< Lévitique 24 >
1 Le Seigneur parla encore à Moïse, disant:
౧యెహోవా మోషేకు ఇలా ఆజ్ఞాపించాడు.
2 Ordonne aux enfants d’Israël qu’ils t’apportent de l’huile d’olives très pure et très claire pour entretenir des lampes perpétuellement,
౨“దీపం ఎప్పుడూ వెలుగుతూ ఉండేలా ప్రమిదల కోసం దంచి తీసిన స్వచ్ఛమైన ఒలీవ నూనె తేవాలని ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించు.
3 En dehors du voile de témoignage dans le tabernacle d’alliance. Et Aaron les disposera depuis le soir jusqu’au matin devant le Seigneur par un culte et un rite perpétuel en vos générations.
౩ప్రత్యక్ష గుడారంలో శాసనాల అడ్డతెర బయట అహరోను సాయంత్రం నుండి ఉదయం దాకా అది వెలుగుతూ ఉండేలా యెహోవా సన్నిధిలో దాన్ని చూసుకుంటూ ఉండాలి. ఇది మీ తరతరాలకు నిత్యమైన శాసనం.
4 C’est sur le chandelier très pur qu’elles seront toujours placées en la présence du Seigneur.
౪అతడు నిర్మలమైన దీపవృక్షం మీద ప్రమిదలను యెహోవా సన్నిధిలో నిత్యం చూసుకోవాలి.
5 Tu prendras aussi de la fleur de farine, et tu cuiras avec elle douze pains qui auront chacun deux décimes;
౫నీవు గోదుమ పిండి తీసుకుని దానితో పన్నెండు రొట్టెలు చెయ్యాలి. ఒక్కొక్క రొట్టెకు రెండు కిలోల పిండి వాడాలి.
6 Tu en placeras six des deux côtés sur la table très pure devant le Seigneur;
౬యెహోవా సన్నిధిలో నిర్మలమైన బల్లమీద ఆరేసి రొట్టెలున్న రెండు దొంతులుగా వాటిని ఉంచాలి.
7 Et tu mettras sur eux de l’encens le plus luisant, afin que le pain soit un monument de l’oblation du Seigneur.
౭ఒక్కొక్క దొంతి మీద స్వచ్ఛమైన సాంబ్రాణి ఉంచాలి. అది యెహోవా కోసం పరిమళ హోమం.
8 À chaque sabbat, ils seront changés devant le Seigneur, après qu’ils auront été reçus des enfants d’Israël, par une alliance perpétuelle;
౮యాజకుడు ప్రతి విశ్రాంతి దినాన నిత్య నిబంధన ప్రకారం ఇశ్రాయేలీయుల పక్షంగా ఆ రొట్టెలు బల్లపై పెడుతూ ఉండాలి.
9 Et ils appartiendront à Aaron et à ses fils, afin qu’ils les mangent dans un lieu saint, parce que c’est une chose très sainte des sacrifices du Seigneur en vertu d’un droit perpétuel.
౯ఈ అర్పణ అహరోనుకు అతని సంతానానికి. వారు పరిశుద్ధస్థలం లో దాన్ని తినాలి. నిత్య శాసనం చొప్పున యెహోవాకు చేసే హోమాల్లో అది అతి పవిత్రం.”
10 Or voilà que le fils d’une femme israélite qu’elle avait eu d’un Egyptien parmi les enfants d’Israël, étant sorti, eut une querelle dans le camp avec un Israélite.
౧౦ఒక ఇశ్రాయేలు జాతి స్త్రీకి ఐగుప్తు పురుషుడికి పుట్టిన ఒకడు ఇశ్రాయేలీయులతో కలిసి వచ్చాడు.
11 Et comme il blasphéma le nom de Dieu et le maudit, il fut conduit à Moïse (or sa mère s’appelait Salumith, fille de Dabri, de la tribu de Dan);
౧౧ఆ ఇశ్రాయేలీయురాలి కొడుక్కి ఒక ఇశ్రాయేలీయుడికి శిబిరంలో గొడవ జరిగింది. ఆ ఇశ్రాయేలీయురాలి కొడుకు యెహోవా నామాన్ని దూషించి శపించాడు. ప్రజలు మోషే దగ్గరికి వాణ్ణి తీసుకొచ్చారు. వాడి తల్లి పేరు షెలోమీతు. ఆమె దాను గోత్రికుడు దిబ్రీ కూతురు.
12 Et on le mit en prison, jusqu’à ce qu’on sût ce que commanderait le Seigneur.
౧౨యెహోవా ఏమి చెబుతాడో తెలిసేదాకా వాణ్ణి కావలిలో ఉంచారు.
13 Le Seigneur parla à Moïse,
౧౩అప్పుడు యెహోవా మోషేకు ఇలా చెప్పాడు.
14 Disant: Fais sortir hors du camp le blasphémateur; que tous ceux qui l’ont entendu mettent leurs mains sur sa tête, et que tout le peuple le lapide.
౧౪“శపించిన వాణ్ణి శిబిరం బయటికి తీసుకురా. వాడు పలికిన శాపనార్థాలు విన్న వారంతా వాని తల మీద చేతులుంచిన తరవాత ప్రజలంతా రాళ్లతో వాణ్ణి చావగొట్టాలి.
15 Et aux enfants d’Israël tu diras: Un homme qui maudira son Dieu, portera son péché;
౧౫నీవు ఇశ్రాయేలీయులతో ఇలా చెప్పు. తన దేవుణ్ణి శపించేవాడు తన పాపశిక్షను భరించాలి.
16 Et que celui qui blasphémera le nom du Seigneur, meure de mort; toute la multitude le lapidera, soit qu’il soit citoyen ou étranger. Que celui qui blasphème le nom du Seigneur meure de mort.
౧౬యెహోవా నామాన్ని దూషించేవాడికి మరణశిక్ష విధించాలి. ప్రజలంతా రాళ్లతో అలాటి వాణ్ణి చావ గొట్టాలి. పరదేశిగాని స్వదేశిగాని యెహోవా నామాన్ని దూషిస్తే వాడికి మరణశిక్ష విధించాలి.
17 Que celui qui frappe et tue un homme, meure de mort.
౧౭ఎవడైనా హత్య చేసినట్టయితే వాడికి మరణశిక్ష విధించాలి.
18 Celui qui tuera un animal, en rendra un autre à sa place, c’est-à-dire, âme pour âme.
౧౮జంతువు ప్రాణం తీసినవాడు ప్రాణానికి ప్రాణమిచ్చి దాని నష్టపరిహారం చెల్లించాలి.
19 Celui qui fera un outrage à quelqu’un de ses concitoyens, comme il aura fait, ainsi il lui sera fait:
౧౯ఒకడు తన సాటి మనిషిని గాయపరిస్తే వాడు చేసినట్టే వాడికీ చెయ్యాలి.
20 Il rendra fracture pour fracture, œil pour œil, dent pour dent. Quelque outrage qu’il ait fait, il sera obligé de le souffrir.
౨౦ఎముక విరగ్గొడితే వాడి ఎముక విరగ్గొట్టాలి. కంటికి కన్ను, పంటికి పన్ను. ఒకడు వేరొకడికి గాయం చేస్తే వాడికి అదే చెయ్యాలి.
21 Celui qui frappera une bête, en rendra une autre. Celui qui frappera un homme, sera puni.
౨౧జంతువును చావగొట్టినవాడు దాని నష్టపరిహారం ఇచ్చుకోవాలి. హత్య చేసినవాడికి మరణశిక్ష విధించాలి.
22 Qu’il y ait un jugement équitable parmi vous, que ce soit un étranger, ou un citoyen qui ait péché, parce que je suis le Seigneur votre Dieu.
౨౨మీరు పక్షపాతం లేకుండా తీర్పు తీర్చాలి. మీలో నివసించే పరదేశికి మీరు చేసినట్టే మీ స్వజాతివారికీ చెయ్యాలి. నేను మీ దేవుడినైన యెహోవానని వారితో చెప్పు” అన్నాడు.
23 Moïse parla donc aux enfants d’Israël, et ils firent sortir celui qui avait blasphémé hors du camp, et ils le lapidèrent. Et les enfants d’Israël firent comme avait ordonné le Seigneur à Moïse.
౨౩కాబట్టి మోషే ఇశ్రాయేలీయులతో “దేవుణ్ణి శాపనార్థాలు పెట్టిన వాణ్ణి శిబిరం బయటికి తీసుకుపోయి రాళ్లతో చావగొట్టండి” అని చెప్పాడు. యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్టు ఇశ్రాయేలీయులు చేశారు.