũrageria kwarahũra ũiru wa Mwathani? Kaĩ tũrĩ na hinya kũmũkĩra?
౨౨ప్రభువుకు రోషం కలిగిస్తామా? మనం ఆయనకంటే బలవంతులమా?
23 “Niĩ ndirigĩrĩirio gwĩka ũndũ,” no ti ũndũ o wothe ũrĩ na kĩguni. “Niĩ ndirigĩrĩirio gwĩka ũndũ,” no ti ũndũ o wothe ũrĩ na uumithio.
౨౩అన్నీ చట్టబద్దమైనవే కానీ అన్నీ ప్రయోజనకరమైనవి కావు. అన్నిటిలో నాకు స్వేచ్ఛ ఉంది గాని అన్నీ మనుషులకు వృద్ధి కలిగించవు.
24 Gũtirĩ mũndũ wagĩrĩirwo nĩgũcaragia maũndũ ma kwĩguna we mwene, no nĩacaragie maũndũ ma kũguna andũ arĩa angĩ.
౨౪ప్రతి ఒక్కడూ తన సొంత క్షేమం కాక ఇతరుల క్షేమం కోసం చూడాలి.
25 Rĩĩagai kĩrĩa gĩothe kĩendagio thoko-inĩ ya nyama mũtekwĩyũria ciũria nĩ ũndũ wa mwĩcuuko wa thamiri,
౨౫మనస్సాక్షి వేసే ప్రశ్నల గురించి ఆలోచించకుండా దుకాణంలో అమ్మే మాంసాన్ని కొని తినవచ్చు.
26 nĩgũkorwo, “Thĩ nĩ ya Mwathani, na kĩrĩa gĩothe kĩrĩ thĩinĩ wayo.”
౨౬ఎందుకంటే ఈ భూమీ దానిలోని సమస్తమూ దేవునివే.
27 Mũndũ ũtarĩ mwĩtĩkia angĩmwĩta mũkarĩe irio gwake, na inyuĩ mũkorwo nĩ mũkwenda gũthiĩ-rĩ, rĩa irio ciothe iria mũngĩheo mũtekwĩyũria ciũria cia mwĩcuuko wa thamiri.
౨౭ప్రభువుని నమ్మని ఎవరైనా మిమ్మల్ని భోజనానికి పిలిస్తే, మీకు ఇష్టమైతే వెళ్ళండి. అక్కడ మీకు వడ్డించినది ఏదైనా సరే, మీ మనస్సాక్షి ననుసరించి ప్రశ్నలేవీ అడగకుండా తినండి.
28 No mũndũ angĩmwĩra atĩrĩ, “Irio ici irutĩtwo irĩ igongona,” mũtigacirĩe, nĩ ũndũ wa mũndũ ũcio wamwĩra ũguo, o na nĩ ũndũ wa mwĩcuuko wa thamiri;
౨౮అయితే, “ఇది విగ్రహాలకు అర్పించినది” అని ఎవరైనా మీతో చెబితే, అతడి నిమిత్తమూ, మీ మనస్సాక్షి నిమిత్తమూ దాన్ని తినవద్దు.
29 ngiuga ũguo ti thamiri yaku ndagweta, no nĩ thamiri ya mũndũ ũcio ũngĩ. Nĩ ũndũ-rĩ, wĩyathi wakwa ũgũciirithio nĩkĩ nĩ ũndũ wa thamiri ya mũndũ ũngĩ?
౨౯ఇక్కడ మనస్సాక్షి అంటే, నీ సొంత మనస్సాక్షి కాదు, ఎదుటివాడి మనస్సాక్షి నిమిత్తమే అని చెబుతున్నాను. నా స్వేచ్ఛ విషయంలో వేరొకడి మనస్సాక్షి ఎందుకు తీర్పు చెప్పాలి?
30 Ingĩrĩanĩra irio na andũ angĩ ndĩ na ngaatho-rĩ, nĩ kĩĩ gĩgũtũma njambio nĩ ũndũ wa kĩndũ kĩu njokeirie Ngai ngaatho nĩ ũndũ wakĩo?
౩౦నేను కృతజ్ఞతతో పుచ్చుకొంటే కృతజ్ఞతలు చెల్లించిన దాని విషయంలో నేనెందుకు నిందకు గురి కావాలి?
31 Nĩ ũndũ ũcio, rĩrĩa mũkũrĩa kana rĩrĩa mũkũnyua, o na kana mũgĩĩka ũndũ o wothe-rĩ, wĩkagei nĩ ũndũ wa kwenda kũgoocithia Ngai.
౩౧కాబట్టి మీరు తిన్నా, తాగినా, ఏమి చేసినా సరే, అన్నీ దేవుని మహిమ కోసం చేయండి.
32 Tigai gwĩka ũndũ ũngĩhĩngithia mũndũ, arĩ Mũyahudi, kana arĩ Mũyunani, o na kana ũhĩngithie kanitha wa Ngai,
౩౨యూదులకు గానీ, గ్రీసుదేశస్థులకు గానీ, దేవుని సంఘానికి గానీ అభ్యంతరం కలిగించకండి.
33 o ta ũrĩa niĩ ngeragia gũkenia andũ othe na njĩra o yothe. Nĩgũkorwo ndicaragia ũndũ wa kwĩguna niĩ mwene, no njaragia ũrĩa ingĩguna andũ aingĩ, nĩguo mahonoke.
౩౩నేను కూడా ఇదే విధంగా సొంత ప్రయోజనాలు చూసుకోకుండా, చాలా మంది పాప విమోచన పొందాలని వారికి ప్రయోజనం కలగాలని కోరుకుంటూ అన్ని విషయాల్లో, అందరినీ సంతోషపెడుతున్నాను.