< Joël 2 >
1 Sonnez de la trompette en Sion, faites-la retentir sur ma sainte montagne! Que tous les habitants du pays tremblent! Car le jour de l'Éternel vient, car il est proche;
౧సీయోనులో బాకా ఊదండి, నా పరిశుద్ధ పర్వతం మీద మేల్కొలిపే శబ్దం చేయండి! యెహోవా దినం వస్తున్నదనీ అది సమీపమయ్యిందనీ దేశనివాసులంతా భయంతో వణకుతారు గాక.
2 Jour de ténèbres et d'obscurité, jour de nuées et de brouillards. Comme l'aube du jour s'étend sur les montagnes, voici un peuple nombreux et fort, tel qu'il n'y en a point eu dans tous les temps et qu'il n'y en aura plus dans la suite, de génération en génération.
౨అది చీకటి రోజు, గాఢాంధకారమయమైన రోజు. కారు మబ్బులు కమ్మే కటిక చీకటి రోజు. పర్వతాల మీద ఉదయకాంతి ప్రసరించినట్టు బలమైన గొప్ప సేన వస్తూ ఉంది. అలాంటి సేన ఎన్నడూ లేదు, ఇక ఎన్నడూ మళ్ళీ రాదు. తరతరాల తరువాత కూడా అది ఉండదు.
3 Un feu dévore devant lui, et derrière lui une flamme consume. Avant lui le pays était un jardin d'Éden, après lui c'est un désert affreux, et il n'y a rien qui lui échappe.
౩దాని ముందు అగ్ని అన్నిటినీ కాల్చేస్తున్నది. వాటి వెనుక, మంట మండుతూ ఉంది. అది రాకముందు భూమి ఏదెను తోటలా ఉంది. అది వచ్చి వెళ్లిపోయిన తరువాత భూమి ఎడారిలా పాడయింది. దానినుంచి ఏదీ తప్పించుకోలేదు.
4 Leur aspect est comme l'aspect des chevaux, et ils s'élancent comme des cavaliers.
౪సేన రూపం, గుర్రాల లాగా ఉంది. వాళ్ళు రౌతులలాగా పరుగెడుతున్నారు.
5 C'est comme un bruit de chars, quand ils bondissent au sommet des montagnes, comme le pétillement d'une flamme de feu, qui dévore du chaume; c'est comme un peuple puissant rangé en bataille!
౫వాళ్ళు పర్వత శిఖరాల మీద రథాలు పరుగులు పెడుతున్నట్టు వచ్చే శబ్దంతో దూకుతున్నారు. ఎండిన దుబ్బు మంటల్లో కాలుతుంటే వచ్చే శబ్దంలా, యుద్ధానికి సిద్ధమైన గొప్ప సేనలా ఉన్నారు.
6 Devant eux les peuples tremblent, tous les visages pâlissent.
౬వాటిని చూసి ప్రజలు అల్లాడిపోతున్నారు, అందరి ముఖాలు పాలిపోతున్నాయి.
7 Ils courent comme des hommes vaillants; ils montent sur la muraille comme des gens de guerre; ils marchent chacun en son rang, et ne s'écartent point de leur route.
౭అవి శూరుల్లాగా పరుగెడుతున్నాయి. సైనికుల్లాగా అవి గోడలెక్కుతున్నాయి. అటూ ఇటూ తిరుగకుండా అవన్నీ తిన్నగా నడుస్తున్నాయి.
8 L'un ne presse point l'autre; chacun poursuit sa voie. Ils se précipitent au travers des traits, ils n'interrompent point leur marche.
౮ఒకదానినొకటి తోసుకోకుండా తమ దారిలో చక్కగా పోతున్నాయి. ఆయుధాలు ఎదుర్కొన్నా వరుస తప్పవు.
9 Ils se répandent dans la ville, courent sur les murs, montent dans les maisons; ils entrent par les fenêtres comme le voleur.
౯పట్టణంలో చొరబడుతున్నాయి. గోడల మీద పరుగెడుతూ దొంగల్లాగా కిటికీల గుండా ఇళ్ళల్లోకి వస్తున్నాయి.
10 Devant eux la terre tremble, les cieux sont ébranlés, le soleil et la lune s'obscurcissent, et les étoiles retirent leur éclat.
౧౦వాటి ముందు భూమి కంపిస్తున్నది, ఆకాశాలు వణుకుతున్నాయి. సూర్యచంద్రులకు చీకటి కమ్ముకుంది. నక్షత్రాలు కాంతి తప్పుతున్నాయి.
11 Et l'Éternel fait entendre sa voix devant son armée; car son camp est fort nombreux, l'exécuteur de sa parole est puissant. Certainement le jour de l'Éternel est grand et terrible; qui pourra le soutenir?
౧౧యెహోవా తన సైన్యం ముందు తన స్వరం పెంచాడు, ఆయన యోధులు చాలా ఎక్కువమంది. ఆయన ఆజ్ఞలను నెరవేర్చేవారు బలవంతులు. యెహోవా దినం గొప్పది, మహా భయంకరమైనది. దాన్ని ఎవరు వైపుకోగలరు?
12 Et maintenant encore, dit l'Éternel, convertissez-vous à moi de tout votre cœur, avec jeûne, avec larmes et avec lamentations.
౧౨యెహోవా ఇలా అంటున్నాడు, “ఇప్పుడైనా, ఉపవాసముండి కన్నీళ్ళు కారుస్తూ దుఃఖిస్తూ హృదయపూర్వకంగా నాదగ్గరికి తిరిగి రండి.”
13 Déchirez vos cœurs, et non vos vêtements; et revenez à l'Éternel votre Dieu; car il est miséricordieux et compatissant, lent à la colère et abondant en grâce, et il se repent d'avoir affligé.
౧౩మీ యెహోవా దేవుడు అత్యంత కృప గలవాడూ దయగలవాడు. త్వరగా కోపపడేవాడు కాదు. విస్తారంగా ప్రేమ చూపించేవాడు. శిక్షించాలనే తన మనస్సు మార్చుకునేవాడు. కాబట్టి మీ బట్టలు మాత్రమే కాక మీ హృదయాలను చింపుకుని ఆయన వైపు తిరగండి.
14 Qui sait s'il ne reviendra pas et ne se repentira pas, et s'il ne laissera pas après lui la bénédiction, l'offrande et la libation pour l'Éternel votre Dieu?
౧౪ఒకవేళ ఆయన మీ వైపు తిరిగి జాలి చూపుతాడేమో. మీరు మీ యెహోవా దేవునికి తగిన నైవేద్యాన్ని, పానార్పణాన్ని అర్పించేలా మిమ్మల్ని దీవిస్తాడేమో ఎవరికి తెలుసు?
15 Sonnez de la trompette en Sion, sanctifiez un jeûne, convoquez une assemblée solennelle!
౧౫సీయోనులో బాకా ఊదండి. ఉపవాసదినం ప్రతిష్ఠించండి. సంఘంగా కూడండి.
16 Réunissez le peuple, sanctifiez l'assemblée; réunissez les anciens! Assemblez les enfants et les nourrissons à la mamelle! Que l'époux sorte de sa chambre, et l'épouse de son appartement!
౧౬ప్రజలను సమకూర్చండి. సంఘాన్ని ప్రతిష్ఠించండి. పెద్దలను పిలిపించండి. పిల్లలనూ చంటి పిల్లలనూ తీసుకురండి. పెళ్లికొడుకులు తమ గదుల్లోనుంచి, పెళ్లికూతుళ్ళు తమ పెళ్లి గదుల్లోనుంచి రావాలి.
17 Que les sacrificateurs qui font le service de l'Éternel pleurent entre le portique et l'autel, et qu'ils disent: Éternel! épargne ton peuple, et n'expose pas ton héritage à l'opprobre, aux railleries des nations. Pourquoi dirait-on parmi les peuples: Où est leur Dieu?
౧౭యెహోవాకు పరిచర్యచేసే సేవకులు, యాజకులు మంటపానికీ బలిపీఠానికి మధ్య నిలబడి ఏడవాలి. “యెహోవా, నీ ప్రజలను కనికరించు. నీ సొత్తుగా ఉన్న వారిని సిగ్గుపడనివ్వకు. వారి మీద రాజ్యాలను ఏలనివ్వకు. వారి దేవుడు ఏమయ్యాడు? అని ఇతర ప్రజలు ఎందుకు చెప్పుకోవాలి?”
18 L'Éternel a été jaloux de sa terre, il a été ému de compassion envers son peuple.
౧౮అప్పుడు యెహోవా తన దేశాన్ని గురించి రోషంతో ఉన్నాడు. తన ప్రజల పట్ల జాలితో ఉన్నాడు.
19 Et l'Éternel a répondu et a dit à son peuple: Voici, je vais vous envoyer du blé, du moût et de l'huile; vous en serez rassasiés, et je ne vous livrerai plus à l'opprobre parmi les nations.
౧౯యెహోవా తన ప్రజలకు ఇలా జవాబిచ్చాడు, “నేను మీకు ధాన్యం, కొత్త ద్రాక్షారసం, నూనె పంపిస్తాను. మీరు వాటితో తృప్తి చెందుతారు. ఇకనుంచి మరెన్నడూ మిమ్మల్ని ఇతర ప్రజల్లో అవమానానికి గురిచేయను.
20 J'éloignerai de vous l'ennemi du nord, et je le chasserai dans une contrée aride et désolée; son avant-garde vers la mer orientale, et son arrière-garde vers la mer occidentale; sa puanteur montera, et son infection s'élèvera, quoiqu'il ait fait de grandes choses.
౨౦ఉత్తర దిక్కు నుంచి వచ్చే సేనను మీకు దూరంగా పారదోలతాను. వారిని ఎండిపోయి, పాడైపోయిన ప్రాంతానికి తోలివేస్తాను. దాని ముందు భాగాన్ని తూర్పు సముద్రంలో, దాని వెనుక భాగాన్ని పడమటి సముద్రంలో పడేస్తాను. అది కంపు కొడుతుంది, చెడ్డవాసన వస్తుంది. నేను గొప్ప పనులు చేస్తాను.”
21 Terre, ne crains point; égaye-toi et réjouis-toi! Car l'Éternel a fait de grandes choses.
౨౧దేశమా, భయపడక సంతోషించి గంతులు వెయ్యి. యెహోవా గొప్ప పనులు చేశాడు.
22 Ne craignez pas, bêtes des champs; car les pâturages du désert reverdissent; les arbres portent leurs fruits; le figuier et la vigne donnent leurs richesses.
౨౨పశువులారా, భయపడవద్దు. గడ్డిబీళ్లలో పచ్చిక మొలుస్తుంది. చెట్లు కాయలు కాస్తాయి. అంజూరపుచెట్లు, ద్రాక్షచెట్లు సమృద్ధిగా ఫలిస్తాయి.
23 Et vous, enfants de Sion, égayez-vous et réjouissez-vous en l'Éternel votre Dieu! Car il vous donne la pluie de la première saison dans une juste mesure, et il vous envoie une pluie abondante de la première et de la dernière saison, comme autrefois.
౨౩సీయోను ప్రజలారా, ఆనందించండి. మీ యెహోవా దేవుణ్ణి తలుచుకుని సంతోషించండి. ఆయన నీతి బట్టి మీ కోసం సరిపోయినంత తొలకరి వాన, వాన జల్లు పంపిస్తాడు. ముందులాగా తొలకరి వాన, కడవరి వాన కురిపిస్తాడు.
24 Les aires se rempliront de froment, et les cuves regorgeront de moût et d'huile.
౨౪కళ్ళాలు గోదుమ గింజలతో నిండి ఉంటాయి. కొత్త ద్రాక్షారసం, నూనెతో తొట్లు పొర్లి పారతాయి.
25 Et je vous rendrai les années qu'a dévorées la sauterelle, le jélek, le hasil, et le gazam, ma grande armée, que j'avais envoyée contre vous.
౨౫“ఎగిరే మిడతల గుంపులూ పెద్ద మిడతలూ మిడత పిల్లలూ గొంగళి పురుగులూ, ఆ నా మహాసేన తినేసిన సంవత్సరాల పంటను మీకు మళ్ళీ ఇస్తాను.
26 Vous mangerez et vous serez rassasiés, et vous louerez le nom de l'Éternel, votre Dieu, qui vous aura fait des choses merveilleuses; et mon peuple ne sera jamais confus.
౨౬మీరు కడుపునిండా తిని తృప్తి పడతారు. మీ మధ్య చేసిన అద్భుతాలను బట్టి మీ యెహోవా దేవుని పేరును స్తుతిస్తారు. నా ప్రజలను ఇక ఎన్నటికీ సిగ్గుపడనివ్వను.
27 Vous saurez que je suis au milieu d'Israël; que moi, l'Éternel, je suis votre Dieu, et qu'il n'y en a point d'autre; et mon peuple ne sera plus jamais confus.
౨౭అప్పుడు ఇశ్రాయేలీయుల మధ్య ఉంది నేనే అనీ, నేనే మీ యెహోవా దేవుడిననీ, నేను తప్ప వేరే దేవుడు లేడనీ మీరు తెలుసుకుంటారు. నా ప్రజలను ఇక ఎన్నటికీ సిగ్గుపడనివ్వను.
28 Et il arrivera, après ces choses, que je répandrai mon Esprit sur toute chair; vos fils et vos filles prophétiseront; vos vieillards auront des songes, et vos jeunes gens des visions.
౨౮తరువాత నేను ప్రజలందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. మీ కొడుకులూ మీ కూతుర్లూ ప్రవచనాలు చెబుతారు. మీ ముసలివారు కలలుకంటారు. మీ యువకులకు దర్శనాలు వస్తాయి.
29 Et même sur les serviteurs et sur les servantes, en ces jours-là, je répandrai mon Esprit.
౨౯ఆ రోజుల్లో నేను పనివారి మీద నా ఆత్మను కుమ్మరిస్తాను.
30 Et je ferai des prodiges dans les cieux et sur la terre; du sang, du feu, et des colonnes de fumée.
౩౦ఆకాశంలో అద్భుతాలు చూపిస్తాను. భూమ్మీద రక్తం, మంటలు, ఎత్తయిన పొగ కలిగిస్తాను.
31 Le soleil sera changé en ténèbres, et la lune en sang, avant que le grand et terrible jour de l'Éternel vienne.
౩౧యెహోవా భయంకరమైన ఆ మహాదినం రాకముందు సూర్యుడు చీకటిగా, చంద్రుడు రక్తంలా మారతాయి.
32 Et il arrivera que quiconque invoquera le nom de l'Éternel sera sauvé; car le salut sera sur la montagne de Sion et à Jérusalem, comme l'a dit l'Éternel; et parmi les réchappés seront ceux que l'Éternel appellera.
౩౨యెహోవా పేరున ప్రార్థనచేసే వారందరినీ కాపాడడం జరుగుతుంది. యెహోవా చెప్పినట్టు సీయోను కొండమీద, యెరూషలేములో తప్పించుకున్నవారుంటారు. యెహోవా ఏర్పాటు చేసుకున్నవాళ్ళు మిగులుతారు.”