< Josué 15 >
1 Et les limites de la tribu de Juda, par familles, s'étendent au midi des confins de l'Idumée et du désert de Sin jusqu'à Cadès.
౧యూదాగోత్రం వారికి వారి వంశాల ప్రకారం చీట్ల వల్ల వచ్చిన వంతు, ఎదోం దేశ సరిహద్దు వరకూ అంటే దక్షిణ దిక్కున సీను ఎడారి చిట్టచివరి దక్షిణ భాగం వరకూ ఉంది.
2 Puis, elles vont du côté du midi jusqu'aux bords de la mer Salée, du côté de la colline qui regarde le midi.
౨వారి దక్షిణ సరిహద్దు, ఉప్పు సముద్రపు ఒడ్డు నుండి అంటే దక్షిణంగా ఉన్న అఖాతం నుండి వ్యాపించింది.
3 Et ensuite, elles passent devant les hauteurs d'Acrabin; elles contournent Séna; elles montent au midi de Cadès-Barné, elles sortent d'Asoron et montent à Sérada pour aller à l'occident de Cadès.
౩వారి సరిహద్దు అక్రబ్బీము కొండకు దక్షిణంగా ఎక్కి, సీను వరకూ పోయి కాదేషు బర్నేయకు దక్షిణంగా ఎక్కి హెస్రోను మీదుగా అద్దారు ఎక్కి కర్కాయు వైపు తిరిగి
4 Et elles sortent de Selmona; puis, elles traversent le pays jusqu'au torrent d'Egypte, et finissent à la mer. Telles sont les limites de Juda du coté du midi.
౪అస్మోను గుండా ఐగుప్తు వాగు పక్కగా వెళ్ళింది. ఇది సముద్రం ఒడ్డు వరకూ ఉంది. ఇది వారి దక్షిణ సరిహద్దు.
5 A l'orient, Juda a pour limite toute la mer Salée jusqu'au Jourdain. Et au nord, en partant du Jourdain et des collines de la mer Salée,
౫దాని తూర్పు సరిహద్దు యొర్దాను చివరివరకూ ఉన్న ఉప్పు సముద్రం. ఉత్తరదిక్కు సరిహద్దు యొర్దాను చివర ఉన్న సముద్రాఖాతం మొదలుకొని వ్యాపించింది.
6 Ses limites montent vers Bethaglaam; elles passent au nord de Betharaba; elles montent sur la roche de Béon, fils de Ruben;
౬ఆ సరిహద్దు బేత్‌హోగ్లా వరకూ వెళ్లి బేత్ అరాబాకు ఉత్తరంగా వ్యాపించింది. అక్కడనుండి ఆ సరిహద్దు రూబేనీయుడైన బోహను రాయి వరకూ వ్యాపించింది.
7 Elles côtoient le quart de la vallée d'Acbor; elles descendent vers Galgal, qui est en face de la colline d'Adammin au midi de la vallée; elles traversent les eaux de la fontaine du Soleil, elles aboutissent à la fontaine de Rhogel.
౭ఆ సరిహద్దు ఆకోరు లోయ నుండి దెబీరు వరకూ వాగుకి దక్షిణ తీరాన ఉన్న అదుమ్మీము కొండ ఎదురుగా ఉన్న గిల్గాలుకు ఉత్తరంగా వ్యాపించింది. ఆ సరిహద్దు ఏన్‌షేమెషు నీళ్లవరకూ వ్యాపించింది. దాని కొన ఏన్‌రోగేలు దగ్గర ఉంది.
8 Elles remontent ensuite la vallée d'Ennom, au-dessus de Jébus, la même que Jérusalem, qu'elles laissent au midi; puis, elles passent sur la cime des monts qui sont au couchant en face de la vallée d'Ennom, et au nord sur les confins de la contrée de Raphaïm.
౮ఆ సరిహద్దు పడమట బెన్ హిన్నోము లోయ గుండా దక్షిణాన యెబూసీయుల పట్టణం వరకూ, అంటే యెరూషలేం వరకూ వెళ్ళింది. ఆ సరిహద్దు పడమట హిన్నోము లోయకు ఎదురుగా ఉన్న కొండ శిఖరం వరకూ వ్యాపించింది. అది ఉత్తర దిక్కున రెఫాయీయుల లోయ చివర ఉంది.
9 De ces sommités, la limite traverse les eaux de la fontaine Naphtho, puis le mont Ephron, d'où elle descend en Baala, la même que Cariathiarim.
౯ఆ సరిహద్దు ఆ కొండ శిఖరం నుండి నెఫ్తోయ నీళ్ల ఊట వరకూ వెళ్ళింది. అక్కడ నుండి ఏఫ్రోనుకొండ పట్టణాల వరకూ వ్యాపించింది. ఆ సరిహద్దు కిర్యత్యారీం అనే బాలా వరకూ వెళ్ళింది.
10 Elle tourne au sortir de Baala vers l'occident; elle côtoie le mont Assa au nord, au-dessus de la ville d'Iarin, la même que Chaslon; elle descend vers la Ville du Soleil, qu'elle laisse au nord.
౧౦ఆ సరిహద్దు పడమరగా బాలా నుండి శేయీరు కొండకు వంపుగా సాగి కెసాలోను అనే యారీము కొండ ఉత్తరపు వైపు దాటి బేత్షెమెషు వరకూ దిగి తిమ్నా వైపుకు వ్యాపించింది.
11 Ensuite, elle passe au nord au-dessus d'Accaron; puis, elle traverse Soccboth; puis, elle incline au midi; puis, elle passe vers Lebna, où elle finit à l'occident.
౧౧ఆ సరిహద్దు ఎక్రోనుకు ఉత్తరంగా సాగింది. అక్కడ నుండి షిక్రోనుకు చుట్టి వెళ్లి బాలా కొండ దాటి యబ్నెయేలుకు వెళ్ళింది. ఆ సరిహద్దు సముద్రం వరకూ వ్యాపించింది.
12 Et à l'occident la tribu de Juda a pour limite la grande mer elle-même. Telles sont les frontières qui entourent la tribu de Juda par familles.
౧౨పడమటి సరిహద్దు మహాసముద్రం. వారి వారి వంశాల ప్రకారం యూదా గోత్రంవారి సరిహద్దులివి.
13 Et à Caleb, fils de Jephoné, il fut donné une part, au milieu des fils de Juda, par ordre du Seigneur; Josué lui donna la ville d'Arboc, métropole d'Enac, la même qu'Hébron.
౧౩యెహోవా యెహోషువకు ఇచ్చిన ఆజ్ఞ ప్రకారం యూదా గోత్రం సరిహద్దు లోపల యెఫున్నె కుమారుడు కాలేబుకు ఒక వంతు, అంటే అనాకీయుల వంశకర్త అర్బా పట్టణాన్ని ఇచ్చాడు. అది హెబ్రోను.
14 Et Caleb, fils de Jephoné, y extermina les trois fils d'Enac: Susi, Tholami et Achima.
౧౪షెషయి అహీమాను తల్మయి అనే అనాకు ముగ్గురు సంతతి వాళ్ళను కాలేబు అక్కడనుండి వెళ్ళగొట్టాడు.
15 De là, Caleb partit pour attaquer les habitants de Dabir, qui était autrefois la Ville des Lettres (Cariath-Sépher).
౧౫అక్కడనుండి అతడు దెబీరు నివాసుల మీదికి వెళ్ళాడు. అంతకుముందు దెబీరు పేరు కిర్యత్ సేఫరు.
16 Et Caleb dit: Celui qui prendra et réduira la Ville des Lettres et s'en rendra maître, je lui donnerai pour femme ma fille Ascha.
౧౬కిర్యత్సేఫెరును పట్టుకుని దాన్ని కొల్లపెట్టిన వాడికి నా కుమార్తె అక్సాతో పెళ్లి చేస్తాను అని కాలేబు చెబితే
17 Et Gothoniel, fils de Cénez, de la famille de Caleb, prit la ville, et Caleb lui donna pour femme sa fille Ascha.
౧౭కాలేబు సోదరుడు కనజు కుమారుడు ఒత్నీయేలు దాని పట్టుకున్నాడు కాబట్టి అతడు తన కుమార్తె అక్సాను అతనికి భార్యగా ఇచ్చాడు.
18 Pendant qu'elle s'en allait, elle se concerta avec lui, disant: Je demanderai un champ à mon père, et montée sur son âne elle cria, et Caleb lui dit: Qu'as-tu?
౧౮ఆమె తన దగ్గరికి వచ్చినప్పుడు తన తండ్రిని కొంత భూమి అడగమని అతనిని ప్రేరేపించింది. ఆమె గాడిదె దిగగానే కాలేబు ఆమెతో “నీకేం కావాలి” అని అడిగాడు.
19 Et elle lui dit: Accorde-moi un bienfait; tu m'as donné Nageb, donne- moi en outre un pâturage; et son père lui donna, avec Gonethla haute, Gonethla inférieure.
౧౯“నాకు అనుగ్రహం చూపండి. నీవు నాకు నెగెబు ప్రాంతాన్ని ఇచ్చావు. నీటి మడుగులు కూడా ఇవ్వండి” అంది. కాలేబు ఆమెకు ఎగువనున్న మడుగులూ పల్లపు మడుగులూ ఇచ్చాడు.
20 Voici l'héritage de la tribu de Juda.
౨౦యూదా వంశస్థుల గోత్రానికి వారి వంశాల ప్రకారం వచ్చిన స్వాస్థ్యం ఇది.
21 Leurs villes furent près des confins d'Edom, vers le désert: Beseléel, Ara et Asor,
౨౧యూదా గోత్రం వారికి దక్షిణంగా ఎదోం దేశ సరిహద్దు వైపు వచ్చిన పట్టణాలు: కబ్సెయేలు, ఏదెరు, యాగూరు,
22 Icam, Rhegma et Aruel,
౨౨కీనా, దిమోనా, అదాదా,
23 Cadès, Asorionaïn et Ménam,
౨౩కెదెషు, హాసోరు, ఇత్నాను,
24 Balmenan et ses villages,
౨౪జీఫు, తెలెము, బెయాలోతు,
25 Et Aseron, nommée aussi Asor,
౨౫హాసోరు, హదత్తా, కెరీయోతు, హెస్రోను అనే హాసోరు,
26 Sen, Salmaa et Molada,
౨౬అమాము, షేమ, మోలాదా,
౨౭హసర్ గద్దా, హెష్మోను, బేత్పెలెతు,
28 Cholaséola, Bersabée, leurs villages et leurs hameaux;
౨౮హసర్ షువలు, బెయేర్షెబా, బిజియోతియా,
30 Elbudad, Béthel et Henna,
౩౦ఎల్తోలదు, కెసీలు, హోర్మా,
31 Sécelac, Macharim et Séthennac,
౩౧సిక్లగు, మద్మన్నా, సన్సన్నా,
32 Labos, Sala et Eromoth: vingt-neuf villes avec leurs villages;
౩౨లెబాయోతు, షిల్హిము, అయీను, రిమ్మోను అనేవి. వాటి పల్లెలు పోగా ఈ పట్టాణాలన్నీ ఇరవై తొమ్మిది.
33 Dans la plaine: Astaol, Rhaa et Assa,
౩౩మైదానం లో పడమరగా, ఎష్తాయోలు, జొర్యా, అష్నా,
34 Rhamen, Tano, Ilouthoth et Méani,
౩౪జానోహ ఏన్ గన్నీము, తప్పూయ, ఏనాము,
35 Jermuth, Odollam, Membra, Saocho et Jazéca,
౩౫యర్మూతు, అదుల్లాము, శోకో, అజేకా,
36 Sacarim, Gadera et leurs villages: quatorze villes et leurs villages;
౩౬షరాయిము, అదీతాయిము, గెదెరోతాయిము అనే గెదేరా అనేవి. వాటి పల్లెలు పోగా పద్నాలుగు పట్టణాలు.
37 Senna, Adasan et Magadalgad,
౩౭సెనాను, హదాషా, మిగ్దోల్గాదు,
38 Dalad, Maspha et Jacharéel,
౩౮దిలాను, మిజ్పా, యొక్తయేలు,
39 Basedoth et Idéadaléa,
౩౯లాకీషు, బొస్కతు, ఎగ్లోను,
40 Chabré, Machès et Maachos,
౪౦కబ్బోను, లహ్మాసు, కిత్లిషు,
41 Geddor, Bagadiel, Noman et Machédan: seize villes et leurs villages;
౪౧గెదెరోతు, బేత్ దాగోను, నయమా, మక్కేదా అనేవి. వాటి పల్లెలు పోగా పదహారు పట్టణాలు.
42 Lebna, Ithac et Anoch,
౪౨లిబ్నా, ఎతెరు, ఆషాను,
44 Céilam, Aciézi, Césib, Bathésar et Elom: dix villes et leurs villages;
౪౪కెయీలా, అక్జీబు, మారేషా అనేవీ వాటి పల్లెలు పోగా తొమ్మిది పట్టణాలు.
45 Accaron et ses villages et leurs hameaux;
౪౫ఎక్రోను దాని పట్టణాలు పల్లెలు, ఎక్రోను మొదలుకుని సముద్రం వరకూ అష్డోదు ప్రాంతమంతా,
46 Après Accaron, Gemna et toutes les villes qui sont près d'Asedoth et leurs villages;
౪౬దాని పట్టణాలు పల్లెలు, ఐగుప్తు వాగు వరకూ మహా సముద్రం వరకూ, అష్డోదు వాటి పల్లెలు.
47 Asiédoth et ses villages et ses hameaux, Gaza et ses villages et ses hameaux, jusqu'au torrent d'Egypte; la grande mer est sa limite;
౪౭గాజా ప్రాంతం వరకూ, వాటి పట్టణాలు పల్లెలు,
48 Et dans les montagnes: Samir, Jéther et Socha,
౪౮మన్య ప్రదేశంలో షామీరు, యత్తీరు, శోకో,
49 Rhenna et la Ville des Lettres, la même que Dabir,
౪౯దన్నా, దెబీర్ అనే కిర్యత్ సన్నా,
50 Anon, Es, Man et Esam,
౫౦అనాబు, ఎష్టెమో, ఆనీము,
51 Gosom, Chalu, Channa et Gélom: onze villes et leurs villages;
౫౧గోషెను, హోలోను గిలో అనేవి. వాటి పల్లెలు పోగా పదకొండు పట్టణాలు.
53 Jemaïm, Béthachu et Phacua,
౫౩యానీము, బేత్ తపూయ, అఫెకా,
54 Eyma, Cariath-Arboc, la même qu'Hébron et Soraïth: onze villes et leurs villages;
౫౪హుమ్తా, కిర్యతర్బా అనే హెబ్రోను, సీయోరు అనేవి. వాటి పల్లెలు పోగా తొమ్మిది పట్టణాలు.
55 Maor, Carmel, Ozib et Itan,
౫౫మాయోను, కర్మెలు, జీఫు, యుట్టా,
56 Jariel, Aricam et Zacanaïm,
౫౬యెజ్రెయేలు, యొక్దెయాము, జానోహ,
57 Gabaa et Thamnatha: neuf villes et leurs villages;
౫౭కయీను, గిబియా, తిమ్నా అనేవి. వాటి పల్లెలు పోగా పది పట్టణాలు.
58 Elua, Bethsur et Geddon,
౫౮హల్హూలు, బేత్సూరు, గెదోరు,
59 Magaroth, Béthanam et Thécum: six villes et leurs villages;
౫౯మారాతు, బేత్ అనోతు, ఎల్తెకోను అనేవి. వాటి పల్లెలు పోగా ఆరు పట్టణాలు.
60 Théco, Ephrata, la même que Bethléem, Phagor, Etan, Culon, Tatam, Thobès, Carem, Galem, Théther et Manocho: onze villes et leurs villages; Cariath- Baal, la même que Cariathiarim et Sothéba: deux villes et leurs villages;
౬౦కిర్యత్యారీం అంటే కిర్యత్ బయలు, రబ్బా అనేవి. వాటి పల్లెలు పోగా రెండు పట్టణాలు.
61 Baddargis, Tharabaam et Enon,
౬౧అరణ్యంలో బేత్ అరాబా మిద్దీను సెకాకా
62 Et Eochiosa et Naphlazon, et les villes de Sadon et d'Ancadès: sept villes et leurs villages.
౬౨ఉప్పు పట్టణం నిబ్షాను, ఈల్మెలహు ఏన్గెదీ అనేవి. వాటి పల్లెలు పోగా ఆరు పట్టణాలు.
63 Or, le Jébuséen habitait Jérusalem, et les fils de Juda ne purent les détruire; les Jébuséens ont ainsi demeuré en Jérusalem jusqu'à ce jour.
౬౩యెరూషలేములో నివసించిన యెబూసీయులను యూదా వంశస్థులు తోలివేయలేకపోయారు కాబట్టి యెబూసీయులు ఈ నాటికీ యెరూషలేములో యూదా వారితో కలిసి నివసిస్తున్నారు.