< 2 Rois 13 >
1 En la vingt-troisième année de Joas, fils d’Ochozias, roi de Juda, Joachaz, fils de Jéhu, régna sur Israël dans Samarie, pendant dix-sept ans.
౧యూదా రాజు అహజ్యా కుమారుడు యోవాషు పరిపాలనలో 23 వ సంవత్సరంలో యెహూ కుమారుడు యెహోయాహాజు షోమ్రోనులో ఇశ్రాయేలుపై తన పరిపాలన మొదలు పెట్టాడు. అతడు 15 సంవత్సరాలు ఏలాడు.
2 Il fit le mal devant le Seigneur, et il suivit les péchés de Jéroboam, fils de Nabath, qui fit pécher Israël, et il ne s’en détourna point.
౨ఇతడు ఇశ్రాయేలు వారు పాపం చేయడానికి కారకుడైన నెబాతు కుమారుడు యరొబాము పాపాలను వదలకుండా అనుసరిస్తూ యెహోవా దృష్టిలో దుర్మార్గంగా ప్రవర్తించాడు.
3 Et la fureur du Seigneur fut irritée contre Israël, et il les livra à la main d’Hazaël, roi de Syrie, et à la main de Bénadad, fils d’Hazaël, durant tous ses jours.
౩కాబట్టి యెహోవా కోపం ఇశ్రాయేలు వారిపై రగులుకుంది. ఆయన సిరియా రాజు హజాయేలు కాలంలోనూ హజాయేలు కుమారుడు బెన్హదదు కాలంలోనూ ఇశ్రాయేలు వారిని వారి వశం చేశాడు.
4 Or Joachaz implora la face du Seigneur, et le Seigneur l’écouta; car il vit l’angoisse d’Israël, parce que le roi de Syrie les avait brisés.
౪అయితే యెహోయాహాజు యెహోవాను వేడుకున్నప్పుడు యెహోవా సిరియా రాజు మూలంగా బాధలు పడుతున్న ఇశ్రాయేలు వారిని కనికరించి అతని మనవి అంగీకరించాడు.
5 Et le Seigneur donna un sauveur à Israël, et il fut délivré de la main du roi de Syrie; et les enfants d’Israël habitèrent dans leurs tabernacles comme hier et avant-hier.
౫ఎలాగంటే యెహోవా ఇశ్రాయేలు వారికి ఒక రక్షకుణ్ణి ఇచ్చాడు. అతని మూలంగా ఇశ్రాయేలు వారు సిరియా వారి వశంలోనుండి తప్పించుకుని మునుపటి లాగానే తమ సొంత పల్లెల్లో కాపురం ఉన్నారు.
6 Cependant ils ne s’écartèrent pas des péchés de la maison de Jéroboam, qui fit pécher Israël; mais ils y marchèrent, puisque même le bois sacré demeura toujours en Samarie.
౬అయినా ఇశ్రాయేలు వారు పాపం చేయడానికి కారణభూతుడైన యరొబాము కుటుంబికులు చేసిన పాపాలనే వారు కూడా వదలకుండా అనుసరించారు. ఆ దేవతాస్తంభాలు షోమ్రోనులో అలానే నిలిచి ఉన్నాయి.
7 Et il ne resta de peuple à Joachaz que cinquante cavaliers, dix chariots et dix mille hommes de pied; car le roi de Syrie les avait tués et réduits comme la poussière dans un battage d’aire.
౭అశ్వికులు 50 మంది, రథాలు పది, కాల్బలం పదివేలమంది మాత్రమే యెహోయాహాజు దగ్గర మిగిలారు. మిగిలిన వారిని సిరియా రాజు తూర్పారబట్టిన పొట్టు లాగా నాశనం చేశాడు.
8 Mais le reste des actions de Joachaz, tout ce qu’il a fait, et son courage, n’est-ce pas écrit dans le Livre des actions des jours des rois d’Israël?
౮యెహోయాహాజు గురించిన మిగతా విషయాలు, అతడు చేసిన మిగతా పనులు, అతడు చూపిన పరాక్రమం ఇశ్రాయేలు రాజుల వృత్తాంత గ్రంథంలో రాసి ఉంది కదా.
9 Et Joachaz dormit avec ses pères, et on l’ensevelit à Samarie; et Joas, son fils, régna en sa place.
౯యెహోయాహాజు తన పూర్వికులతో కన్ను మూశాడు. అతణ్ణి షోమ్రోనులో పాతిపెట్టారు. అతని కుమారుడు యెహోయాషు అతని స్థానంలో రాజయ్యాడు.
10 En la trente-septième année de Joas, roi de Juda, Joas, fils de Joachaz, régna sur Israël dans Samarie, pendant seize ans;
౧౦యూదారాజు యోవాషు పరిపాలనలో 37 వ సంవత్సరాన యెహోయాహాజు కుమారుడు యెహోయాషు షోమ్రోనులో ఇశ్రాయేలుపై పరిపాలన మొదలు పెట్టి 16 సంవత్సరాలు ఏలాడు.
11 Et il fit le mal devant le Seigneur: il ne se détourna pas de tous les péchés de Jéroboam, fils de Nabath, qui fit pécher Israël; mais il y marcha.
౧౧ఇతడు కూడా ఇశ్రాయేలు వారు పాపం చేయడానికి కారణభూతుడైన నెబాతు కుమారుడు యరొబాము చేసిన పాపాలను వదలకుండా వాటినే అనుసరిస్తూ యెహోవా దృష్టికి దుర్మార్గంగా ప్రవర్తించాడు.
12 Mais le reste des actions de Joas, tout ce qu’il a fait, et son courage, et comment il combattit contre Amasias, roi de Juda, n’est-ce pas écrit dans le Livre des actions des jours des rois d’Israël?
౧౨యెహోయాషు చేసిన మిగతా పనులు, అతని చర్యలన్నిటి గురించీ యూదా రాజు అమజ్యాతో యుద్ధమాడినప్పుడు అతడు కనుపరచిన పరాక్రమం గూర్చి ఇశ్రాయేలు రాజుల వృత్తాంత గ్రంథంలో రాసి ఉంది కదా.
13 Et Joas dormit avec ses pères; mais Jéroboam s’assit sur son trône. Or Joas fut enseveli à Samarie avec les rois d’Israël.
౧౩యెహోయాషు తన పూర్వికులతో కన్నుమూసిన తరవాత అతని సింహాసనంపై యరొబాము ఆసీనుడయ్యాడు. యెహోయాషును షోమ్రోనులో ఇశ్రాయేలు రాజుల సమాధిలో పాతిపెట్టారు.
14 Cependant Élisée était malade de la maladie même dont il mourut; et Joas, roi d’Israël, descendit vers lui, et il pleurait devant lui, et disait: Mon père, mon père, vous le char d’Israël et son conducteur.
౧౪ఎలీషా మరణాంతక వ్యాధి బారిన పడ్డాడు. ఇశ్రాయేలు రాజు యెహోయాషు అతని దగ్గరికి వచ్చి అతణ్ణి చూసి కన్నీరు కారుస్తూ “నా తండ్రీ, నా తండ్రీ, ఇశ్రాయేలు ప్రజలకు రథం, అశ్వికదళం నువ్వే కదా” అని విలపించాడు.
15 Et Élisée lui dit: Apportez-moi un arc et des flèches. Et lorsqu’il lui eut apporté un arc et des flèches,
౧౫అప్పుడు ఎలీషా “విల్లంబులు తీసుకురా” అని అతనితో చెప్పాడు. అతడు అలానే చేశాడు.
16 Élisée dit: Mettez votre main sur cet arc. Et lorsque le roi eut mis sa main, Élisée mit ses mains sur les mains du roi,
౧౬“నీ చెయ్యి విల్లుపై వెయ్యి” అని అతడు ఇశ్రాయేలు రాజుతో చెప్పాడు. అతడు తన చెయ్యి విల్లుపై ఉంచాడు. ఎలీషా రాజు చేతుల మీద తన చేతులు పెట్టి
17 Et dit: Ouvrez la fenêtre qui regarde l’orient. Et lorsqu’il l’eut ouverte, Élisée dit: Jetez une flèche. Et il la jeta. Et Élisée reprit: Flèche de salut du Seigneur, flèche de salut contre la Syrie; et vous frapperez la Syrie à Aphec, jusqu’à ce que vous l’exterminiez.
౧౭“తూర్పు వైపు కిటికీ తెరువు” అన్నాడు. రాజు అలానే చేశాడు. అప్పుడు ఎలీషా “బాణం వెయ్యి” అని చెప్పగా అతడు బాణం వేశాడు. అతడు “ఇది యెహోవా రక్షణ బాణం. సిరియనుల చేతిలో నుండి మిమ్మల్ని రక్షించే బాణం. సిరియనులు నాశనమయ్యేలా నీవు ఆఫెకులో వారిని హతమారుస్తావు” అని చెప్పాడు.
18 Il dit encore: Prenez les flèches. Lorsque le roi les eut prises, il lui dit de nouveau: Frappez la terre avec un dard. Et lorsqu’il eut frappé trois fois, et qu’il se fut arrêté,
౧౮ఈసారి ఎలీషా “బాణాలు పట్టుకో” అని చెప్పగా అతడు పట్టుకున్నాడు. అప్పుడు ఎలీషా ఇశ్రాయేలు రాజుతో “నేలను కొట్టు” అన్నాడు. అతడు మూడు సార్లు కొట్టి ఊరుకున్నాడు.
19 L’homme de Dieu s’irrita contre lui et dit: Si vous eussiez frappé la terre cinq fois, ou six fois, ou sept fois, vous auriez frappé la Syrie jusqu’à l’extermination; mais maintenant vous la frapperez par trois fois.
౧౯అది చూసి దైవసేవకుడు అతనిపై మండిపడి “నీవు ఐదారు సార్లు కొట్టి ఉంటే సిరియనులు నాశనమయ్యే దాకా నీవు వారిని నిర్మూలం చేసి ఉండే వాడివి. అయితే ఇప్పుడు మూడు సార్లు మాత్రమే సిరియనులను ఓడిస్తావు” అని చెప్పాడు.
20 Élisée mourut donc, et on l’ensevelit. Or des voleurs de Moab vinrent sur la terre d’Israël en cette même année.
౨౦తరువాత ఎలీషా చనిపోయాడు. వారు అతణ్ణి సమాధిలో పెట్టారు. ఒక సంవత్సరం తరవాత మోయాబీ దోపిడీ దారుల గుంపులు దేశంపై దండెత్తారు.
21 Or quelques hommes enterrant un mort virent les voleurs, et jetèrent le cadavre dans le sépulcre d’Élisée. Lorsque le cadavre eut touché les os d’Élisée, l’homme revécut, et se tint sur ses pieds.
౨౧కొందరు ఒక శవాన్ని పాతిపెడుతూ శత్రు సైన్యానికి భయపడి ఆ శవాన్ని ఎలీషా సమాధిలో పెట్టారు. సమాధిలో దింపిన ఆ మృతదేహం ఎలీషా ఎముకలు తగలగానే తిరిగి బతికి అతడు తన కాళ్ళపై నిలబడ్డాడు.
22 Hazaël, roi de Syrie, affligea donc Israël durant tous les jours de Joachaz;
౨౨యెహోయాహాజు కాలమంతా సిరియారాజు హజాయేలు ఇశ్రాయేలు వారిని బాధించాడు.
23 Et le. Seigneur eut pitié d’eux, et il revint à eux à cause de son alliance qu’il avait faite avec Abraham, Isaac et Jacob: il ne voulut pas les perdre, ni les rejeter entièrement jusqu’au temps présent.
౨౩అయితే యెహోవా వారిపై జాలిపడి దయ చూపి అబ్రాహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసిన నిబంధనను బట్టి వారిపై శ్రద్ధ చూపి, వారిని నాశనం చేయడానికి ఇష్టపడలేదు. ఇప్పటికీ తన సముఖం లోనుండి వారిని వెళ్లగొట్టలేదు.
24 Cependant Hazaël, roi de Syrie, mourut, et Bénadad, son fils, régna en sa place.
౨౪సిరియారాజు హజాయేలు చనిపోగా అతని కుమారుడు బెన్హదదు అతనికి స్థానంలో రాజయ్యాడు.
25 Mais Joas, fils de Joachaz, reprit de la main de Bénadad, fils d’Hazaël, les villes qu’Hazaël avait prises de la main de Joachaz, son père, par le droit de la guerre. Joas le battit par trois fois, et il rendit les villes d’Israël.
౨౫యెహోయాహాజు కొడుకు యెహోయాషు హజాయేలు కొడుకు బెన్హదదు తన తండ్రి యెహోయాహాజు చేతిలో నుండి యుద్ధంలో స్వాధీనం చేసుకున్న పట్టణాలను తిరిగి వశపరచుకున్నాడు. యెహోయాషు అతణ్ణి మూడు సార్లు జయించి ఇశ్రాయేలు నగరాలను తిరిగి వశపరచుకున్నాడు.