< Ézéchiel 6 >
1 Et la parole du Seigneur me fut adressée, disant:
౧నా దగ్గరికి తిరిగి యెహోవా వాక్కు వచ్చింది. ఆయన నాకిలా చెప్పాడు.
2 Fils d’un homme, tourne ta face vers les montagnes d’Israël, et tu prophétiseras contre elles,
౨“నరపుత్రుడా, ఇశ్రాయేలు పర్వతాలకు అభిముఖంగా నిలబడి ఇలా ప్రకటించు.
3 Et dis-leur: Montagnes d’Israël, écoutez la parole du Seigneur Dieu aux montagnes, aux collines, aux rochers et aux vallées: Voilà que moi j’amènerai sur vous le glaive, et je détruirai entièrement vos hauts lieux,
౩ఇశ్రాయేలు పర్వతాల్లారా, ప్రభువైన యెహోవా మాట వినండి. ప్రభువైన యెహోవా పర్వతాలతోనూ, కొండలతోనూ, వాగులతోనూ, లోయలతోనూ ఇలా చెప్తున్నాడు. చూడండి! మీకు విరోధంగా ఖడ్గాన్ని పంపుతున్నాను. మీ ఉన్నత స్థలాలను నాశనం చేస్తాను.
4 Et j’abattrai vos autels, et vos simulacres seront brisés; et je jetterai ceux qui vous seront tués devant vos idoles.
౪తరువాత మీ బలిపీఠాలు పాడై పోతాయి. మీ దేవతా స్తంభాలు ధ్వంసం అవుతాయి. హతమైన మీ వాళ్ళను మీ విగ్రహాల ఎదుట పారవేస్తాను.
5 Et je mettrai les cadavres des fils d’Israël devant la face de vos simulacres, et je disperserai vos os autour de vos autels.
౫ఇశ్రాయేలు ప్రజల శవాలను వారి విగ్రహాల ఎదుట పేరుస్తాను. వాళ్ళ ఎముకలను మీ బలిపీఠాల చుట్టూ వెదజల్లుతాను.
6 Dans toutes vos habitations les villes seront désertes, et les hauts lieux seront abattus et détruits; et vos autels tomberont et seront brisés; vos idoles ne seront plus, et vos temples seront détruits, et vos ouvrages périront.
౬మీరు ఏ పట్టణంలో నివసించినా ఆ పట్టణాలు నాశనం అవుతాయి. మీ బలిపీఠాలు నాశనం, నిర్జనం అవుతాయి. తరువాత అవి పగిలి పోతాయి. మాయమై పోతాయి. మీ దేవతా స్తంభాలు విరిగిపోతాయి. మీరు చేసినవన్నీ తుడిచిపెట్టుకు పోతాయి.
7 Et les tués tomberont au milieu de vous, et vous saurez que moi je suis le Seigneur.
౭ప్రజలు చనిపోయి మీ మధ్యలో కూలిపోతారు. నేను యెహోవాను అని మీరు తెలుసుకుంటారు.
8 Et je laisserai d’entre vous ceux qui auront échappé au glaive, parmi les nations, lorsque je vous aurai dispersés dans les divers pays.
౮అయితే మీలో కొంత శేషాన్ని నేను భద్రం చేస్తాను. మీరు వివిధ దేశాల్లోకి చెదరిపోయినప్పుడు మీలో కొంతమంది ఖడ్గాన్ని తప్పించుకుంటారు.
9 Et ceux qui vous auront été délivrés se souviendront de moi parmi les nations, chez lesquelles ils auront été emmenés captifs, parce que j’ai brisé leur cœur fornicateur et qui s’est retiré de moi, et leurs yeux qui ont forniqué à la suite de leurs idoles; et ils se déplairont à eux-mêmes à cause des maux qu’ils ont faits dans leurs abominations.
౯అప్పుడు అలా తప్పించుకుని ఇతర జాతుల మధ్య బందీలుగా ఉన్నవారు నా గురించి ఆలోచిస్తారు. వాళ్ళకి నన్ను దూరం చేసిన తమ లైంగిక విశృంఖలత, విగ్రహాలపట్ల వాళ్ళకున్న అనురక్తీ నన్నెలా వేదనకి గురి చేసిందో ఆలోచిస్తారు. చండాలమైన పనులన్నిటితో తాము సాగించిన దుర్మార్గత పట్ల వాళ్ళ ముఖాలపై అసహ్యం కనిపిస్తుంది.
10 Et ils sauront que moi, le Seigneur, je n’ai pas dit en vain que je leur ferais ce mal.
౧౦అప్పుడు నేనే యెహోవాను అని తెలుసుకుంటారు. వాళ్ళ పైకి కీడు రప్పిస్తానని నేను చెప్పిన మాట వెనుక ఒక కారణం ఉంది.”
11 Voici ce que dit le Seigneur Dieu: Frappe ta main, et heurte ton pied, et dis: Malheur sur toutes les abominations des maux de la maison d’Israël, parce que c’est par le glaive, par la famine et par la peste qu’ils doivent tomber.
౧౧ప్రభువైన యెహోవా ఇలా చెప్తున్నాడు. “నీ చేతులు చరిచి నీ పాదాలు నేలకు తన్ను! ఇశ్రాయేలు జాతి సాగించిన అసహ్యమైన పనుల కోసం ‘అయ్యో’ అని రోదించు. ఎందుకంటే వాళ్ళని ఖడ్గం, కరువు, తెగులు హతం చేస్తాయి.
12 Celui qui est au loin mourra de la peste; mais celui qui est près tombera sous le glaive; celui qui aura été laissé et assiégé mourra de faim; et j’assouvirai mon indignation sur eux.
౧౨దూరంగా ఉన్నవాళ్ళు తెగులు వల్ల చస్తారు. సమీపంలో ఉన్నవాళ్ళను ఖడ్గం హతం చేస్తుంది. మిగిలిన వాళ్ళు కరువు వల్ల చనిపోతారు. ఈ విధంగా నా క్రోధాన్ని అమలు చేస్తాను.
13 Et vous saurez que je suis le Seigneur, lorsque ceux qui vous auront été tués seront gisants au milieu de vos idoles, autour de vos autels, sur toute colline élevée, et sur tous les sommets des montagnes, et sous tout arbre touffu, et sous tout chêne feuillu; lieux où ils ont brûlé des encens odorants en l’honneur de leurs idoles.
౧౩వాళ్ళలో హతం అయిన వాళ్ళు ఎత్తయిన కొండలన్నిటి పైనా బలిపీఠాల చుట్టూ ఉన్న విగ్రహాల మధ్యలోనూ, పర్వత శిఖరాల పైనా, తమ విగ్రహాలకి పరిమళ ధూపం వేసిన పచ్చని చెట్లన్నిటి మధ్యా, సింధూర వృక్షాల మధ్యా పడి ఉంటారు. అప్పుడు నేనే యెహోవాను అని మీరు తెలుసుకుంటారు.
14 Et j’étendrai ma main sur eux, et je rendrai la terre désolée et abandonnée, depuis le désert de Déblatha, dans toutes leurs habitations; et ils sauront que je suis le Seigneur.
౧౪నా శక్తిని కనుపరుస్తాను. వాళ్ళ దేశాన్నీ, వాళ్ళు నివసించే ప్రాంతాలన్నిటినీ దిబ్లాతు ఎడారిలా నిర్జనం గానూ, వ్యర్ధంగానూ చేస్తాను. అప్పుడు నేనే యెహోవాను అని వాళ్లు తెలుసుకుంటారు.”