< Marqqossa 16 >
1 Sanbatay adhidappe guye Magidale Marama Yaqobe aayo Maramira Salomira issippe bidi Yesusa anha tiyanas shito shamida.
౧విశ్రాంతి దినం అయిపోగానే, మగ్దలేనే మరియ, యాకోబు తల్లి మరియ, సలోమి కలిసి వెళ్ళి యేసు దేహానికి పూయడానికి సుగంధ ద్రవ్యాలు కొన్నారు.
2 Samintafe koyro galas malado wontara buro awa arshey kezida mala Yesusa dufokk buro bishin
౨ఆదివారం ఉదయం తెల్లవారుతూ ఉండగా వారు యేసు సమాధి దగ్గరికి వస్తూ,
3 “Dufoza dunappe shucha nuss ooni gendersanee?” gidi ba garsan hasa7etida.
౩“మన కోసం సమాధిని మూసిన ఆ రాయిని ఎవరు దొర్లిస్తారు?” అని ఒకరితో ఒకరు చెప్పుకున్నారు.
4 Issti dhoqu gi xelishin daro gitta shuchay dufoza dunappe genderidaysa beyida.
౪వారు వచ్చి సమాధికేసి చూడగా ఆ పెద్ద రాయి పక్కకి దొర్లించి ఉంది.
5 Gede dufoza giddo gelida mala issi botha mayo mayida panthi ushacha bagara utidaysa beyidi dagamida.
౫వారు ఆ సమాధిలోకి వెళ్ళి తెల్లటి దుస్తులు ధరించిన ఒక యువకుడు కుడి పక్కన కూర్చుని ఉండడం చూశారు. అది చూసి వారు నిర్ఘాంతపోయారు.
6 Izi qass istas “Dagamopitte inte kaqetida Nazirete Yesusa koyista, izi dendidees han deena, issti iza wothidaso hayssa beyte” gidees.
౬అతడు వారితో ఇలా అన్నాడు, “భయపడకండి! మీరు వెతుకుతున్నది సిలువ మరణం పొందిన నజరేతువాడైన యేసును. ఆయన తిరిగి బతికాడు. ఇక్కడ లేడు. ఇదిగో ఆయనను ఉంచిన స్థలం ఇదే.
7 Gido atin inte biidi iza kalizaytasine Phixirosas kasse intes yotida mala inteppe kasetidi izi Galila bana. Inte iza hen demana gidi istas yotitte gidees.
౭మీరు వెళ్ళి ఆయన శిష్యులతో, పేతురుతో ఇలా చెప్పండి. “యేసు మీకంటే ముందుగా గలిలయకి వెళ్తున్నాడు. ఆయన ముందుగానే చెప్పినట్టు మీరు ఆయనను అక్కడ చూస్తారు.”
8 Macashatikka malaletishene kokorishe dufappe kezi baqatida. Babida gish oonasikka aykkokka qatibeytena.
౮ఆ స్త్రీలు భయపడుతూ, వణుకుతూ, ఆ సమాధి నుండి పరుగెత్తి వెళ్ళిపోయారు. వారు భయం వల్ల తమలో తాము ఏమీ మాట్లాడుకోలేదు.
9 (note: The most reliable and earliest manuscripts do not include Mark 16:9-20.) Samintappe koyro galas Wogga wonta maladora izi hayqoppe dendidappe guye Yesusay izippe lappun daydanth kesida Magidale Maramis koyro betides.
౯(note: The most reliable and earliest manuscripts do not include Mark 16:9-20.) వారం మొదటి రోజు ఆదివారం తెల్లవారుతూ ఉండగా యేసు లేచి, తాను ఏడు దయ్యాలను వదిలించిన మగ్దలేనే మరియకు మొట్టమొదట కనిపించాడు.
10 Izakka bada kasse izara dizayti muzotishenne yekishe dishin demada yotadus.
౧౦ఆమె, యేసుతో కలిసి ఉన్న వారి దగ్గరికి వెళ్ళింది. వారు దుఃఖిస్తూ, విలపిస్తూ ఉన్నారు. అప్పుడు ఆమె యేసు తిరిగి లేచిన సంగతి వారికి చెప్పింది.
11 Isti Yesusay paxa dizaysanne iza ta iza beyadis gidaysa siyidi amanibeytena.
౧౧యేసు మళ్ళీ బతికాడనీ, తాను ఆయనను చూశాననీ చెప్పింది. కాని, వారు ఆమె మాటలు నమ్మలేదు.
12 Hessappe guye iza kalizaytappe namm7ati gede dere gars bishin Yesusay isstas hara ass milati betidees.
౧౨ఆ తరువాత వారిలో ఇద్దరు శిష్యులు వారి గ్రామానికి నడిచి వెళ్తూ ఉండగా ఆయన వారికి వేరే రూపంలో కనిపించాడు.
13 Isstikka simidi hessa iza kalizaytappe atidaytas yotida. Gido atin iza kalizyti siyidi amaibeytena.
౧౩వారు తిరిగి వెళ్ళి మిగిలిన వారికి ఆ సంగతి చెప్పారు గానీ వారు నమ్మలేదు.
14 Hessappe guye tammane issineti kaththa madan dishin Yesusay istas qoncidees. Izi hayqoppe dendin iza beyida asati isstas yotin siyidi ammanonita agida gish isstas ammanoy bayndaysanne issta wozina mumetetha gish issta borides.
౧౪ఆ తరువాత పదకొండు మంది శిష్యులు భోజనం చేస్తూ ఉండగా యేసు వారికి కనిపించాడు. తాను తిరిగి బతికిన విషయం కొందరు చెప్పినా శిష్యులు నమ్మలేదు కాబట్టి వారి అపనమ్మకం, హృదయ కాఠిన్యం బట్టి వారిని గద్దించాడు.
15 Isstaskka hizgidees “Gede alame wursoso biite, mishracho qaala medhetetha wursoso sabakitte.”
౧౫యేసు వారితో ఇలా అన్నాడు, “మీరు సర్వ లోకానికీ వెళ్ళి సృష్టిలో అందరికీ సువార్త ప్రకటించండి.
16 Aamanidayne xamaqetiday atana. Amanontay gidikko pirdistana.
౧౬దాన్ని నమ్మి బాప్తిసం పొందిన వారు రక్షణ పొందుతారు. నమ్మని వారు శిక్ష అనుభవిస్తారు.
17 Tana amanizayta hayti malatati kalana. Isti ta sunthan daydanthata kesana, ooratha qalankka hasa7ana.
౧౭“నమ్మిన వారి ద్వారా ఈ సూచక క్రియలు జరుగుతాయి, వారు నా పేరిట దయ్యాలను వెళ్ళగొడతారు. కొత్త భాషలు మాట్లాడతారు.
18 Issti shoshata ba kushera oykkana, wodhiza marzekka uyikoka issta qohena. Be kushe harganchata bolla wothi wossikko haraganchati paxana.
౧౮తమ చేతులతో విషసర్పాలను పట్టుకుంటారు. విషం తాగినా వారికి ఏ హానీ కలగదు. వారు రోగుల మీద తమ చేతులు ఉంచినప్పుడు రోగులు బాగుపడతారు.”
19 Goda Yesusay hessa yotidappe gueye pudde salo dendidi bidi Xoossa ushacan utidees.
౧౯ప్రభు యేసు వారితో మాట్లాడిన తరవాత దేవుడు ఆయనను పరలోకంలోకి స్వీకరించాడు. అక్కడ యేసు దేవుని కుడి చేతి వైపున కూర్చున్నాడు.
20 Iza kalizayti hessappe kezidi wursoson adhi adhi sabakida. Godaykka isstara oothidees. Issta timirteza ekidi oothizaytas ba yotida qalakka malata othi othi minthidees.
౨౦ఆ తరువాత శిష్యులు బయలుదేరి అన్ని ప్రాంతాలకూ వెళ్ళి యేసును ప్రకటించారు. ప్రభువు వారికి తోడై, వారు ప్రకటించిన సందేశం సత్యమని సూచనల ద్వారా, అద్భుతాల ద్వారా స్థిరపరిచాడు.