< Psalm 68 >
1 Ein Psalmlied Davids, vorzusingen. Es stehe Gott auf, daß seine Feinde zerstreut werden, und die ihn hassen, vor ihm fliehen.
౧ప్రధాన సంగీతకారుని కోసం. దావీదు కీర్తన. దేవుడు లేస్తాడు గాక, ఆయన శత్రువులు చెదరిపోతారు గాక. ఆయనను ద్వేషించేవారు ఆయన సన్నిధి నుండి పారిపోతారు గాక.
2 Vertreibe sie, wie der Rauch vertrieben wird; wie das Wachs zerschmilzt vom Feuer, so müssen umkommen die Gottlosen vor Gott.
౨పొగను చెదరగొట్టినట్టు నువ్వు వారిని చెదరగొట్టు. అగ్నికి మైనం కరిగిపోయేలా దుర్మార్గులు దేవుని సన్నిధిలో కరిగి నశించిపోతారు గాక.
3 Die Gerechten aber müssen sich freuen und fröhlich sein vor Gott und von Herzen sich freuen.
౩నీతిమంతులు సంతోషిస్తారు గాక. వారు దేవుని సన్నిధిలో సంతోషించి బహుగా ఆనందిస్తారు గాక.
4 Singet Gott, lobsinget seinem Namen! Machet Bahn dem, der durch die Wüste herfährt-er heißt HERR -, und freuet euch vor ihm,
౪దేవుని గూర్చి పాడండి. ఆయన నామాన్ని బట్టి స్తోత్రగానం చేయండి. యొర్దాను నదీ లోయ ప్రాంతంలో స్వారీ చేసే దేవుని కోసం, ఒక రాజమార్గం ఏర్పాటు చేయండి. ఆయన పేరు యెహోవా. ఆయన ఎదుట పండగ చేసుకోండి.
5 der ein Vater ist der Waisen und ein Richter der Witwen. Er ist Gott in seiner heiligen Wohnung,
౫తన పరిశుద్ధాలయంలో ఉన్న దేవుడు, తండ్రి లేని వారికి తండ్రిగా, వితంతువులకు సహాయకుడిగా ఉన్నాడు.
6 ein Gott, der den Einsamen das Haus voll Kinder gibt, der die Gefangenen ausführt zu rechter Zeit und läßt die Abtrünnigen bleiben in der Dürre.
౬దేవుడు ఒంటరి వారిని కుటుంబాలుగా చేస్తాడు. ఆయన బంధకాల్లో ఉన్న వారిని విడిపించి వారిని వృద్ధి చెందిస్తాడు. తిరుగుబాటు చేసే వారి భూములు బీడులైపోతాయి.
7 Gott, da du vor deinem Volk her zogst, da du einhergingst in der Wüste (Sela)
౭దేవా, నీవు నీ ప్రజలకు ముందుగా బయలుదేరినప్పుడు అరణ్యంలో ప్రయాణించినప్పుడు
8 da bebte die Erde, und die Himmel troffen vor Gott, dieser Sinai vor dem Gott, der Israels Gott ist.
౮దేవుని సన్నిధిలో ఆయన సీనాయి కొండకు వచ్చినపుడు, ఇశ్రాయేలు దేవుని సన్నిధిలో భూమి వణికింది, ఆకాశాలు వర్షించాయి.
9 Du gabst, Gott, einen gnädigen Regen; und dein Erbe, das dürre war, erquicktest du,
౯దేవా, నీ వారసత్వం మీద వర్షం సమృద్ధిగా కురిపించావు. అది అలసి ఉన్నప్పుడు నువ్వు దాన్ని బలపరచావు.
10 daß deine Herde darin wohnen könne. Gott, du labtest die Elenden mit deinen Gütern.
౧౦నీ ప్రజలు దానిలో నివసిస్తారు. దేవా, నీ మంచితనంతో పేదలను అనుగ్రహించావు.
11 Der Herr gab das Wort mit großen Scharen Evangelisten:
౧౧ప్రభువు ఆజ్ఞాపించాడు. గొప్ప సైన్యం దాన్ని ప్రకటించింది.
12 “Die Könige der Heerscharen flohen eilends, und die Hausehre teilte den Raub aus.
౧౨సైన్యాలున్న రాజులు పారిపోతారు. వారు పారిపోతారు. ఇళ్ళలో ఉండే స్త్రీలు దోపుడు సొమ్ము పంచుకుంటారు.
13 Wenn ihr zwischen den Hürden laget, so glänzte es wie der Taube Flügel, die wie Silber und Gold schimmern.
౧౩గువ్వలను వెండితో కప్పినట్టు, వాటి రెక్కలకు పచ్చని బంగారు పూత పూసినట్టు ఉన్న సొమ్ము వారు పంచుకుంటారు. గొర్రెల దొడ్లలో మీలో కొందరు ఎందుకు పడుకుని ఉండిపోయారు?
14 Als der Allmächtige die Könige im Lande zerstreute, da ward es helle, wo es dunkel war.”
౧౪సర్వశక్తుడు అక్కడి రాజులను చెదరగొట్టినప్పుడు సల్మోను కొండ మీద మంచు కురిసినట్టు కనిపించింది.
15 Ein Gebirge Gottes ist das Gebirge Basans; ein großes Gebirge ist das Gebirge Basans.
౧౫బాషాను చాలా ఉన్నతమైన పర్వతం. అది అనేక శిఖరాలు ఉన్న పర్వతం.
16 Was seht ihr scheel, ihr großen Gebirge, auf den Berg, da Gott Lust hat zu wohnen? Und der HERR bleibt auch immer daselbst.
౧౬శిఖరాలున్న పర్వతాల్లారా, దేవుడు తన నివాసంగా ఏర్పాటు చేసిన పర్వతాన్ని ఎందుకు అంత అసూయగా చూస్తున్నారు? యెహోవా శాశ్వతంగా దానిలో నివసిస్తాడు.
17 Der Wagen Gottes sind vieltausendmal tausend; der Herr ist unter ihnen am heiligen Sinai.
౧౭దేవుని రథాలు వేలాదిగా ఉన్నాయి. సీనాయి కొండపై ఉన్నట్టుగా యెహోవా వాటి మధ్య తన పరిశుద్ధ సన్నిధిలో ఉన్నాడు.
18 Du bist in die Höhe gefahren und hast das Gefängnis gefangen; du hast Gaben empfangen für die Menschen, auch die Abtrünnigen, auf daß Gott der HERR daselbst wohne.
౧౮నీవు ఆరోహణమైపోయావు. బందీలను చెరపట్టుకుపోయావు. మనుషుల నుండి నువ్వు కానుకలు తీసుకున్నావు. యెహోవా, నువ్వు అక్కడ నివసించేలా నీపై తిరుగుబాటు చేసిన వారి నుండి కూడా నువ్వు కానుకలు తీసుకున్నావు.
19 Gelobet sei der Herr täglich. Gott legt uns eine Last auf; aber er hilft uns auch. (Sela)
౧౯ప్రభువుకు స్తుతి కలుగు గాక. ఆయన ప్రతిరోజూ మా భారాలు మోస్తున్నాడు. దేవుడే మా రక్షణకర్త.
20 Wir haben einen Gott, der da hilft, und den HERRN Herrn, der vom Tode errettet.
౨౦మన దేవుడు మనలను రక్షించే దేవుడు. మన దేవుడైన యెహోవాయే మరణం నుండి తప్పించేవాడు.
21 Ja, Gott wird den Kopf seiner Feinde zerschmettern, den Haarschädel derer, die da fortfahren in ihrer Sünde.
౨౧దేవుడు తన శత్రువుల తలలు తప్పక పగలగొడతాడు. ఎడతెగక తప్పులు చేసేవారి నడినెత్తిని ఆయన చితకగొడతాడు.
22 Der Herr hat gesagt: “Aus Basan will ich dich wieder holen, aus der Tiefe des Meeres will ich sie holen,
౨౨ప్రభువు చెబుతున్నాడు, నేను బాషాను నుండి వారిని వెనక్కి రప్పిస్తాను. సముద్ర అగాధాల్లో నుండి వారిని రప్పిస్తాను.
23 daß dein Fuß in der Feinde Blut gefärbt werde und deine Hunde es lecken.”
౨౩నువ్వు నీ శత్రువులను అణచివేసి వారి రక్తంలో నీ పాదాలు ముంచుతావు. వారు నీ కుక్కల నాలుకలకు ఆహారమౌతారు.
24 Man sieht, Gott, wie du einherziehst, wie du, mein Gott und König, einherziehst im Heiligtum.
౨౪దేవా, నీ యాత్రను, పరిశుద్ధ స్థలానికి పోయే నా రాజైన దేవుని యాత్రను వారు చూశారు.
25 Die Sänger gehen vorher, die Spielleute unter den Jungfrauen, die da pauken:
౨౫చుట్టూరా కన్యలు తంబురలు వాయిస్తుండగా పాటలు పాడేవారు ముందుగా నడిచారు. తంతివాద్యాలు వాయించేవారు వారిని వెంబడించారు.
26 “Lobet Gott den Herrn in den Versammlungen, ihr vom Brunnen Israels!”
౨౬సమాజాల్లో దేవుణ్ణి స్తుతించండి. ఇశ్రాయేలు సంతానమా, యెహోవాను స్తుతించండి.
27 Da herrscht unter ihnen der kleine Benjamin, die Fürsten Juda's mit ihren Haufen, die Fürsten Sebulons, die Fürsten Naphthalis.
౨౭మొదట కనిష్ఠుడైన బెన్యామీను గోత్రం, తరవాత యూదా అధిపతులు, వారి పరివారం ఉంది. జెబూలూను, నఫ్తాలి గోత్రాల అధిపతులు అక్కడ ఉన్నారు.
28 Dein Gott hat dein Reich aufgerichtet; das wollest du, Gott, uns stärken, denn es ist dein Werk.
౨౮నీ దేవుడు నీకు బలం ఇచ్చాడు. దేవా, గతంలో చేసినట్టు నీ శక్తిని మాకు కనపరచు.
29 Um deines Tempels willen zu Jerusalem werden dir die Könige Geschenke zuführen.
౨౯యెరూషలేములోని నీ ఆలయాన్నిబట్టి రాజులు నీ దగ్గరికి కానుకలు తెస్తారు.
30 Schilt das Tier im Rohr, die Rotte der Ochsen mit ihren Kälbern, den Völkern, die da zertreten um Geldes willen. Er zerstreut die Völker, die da gerne kriegen.
౩౦జమ్ముగడ్డిలోని మృగాన్ని, ఆబోతుల గుంపును, దూడల్లాంటి జాతులను ఖండించు. వారు నీకు లోబడి శిస్తుగా వెండి కడ్డీలు తెచ్చేలా వారిని గద్దించు. యుద్ధాలు కోరుకునే వారిని చెదరగొట్టు.
31 Die Fürsten aus Ägypten werden kommen; Mohrenland wird seine Hände ausstrecken zu Gott.
౩౧ఈజిప్టు నుండి రాకుమారులు వస్తారు. ఇతియోపియా దేవుని వైపు తన చేతులు చాచి పరిగెత్తి వస్తుంది.
32 Ihr Königreiche auf Erden, singet Gott, lobsinget dem Herrn (Sela)
౩౨భూరాజ్యాలన్నీ దేవుని గూర్చి పాడండి. ప్రభువును కీర్తించండి.
33 dem, der da fährt im Himmel allenthalben von Anbeginn! Siehe, er wird seinem Donner Kraft geben.
౩౩అనాది కాలం నుండి ఆకాశాలపై స్వారీ చేసే ఆయనను కీర్తించండి. ఆయన తన స్వరం వినిపిస్తాడు. అది బలమైన స్వరం.
34 Gebet Gott die Macht! Seine Herrlichkeit ist über Israel, und seine Macht in den Wolken.
౩౪దేవునికి బలాతిశయం ఆపాదించండి. ఆయన మహిమ ఇశ్రాయేలు మీద ఉంది. ఆయన బలం అంతరిక్షంలో ఉంది.
35 Gott ist wundersam in seinem Heiligtum. Er ist Gott Israels; er wird dem Volk Macht und Kraft geben. Gelobt sei Gott!
౩౫దేవా, నీ పరిశుద్ధ స్థలాల్లో నువ్వు భీకరుడివి. ఇశ్రాయేలు దేవుడే తన ప్రజలకు బల ప్రభావాలను అనుగ్రహిస్తున్నాడు. దేవునికి స్తుతి కలుగు గాక.