< Psalm 47 >

1 Ein Psalm, vorzusingen, der Kinder Korah. Frohlocket mit Händen, alle Völker, und jauchzet Gott mit fröhlichem Schall!
ప్రధాన సంగీతకారుడి కోసం, కోరహు వారసుల కీర్తన. జాతులన్నీ చప్పట్లు కొట్టండి. విజయోత్సాహంతో ఆనంద ధ్వనులు చేయండి.
2 Denn der HERR, der Allerhöchste, ist erschrecklich, ein großer König auf dem ganzen Erdboden.
అత్యున్నతుడైన యెహోవా భయంకరమైనవాడు. భూమి అంతటికీ ఆయన మహారాజు.
3 Er wird die Völker unter uns zwingen und die Leute unter unsere Füße.
ఆయన జాతులను మనకు లోబరుస్తాడు. దేశాలను మన కాళ్ళ కిందకు తీసుకువస్తాడు.
4 Er erwählet uns zum Erbteil, die HERRLIchkeit Jakobs, den er liebet. (Sela)
మన వారసత్వాన్ని ఎంపిక చేస్తాడు. అది తాను ప్రేమించిన యాకోబు కీర్తి ప్రతిష్టల వారసత్వం.
5 Gott fähret auf mit Jauchzen und der HERR mit heller Posaune.
దేవుడు గొప్ప ధ్వనితో ఆరోహణం అయ్యాడు. బాకా శబ్దంతో యెహోవా ఆరోహణం అయ్యాడు.
6 Lobsinget, lobsinget Gott; lobsinget, lobsinget unserm Könige!
దేవునికి స్తుతులు పాడండి. స్తుతించండి. మన రాజుకు స్తుతులు పాడండి, స్తుతులు పాడండి.
7 Denn Gott ist König auf dem ganzen Erdboden; lobsinget ihm klüglich!
ఎందుకంటే మన దేవుడు భూమి అంతటికీ రాజు. అవగాహనతో స్తుతులు పాడండి.
8 Gott ist König über die Heiden; Gott sitzt auf seinem heiligen Stuhl.
దేవుడు అన్ని జాతులల పైనా పరిపాలన చేస్తున్నాడు. ఆయన తన పవిత్ర సింహాసనంపై కూర్చుని ఉన్నాడు.
9
జాతుల అధిపతులు అబ్రాహము దేవుని ప్రజలతో కూడి ఉన్నారు. భూమిపై రక్షణ డాళ్ళు దేవునికే చెందుతాయి. భూమిపై అత్యున్నత స్థానం ఆయనదే.

< Psalm 47 >