< Ester 5 >

1 Und es geschah am dritten Tage, da kleidete sich Esther königlich und trat in den inneren Hof des Hauses des Königs, dem Hause des Königs gegenüber. Und der König saß auf seinem königlichen Throne im königlichen Hause, dem Eingang des Hauses gegenüber.
మూడో రోజున ఎస్తేరు రాణివస్త్రాలు ధరించుకుని రాజభవనం ఆవరణంలో రాజు సన్నిధికి వెళ్లి నిలబడింది. రాజనగరు ద్వారానికి ఎదురుగా ఉన్న ఆవరణంలో రాజు తన సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు.
2 Und es geschah, als der König die Königin Esther im Hofe stehen sah, erlangte sie Gnade in seinen Augen; und der König reichte Esther das goldene Zepter entgegen, das in seiner Hand war; und Esther nahte herzu und rührte die Spitze des Zepters an.
ఎస్తేరురాణి ఆవరణంలో నిలబడి ఉండడం రాజు చూశాడు. అతనికి ఆమెపై ఇష్టం పుట్టింది. రాజు తన చేతిలోని బంగారపు రాజ దండాన్ని ఎస్తేరు వైపు చాపాడు. ఎస్తేరు దగ్గరికి వచ్చి దండం కొనను తాకింది.
3 Und der König sprach zu ihr: Was ist dir, Königin Esther? Und was ist dein Begehr? Bis zur Hälfte des Königreiches, und sie soll dir gegeben werden!
రాజు “రాణివైన ఎస్తేరూ, నీకేమి కావాలి? నీ మనవి ఏమిటి? అర్థ రాజ్యం కోరినా సరే, నీకు ఇచ్చేస్తాను” అన్నాడు.
4 Und Esther sprach: Wenn es den König gut dünkt, so möge der König und Haman heute zu dem Mahle kommen, das ich ihm bereitet habe.
అప్పుడు ఎస్తేరు “రాజుకు సమంజసం అనిపిస్తే నేను రాజు కోసం ఏర్పాటు చేయించిన విందుకు రాజైన మీరూ హామానూ ఈ రోజు రావాలని నా కోరిక” అంది.
5 Da sprach der König: Bringet eilends Haman her, damit wir tun, was Esther gesagt hat. Und der König und Haman kamen zu dem Mahle, das Esther bereitet hatte.
అప్పుడు రాజు “ఎస్తేరు అడిగిన ప్రకారం జరిగేలా హామానును కూడా త్వరగా తెండి” అని ఆజ్ఞ ఇచ్చాడు. రాజు, హామాను ఎస్తేరు చేయించిన విందుకు వచ్చారు.
6 Und der König sprach zu Esther beim Weingelage: Was ist deine Bitte? Und sie soll dir gewährt werden. Und was ist dein Begehr? Bis zur Hälfte des Königreiches, und es soll geschehen!
విందులో ద్రాక్షారసం పోస్తుండగా రాజు ఎస్తేరుతో “నీ కోరిక ఏమిటి? దాన్ని తీరుస్తాను. నీ మనవి ఏమిటి? అర్థ రాజ్యమైనా సరే, నీకు ఇస్తాను” అని చెప్పాడు.
7 Da antwortete Esther und sprach: Meine Bitte und mein Begehr ist:
ఎస్తేరు ఇలా బదులు ఇచ్చింది “రాజైన మీకు నాపై అనుగ్రహం కలిగితే, నా మనవి ప్రకారం చేయడం రాజైన మీకు అనుకూలమైతే,
8 Wenn ich Gnade gefunden habe in den Augen des Königs, und wenn es den König gut dünkt, meine Bitte zu gewähren und mein Begehr zu tun, so möge der König und Haman zu dem Mahle kommen, das ich ihnen bereiten will; und morgen will ich tun nach dem Worte des Königs.
రాజైన మీరూ హామానూ రేపు కూడా మీ కోసం నేను చేయించబోయే విందుకు రావాలి. మీ ప్రశ్నకు జవాబు అప్పుడు ఇస్తాను.”
9 Und Haman ging an selbigem Tage hinaus, fröhlich und guten Mutes. Als aber Haman den Mordokai im Tore des Königs sah, und daß er weder aufstand, noch sich vor ihm rührte, da ward Haman voll Grimmes über Mordokai; aber Haman bezwang sich.
ఆ రోజు హామాను సంతోషంగా ఉల్లాసంగా బయలుదేరాడు. రాజు భవన ద్వారం దగ్గర ఉన్న మొర్దెకై తనను చూసి లేచి నిలబడక పోవడం, అసలు ఎలాటి భయం చూపకపోవడం చూసి మొర్దెకై మీద మండిపడ్డాడు.
10 Und als er in sein Haus gekommen war, sandte er hin und ließ seine Freunde und sein Weib Seresch kommen.
౧౦అయితే అతడు కోపం అణచుకుని ఇంటికి పోయి తన స్నేహితులను తన భార్య జెరెషును పిలిపించాడు.
11 Und Haman erzählte ihnen von der Herrlichkeit seines Reichtums und von der Menge seiner Söhne; und alles, wie der König ihn groß gemacht, und wie er ihn erhoben habe über die Fürsten und Knechte des Königs.
౧౧తన ఐశ్వర్య వైభవాల గురించి, తనకున్న చాలామంది కొడుకుల గురించి, రాజు తనని రాజోద్యోగులందరి కంటే, రాజసేవకులందరి కంటే ఎలా ఉన్నత స్థాయిలో ఉంచాడో వారికి వివరించాడు.
12 Und Haman sprach: Auch hat die Königin Esther niemand mit dem König zu dem Mahle kommen lassen, das sie bereitet hatte, als nur mich; und auch auf morgen bin ich mit dem König von ihr geladen.
౧౨ఇంకా అతడు “ఎస్తేరు రాణి తాను చేయించిన విందుకు రాజును నన్ను తప్ప మరి ఎవరినీ పిలవ లేదు. రేపు కూడా రాజుతో కలిసి విందుకు రమ్మని నాకు ఆహ్వానం అందింది” అని చెప్పాడు.
13 Aber dieses alles gilt mir nichts, solange ich Mordokai, den Juden, im Tore des Königs sitzen sehe.
౧౩“అయితే యూదుడైన మొర్దెకై రాజభవన ద్వారం దగ్గర కూర్చుని ఉండడం నేను చూస్తున్నంత కాలం ఈ పదవి అంతటి వలనా నాకు ప్రయోజనమేముంది?” అని అతడు అన్నాడు.
14 Da sprachen sein Weib Seresch und alle seine Freunde zu ihm: Man richte einen Baum her, fünfzig Ellen hoch; und am Morgen sage dem König, daß man Mordokai daran hänge. Dann gehe mit dem König fröhlich zum Mahle! Und das Wort dünkte Haman gut, und er ließ den Baum herrichten.
౧౪అతని భార్య జెరెషు, అతని స్నేహితులందరూ “50 మూరల ఎత్తున్న ఉరికొయ్య ఒకటి చేయించు. దాని మీద మొర్దెకైని ఉరి తీసేలా రేపు రాజుకు మనవి చెయ్యి. ఆపైన సంతోషంగా రాజుతో కలిసి విందుకు పోవచ్చు” అని అతనితో చెప్పారు. ఈ సంగతి హామానుకు సముచితంగా తోచింది. అతడు ఉరికొయ్య ఒకటి సిద్ధం చేయించాడు.

< Ester 5 >