< Nombres 10 >
1 Le Seigneur parla encore à Moïse, disant:
౧యెహోవా మోషేతో మాట్లాడాడు. ఆయన ఇలా అన్నాడు.
2 Fais-toi deux trompettes d’argent ductiles, avec lesquelles tu puisses convoquer la multitude, quand le camp devra être levé.
౨“రెండు వెండి బాకాలు చేయించు. వెండిని సాగగొట్టి వాటిని చేయించాలి. సమాజాన్ని సమావేశం కోసం పిలవడానికీ, సేనలను తరలించడానికీ ఆ బాకాలను ఉపయోగించాలి.
3 Et lorsque tu auras sonné des trompettes, toute la multitude s’assemblera vers toi à la porte du tabernacle d’alliance.
౩సన్నిధి గుడారం ఎదుట నీ దగ్గరికి సమాజమంతా సమావేశం కావడానికి యాజకులు ఆ బాకాలు ఊదాలి.
4 Si tu sonnes une fois, les princes viendront vers toi, et les chefs de la multitude d’Israël.
౪యాజకులు ఒకే బాకా ఊదితే ఇశ్రాయేలు సమాజంలో నాయకులూ, తెగల పెద్దలు నీ దగ్గరకి రావాలి.
5 Mais si le son de la trompette se fait entendre plus prolongé et interrompu, ceux qui sont du côté oriental lèveront le camp les premiers.
౫మీరు పెద్ద శబ్దంతో వాటిని ఊదితే అది సంకేతంగా భావించి తూర్పు వైపున ఉన్న సేనలు ప్రయాణం ప్రారంభించాలి.
6 Mais au deuxième son et au bruit de la trompette pareil au premier, ceux qui habitent au midi enlèveront leurs tentes; et c’est de cette manière que les autres feront, les trompettes retentissant pour le départ.
౬మీరు రెండో సారి పెద్ద శబ్దంతో వాటిని ఊదితే అది సంకేతంగా భావించి దక్షిణం వైపున సైన్యాలు ప్రయాణం మొదలు పెట్టాలి. వారి ప్రయాణం ప్రారంభించినప్పుడు పెద్ద శబ్దంతో ఊదాలి.
7 Et quand le peuple devra être assemblé, le son des trompettes sera simple, et elles sonneront sans interruption.
౭సమాజం సమావేశంగా కూడినప్పుడు బాకాలు ఊదాలి గానీ పెద్ద శబ్దం చేయకూడదు.
8 Or, les fils d’Aaron, prêtres, sonneront des trompettes; et ce sera une loi perpétuelle en vos générations.
౮యాజకులైన అహరోను కొడుకులు ఆ బాకాలు ఊదాలి. మీ తరతరాల్లో మీ సంతానానికి అది నిత్యమైన నియమంగా ఉండాలి.
9 Si vous sortez de votre terre pour une guerre contre les ennemis qui combattent contre vous, vous sonnerez bruyamment des trompettes, et il y aura souvenir de vous devant le Seigneur votre Dieu, en sorte que vous soyez délivrés des mains de vos ennemis.
౯మిమ్మల్ని బాధించే శత్రువుకి వ్యతిరేకంగా మీ దేశంలో యుద్ధానికి బయలు దేరే సమయంలో ఆ బాకాలు పదేపదే పెద్ద శబ్దంతో ఊదాలి. అప్పుడు మీ దేవుడైన యెహోవా అనే నేను మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుని శత్రువుల నుండి మిమ్మల్ని రక్షిస్తాను.
10 Quand vous ferez un festin, ainsi que les jours de fête, et les calendes, vous sonnerez des trompettes au milieu des holocaustes et des victimes pacifiques, afin qu’elles soient pour vous un souvenir de la part de votre Dieu. Je suis le Seigneur votre Dieu.
౧౦మీ పండగల సమయంలోనూ, నెల ప్రారంభంలోనూ మీరు వేడుకలు చేసుకునేటప్పుడు మీరు అర్పించే దహన బలుల గౌరవార్ధం, మీ శాంతి బలుల గౌరవార్ధం మీరు బాకాలు ఊదాలి. ఇవి మీకు మీ దేవుడినైన నన్ను జ్ఞాపకం చేస్తాయి. నేనే యెహోవాను. మీ దేవుణ్ణి.”
11 À la seconde année, au second mois, au vingtième jour du mois, la nuée se leva de dessus le tabernacle de l’alliance;
౧౧రెండో సంవత్సరం రెండో నెల ఇరవయ్యో రోజున శాసనాల గుడారం పైనుండి మేఘం వెళ్లి పోయింది.
12 Alors les enfants d’Israël partirent, selon leurs bandes, du désert de Sinaï, et la nuée se reposa dans la solitude de Pharan.
౧౨కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు సీనాయి అరణ్యంలో తమ ప్రయాణం సాగించారు. మేఘం తిరిగి పారాను అరణ్యంలో నిలిచింది.
13 Or levèrent le camp les premiers, selon le commandement du Seigneur par l’entremise de Moïse,
౧౩యెహోవా మోషేకి ఇచ్చిన ఆదేశాలను బట్టి వారు తమ మొదటి ప్రయాణం చేశారు.
14 Les enfants de Juda, selon leurs bandes, dont le prince était Nahasson, fils d’Aminadab.
౧౪యూదా గోత్రం వారి ధ్వజం కింద ఉన్న సైన్యం మొదట శిబిరం బయటికి కదిలింది. అమ్మీనాదాబు కొడుకు నయస్సోను ఆ సైన్యానికి నాయకుడు.
15 Dans la tribu des enfants d’Issachar, fut prince Nathanaël, fils de Suar.
౧౫ఇశ్శాఖారు గోత్రం సైన్యాన్ని సూయారు కొడుకు నెతనేలు నడిపించాడు.
16 Dans la tribu de Zabulon, était prince Eliab, fils d’Hélon.
౧౬జెబూలూను గోత్రం సైన్యానికి హేలోను కొడుకు ఏలీయాబు నాయకుడు.
17 Ainsi, le tabernacle ayant été enlevé, les enfants de Gerson et de Mérari sortirent, le portant.
౧౭గెర్షోను, మెరారి తెగలవారు తమ బాధ్యత ప్రకారం మందిరాన్ని విప్పి దాన్ని మోస్తూ ముందుకు సాగారు.
18 Ensuite partirent aussi selon leurs bandes et leur rang, les enfants de Ruben, dont le prince était Hélisur, fils de Sédéur.
౧౮తరువాత రూబేను గోత్రం ధ్వజం కింద ఉన్న సైన్యం ముందుకు కదిలింది. ఆ సైన్యానికి నాయకుడు షెదేయూరు కొడుకు ఏలీసూరు.
19 Mais dans la tribu des enfants de Siméon, le prince fut Salamiel, fils de Surisaddaï.
౧౯షిమ్యోను గోత్రం సైన్యానికి సూరీషదాయి కొడుకు షెలుమీయేలు నాయకుడు.
20 Et dans la tribu de Gad était prince Eliasaph, fils de Duel.
౨౦గాదు గోత్రం సైన్యానికి దెయూవేలు కొడుకు ఎలీయాసాపు నాయకుడు.
21 Après, partirent aussi les Caathites portant le sanctuaire. Le tabernacle était toujours porté, jusqu’à ce qu’on vînt au lieu de l’érection,
౨౧కహాతు తెగవారు ప్రయాణమయ్యారు. వారు పరిశుద్ధ స్థలంలోని పరిశుద్ధ పరికరాలను మోస్తూ వెళ్ళారు. తరువాతి శిబిరంలో కహాతు తెగవారు వచ్చేలోగా ఇతరులు మందిరాన్ని నిలబెడుతూ ఉన్నారు.
22 Levèrent de même le camp selon leurs bandes, les enfants d’Ephraïm, dans l’armée desquels le prince était Elisama, fils d’Ammiud.
౨౨ఎఫ్రాయీము గోత్రం వారి ధ్వజం కింద వారి సేనలు కదిలాయి. ఈ సైన్యానికి అమీహూదు కొడుకు ఎలీషామా నాయకుడు.
23 Dans la tribu des fils de Manassé, le prince fut Gamaliel, fils de Phadassur.
౨౩మనష్శే గోత్రం సైన్యానికి పెదాసూరు కొడుకు గమలీయేలు నాయకుడు.
24 Et dans la tribu de Benjamin était chef Abidan, fils de Gédéon.
౨౪బెన్యామీను గోత్రం సైన్యానికి గిద్యోనీ కొడుకు అబీదాను నాయకుడు.
25 Partirent les derniers de tout le camp, selon leurs bandes, les fils de Dan, dans l’armée desquels le prince fut Ahiézer, fils d’Ammisaddaï.
౨౫చివర్లో దాను గోత్రపు సైన్యాలు తమ ధ్వజం కింద కదిలాయి. ఈ సైన్యానికి నాయకుడు అమీషదాయి కొడుకు అహీయెజెరు.
26 Mais dans la tribu des enfants d’Aser était prince Phégiel, fils d’Ochran;
౨౬ఆషేరు గోత్రం సైన్యానికి ఒక్రాను కొడుకు పగీయేలు నాయకుడు.
27 Et dans la tribu des enfants de Nephthali, le prince fut Ahira, fils d’Enan.
౨౭నఫ్తాలి గోత్రం సేనలకి ఏనాను కొడుకు అహీరా నాయకుడు.
28 Voilà le camp et les départs des enfants d’Israël, selon leurs bandes, quand ils sortaient.
౨౮ఈ విధంగా ఇశ్రాయేలు సైన్యాలు ముందుకు ప్రయాణం చేసాయి.
29 Or. Moïse dit à Hobab, fils de Raguel, le Madianite, son parent: Nous partons pour le lieu que le Seigneur doit nous donner: viens avec nous, afin que nous te fassions du bien, parce que le Seigneur a promis des biens à Israël.
౨౯మోషే హోబాబుతో మాట్లాడాడు. ఈ హోబాబు మోషే భార్యకు తండ్రి అయిన రెవూయేలు కొడుకు. ఇతడు మిద్యాను ప్రాంతం వాడు. మోషే హోబాబుతో “యెహోవా మాకు చూపించిన దేశానికి మేము వెళ్తున్నాం. దాన్ని మీకు ఇస్తానని యెహోవా మాకు చెప్పాడు. నువ్వు మాతో రా. మా వల్ల మీకు మేలు కలుగుతుంది. ఇశ్రాయేలు ప్రజలకి మేలు చేస్తానని యెహోవా ప్రమాణం చేశాడు” అని చెప్పాడు.
30 Hobab lui répondit: Je n’irai pas avec toi, mais je retournerai en ma terre, dans laquelle je suis né.
౩౦దానికి అతడు “నేను రాను. నేను నా స్వదేశానికీ, నా సొంత ప్రజల దగ్గరకీ వెళ్తాను” అన్నాడు.
31 Mais Moïse: Ne nous abandonne pas, reprit-il; car toi, tu sais dans quels lieux dans le désert nous devons camper, et tu seras notre guide.
౩౧అప్పుడు మోషే ఇలా జవాబిచ్చాడు. “నువ్వు మమ్మల్ని దయచేసి విడిచి పెట్టవద్దు. అరణ్యంలో ఎలా నివసించాలో నీకు బాగా తెలుసు. నువ్వు మా కోసం కనిపెట్టుకుని ఉండాలి.
32 Et quand tu seras venu avec nous, tout ce qu’il y aura de meilleur dans les richesses que le Seigneur doit nous accorder, nous te le donnerons.
౩౨నువ్వు మాతో వస్తే యెహోవా మాకు చేసిన మేలుని మేము నీకు చేస్తాం.”
33 Partis donc de la montagne du Seigneur, ils firent le chemin de trois journées, et l’arche d’alliance du Seigneur les précédait, montrant pendant trois jours le lieu du camp.
౩౩వారు యెహోవా కొండ దగ్గర నుండి మూడు రోజులు ప్రయాణం చేశారు. వారి విశ్రాంతి స్థలం కోసం చేసిన మూడు రోజుల ప్రయాణంలో యెహోవా నిబంధన శాసనాల పెట్టె వాళ్లకి ముందుగా కదిలింది.
34 La nuée du Seigneur aussi les couvrait pendant le jour, lorsqu’ils marchaient.
౩౪వారు తాము మజిలీ చేసిన స్థలం నుండి ప్రయాణం చేసినప్పుడు యెహోవా మేఘం పగటివేళ వారి మీద ఉంది.
35 Et lorsqu’on élevait l’arche, Moïse disait: Levez-vous, Seigneur, que vos ennemis soient dissipés, et qu’ils fuient devant votre face, ceux qui vous haïssent.
౩౫నిబంధన పెట్టె ప్రయాణం కోసం లేచినప్పుడల్లా మోషే “యెహోవా, లే, నీ శత్రువులను చెదరగొట్టు. నిన్ను ద్వేషించే వారిని నీ ఎదుటనుండి తరిమి కొట్టు” అనేవాడు.
36 Et lorsqu’on la posait, il disait: Revenez, Seigneur, à la multitude de l’armée d’Israël.
౩౬నిబంధన పెట్టె ఆగినప్పుడు మోషే “యెహోవా లక్షలాది మంది ఇశ్రాయేలు ప్రజల దగ్గరికి తిరిగి రా” అనేవాడు.