< 1 Koenige 4 >
1 Der König Salomo war also König über Gesamtisrael.
౧సొలొమోను రాజు ఇశ్రాయేలీయులందరి మీదా రాజయ్యాడు.
2 Dies sind seine Obersten: Azarja, Sohn des Priesters Sadok.
౨అతని దగ్గర ఉన్న అధికారులు ఎవరంటే, సాదోకు కొడుకు అజర్యా యాజకుడు,
3 Schreiber waren Elichoreph und Achia, Sisas Söhne. Achiluds Sohn Josaphat war Kanzler.
౩షీషా కొడుకులు ఎలీహోరెపు, అహీయా ప్రధాన మంత్రులు, అహీలూదు కొడుకు యెహోషాపాతు లేఖికుడు.
4 Jojadas Sohn Benaja befehligte das Heer. Sadok und Ebjatar waren Priester.
౪యెహోయాదా కొడుకు బెనాయా సైన్యాధిపతి, సాదోకు, అబ్యాతారు యాజకులు.
5 Azarja, Natans Sohn, war über die Vögte gesetzt. Natans Sohn Zabud war des Königs eigener Priester.
౫నాతాను కొడుకు అజర్యా అధికారుల పైఅధికారిగా ఉన్నాడు. నాతాను మరో కొడుకు జాబూదు యాజకుడు, రాజు చెలికాడు.
6 Achisar war über das Haus gesetzt und Abdas Sohn Adoniram über die Fron.
౬అహీషారు గృహ నిర్వాహకుడు, అబ్దా కొడుకు అదోనీరాము వెట్టి చాకిరీ పనివాళ్ళపై అధికారి.
7 Salomo hatte zwölf Vögte für ganz Israel. Diese versorgten den König und sein Haus. Je einen Monat im Jahre lag jedem ob, ihn zu versorgen.
౭ఇశ్రాయేలీయులందరి మీదా సొలొమోను 12 మంది అధికారులను నియమించాడు. వీరు రాజుకు, అతని ఇంటివారికి ఆహారం ఏర్పాటు చేసేవారు. సంవత్సరంలో ఒక్కొక్క నెలకు వారిలో ఒక్కొక్కడు ఆహారం సరఫరా చేసే బాధ్యత వహించాడు.
8 Dies sind ihre Namen: Churs Sohn auf dem Gebirge Ephraim.
౮వారెవరంటే, ఎఫ్రాయిము మన్యంలో ఉండే హూరు కొడుకు,
9 Dekers Sohn in Makas, Saalbim, Betsemes und Elon Bet Chanan.
౯మాకస్సులో, షయల్బీములో, బేత్షెమెషులో, ఏలోన్ బేత్ హనాన్లో దెకెరు కొడుకు,
10 Cheseds Sohn in Arubbot; ihm unterstanden Soko und das ganze Chepherland.
౧౦అరుబ్బోతులో హెసెదు కొడుకు, ఇతనికి శోకో, హెపెరు దేశాలు అప్పగించారు.
11 Abinadabs Sohn im ganzen Hügelland von Dor. Er hatte Salomos Tochter Taphat zum Weibe.
౧౧అబీనాదాబు కొడుక్కి దోరు మన్య ప్రదేశమంతా అప్పగించారు. సొలొమోను కూతురు టాపాతు ఇతని భార్య.
12 Baana, Achiluds Sohn in Taanak, Megiddo und ganz Betsean, das neben Sartan unterhalb Jezreels liegt, von Betsean bis Abel Mechola und bis jenseits von Jokneam.
౧౨అహీలూదు కొడుకు బయనాకు తానాకు, మెగిద్దో, బేత్షెయాను ప్రదేశమంతా అప్పగించారు. ఇది యెజ్రెయేలు దగ్గర ఉన్న సారెతా నుండి బేత్షెయాను మొదలు ఆబేల్మెహోలా వరకూ యొక్నెయాము అవతలి స్థలం వరకూ వ్యాపించింది.
13 Gebers Sohn in Ramat Gilead unterstanden die Dörfer Jairs, des Manassesohnes, in Gilead, ebenso der Landstrich Argob in Basan, sechzig große Städte mit Mauern und ehernen Riegeln.
౧౩గెబెరు కొడుకు రామోత్గిలాదులో కాపురమున్నాడు. ఇతనికి గిలాదులో ఉన్న మనష్షే కుమారుడు యాయీరు గ్రామాలు, బాషానులో ఉన్న అర్గోబు దేశం అప్పగించారు. అది ప్రాకారాలు, ఇత్తడి అడ్డగడియలు ఉన్న 60 గొప్ప పట్టణాలున్న ప్రాంతం.
14 Joddas Sohn Achinadab in Machanaim.
౧౪ఇద్దో కొడుకు అహీనాదాబు మహనయీములో ఉండగా
15 Achimaas in Naphtali. Auch er nahm eine Tochter Salomos, Basemat, zum Weibe.
౧౫నఫ్తాలీము దేశంలో అహిమయస్సు ఉన్నాడు. ఇతడు సొలొమోను కూతురు బాశెమతును పెళ్ళి చేసుకున్నాడు.
16 Chusas Sohn Baana in Asser und in Alot.
౧౬ఆషేరులో, ఆలోతులో హూషై కొడుకైన బయనా ఉండేవాడు.
17 Paruchs Sohn Josaphat in Issakar.
౧౭ఇశ్శాఖారు దేశంలో పరూయహు కొడుకు యెహోషాపాతు ఉండేవాడు.
18 Elas Sohn Simi in Benjamin.
౧౮బెన్యామీను దేశంలో ఏలా కొడుకు షిమీ ఉండేవాడు.
19 Uris Sohn Geber im Lande Gilead, dem Land des Amoriterkönigs Sichon und des Basankönigs Og. Dazu war er Vogt über das Land.
౧౯గిలాదు దేశంలో, అమోరీయుల రాజు సీహోను దేశంలో, బాషాను రాజు ఓగు దేశంలో, ఊరీ కొడుకైన గెబెరు ఉన్నాడు. అతడు ఒక్కడే ఆ దేశంలో అధికారి.
20 Juda und Israel waren zahlreich wie der Meeressand an Menge. Sie aßen, tranken und waren guter Dinge.
౨౦అయితే యూదావారూ ఇశ్రాయేలు వారూ సముద్రం ఒడ్డున ఉండే ఇసుక రేణువులంత విస్తారమైన సమూహంగా ఉండి తింటూ, తాగుతూ, సంబరపడుతూ ఉన్నారు.
21 Salomo herrschte über alle Königreiche vom Strom bis zum Philisterland und bis zu Ägyptens Grenze. Sie brachten Abgaben und dienten Salomo alle Tage seines Lebens.
౨౧నది (యూఫ్రటీసు) మొదలుకుని ఐగుప్తు సరిహద్దు వరకూ ఆ మధ్యలో ఉన్న రాజ్యాలన్నిటి మీదా ఫిలిష్తీయుల దేశమంతటి మీదా సొలొమోను అధికారం ఉంది. సొలొమోను బతికిన కాలమంతా ఆ ప్రజలు అతనికి పన్ను చెల్లిస్తూ, అణిగిమణిగి ఉన్నారు.
22 Salomos Speisebedarf für einen Tag betrug: dreißig Maß Feinmehl und sechzig Maß anderes Mehl,
౨౨రోజుకి సొలొమోను భోజన సామగ్రి 600 తూముల మెత్తని గోదుమ పిండి, 1, 200 తూముల ముతక పిండి,
23 zehn fette Rinder, zwanzig Weiderinder und hundert Schafe, ohne die Hirsche, Gazellen, Damhirsche, Wasservögel und Wildtauben.
౨౩పది కొవ్విన ఎద్దులు, గడ్డి మైదానాల నుండి తెచ్చిన ఎద్దులు 20, గొర్రెలు 100. ఇవిగాక ఎర్ర దుప్పులు, దుప్పులు, జింకలు, కొవ్విన బాతులు.
24 Er waltete über alles Land jenseits des Stroms von Tipsach bis Gaza und über alle Könige jenseits des Stroms. So hatte er auf allen Seiten ringsum Frieden.
౨౪యూఫ్రటీసు నది ఇవతల తిప్సహు నుండి గాజా వరకూ నది ఇవతల ఉన్న రాజులందరి మీదా సొలోమోనుకు అధికారముంది. అతని కాలంలో నాలుగు దిక్కులా శాంతి నెలకొంది.
25 Juda und Jerusalem wohnten ruhig, jeder saß unter seinem Weinstock und Feigenbaum von Dan bis Beerseba, solange Salomo lebte.
౨౫సొలొమోను కాలమంతా ఇశ్రాయేలు వారూ యూదా వారూ దాను నుండి బెయేర్షెబా వరకూ తమ తమ ద్రాక్షచెట్ల కిందా అంజూరపు చెట్ల కిందా నిర్భయంగా నివసించారు.
26 Und Salomo besaß 40.000 Stuten als Rosse für seine Wagen nebst 12.000 Reitpferden.
౨౬సొలొమోను రాజు రథాల కోసం శాలల్లో 40,000 గుర్రాలు, అశ్విక దళానికి 12,000 గుర్రాలు ఉండేవి.
27 Jene Vögte versorgten den König Salomo und alle, die zum Tisch des Königs Salomo Zutritt hatten, jeder einen Monat lang. Sie ließen es an nichts fehlen.
౨౭సొలొమోనుకు, అతని భోజనపు బల్ల దగ్గరికి వచ్చిన వారికందరికీ ఏమీ తక్కువ కాకుండా అధికారుల్లో ప్రతి ఒక్కడూ తనకు అప్పగించిన నెలను బట్టి ఆహారం పంపుతూ వచ్చారు.
28 Auch Gerste und Stroh für die Rosse und Rennpferde brachten sie an den Ort, wo er gerade war, jeder nach seiner Ordnung.
౨౮రథాలు లాగే గుర్రాలు, ఇతర గుర్రాలు ఉన్న వివిధ స్థలాలకు ప్రతివాడూ తన బాధ్యతను బట్టి బార్లీ, ఎండు గడ్డి తెచ్చి ఇచ్చేవాడు.
29 Und Gott gab Salomo Weisheit und Einsicht überreichlich sowie Geistesreichtum gleich dem Sand am Meeresufer.
౨౯దేవుడు సొలొమోనుకు జ్ఞానాన్నీ బుద్ధినీ అత్యంత వివేచన గల మనస్సునూ దయ చేశాడు.
30 Salomos Weisheit ward größer als die Weisheit aller Söhne des Ostens und als die Ägyptens.
౩౦అతనికి కలిగిన జ్ఞానం తూర్పుదేశాల వారి జ్ఞానం కంటే, ఐగుప్తీయుల జ్ఞానమంతటి కంటే మించిపోయింది.
31 Er war weiser als alle Menschen, als der Ezrachite Etan und Machols Söhne Heman, Kalkol und Darda. Bei allen Heiden ringsum war er berühmt.
౩౧అతడు మానవులందరి కంటే, ఎజ్రాహీయుడైన ఏతాను కంటే, మహోలు కొడుకులు హేమాను, కల్కోలు, దర్ద అనేవారి కంటే జ్ఞానవంతుడు. కాబట్టి అతని కీర్తి చుట్టూ ఉన్న ప్రజలందరిలో వ్యాపించింది.
32 Er verfaßte 3.000 Sprüche, und seiner Lieder waren es 1.005.
౩౨అతడు 3,000 సామెతలు చెప్పాడు. 1,005 కీర్తనలు రచించాడు.
33 Er redete über die Bäume von der Zeder auf dem Libanon bis zum Ysop, der an der Mauer herauswächst. Er redete auch über das Wild, die Vögel, das Gewürm und die Fische.
౩౩లెబానోనులో పెరిగే దేవదారు వృక్షమే గాని, గోడలో నుండి మొలిచే హిస్సోపు మొక్కే గాని, చెట్లన్నిటిని గూర్చీ అతడు రాశాడు. ఇంకా మృగాలు, పక్షులు, పాకే జంతువులు, జలచరాలు, అన్నిటిని గురించీ అతడు రాశాడు.
34 Aus allen Völkern kamen Leute, Salomos Weisheit zu hören, von allen Erdenkönigen, die von seiner Weisheit hörten.
౩౪అతని జ్ఞానం గురించి వినిన భూరాజులందరిలో నుండీ ప్రజలందరిలో నుండీ అతని జ్ఞానవాక్కులు తెలుసుకోడానికి మనుషులు సొలొమోను దగ్గరకి వచ్చారు.