< Ézéchiel 1 >
1 Or il arriva en la trentième année, au quatrième mois, au cinquième jour du mois, que lorsque j’étais au milieu des captifs, près du fleuve de Chobar, les deux furent ouverts, et je vis les visions de Dieu.
౧నా వయస్సు ముప్ఫయ్యవ సంవత్సరం నాలుగో నెల ఐదో రోజున ఉన్నట్టుండి ఆకాశం తెరుచుకుంది. నేను దైవ దర్శనాలు చూశాను. ఆ రోజుల్లో నేను కెబారు నది దగ్గర బందీల మధ్య నివసిస్తున్నాను.
2 Le cinquième du mois, c’est la cinquième année de la transmigration du roi Joachim,
౨అది యెహోయాకీను రాజును బందీగా పట్టుకెళ్ళిన తరువాత ఐదో సంవత్సరం. ఆ నెల ఐదో రోజున
3 La parole du Seigneur fut adressée à Ezéchiel, le prêtre, fils de Buzi, dans la terre des Chaldéens, près du fleuve de Chobar, et là fut sur lui la main du Seigneur.
౩కల్దీయుల దేశంలో కెబారు నది పక్కన బూజీ కొడుకూ, యాజకుడూ అయిన యెహెజ్కేలుకు యెహోవా వాక్కు బలంగా వచ్చింది. అక్కడే యెహోవా హస్తం అతని మీదికి వచ్చింది.
4 Et je vis, et voilà qu’un vent de tourbillon venait de l’aquilon; et une grande nuée, et un feu tournoyant, et une lumière éclatante tout autour, et du milieu, c’est-à-dire du milieu du feu, brillait comme une espèce de succin;
౪అప్పుడు ఉత్తరం వైపు నుండి ఒక తుఫాను వస్తుండడం చూశాను. ఒక మహా మేఘం, దానిలో ప్రజ్వలించే అగ్ని కనిపించాయి. ఆ మేఘంలో గొప్ప కాంతి కనిపించింది. ఆ కాంతి దాన్ని ఆవరించి ఉంది. ఆ మేఘంలో మండే అగ్ని మెరుగు పెట్టిన కంచులా ఉంది.
5 Et au milieu du feu la ressemblance ressemblance de quatre animaux; et voici leur aspect: la ressemblance d’un homme.
౫దాని మధ్యలో నాలుగు జీవుల్లాంటి ఒక స్వరూపం కనిపించింది. అవి మానవ రూపంలో ఉన్నాయి.
6 Chacun d’eux avait quatre faces, et chacun d’eux quatre ailes.
౬ఒక్కో దానికి నాలుగు ముఖాలు ఉన్నాయి. అలాగే నాలుగు రెక్కలు ఉన్నాయి.
7 Leurs pieds étaient droits, et la plante de leurs pieds comme la plante du pied d’un veau, et il sortait d’eux des étincelles ayant l’apparence de l’airain le plus brillant.
౭వాటి కాళ్లు తిన్నగా ఉన్నాయి. వాటి అరికాళ్ళు దూడ డెక్కల్లా ఉన్నాయి. అవి మెరుగు పెట్టిన ఇత్తడిలా మెరుస్తూ ఉన్నాయి.
8 Et des mains d’hommes étaient sous leurs ailes aux quatre côtés; et ils avaient des faces et des ailes aux quatre côtés.
౮అయినా మనుషులకున్నట్టే వాటికి చేతులు ఉన్నాయి. అవి వాటి నాలుగు రెక్కల కింద ఉన్నాయి. నాలుగు జీవుల ముఖాలూ, రెక్కలూ ఇలా ఉన్నాయి.
9 Et les ailes de l’un étaient jointes à celles de l’autre; ils ne se retournaient pas lorsqu’ils marchaient; mais chacun d’eux allait devant sa face.
౯వాటి రెక్కలు పక్కనే ఉన్న మరో జీవి రెక్కలను తాకుతూ ఉన్నాయి. అవి వెళ్తున్నప్పుడు ఏ వైపుకీ తిరగడం లేదు. అవన్నీ ముందుకే ప్రయాణం చేస్తూ ఉన్నాయి.
10 Quant à la ressemblance de leur visage, c’était une face d’homme et une face de lion, à la droite des quatre; mais une face de bœuf à la gauche des quatre, et une face d’aigle au-dessus des quatre.
౧౦వాటి ముఖాలు ఎదుట నుంచి చూస్తే మనిషి ముఖాల్లా ఉన్నాయి. కుడివైపు నుండి చూస్తే సింహం ముఖంలా ఎడమవైపు నుండి చూస్తే ఎద్దు ముఖంలా ఉన్నాయి. ఇంకా ఈ నాలుగు జీవులకీ డేగ లాంటి ముఖాలు ఉన్నాయి.
11 Leurs faces et leurs ailes s’étendaient en haut: ils se tenaient l’un l’autre par deux de leurs ailes, et ils couvraient leur corps par les deux autres;
౧౧వాటి ముఖాలు అలాంటివే. వాటి రెక్కలు పైకి విచ్చుకుని ఉన్నాయి. దాంతో ఒక జత రెక్కలు మరో జీవి రెక్కలను తాకుతూ ఉన్నాయి. ఇంకో జత రెక్కలు వాటి దేహాలను కప్పుతూ ఉన్నాయి.
12 Et chacun d’eux marchait devant sa face; là où était l’impétuosité de l’esprit, là ils allaient; et ils ne se retournaient pas lorsqu’ils marchaient.
౧౨అవి అన్నీ ముందుకు సాగి వెళ్తున్నాయి. అటూ ఇటూ తిరుగకుండా ఆత్మ నిర్దేశించిన మార్గంలో వెళ్తున్నాయి.
13 Et la ressemblance des animaux et leur aspect étaient comme un feu de charbons ardents et comme un aspect de lampes. Voici ce qu’on voyait courir au milieu des animaux: l’éclat d’un feu, et la foudre sortant du feu.
౧౩ఈ జీవులు రగులుతున్న నిప్పు కణికల్లా, దివిటీల్లా కనిపిస్తున్నాయి. ప్రకాశవంతమైన అగ్ని ఆ జీవుల మధ్య కదులుతూ ఉంది. అక్కడ నుండి మెరుపులు వస్తున్నాయి.
14 Et les animaux allaient et revenaient, comme la foudre étincelante.
౧౪ఆ జీవులు వెనక్కీ ముందుకీ కదులుతున్నాయి. దాంతో అవి మెరుపుల్లా కనిపిస్తున్నాయి.
15 Et comme je regardais les animaux, apparut sur la terre, près des animaux, une roue ayant quatre faces;
౧౫తరువాత నేను ఆ జీవులను చూస్తుంటే వాటి పక్కనే నేలపైన చక్రాల వంటివి కనిపించాయి.
16 Et l’aspect des roues et leur structure étaient comme la vue de la mer, et toutes quatre se ressemblaient: et leur aspect et leur structure étaient comme ceux d’une roue qui est au milieu d’une autre roue.
౧౬ఆ చక్రాల నిర్మాణం ఇలా ఉంది, ప్రతి చక్రం గోమేధికంలా ఉంది. నాలుగు చక్రాలూ ఒకేలా ఉన్నాయి. ఒక చక్రంలో మరో చక్రం ఇమిడి ఉన్నట్టుగా ఉన్నాయి.
17 Elles allaient constamment par leurs quatre côtés, et elles ne se retournaient pas lorsqu’elles marchaient.
౧౭అవి కదిలినప్పుడు అన్నీ నాలుగు వైపులకీ కదులుతున్నాయి. ఏదీ వెనక్కి తిరగడం లేదు.
18 Les roues avaient aussi une étendue, une hauteur et un aspect horrible; et tout le corps des quatre roues était plein d’yeux tout autour.
౧౮వాటి అంచులు ఎత్తుగా ఉండి భయం పుట్టిస్తున్నాయి. వాటి అంచుల చుట్టూ కళ్ళు ఉన్నాయి.
19 Et lorsque les animaux marchaient, marchaient pareillement aussi les roues près d’eux; et lorsque les animaux s’élevaient de terre, s’élevaient en même temps aussi les roues.
౧౯ఆ జీవులు కదిలినప్పుడల్లా వాటితో పాటు ఆ చక్రాలు కూడా కదిలాయి. జీవులు భూమి పై నుండి పైకి లేచినప్పుడు ఆ చక్రాలు కూడా లేచాయి.
20 Partout où allait l’esprit, là allant l’esprit, les roues aussi pareillement s’élevaient en le suivant. Car l’esprit de vie était dans les roues.
౨౦ఆత్మ ఎక్కడికి కదిలి వెళ్తున్నాడో జీవులు కూడా అక్కడికి వెళ్తున్నాయి. చక్రాలు జీవులతో పాటు లేస్తున్నాయి. ఎందుకంటే ఈ జీవుల ఆత్మ చక్రాల్లో ఉంది.
21 Lorsque les animaux allaient, les roues allaient; lorsqu’ils s’arrêtaient, elles s’arrêtaient; lorsqu’ils s’élevaient de terre, pareillement s’élevaient aussi les roues, en les suivant; parce que l’esprit de vie était en elles.
౨౧ఈ జీవుల ఆత్మ చక్రాల్లో ఉంది కాబట్టి జీవులు కదిలినప్పుడు చక్రాలు కూడా కదిలాయి. జీవులు నిశ్చలంగా నిలిచిపోయినప్పుడు చక్రాలు కూడా నిలిచిపోయాయి. జీవులు భూమిపై నుండి పైకి లేచినప్పుడు చక్రాలు కూడా లేచాయి.
22 Et une ressemblance du firmament était au-dessus de la tête des animaux, comme l’aspect d’un cristal horrible et étendu en haut sur leurs têtes.
౨౨ఆ జీవుల తలల పైగా విశాలమైనది ఒకటి కనిపించింది. అది మెరుస్తున్న మంచు గడ్డలా ఆ జీవుల తలల పైగా వ్యాపించినట్టు కనిపించింది. అది అద్భుతం గానూ, ఆశ్చర్యాన్ని కలిగించేది గానూ ఉంది.
23 Mais sous le firmament, leurs ailes étaient droites l’une vis-à-vis de l’autre; l’un avec deux de ses ailes voilait son corps, et l’autre semblablement se voilait.
౨౩ఆ విశాలమైన దాని కింద జీవులు తమ రెక్కలు చాపుకుని ఉన్నాయి. ఒకదాని రెక్కలు మరోదాని రెక్కలను తాకుతూ ఉన్నాయి. ప్రతి జీవీ తన రెండు రెక్కలతో తన దేహాన్ని కప్పుకుంటూ ఉంది. అలా ప్రతి జీవికీ దేహాన్ని కప్పుకోడానికి రెండు రెక్కలున్నాయి.
24 Et j’entendais le bruit de leurs ailes comme le bruit des grandes eaux, comme la voix du Dieu très haut: quand ils marchaient, c’était comme le bruit d’une grande multitude, comme le bruit d’un camp; et quand ils s’arrêtaient, leurs ailes s’abaissaient.
౨౪ఆ తరువాత నేను వాటి రెక్కల శబ్దం విన్నాను. అది పరుగులెత్తే నీటి శబ్దంలా ఉంది. సర్వశక్తిగల దేవుని స్వరంలా ఉంది. అవి కదిలినప్పుడల్లా గాలివాన శబ్దం వినిపించింది. ఒక సైన్యం చేస్తున్న శబ్దంలా తోచింది. అవి కదలకుండా ఆగినప్పుడు తమ రెక్కలను కిందకి వాల్చి ఉంచాయి.
25 Car lorsque la voix se faisait entendre au-dessus du firmament qui était sur leurs têtes, ils s’arrêtaient et baissaient leurs ailes.
౨౫అవి ఆగిపోయి తమ రెక్కలు చాపినప్పుడు వాటి తలల పైన ఉన్న విశాలమైన దానికి పైగా ఒక స్వరం వినిపించింది.
26 Et sur ce firmament qui était suspendu au-dessus de leurs têtes, c’était comme l’aspect d’un saphir ressemblant à un trône; et sur cette ressemblance d’un trône, une ressemblance comme l’aspect d’un homme dessus.
౨౬వాటి తలల పైగా ఉన్న ఆ విశాలమైనదాని పైన ఒక సింహాసనం లాంటిది కనిపించింది. అది నీలకాంత మణిలా ఉంది. ఆ సింహాసనం పైన మానవ స్వరూపంలో ఉన్న ఒక వ్యక్తి కూర్చున్నట్లు కనిపించింది.
27 Et je vis comme une espèce de succin, comme l’apparence d’un feu, au dedans de lui tout autour; depuis ses reins et au-dessus, et depuis ses reins jusqu’en bas, je vis comme une espèce de feu, resplendissant tout autour.
౨౭అప్పుడు ఒక ఆకారాన్ని నేను చూశాను. అతని నడుము పైగా అగ్నితో మండుతున్న లోహంలా నాకు కనిపించింది. అతని నడుము కింద చుట్టూ అగ్నిలా, ప్రకాశవంతమైన కాంతిలా కనిపించింది.
28 Je vis comme l’aspect de l’arc, lorsqu’il est dans une nuée au jour de la pluie; tel était l’aspect de la splendeur tout autour.
౨౮అది వర్షం కురిసినప్పుడు మబ్బుల్లో కనిపించే మేఘధనస్సులా, దాని చుట్టూ ఉండే ప్రకాశవంతమైన కాంతిలా కనిపించింది. అది యెహోవా మహిమలా కనిపించింది. అది చూసి నేను సాగిలపడ్డాను. అప్పుడు ఒక స్వరం నాతో మాట్లాడటం నేను విన్నాను.