< Job 25 >

1 Und Bildad, der Schuchiter, antwortete und sprach:
అప్పుడు షూహీయుడు బిల్దదు ఇలా జవాబు ఇచ్చాడు.
2 Herrschaft und Schrecken sind bei ihm; er schafft Frieden in seinen Höhen.
అధికారం, భీకరత్వం ఆయనవి. ఆయన పరలోక స్థలాల్లో క్రమం నెలకొల్పుతాడు.
3 Sind seine Scharen zu zählen? und über wem erhebt sich nicht sein Licht?
ఆయన సేనలను లెక్కింప శక్యమా? ఆయన వెలుగు ఎవరి మీదనైనా ఉదయించకుండా ఉంటుందా?
4 Und wie könnte ein Mensch gerecht sein vor Gott, [El. O. recht haben Gott gegenüber] und wie könnte rein sein ein vom Weibe Geborener?
మనిషి దేవుని దృష్టికి నీతిమంతుడు ఎలా కాగలడు? స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎలా శుద్ధుడు కాగలడు?
5 Siehe, sogar der Mond scheint nicht hell, und die Sterne sind nicht rein in seinen Augen:
ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు. నక్షత్రాలు పవిత్రమైనవి కావు.
6 wieviel weniger der Mensch, der Wurm, und das Menschenkind, die Made!
మరి నిశ్చయంగా పురుగు-పురుగులాంటి నరుడు అంతే కదా.

< Job 25 >