< Mica 1 >
1 Das Wort Jehovahs, das geschah an Michah, den Moraschthiter, in den Tagen Jothams, Achas, Jechiskijahs, der Könige von Judah, das er schaute über Schomron und Jerusalem.
౧యోతాము ఆహాజు హిజ్కియా అనే యూదా రాజుల రోజుల్లో సమరయ గురించి యెరూషలేము గురించి దర్శనాల్లో మోరష్తీయుడైన మీకాకు యెహోవా తెలియజేసిన సందేశం.
2 Höret, ihr Völker allzumal, horche, o Erde und ihre Fülle; und zum Zeugen sei wider euch der Herr Jehovah, der Herr aus dem Tempel Seiner Heiligkeit.
౨ప్రజలారా, మీరంతా వినండి. భూమీ, నువ్వూ నీలో ఉన్నదంతా వినాలి. యెహోవా ప్రభువు మీ మీద సాక్ష్యం చెప్పబోతున్నాడు. పరిశుద్ధాలయంలోనుంచి ప్రభువు మీ మీద సాక్ష్యం చెప్పబోతున్నాడు.
3 Denn siehe, Jehovah geht aus von Seinem Ort und steigt herab und tritt auf der Erde Höhen;
౩చూడండి. యెహోవా తన స్థలం విడిచి బయలుదేరుతున్నాడు. ఆయన దిగి భూమి మీది ఉన్నత స్థలాల మీద నడవబోతున్నాడు.
4 Daß unter Ihm die Berge schmelzen und Talgründe sich spalten, wie Wachs vor dem Feuer, wie Wasser, das man auf den Abhang hingießt.
౪ఆయన కింద పర్వతాలు కరిగిపోతాయి. లోయలు పగిలిపోతాయి. నిప్పుకు కరిగిపోయే మైనంలా, వాలు మీద పడ్డ నీళ్ళు పారే విధంగా అవి కరిగిపోతున్నాయి.
5 Wegen Jakobs Übertretung ist alles dies und wegen der Sünden des Hauses Israel. Was ist die Übertretung Jakobs? Ist es nicht Schomron? Und was Jehudahs Opferhöhen? Ist es nicht Jerusalem?
౫ఇదంతా యాకోబు తిరుగుబాటు మూలంగానే. ఇశ్రాయేలు సంతానం వారి పాపాలే కారణం. యాకోబు తిరుగుబాటుకు మూలం ఏంటి? అది సమరయ కాదా? యూదావారి ఉన్నత స్థలాల మూలం ఏంటి? అది యెరూషలేము కాదా?
6 Und zum Trümmerhaufen auf dem Felde mache Ich Schomron, zu Pflanzungen eines Weinbergs, und gieße seine Steine in die Schlucht hin, und decke seine Grundfesten auf.
౬నేను సమరయను పొలం లోని రాళ్లకుప్పలాగా చేస్తాను. ద్రాక్షతోటలు నాటే స్థలంగా చేస్తాను. దాని రాళ్ళు లోయలో పారబోస్తాను, దాని పునాదులు కనబడేలా చేస్తాను.
7 Zerstoßen werden alle ihre Schnitzbilder, und verbrannt im Feuer alle ihre Buhlgaben, und alle ihre Götzenbilder setze Ich in Verwüstung, denn von der Buhlgabe einer Buhlerin hat sie es zusammengebracht, und zu den Buhlgaben einer Buhlerin kehren sie zurück.
౭దాని చెక్కుడు బొమ్మలు ముక్కలు ముక్కలవుతాయి. దాని కానుకలు మంటల్లో కాలిపోతాయి. దాని విగ్రహాలన్నిటినీ నేను పాడు చేస్తాను. అది వేశ్యగా సంపాదించుకున్న కానుకలతో వాటిని తెచ్చుకుంది, కాబట్టి అవి వేశ్య జీతంగా మళ్ళీ వెళ్ళిపోతాయి.
8 Darüber klage und heule ich, gehe ausgebeutet und nackt daher, mache eine Klage wie die Drachen, und trauere wie die jungen Eulen.
౮ఈ కారణంగా నేను కేకలు పెట్టి ప్రలాపిస్తాను. చెప్పులూ బట్టలూ వేసుకోకుండా తిరుగుతాను. నక్కల్లాగా అరుస్తాను. గుడ్లగూబల్లాగా మూలుగుతాను.
9 Denn verzweifelt sind ihre Schläge, denn bis Jehudah kommt er, berührt Meines Volkes Tor bis an Jerusalem.
౯దాని గాయాలు మానవు. అవి యూదాకు తగిలాయి. నా ప్రజల గుమ్మం వరకూ, యెరూషలేము వరకూ అవి వచ్చాయి.
10 In Gath sagt es nicht an mit Weinen, weint nicht im Hause Aphras! Wälze dich umher im Staube!
౧౦ఈ సంగతి గాతులో చెప్పవద్దు. అక్కడ ఏమాత్రం ఏడవద్దు. బేత్ లెయప్రలో నేను దుమ్ములో పడి పొర్లాడాను.
11 Ziehet für euch hinüber, Einwohnerschaft Schaphirs, entblößt mit Scham. Nicht komm heraus, die du in Zaanan wohnest. Die Klage von Beth-Haezel nehme ihren Stand von euch.
౧౧షాఫీరు పురవాసులారా, నగ్నంగా సిగ్గుతో వెళ్ళిపోండి. జయనాను పురవాసులారా, బయటకు రావద్దు. బేత్ ఎజేల్ దుఖిస్తోంది. వారి భద్రత తొలిగి పోయింది.
12 Denn die Bewohnerin von Maroth wartet auf Gutes; denn von Jehovah kam Böses herab bis an das Tor von Jerusalem.
౧౨మారోతువారు మంచి కబురు కోసం ఆరాటంగా ఉన్నారు. యెహోవా విపత్తు కలిగించాడు. అది యెరూషలేము గుమ్మాల వరకూ వచ్చింది.
13 Schirre den Renner an den Streitwagen, Bewohnerin von Lachisch, Anfängerin der Sünde ist sie für Zijons Tochter; denn in dir fanden sich die Übertretungen Israels.
౧౩లాకీషు పురవాసులారా, రథాలకు యుద్ధాశ్వాలను పూన్చండి. ఇశ్రాయేలు వారు చేసిన తిరుగుబాట్లు నీలో కనిపించాయి. నువ్వు సీయోను కుమార్తె పాపానికి ప్రారంభం.
14 Darum tue Verzicht auf den Erbbesitz Gaths; die Häuser Achsibs sind eine Täuschung für Israels Könige.
౧౪మీరు విడుదల కోసం మోరెషెత్ గాతుకు కానుకలిస్తారు. అక్జీబు ఊరు ఇశ్రాయేలు రాజులను మోసగిస్తుంది.
15 Noch bringe Ich dir den Erbbesitzer herein, Mareschahs Wohnerschaft. Bis Adul- lam wird kommen Israels Herrlichkeit.
౧౫మారేషా పురవాసులారా, మిమ్మల్ని వశం చేసుకునే వాణ్ణి మీ మీదికి పంపిస్తాను. ఇశ్రాయేలీయుల నాయకులు అదుల్లాం గుహకు వెళ్ళిపోతారు.
16 Mache dich kahl und schere dich ob den Söhnen deiner Wonne; mache deine Kahlheit breit, wie der Adler; denn sie sind von dir weggeführt.
౧౬నీకిష్టమైన పిల్లల కోసం నీ తల బోడి చేసుకో. నీ వెంట్రుకలు కత్తిరించుకో. రాబందులాగా బోడిగా ఉండు. నీ పిల్లలు నీ దగ్గర నుంచి చెరలోకి వెళ్ళిపోతారు.