< Josué 8 >
1 Et le Seigneur dit à Josué: N'aie point de crainte, point de faiblesse; prends avec toi tous les gens de guerre, et monte en Haï: voilà que j'ai livré à tes mains le roi d'Haï et son territoire.
౧కాబట్టి యెహోవా యెహోషువతో ఇలా అన్నాడు. “భయపడకు, జడియకు, యుద్ధసన్నద్ధులైన వారినందరినీ తీసుకుని హాయి మీదికి వెళ్ళు. చూడూ, నేను హాయి రాజునూ, అతని ప్రజలనూ, అతని పట్టణాన్నీ, అతని దేశాన్నీ నీ చేతికప్పగించాను.
2 Tu feras à Haï ce que tu as fait à Jéricho et à son roi; mais tu prendras pour toi tout le bétail; dresse d'abord une embuscade derrière la ville.
౨నీవు యెరికోకూ, దాని రాజుకూ, ఏమి చేశావో అదే హాయికీ, దాని రాజుకూ చేస్తావు, అయితే దోపుడు సొమ్మునీ పశువులనూ మీరు బాగా దోచుకోవాలి. పట్టణపు పడమటి వైపు మాటుగాళ్ళను ఉంచు.”
3 Josué se leva donc et avec lui tous les gens de guerre, afin de marcher sur Haï. Or, Josué choisit trente mille hommes dans la force de l'âge, et il les fit partir pendant la nuit.
౩యెహోషువ, హాయి మీదికి వెళ్ళడానికి పరాక్రమవంతులైన ముప్ఫై వేల మంది శూరులను ఏర్పరచుకుని రాత్రివేళ వారిని పంపాడు.
4 Et il leur donna des ordres, disant: Placez-vous en embuscade derrière la ville. Ne vous en éloignez pas beaucoup, et tenez-vous prêts.
౪అతడు వారికిలా ఆజ్ఞాపించాడు. “ఈ పట్టణానికి పడమటి వైపున దాన్ని పట్టుకోడానికి మీరు పొంచి ఉండాలి, పట్టణానికి బాగా దూరం వెళ్ళిపోకుండా మీరు సిద్ధంగా ఉండాలి.
5 Moi, cependant, et tous ceux qui m'accompagnent, nous nous approcherons des remparts, et il adviendra que quand les habitants d'Haï sortiront à notre rencontre, comme ils l'ont fait récemment, nous fuirons devant eux.
౫నేనూ, నాతో కూడా ఉన్న ప్రజలంతా పట్టణానికి చేరుకుంటాం, వారు ఇంతకు ముందులాగా మమ్మల్ని ఎదుర్కోడానికి రాగానే మేము పారిపోతాం.
6 Et lorsqu'ils se seront lancés à notre poursuite, nous les attirerons loin de la ville, et ils diront: Ces gens-là fuient devant nous de la même manière que précédemment.
౬ఇంతకు ముందులాగానే ‘వారు మన ముందు నిలవలేక పారిపోతున్నారు’ అనుకుని, వారు మా వెంటబడతారు, పట్టణం నుండి వారు బయటికి రాగానే
7 Alors, levez-vous, quittez votre embuscade, et entrez dans la ville.
౭మీరు పొంచి ఉన్న స్థలం నుండి లేచి పట్టణాన్ని పట్టుకోండి, మీ దేవుడు యెహోవా దాన్ని మీ చేతికి అప్పగిస్తాడు.
8 Faites comme je viens de dire: c'est l'ordre que je vous donne.
౮మీరు ఆ పట్టణాన్ని పట్టుకొన్నప్పుడు యెహోవా మాట ప్రకారం దాన్ని తగలబెట్టాలి. ఇదే నేను మీకాజ్ఞాపిస్తున్నాను.”
9 Et Josué les congédia; ils gagnèrent le lieu de l'embuscade, et ils se placèrent entre Béthel et Haï, à l'occident de cette ville.
౯యెహోషువ వారిని పంపగా, వారు పొంచి ఉండటానికి హాయికి పడమటి దిక్కున బేతేలుకు, హాయికి మధ్య ఉన్న స్థలానికి వెళ్ళారు. ఆ రాత్రి యెహోషువ ప్రజల మధ్య బస చేశాడు.
10 Ensuite, Josué s'étant levé de grand matin, inspecta le peuple; et lui- même, avec les anciens, monta en Haï devant tout le peuple.
౧౦ఉదయమే యెహోషువ లేచి ప్రజలను వ్యూహంగా సమకూర్చి తానూ, ఇశ్రాయేలీయుల పెద్దలూ, ప్రజలకు ముందుగా పడమరగా ఉన్న హాయి మీదికి వెళ్ళారు.
11 Tous les gens de guerre marchèrent à sa suite, et arrivèrent devant la ville du côté de l'orient.
౧౧అతని దగ్గరున్న యోధులందరు ఆ పట్టణం సమీపించి హాయికి ఉత్తరాన దిగారు. ఇప్పుడు వారికి, హాయికి మధ్య ఒక లోయ ఉంది.
12 Cependant, l'embuscade était à l'Occident de la ville.
౧౨అతడు ఇంచుమించు ఐదు వేలమందిని పట్టణానికి పడమటి వైపున బేతేలుకు, హాయికి మధ్య పొంచి ఉండటానికి నియమించాడు.
౧౩వారిని అలా ఉంచిన తరువాత యెహోషువ ఆ రాత్రి లోయలో దిగి అక్కడ బస చేశాడు.
14 Et dès que le roi d'Haï aperçut Josué et les siens, il se hâta de sortir directement à leur rencontre pour les combattre; car il ne savait pas qu'une embuscade était dressée de l'autre côté de la ville.
౧౪హాయి రాజు దాన్ని చూసి అతడూ, అతని ప్రజలంతా, త్వరపడి పెందలకడే లేచి మైదానం ఎదురుగా ఇశ్రాయేలీయులను ఎదుర్కొని, తాము అంతకు ముందు నిర్ణయించుకొన్న స్థలం లో యుద్ధం చేయడానికి బయలుదేరారు. తనను పట్టుకోడానికి వారు పట్టణానికి పడమటి వైపున పొంచి ఉన్న సంగతి అతడు తెలుసుకోలేక పోయాడు.
15 Josué et Israël le virent, et ils reculèrent devant lui.
౧౫యెహోషువ, ఇశ్రాయేలీయులందరూ వారి ముందు నిలవలేక ఓడిపోయినట్టు అరణ్యమార్గం వైపు పారిపోతుండగా
16 Et les hommes d'Haï poursuivirent les fils d'Israël, et ils s'éloignèrent de la ville.
౧౬వారిని ఆత్రుతగా తరమడానికి హాయిలో ఉన్న వారందరూ పోగై యెహోషువను తరుముతూ పట్టణానికి దూరంగా వెళ్లిపోయారు.
17 Nul n'était resté dans Haï; tous poursuivaient les fils d'Israël; ils avaient laissé la ville ouverte, et ils s'attachaient aux pas d'Israël.
౧౭ఇశ్రాయేలీయులను తరమడానికి వెళ్లనివారు హాయిలో గాని, బేతేలులో గాని ఒక్కరూ మిగల్లేదు. వారు ద్వారం మూయకుండానే పట్టణాన్ని విడిచిపెట్టి ఇశ్రాయేలీయులను తరమడానికి వెళ్ళిపోయారు.
18 Alors, le Seigneur dit à Josué: Etends la main et le javelot, que tu tiens, vers la ville; car je te l'ai livrée. Et les hommes de l'embuscade vont quitter promptement leur place. Et Josué étendit la main et le javelot vers la ville;
౧౮అప్పుడు యెహోవా యెహోషువతో ఇలా అన్నాడు. “నీవు చేతిలో పట్టుకొన్న ఈటెను హాయి వైపు చాపు, పట్టణాన్ని నీ చేతికి అప్పగిస్తాను.” అప్పుడు యెహోషువ తన చేతిలో ఉన్న ఈటెను ఆ పట్టణం వైపు చాపాడు.
19 A ce moment les hommes de l'embuscade sortirent promptement de leur place; ils partirent, ils entrèrent dans la ville, la prirent et se hâtèrent de la livrer aux flammes.
౧౯అతడు తన చెయ్యి చాపగా పొంచి ఉన్నవారు మాటు వేసిన చోటనుండి త్వరగా లేచి పరుగెత్తి పట్టణంలోకి చొచ్చుకుపోయి దాన్ని పట్టుకుని వెంటనే అప్పటికప్పుడే తగులబెట్టేశారు.
20 Et les hommes d'Haï, ayant regardé ce qui se passait derrière eux, virent la fumée qui s'élevait de la ville jusqu'au ciel, et ils n'eurent plus de refuge ni d'une part ni de l'autre.
౨౦హాయివారు వెనక్కి తిరిగి చూసేటప్పటికి ఆ పట్టణం పొగ ఆకాశానికి ఎక్కుతూ ఉంది. అప్పుడు అరణ్యానికి పారిపోయిన ఇశ్రాయేలు యోధులు వెనక్కి తిరిగి తమను తరుముతున్న వారిమీద దాడిచేసేటప్పటికి ఈ వైపు గానీ, ఆ వైపు గానీ, ఎటూ పారిపోవడానికి వారికి వీలు లేకపోయింది.
21 Dès que Josué et tout le peuple eurent reconnu que les hommes de l'embuscade avaient pris la ville, et que la fumée de l'incendie s'élevait jusqu'au ciel, ils firent volte-face et frappèrent les hommes d'Hai.
౨౧పొంచి ఉన్నవారు పట్టణాన్ని పట్టుకోవడం, పట్టణంలో పొగ పైకి రావడం యెహోషువ, ఇశ్రాయేలీయులంతా చూసినప్పుడు వారు హాయి వారిని హతం చేశారు.
22 Et l'embuscade sortit de la ville à la rencontre de ceux-ci, qui se trouvèrent enveloppés par tous les guerriers du camp, les uns devant eux, les autres sur leurs derrières; ils furent accablés au point que nul ne put fuir; nul ne survécut.
౨౨తక్కిన వారు పట్టణంలో నుండి బయలుదేరి వారికి ఎదురుగా వచ్చారు. అలా ఈ వైపు కొందరు ఆ వైపు కొందరు ఉండగా హాయివారు మధ్యలో చిక్కుకుపోవడం వల్ల ఇశ్రాయేలీయులు వారిని హతం చేశారు. వారిలో ఒక్కడూ మిగల్లేదు, ఒక్కడూ తప్పించుకోలేదు.
23 Toutefois, l'on prit vivant le roi d'Haï et on le mena devant Josué.
౨౩వారు హాయి రాజును ప్రాణంతో పట్టుకుని యెహోషువ దగ్గరికి తీసుకువచ్చారు.
24 Quand les fils d'Israël eurent achevé de tuer tous ceux de Haï qui étaient en plaine, ou qu'ils avaient trouvés sur les pentes de la colline, car ils les poursuivirent tant qu'il en resta, Josué retourna sur la ville et la passa au fil de l'épée.
౨౪ఎడారిలోను, పొలంలోను హాయి నివాసులను తరిమిన ఇశ్రాయేలీయులు కత్తివాత హతం కాకుండా మిగిలిన వాడొక్కడు కూడా లేకపోవడంతో చంపడం చాలించి అందరూ హాయికి తిరిగి వచ్చారు, హాయిని పూర్తిగా కత్తితో నిర్మూలం చేశారు.
25 Ce jour-là, douze mille âmes succombèrent, hommes et femmes; tous les habitants de Haï furent tués.
౨౫ఆ దినాన్న చనిపోయిన స్త్రీ పురుషులందరు మొత్తం పన్నెండు వేలమంది.
౨౬యెహోషువ హాయి నివాసులనందరినీ నిర్మూలం చేసేవరకూ ఈటెను పట్టుకుని చాచిన తన చేతిని తిరిగి ముడుచుకోలేదు.
27 Il ne resta que le butin, réservé aux fils d'Israël, selon l'ordre du Seigneur que leur avait transmit Josué.
౨౭యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించిన మాట ప్రకారం ఇశ్రాయేలీయులు ఆ పట్టణంలోని పశువులనూ సొమ్మునీ తమ కోసం పూర్తిగా దోచుకున్నారు.
28 Et Josué acheva d'incendier la ville; il en fit un tombeau inhabitable à jamais, et resté tel jusqu'à nos jours.
౨౮అలా యెహోషువ, హాయి ఎప్పటికీ పాడు దిబ్బగా ఉండాలని దాన్ని కాల్చివేశాడు, ఇప్పటికీ అది అలాగే ఉంది.
29 Et il suspendit à une croix le roi d'Haï, qu'il y laissa jusqu'au soir. Au coucher du soleil, Josué fit détacher son cadavre, que l'on jeta dans une fosse; puis, on mit sur lui un monceau de pierres qui subsiste encore de nos jours.
౨౯యెహోషువ హాయి రాజును సాయంకాలం వరకూ ఉరికొయ్య మీద వేలాడదీశాడు. పొద్దుగుంకుతున్నప్పుడు యెహోషువ ఆజ్ఞతో ప్రజలు అతని శవాన్ని మానుమీద నుండి దించి ఆ పట్టణ ద్వారం ముందు దాన్ని విసిరేసి దానిమీద పెద్ద రాళ్లకుప్ప వేశారు. అది నేటి వరకూ ఉంది.
౩౦మోషే ధర్మశాస్త్రగ్రంథంలో రాసిన ప్రకారం
౩౧యెహోవా సేవకుడు మోషే, ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించినట్టు యెహోషువ ఇశ్రాయేలీయుల దేవుడు యెహోవా నామాన బలిపీఠాన్ని ఇనుప పనిముట్లు తగలని కారు రాళ్లతో ఏబాలు కొండ మీద కట్టించాడు. దాని మీద వారు యెహోవాకు దహన బలులనూ సమాధాన బలులనూ అర్పించారు.
౩౨మోషే ఇశ్రాయేలీయులకు రాసి ఇచ్చిన ధర్మశాస్త్రగ్రంథం ప్రతిని అతడు అక్కడ ఇశ్రాయేలీయుల సమక్షంలో ఆ రాళ్ల మీద రాయించాడు.
౩౩అప్పుడు ఇశ్రాయేలీయులను దీవించడానికి యెహోవా సేవకుడైన మోషే పూర్వం ఆజ్ఞాపించినట్టు జరగాలని, ఇశ్రాయేలీయులంతా వారి పెద్దలూ వారి నాయకులూ వారిలో పుట్టినవారూ, పరదేశులూ, వారి న్యాయాధిపతులూ యెహోవా నిబంధన మందసాన్ని మోసే యాజకులైన లేవీయుల ఎదుట ఆ మందసానికి ఈ వైపున, ఆ వైపున నిలబడ్డారు. వారిలో సగం మంది గెరిజీము కొండ ముందూ సగం మంది ఏబాలు కొండ ముందూ నిలబడ్డారు.
౩౪యెహోషువ ఆ ధర్మశాస్త్ర గ్రంథంలో రాసి ఉన్న వాటన్నిటిని బట్టి ఆ ధర్మశాస్త్ర వాక్యాలన్నిటినీ అంటే దాని దీవెన వచనాలనూ దాని శాప వచనాలనూ చదివి వినిపించాడు. స్త్రీలూ పిల్లలూ వారి మధ్య ఉన్న పరదేశులూ వింటూ ఉండగా
౩౫యెహోషువ సర్వసమాజం ముందు మోషే ఆజ్ఞాపించిన వాటన్నిటిలో చదవకుండా విడిచిపెట్టిన మాట ఒక్కటి కూడా లేదు.